కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదారణ గణనీయంగా పడిపోయింది. ట్రూడో రోజురోజుకు.. కెనడా ప్రజల మద్దతు కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు సమాచారం.
దాదాపూ 60 శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటుండగా.. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతకు పాపులారిటీ పెరిగిపోయిందని కెనడాకు చెందిన స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ న్యూస్ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ప్రస్తుత ప్రతిపక్ష నేత పియరీ పోయిలివ్రే దాదాపు 40 శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతుండగా..ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితం కానుంది. ట్రూడో ఆద్వర్యంలో కెనడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు అక్కడి గృహ, ఆరోగ్య సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కార్ విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్న వారు చెబుతున్నారు.
మరో సర్వేలో
ఈ నేపథ్యంలో ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో 2017 నుంచి 2019 మధ్యకాలంలో కెనడాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైంది.
వస్తున్నారు.. వెళ్తున్నారు
గత అక్టోబర్ 31న విడుదలైన ఈ సర్వేలో 2017 నుంచి కెనడాకి గుడ్ బై చెబుతున్నారో.. అదే స్థాయిలో కెనడాకి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వే హైలెట్ చేసింది. అధ్యయనం ప్రకారం, 1982లో లేదా తర్వాత కెనడాలో శాశ్వత నివాసం పొందిన వారిలో 0.9 శాతం మంది ప్రతి సంవత్సరం కెనడాను విడిచిపెట్టారు. అయితే 2019లో ఈ శాతం 1.18 శాతానికి పెరిగింది. ఇది వలసదారుల సగటు రేటుతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపుతుంది.
కారణం ఇదే
2019లో దాదాపు 67,000 మంది వలసదారులు కెనడాను విడిచిపెట్టగా, 2017లో 60,000 మంది వలసవెళ్లారు. కెనడాను విడిచిపెట్టిన వలసదారుల పెరుగుదలలో ఈ ధోరణి 1990ల నుండి పెరుగుతోందని అధ్యయనం తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వేలో కెనడాకు కొత్తగా వచ్చే వారి అంచనాలను అందుకోవడంలో కెనడియన్ ప్రభుత్వం విఫలమైన ఫలితంగా, కెనడా నుంచి వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నాయి. కొత్త వలసదారులు క్షీణిస్తున్న గృహ ప్రణాళికలు, ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉపాధి తక్కువగా ఉండటంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న వారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన పరిపాలనలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment