చండీగఢ్ : ప్రభుత్వ టీచర్లందరూ అర్చక శిక్షణ తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 29న ప్రభుత్వం నిర్వహించిన శిక్షణకు హాజరు కానీ టీచర్లపై కఠినచర్యలకు మనోహర్‌లాల్ కట్టర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్చక శిక్షణ తీసుకున్న టీచర్లు.. ఆయా గ్రామాల్లో పండుగలు, ఇతర పర్వదినాల్లో అర్చకత్వం చేయాల్సి ఉంటుందని గతంలో హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ అర్చక శిక్షణపై పలువురు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం అంటూ.. పలువురు టీచర్లు ఈ అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కాలేదు. శిక్షణా కార్యక్రమానికి టీచర్లు హాజరు కాకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో వివరించాలంటూ.. ఆయా టీచర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కానీ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌డీఓ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment