
వాషింగ్టన్: ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ దినము, ఫాదర్స్ డేని పురస్కరించుకొని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) వాషింగ్టన్ డీసీ వారి ఆధ్వర్యంలో జూన్ 21న ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కోవిడ్ కష్ట కాలంలో సరైన రక్షణ, ఆహరం దొరకక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొందరు హోమ్ బిల్డర్స్ కేర్ అస్సెస్మెంట్ (HBCAC)లో రక్షణ తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీఎఫ్ వారికి ఆహార అవసరాలను సమకూర్చి చిరునవ్వు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అత్యవసర వసతి గృహంలో వున్న వారికి మంచి విందును ఇవ్వగలిగింది. టీడీఎఫ్ సభ్యుల సహకారంతో తత్వా (TATVA) రెస్టారెంట్ వారికి రుచికరమైన ఆహరాన్ని సమకూర్చింది. తద్వారా ఎంతో మంది నిరుపేదల ముఖాలపై, చిరునవ్వు, సంతోషం వెల్లివిరిసింది. స్వరూప్ కూరెళ్ల ఆధ్వర్యంలో SEWA టీం, టీడీఎఫ్ సంయుక్తంగా ఈ ఫాదర్స్ డే నాడు చాలా మంది నిరుపేదలకు ఆహరాన్ని అందించడంతోపాటు నిత్యావసర వస్తువులు కొనిచ్చింది. (టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు)
ఈ సందర్భంగా టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు కవిత చల్ల SEWA టీమ్‌కు, టీడీఎఫ్ (TDF) కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా టీడీఎఫ్.. సభ్యుల సహకారంతో ఇలాంటి సాంఘీక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన టీడీఎఫ్ డీసీ కోఆర్డినేటర్ జీనత్ కుండూర్, రజని కొప్పారపు, శివాని రెడ్డి , ప్రతిభా కొప్పుల గారికి ప్రేత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన టీడీఎఫ్ వర్జీనియా కోఆర్డినేటర్ రామ్మోహన్ సూరినేని , టీడీఎఫ్ వర్జీనియా కోశాధికారి హర్షా రెడ్డి , టీడీఎఫ్ డీసీ సలహాదారు సుధీర్ బండారు, రవి పల్ల, టీడీఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆరుట్ల, టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్వరూప్ కూరెళ్ల (సేవా ఆర్గనైజషన్ ), ఫేస్‌బుక్ , టీడీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం)
Comments
Please login to add a commentAdd a comment