కెనడా: కెనడాలో రాజకీయాలలో భారత సంతతి సిక్కులు దూసుకుపోతున్నారు. కెనడా నూతన మంత్రివర్గంలో ముగ్గురు సిక్కులకు చోటు దక్కింది. కెనడా నూతన ప్రధానిగా ట్రుడేవ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన సిక్కులు హర్జిత్ సజ్జన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులు కాగా, నవ్దీప్ బెయిన్స్ శాస్ త్రవిఙ్ఞాన, సృజనాత్మక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో సిక్కు అమర్ జీత్ సోహి ప్రాధమిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అమర్ జిత్ సోహి గతంలో బస్సు డ్రైవర్గా పని చేశాడు. 1980 లలో భారత్లో రెండేళ్లపాటు జైలులో కూడా గడిపాడు. కెనడా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో నవ్దీప్ సిద్దు ప్రముఖ పాత్ర పోషించడంతో ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కింది. కాగా సజ్జన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్, బోస్నియాలలో ప్రత్యేక సలహాదారుడిగా సేవలందించారు.