
హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ జె. ఉమా దేవి, జస్టిస్ ఎన్.బాలయోగి, జస్టిస్ టి.రజని, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మంగళవారం ప్రమాణం చేయించారు. అనంతరం వీరు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కలసి జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కలసి జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ నాగార్జునరెడ్డితో కలసి జస్టిస్ రజని, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో కలసి జస్టిస్ బాలయోగి కేసులను విచారించారు. కొత్తగా బాధ్య తలు స్వీకరించిన నలుగురు న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.