డల్లాస్లో టీడీఎఫ్ తెలంగాణ ఆవిర్భావ సంబురాలు | TDF Dallas Chapter celebrates 1st Telangana Formation Day | Sakshi
Sakshi News home page

డల్లాస్లో టీడీఎఫ్ తెలంగాణ ఆవిర్భావ సంబురాలు

Published Mon, Jun 15 2015 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

డల్లాస్లో టీడీఎఫ్ తెలంగాణ ఆవిర్భావ సంబురాలు

డల్లాస్లో టీడీఎఫ్ తెలంగాణ ఆవిర్భావ సంబురాలు

డల్లాస్:  తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో  అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో తెలంగాణ మొదటి ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని హిల్టాప్ బంక్వీట్ హాలులో నిర్వహించిన ఈ వేడుకకు వందల సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ తోపాటు అమరవీరులకు నివాళులు అర్పించారు.

టీడీఎఫ్ డల్లాస్ శాఖ ప్రతినిధులు రామ్ కొమందూరి, మాధవి సుంకిరెడ్డి, రవి పటేల్, విజయ పిట్టా, ప్రవీణ్ బిల్లా, శ్రీమతి శారదా సుంకిరెడ్డి, రావు కల్వాల, రఘువీర్ బండారు, ఉపేంద్ర తెలుగు, వేణు భాగ్యనగర్, దయాకర్ పుస్కూర్, దయాకర్ మందా, మోహన్ గాలి, ఆనంద్ కాట్రోజు, శివ మాటేటి, కరణ్ పోరెడ్డి, శ్రీనివాస్ వేముల, శ్రీధర్ వేముల, ఉపేందర్ తెలుగు, స్వరూప్ కొండూరు, నరేశ్ సుంకిరెడ్డి, వేణు భాగ్యనగర్, చంద్రా బండారు, పవన్ గంగాధర, అశోక్ కొండాట్ల, రామ్ అన్నాదిల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

పిల్లలు, మహిళలు కలిసి తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు తెలుగు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. 1969 ఉద్యమంలో భాగస్వాములైన సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు సదా సిద్ధంగా ఉంటామని టీడీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement