‘చీమకుర్తి’ ప్రభుత్వ భూముల్లో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు | Illegal Granite Mining In Prakasam District, Writ Petition Filed In High Court | Sakshi
Sakshi News home page

‘చీమకుర్తి’ ప్రభుత్వ భూముల్లో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు

Oct 22 2025 4:37 AM | Updated on Oct 22 2025 1:51 PM

Illegal granite mining on government lands in Chimakurthi

హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు  

చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలైంది. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈ నెల 17న న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ద్వారా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సర్వే నంబర్లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు పిటిషన్‌­లో తెలిపారు. మణికంఠ గ్రానైట్స్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్‌ యజమానులు అక్రమంగా అనుమతులు తెచ్చు­కుని తవ్వకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. 

వీరితోపాటు హంస, జయ మినరల్స్, ఎన్‌.వి.ఎక్స్‌పోర్ట్స్‌ తదితర క్వారీల యజమానులు ఆర్‌.ఎల్‌.పురం, బూదవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో మరో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారుల్ని ప్రలోభపెట్టి పేదలకు డి–పట్టాగా ఇచి్చన భూముల్ని ఆ«దీనం­లోకి తీసుకుని ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement