సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా?
పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్‌కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు.
పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్‌సైడర్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు.
11 ఏళ్ల పిల్లలు కూడా..
స్విట్జర్లాండ్‌కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్‌లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు.
టీచర్లు ఏమంటున్నారంటే..
స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment