తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (అట్లాంటా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు చెట్టు కింద వంట కార్యక్రమాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. 2022 మే 14న బూఫోర్డ్ డ్యామ్‌రోడ్డులో ఉన్న సరస్సు ఒడ్డున చిక్కనైన వనంలో పచ్చని చెట్ల కింద వంటావార్పు - ఆటాపాటలతో సందడి చేశారు. ఆరేళ్ల కిందట టీడీఎఫ్ ఈ వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ వంటావార్పు కార్యక్రమంలో 800ల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా హాయిగా గడిపారు. పురుషులు నలభీములై పాకాలను ఘుమఘుమలాడించగ, స్త్రీమూర్తులు అన్నపూర్ణలై కమ్మదనాన్ని రంగరించారు. సుమారు 20 రకాల నోరూరే శాకాహార మాంసాహార వంటకాలు సిద్ధం చేశారు. లావణ్య గూడూరు తన ఆటపాటలతో ఆకట్టుకుంది.
చెట్టు కింద వంట కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించుకుని టీడీఎఫ్ అందులో విజయం సాధించింది. బాపురెడ్డి కేతిరెడ్డి, స్వాతి సుదిని సారథ్యంలో స్వప్న కస్వా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, కోర్‌టీం మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమ నిర్వాహణకు తమ వంతు సహకారాన్ని అందించిన సువిద, డెక్కన్ స్పైస్, డీజే దుర్గం, లావణ్య గూడురు ఇతర స్వచ్చంధ సంస్థలకు టీడీఎఫ్ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహాకారం ఇవ్వాలని కోరింది. తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపింది.
చదవండి : టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే
Comments
Please login to add a commentAdd a comment