వర్జీనియాలో ఫ్రొ.జయశంకర్ కు ఘన నివాళులు
వర్జీనియాలో ఫ్రొ.జయశంకర్ కు ఘన నివాళులు
Published Tue, Aug 12 2014 10:08 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
వర్జినియా: దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకను యూఎస్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఘనంగా నిర్వహించింది.
వర్జీనియాలోని స్వదేశ్ బాంకెట్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు వడ్డెపల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అతిధులుగా హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ అందించిన స్పూర్తిని ఈ కార్యక్రమంలో అతిధులు కొనియాడారు. అభిమానులు, తెలంగాణవాదులు, టీడీఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా ఫ్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించారు.
Advertisement
Advertisement