సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు సమంత నియామకం జరిగింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై రాగా, జస్టిస్ సుబేందు సమంత.. కోల్‌కతా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చారు.