వాషింగ్టన్: అమెరికా పాఠశాలల్లో తుపాకీ కాల్పుల ఘటనలను అరికట్టేందుకు కొంతమంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వారికి తుపాకులు కూడా అందజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ సమస్యకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొంటుందని హామీనిచ్చారు. ఇటీవల ఫ్లోరిడాలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో ఓ బహిష్కృత విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించడం తెలిసిందే. ఆ పాఠశాల విద్యార్థులు, చనిపోయిన వారి తల్లిదండ్రులతో కూడిన బృందం ట్రంప్‌ను కలిసింది. ఉపాధ్యాయులందరికీ తుపాకులు ఇవ్వాలని తానెప్పుడూ అనలేదనీ, కొంతమంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి మాత్రమే తుపాకులు ఇవ్వాలని అన్నానని ట్రంప్ వారికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment