హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ | 331 posts of judges are vacant in High Courts | Sakshi
Sakshi News home page

హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ

Published Mon, Jun 17 2024 4:04 AM | Last Updated on Mon, Jun 17 2024 4:04 AM

331 posts of judges are vacant in High Courts

జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 5,342 పదవులు కూడా

అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా 70 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 7 

భర్తీకి కేంద్ర న్యాయ శాఖ చర్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 7, తెలం­గాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పద­వులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయ­మూ­ర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ­గా ఉన్నాయని వివరించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, సబార్డినేట్‌ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నా­యని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్య­లు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేసింది. 

దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయా­ల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో న్యాయ­మూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వా­నికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. 

ఆ తర్వాత పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్‌ హైకోర్టుల్లో 21 చొప్పున ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 1,250, గుజరాత్‌లో 535, బిహార్‌లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్‌లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement