అమెరికాలో టీడీఎఫ్ సమావేశం
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) సమావేశమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి పథకాలతో పాటుగా ఇతర విషయాల గురించి చర్చించారు. ఎన్నారై భవనంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఎన్నారై విభాగాన్ని ఆహ్వానించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తారు.
టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్.. పారదర్శకత కోసమే ఈ వేదికను నిర్వహిస్తామన్నారు. టీడీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో ఉందని, ఒక్క యూఎస్ఏలోనే 64 నగరాల్లో ఉందని విశ్వేశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో లైబ్రరీలు, విద్యాలయాలు, రోడ్ల అభివృద్ధికి 1,10,000 డాలర్లు కేటాయించినట్టు తెలిపారు.
టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు విజయ్ భాస్కర్ పిట్టా, ప్రధాన కార్యదర్శి కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సహాయ కార్యదర్శి బొజ్జా అమరేందర్, రవీందర్ గడ్డంపల్లి బీఓటీ నాయకులు మురళి చింతలపాణి, శ్రీనాథ్ ముస్కుల, గుర్రాల రాధేశ్ రెడ్డి, విజయ్ సాధువు, సంతోష్ కాకులవరం, మహేష్ వెనుకదాసుల, వాసు దుండిగళ్ల, కృష్ణ ప్రసాద్ జలిగామ, రామ్ కోమందురి, రామ్ చావ్లా, సుమన్ ముప్పిడి, విశ్రాంత ఇంజనీర్ సత్యపాల్ రెడ్డి కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో చక్కటి సంగీత కచేరి ఏర్పాటు చేశారు. గాయకులు దివ్య దవులూరి, పద్మజకనాలి, వెంకట కనకాల, శ్రుతికనాల, స్వాతితిప్పిరెడ్డి, శిల్పాదుండిగల, కృష్ణ జలిగామ భక్తి గీతాలతో అలరించారు. నృత్య విభాగంలో కృతి జలిగామ, వైష్ణవి దెనువకొండ, శ్రేష్ట దుండిగళ్ల, తిప్పిరెడ్డి తన్మయి, ఆత్మకూర్ సానిక, ధృతి పదుకునే, శ్రేష్ట గడ్డం, సోహన్ కోస్నా, అనిష్ గడ్డం, సంజిత్ గడ్డం, అతిథి ఈర్ల, అనన్య భూమిరెడ్డి, మనీష్ ఇలేని, వెనుకదాసుల ప్రవధ్, కార్తీక్ గంకిడి పాల్గొన్నారు. మిమిక్రీలో తనుజ్ గంగ చక్కటి ప్రతిభ కనబరిచారు.