canda
-
కెనడాకి బైబై చెబుతున్న భారతీయులు.. కారణం ఇదే?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదారణ గణనీయంగా పడిపోయింది. ట్రూడో రోజురోజుకు.. కెనడా ప్రజల మద్దతు కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు సమాచారం. దాదాపూ 60 శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటుండగా.. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతకు పాపులారిటీ పెరిగిపోయిందని కెనడాకు చెందిన స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ న్యూస్ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ప్రస్తుత ప్రతిపక్ష నేత పియరీ పోయిలివ్రే దాదాపు 40 శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతుండగా..ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితం కానుంది. ట్రూడో ఆద్వర్యంలో కెనడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు అక్కడి గృహ, ఆరోగ్య సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కార్ విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్న వారు చెబుతున్నారు. మరో సర్వేలో ఈ నేపథ్యంలో ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో 2017 నుంచి 2019 మధ్యకాలంలో కెనడాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైంది. వస్తున్నారు.. వెళ్తున్నారు గత అక్టోబర్ 31న విడుదలైన ఈ సర్వేలో 2017 నుంచి కెనడాకి గుడ్ బై చెబుతున్నారో.. అదే స్థాయిలో కెనడాకి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వే హైలెట్ చేసింది. అధ్యయనం ప్రకారం, 1982లో లేదా తర్వాత కెనడాలో శాశ్వత నివాసం పొందిన వారిలో 0.9 శాతం మంది ప్రతి సంవత్సరం కెనడాను విడిచిపెట్టారు. అయితే 2019లో ఈ శాతం 1.18 శాతానికి పెరిగింది. ఇది వలసదారుల సగటు రేటుతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపుతుంది. కారణం ఇదే 2019లో దాదాపు 67,000 మంది వలసదారులు కెనడాను విడిచిపెట్టగా, 2017లో 60,000 మంది వలసవెళ్లారు. కెనడాను విడిచిపెట్టిన వలసదారుల పెరుగుదలలో ఈ ధోరణి 1990ల నుండి పెరుగుతోందని అధ్యయనం తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వేలో కెనడాకు కొత్తగా వచ్చే వారి అంచనాలను అందుకోవడంలో కెనడియన్ ప్రభుత్వం విఫలమైన ఫలితంగా, కెనడా నుంచి వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నాయి. కొత్త వలసదారులు క్షీణిస్తున్న గృహ ప్రణాళికలు, ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉపాధి తక్కువగా ఉండటంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న వారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన పరిపాలనలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. -
తలపాగే ప్రాణాలను కాపాడింది
కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. (చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్‌లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్‌లో ఉన ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా వాకింగ్ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i — Sikh Community of BC (@BCSikhs) October 16, 2021 -
మళ్లీ బ్యాట్ పట్టిన యువరాజ్ సింగ్
బ్రాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ బరిలోకి దిగాడు. కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 టోర్నమెంట్లో టొరంటో నేషనల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వాంకోవర్ నైట్స్ టీమ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో యువీ నిరాశపరిచాడు. 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్ అయ్యాడు. అయితే రీప్లేలో అతడు నాటౌట్ అయినట్టు గుర్తించినా, అప్పటికే యువీ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రిజ్వాన్ బౌలింగ్‌లో యువరాజ్ ఆడిన బంతి అతడి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ చేతుల్లోంచి వికెట్ల మీద పడింది. యువీ క్రీజ్‌లోనే ఉన్నట్టు రీప్లేలో కనబడింది. అయితే బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి వికెట్లను పడగొట్టిందన్న భావనతో యువీ మైదానాన్ని వీడినట్టుగా అనిపించింది. ఈ మ్యాచ్‌లో యువీ టీమ్‌పై వాంకోవర్ నైట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టొరంటో నేషనల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. వాల్టన్(59), హి వాండర్ డసేన్(65) అర్ధసెంచరీలతో రాణించడంతో వాంకోవర్ నైట్స్ సునాయంగా లక్ష్యాన్ని ఛేదించింది. 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికి మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ రాణిస్తాడని అతడి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. యువీకి స్పెషల్ పర్మిషన్ బీసీసీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గ్లోబల్ టి20లో యువీ ఆడుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు ‘పీటీఐ’తో చెప్పారు. ఈ టోర్నమెంట్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి యువరాజ్ లేఖ రాసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి అతడికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు వివరించారు. యువీతో పాటు బ్రెండన్ మెక్కల్లమ్, క్రిస్ గేల్, హెన్రీచ్ క్లాసన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు గ్లోబల్ టి20లో ఆడుతున్నారు. వాంకోవర్ నైట్స్ టీమ్‌ను గేల్ నాయకత్వం వహిస్తున్నాడు. -
కెనడా కేబినెట్లో సిక్కులకు చోటు
కెనడా: కెనడాలో రాజకీయాలలో భారత సంతతి సిక్కులు దూసుకుపోతున్నారు. కెనడా నూతన మంత్రివర్గంలో ముగ్గురు సిక్కులకు చోటు దక్కింది. కెనడా నూతన ప్రధానిగా ట్రుడేవ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన సిక్కులు హర్జిత్ సజ్జన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులు కాగా, నవ్‌దీప్ బెయిన్స్ శాస్ త్రవిఙ్ఞాన, సృజనాత్మక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో సిక్కు అమర్ జీత్ సోహి ప్రాధమిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమర్ జిత్ సోహి గతంలో బస్సు డ్రైవర్‌గా పని చేశాడు. 1980 లలో భారత్‌లో రెండేళ్లపాటు జైలులో కూడా గడిపాడు. కెనడా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో నవ్‌దీప్ సిద్దు ప్రముఖ పాత్ర పోషించడంతో ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కింది. కాగా సజ్జన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్, బోస్నియాలలో ప్రత్యేక సలహాదారుడిగా సేవలందించారు.