Illegal mining
-
ఇది నా ఆన.. తోడేసుకోనీయండి
అనుమతులు లేని రీచ్.. ఆపై పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలతో తోడివేత.. రాత్రీపగలు తేడా లేకుండా వందల వాహనాల్లో లోడింగ్.. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలింపు..! ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకాలో ఉన్న పెన్నా నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న తీరు. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు వాటాలు ఉండడంతో కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రీచ్‌లో ఇసుక దందాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనపై ఉక్కుపాదం మోపారు కానీ ఇసుక దందాను మాత్రం నిలువరించలేకపోతున్నారు.ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంతసాగరం మండలం పడమటికంభంపాడు (పీకేపాడు) వద్ద పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ఇసుక డాన్ స్థానిక ప్రజాప్రతినిధికి రోజువారీ కప్పం కట్టే ఒప్పందంతో రీచ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. మొదట పర్యావరణ అనుమతి లేదని అధికారులు అడ్డుచెప్పినా.. స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో వెనక్కి తగ్గారు. ఇదే అదనుగా ఏకంగా యంత్రాలు ఉపయోగిస్తూ తోడేస్తున్నారు. రోజుకు 100 భారీ వాహనాలతో పాటు ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇరవై అడుగుల మేర గుంతలతో పెన్నా నదిలో ఇసుకను పిండుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరురోజుకు 5 వేల టన్నుల అక్రమ రవాణాఏడు యూనిట్ల టిప్పర్ ఖరీదు రూ.10 వేలు. అంతకుమించి పెద్ద లారీలు, టిప్పర్లు అయితే రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లకు రూ.వెయ్యి వంతున యూనిట్ ఇసుకను విక్రయిస్తున్నారు. నాణ్యతపరంగా పెన్నా ఇసుకకు చాలా డిమాండ్ ఉంది. దీంతో అందినంత తోడేస్తున్నారు. ఇసుక దందా నడుపుతున్న డాన్ 20 పైగా సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా సాగిస్తున్నాడు. అదికాకుండా ఇతర వాహనాల నుంచి లోడింగ్ చార్జీలు భారీగా వసూలు చేస్తున్నారు.⇒ రోజూ 100 భారీ వాహనాలతో పాటు ట్రాక్టర్లకు లోడింగ్ ద్వారా దాదాపు 5 వేల టన్నుల ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోడింగ్ చార్జీల ద్వారానే దాదాపు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలవారీగా చూస్తే సగటున రూ.3 కోట్ల ఇసుక దందా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు వైఎస్సార్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ఏరియాలకు ఈ రీచ్ నుంచే అక్రమ రవాణా సాగుతోంది. రోజువారీగా వందల వాహనాలతో తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.నెలవారీ మామూళ్లుపీకే పాడు రీచ్‌లో ఇసుక దందా సజావుగా సాగేందుకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్‌పోర్టు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహన యజమానులు మాత్రం వారి రూట్లోని పోలీస్ స్టేషన్లకు రూ.12 వేలు వంతున ఇస్తున్నట్లు చెబుతున్నారు. మామూళ్లు ఇస్తుండడంతో ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.నేషనల్ హైవేపై గుంతలుభారీ వాహనాలు ఓవర్ లోడ్‌తో ఇసుక తరలిస్తుండడంతో ఉప్పలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. 12 టైర్ల వాహనానికి 18 టన్నులు మాత్రమే లోడింగ్ చేయాలి. కానీ, టిప్పర్ల బాడీని పెంచి కట్టించడంతో 40 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్లు గుంతలుపడి వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.ఇసుక దందాపై స్థానికుల ఆందోళనపీకే పాడు రీచ్‌లో ఇసుక అక్రమ దందాపై స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. రోడ్లు పాడవుతుండడంతో పాటు భారీ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పెన్నా నదిలో భారీ గుంతలతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు సాగునీరు అందడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దందాపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. గతంలో రోడ్డెక్కి ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అంటూ దోపిడీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతోనే మాఫియా రెచ్చిపోతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానికుల ఆందోళనను అధికారులు పట్టించుకోపోగా, ఇసుకాసురులకు కొమ్ముకాయడం విశేషం. -
సైదాపురం మండలంలో ఆగని అక్రమ మైనింగ్ దందా
-
టీడీపీ నేతను చితకబాదిన మహిళలు!
తాడికొండ: తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యవహారం రచ్చకెక్కడంతో మహిళలు ఆగ్రహించి ఓ టీడీపీ నేతను చితకబాదిన వైనం తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. లాం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగు తమ్ముళ్లు అక్రమంగా మైనింగ్ చేసి గ్రావెల్‌ను జోరుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేసే సమయంలో అక్కడ జనావాసాల మధ్య పెద్ద రాయి వచ్చి పడింది. దాన్ని తొలగించకుండా తెలుగు తమ్ముళ్లు వదిలేయడంతో టీడీపీకే చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ అఫ్జల్‌ను నిలదీశారు.ఇలా అయితే తాము ఉండేదెలా అంటూ ప్రశ్నించారు. స్థానికులు దీనికి వత్తాసు పలకడంతో వ్యవహారం ముదిరింది. అఫ్జల్ దుర్భాషలాడడంతో స్థానిక మహిళలతోపాటు, తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. దాడిలో అఫ్జల్ చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆగ్రహించిన అఫ్జల్ వర్గీయులు ఎదురుదాడికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తతత నెలకొంది.కాగా, గ్రామంలో రెండు నెలలుగా అక్రమంగా మైనింగ్, బ్లాస్టింగ్ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండుసార్లు కలెక్టర్‌తోపాటు, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు గ్రామస్తులు నేరుగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కనీసం తొంగి చూసిన దాఖలాలు లేవు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని తెలిపారు. -
రాత్రికి రాత్రే రూ.12కోట్ల బెరైటీస్ లూటీ
సాక్షి ప్రతినిధి, కడప : అందరూ సంక్రాంతి సంబరాల్లో జోరుగా హుషారుగా మునిగితేలుతుంటే తెలుగుదేశం తమ్ముళ్లు ఇదే అదనుగా దోపిడీకి తెగబడ్డారు. సందట్లో సడేమియాలా రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారు. వెలికితీసి నిల్వ ఉంచిన బెరైటీస్‌ను లూటీ చేసేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మైనింగ్ లీజుదారులు అధికారులకు విన్నవించినా ఉపయోగంలేకుండా పోయింది.వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో పులివెందుల టీడీపీ తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఈ దోపిడీకి బరితెగించారు. వివరాలివీ..వేముల గనుల్లో వెలికితీసిన బెరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో టిఫిన్ బెరైటీస్ ఆస్బెస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రాంగణంలో దాదాపు 3,500 టన్నులు నిల్వలు అధికారికంగా ఉన్నాయి. ఈ స్టాకుపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. అక్రమ మైనింగ్ చేస్తే కొంతమేరే అక్రమ ఆదాయం వస్తుంది.. అదే రాత్రికి రాత్రే నిల్వ ఉన్న ఈ ఖనిజాన్ని కొల్లగొడితే దెబ్బకు ఒకేసారి భారీగా లబ్ధిపొందవచ్చని వారు భావించారు. అంతే.. సుమారు 3వేల టన్నుల బెరైటీస్‌ను ఉన్నపళంగా తరలించేశారు. మరోవైపు.. తెలుగుదేశం నేతలు తమ కంపెనీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారని.. పైగా అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిరుపయోగమే అయ్యిందని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. సుమారు రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని 20 లారీల ద్వారా తెల్లవారేలోపే వివిధ ప్రాంతాలకు తరలించేశారని.. వారి పన్నాగాన్ని పసిగట్టి అటు మైనింగ్ అధికారులకు ఇటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో లూటీకి ఆస్కారం ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.బీటెక్ రవి ప్రోద్బలంతోనే..ఇదిలా ఉంటే.. టిఫిన్ కంపెనీకి చెందిన దాదాపు 3 వేల టన్నుల బెరైటీస్‌ను అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోవడం వెనుక పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఉన్నారని.. ఆయన ప్రోద్బలంవల్లే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ ఏజెంట్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము) మీడియాకు వెల్లడించారు.అలాగే, వేముల మండల టీడీపీ నేతలు పార్థసారథిరెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథ్రెడ్డిల ప్రత్యక్ష ప్రమేయంతో పెద్దపెద్ద యంత్రాల ద్వారా లోడింగ్ చేస్తూ దాదాపు 20 లారీల బెరైటీస్‌ను తెల్లవారేలోపు కడపలోని పవన్, డైమండ్, జకరయ్య మినరల్స్‌కు తరలించారన్నారు. మరికొంత స్టాకు వేములలోని రామిరెడ్డితోటకు, పేర్ల పార్థసారథిరెడ్డి ఇంటి దగ్గర నిల్వ ఉంచారని తెలిపారు. నిజానికి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీ ప్రతినిధిని అయిన తనను అనేక విధాలుగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని.. కుదరకపోవడంతో చివరికి హత్యాయత్నానికి కూడా తెగబడ్డారన్నారు. వారి బెదిరింపులకు భయపడకుండా వీరి గురించి అధికారులతో పాటు చివరికి ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు సైతం స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసిన ఈ స్టాకుపైన హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులున్నా టీడీపీ నేతలు కొల్లగొట్టుకుపోయారని వారికి తెలిపానన్నారు. అవసరమైతే పోలీసు పికెట్ ఏర్పాటుచేయాలని డీఎస్పీ, ఎస్ఐలను ఆదేశించారనన్నారు. అయినా.. సంక్రాంతి రోజున రాత్రికి రాత్రే మాయంచేశారని వేల్పుల రామలింగారెడ్డి వాపోయారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. -
టీడీపీ నేతల ఇసుక దోపిడీతో మాకు పనిలేకుండా పోయింది..
-
తూర్పుగోదావరి జిల్లాలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
తీరంలో ఘోరం
నదులు, వాగుల్లోని ఇసుకనే కాదు.. అధికార టీడీపీ కూటమి ‘తిమింగలాలు’ ఇప్పుడు సముద్ర తీరంలోని ఇసుకనూ కొల్లగొట్టేస్తున్నారు. ఖనిజాన్వేషణ కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఫలితంగా సముద్ర తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి. ఇలా సాగరతీరాన్ని చెరువులుగా మార్చేస్తూ.. మత్స్యసంపదకు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలోని భీమిలి తీరం ఈ అరాచకానికి కేంద్రంగా మారింది.సాక్షి, విశాఖపట్నం: భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలుండటంతో అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక్కడ బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు లారీలు, మినీ వ్యాన్ల ద్వారా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతూ తీరప్రాంత భద్రతని కలవరపెడుతోంది. ఇప్పటికే తుపాను సమయాల్లో రుషికొండ, ఐటీ జంక్షన్, సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్దఎత్తున కోతకు గురవుతోంది. ఇప్పుడు కూటమి నేతల ఇసుక దందాతో 2–3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. మాకేం తెలీదు.. మేమేం చూడలేదు?ఇక కూటమి నేతలు సముద్ర తీరాన్ని విధ్వంసం చేస్తూ.. భారీ గుంతలు తవ్వుతూ ఇసుకను దోచేస్తున్నా అధికారులు మాత్రం అలాంటివేమీ జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడంలేదు. సీఆర్‌జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా.. టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుండటంతో మత్స్య సంపదకు విఘాతం కలుగుతోందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అవన్నీ తీరంలోనే కప్పేస్తున్నారు తప్ప.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకెయ్యడంలేదు. పైగా.. కూటమి నేతల ఇసుక దాహాన్ని కప్పిపుచ్చే విషయంలో మాత్రం జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎంతో సమన్వయం పాటిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలే కారణం..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. దీంతో.. సముద్రంలో దొరుకుతున్న ఇసుకని ఇంటి నిర్మాణ పనులకు వాడుతున్నామంటూ తప్పుదోవ పట్టించి విచ్చలవిడిగా తోడేస్తూ రాత్రికి రాత్రి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. నిజానికి.. సముద్రపు ఇసుక ఇంటి నిర్మాణానికి వినియోగించేది చాలా అరుదు. కానీ.. ఇందులో అపారమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉండడంతో వీటి కోసమే ఈ తవ్వకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో 24 రకాల ఖనిజ నిక్షేపాలతో కూడిన బ్లాకులున్నాయని గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇటీవల తీరంలో ఇసుక నల్లగా కనిపించడం కూడా దీనిని బలపరుస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి నేతల పాలిట వరంగా మారింది. ఇక్కడి ఇసుకలో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినైట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనోజైట్ వంటి మినరల్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భీమిలిలోని 24 బ్లాకుల్లో సుమారు 4.302 మిలియన్ టన్నుల భారలోహాలున్నాయి. సీ బెడ్‌కు కేవలం ఒక మీటరు లోతు నుంచే ఈ ఖనిజ నిక్షేపాలున్నాయని తెలుస్తోంది. అందుకే.. ఖనిజ నిక్షేపాల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతూ రూ.కోట్ల లావాదేవీలు చేతులు మారుతున్నట్లు సమాచారం.అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలివి..భీమునిపట్నం తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదైనవని జీఎస్ఐ భావిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే గార్నెట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కటింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తారు. ఇలిమినేట్, రూటిల్, లికాక్సిన్ వంటి మినరల్స్‌ను సింథటిక్ రూటిల్స్, టైటానియం డైయాక్సిడ్ పిగ్మెంట్, టైటానియం స్పాంజ్, టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారు. అత్యంత అరుదుగా లభించే టైటానియం మెటల్స్ను ఎయిర్క్రాప్ట్సŠ, స్పేస్ షెటిల్స్, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇందుకోసమే ఎక్కువ లోతులో ఇసుకని తవ్వి చెన్నై, కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.పెద్దపెద్ద లారీల ద్వారా తరలిస్తున్నారు..తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఇది తీరప్రాంత భద్రతకు ముప్పు కలిగించడమే. ఈ గోతులు చూస్తుంటే సముద్రం ఎప్పుడు ముందుకొచ్చేస్తుందోనని మా ప్రాంత ప్రజలంతా భయపడుతున్నాం. పెద్ద పెద్ద లారీల ద్వారా ప్రతిరోజూ ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.– వేముల ఈశ్వర్‌రెడ్డి, కాపులుప్పాడచేపలు దొరకడంలేదు..ఇప్పటికే గంగమ్మ తల్లి ముందుకొచ్చేస్తూ భయపెడుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఇసుక దోచేస్తుండటం మాకు భయం కలిగిస్తోంది. ఇసుక లేకపోతే అలల రాకపోకల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల.. ఇటువైపు చేపల రాక ఆగిపోతుంది. ఈ అక్రమ తవ్వకాలు జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో వేటకు వెళ్తుంటే చేపలు సరిగా దొరకడంలేదు. ఇదే రీతిలో అక్రమ రవాణా కొనసాగితే చిన్న చేప కూడా పట్టుకోలేం. – మేరుగు చిన్నారావు, మత్స్యకారుడు, మంగమారిపేటభవిష్యత్తులో తీర భద్రతకు పెనుముప్పు..సముద్రపు ఇసుకను అక్రమంగా తరలించడం తీర ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ప్రమాదకరం. బీచ్ రోడ్డు ప్రధాన రహదారి వెంబడి యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ అనేక సీసీ కెమెరాలున్నాయి. ఇసుక తరలింపుపై దృష్టిపెట్టి అధికారులు చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యొచ్చు. – దౌలపల్లి కొండబాబు, 4వ వార్డు కార్పొరేటర్ -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణాఫ్రికా గనిలో హాహాకారాలు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులను మూసివేశారు. ఆయా గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ, అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఈ గనుల్లో పని చేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని స్టిల్‌ఫాంటీన్ గనిలో ఏకంగా 4 వేల మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీరంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నట్లు తెలిసింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిని అరెస్టు చేసి, శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టిల్‌ఫాంటీన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేసినట్లు సమాచారం. ఆహారం అందకపోతే వారు చచ్చినట్లు బయటకు వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారికి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణాఫ్రికా మంత్రి ఖుమ్బుడ్జో షావెనీ స్పష్టంచేశారు. వారంతా నేరానికి పాల్పడ్డారని, శిక్షించక తప్పదని అన్నారు. నేరగాళ్లకు సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో వేయి మందికిపైగా కారి్మకులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందక వారంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు.శాంతి భద్రతల సమస్యలు దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాల వద్ద మారణాయుధాలు ఉంటాయి. ఎంతకైనా తెగిస్తారు. అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన అధికారులపై దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలున్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. -
‘పచ్చ ముఠా’ మట్టి మాఫియా
ద్వారకాతిరుమల: పోలవరం కాలువ గట్టుపై పచ్చ ముఠా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు సాగిస్తున్న ఈ దందా రోజురోజుకు ఉధృతమవుతోంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురం, పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై పొక్లెయిన్లు పెట్టి, రాత్రీ పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి, టిప్పర్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో, ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా గట్టును తడుపుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మట్టి పొలసానిపల్లి, ఏలూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిపోతోంది. అనుమతులు ఉన్నాయంటూ దందా.. తవ్విన మట్టిని మరో ప్రాంతానికి తరలించాలంటే కచ్చితంగా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతులు తప్పనిసరి. ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంలో తవ్వకాలు జరుపుతున్న పచ్చ నేతల్లో ఒకరు సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు పొందారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందకుండానే తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని స్థానికులు ఎవరైనా ప్రశి్నస్తే మాకు అనుమతులు ఉన్నాయంటూ తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంకు చెందిన ఆయన అనుచరులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. తవ్వకాల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అనుమతులు ఉన్నాయి మీకెందుకు రిస్క్.. మీ పని మీరు చూసుకోండి అని అధికారులు చెబుతున్నారట. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ముకాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉప ముఖ్యమంత్రికి ఇవి కనబడవా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఐఎస్ జగన్నాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ జరిగిన గ్రావెల్ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాల్లో వైఎస్సార్సీపీ నాయకుల పాత్ర ఏమైనా ఉందేమో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆయనకు కనబడటం లేదా అని స్థానికులు ప్రశి్నస్తున్నారు. -
తలకాయలు తీస్తాం..!
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘అధికారం మాదే. మా ఇష్టమొచ్చినట్లు మైనింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు బిగిస్తే ఊరుకోం.. చెప్పినట్లు వినకుంటే తలకాయలు తీస్తాం. ప్రభుత్వం మాదే, మాకేమీ కాదు’.. అంటూ ఓ గ్యాంగ్ సోమవారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో హల్చల్ చేసింది. అక్రమ మైనింగ్ నుంచి స్వీయ రక్షణ కోసం సంస్థ సూపర్వైజర్లు సీసీ కెమెరాలు బిగిస్తుంటే వారొచ్చి రెచి్చపోయారు. ‘చరిత్ర తెలుసుకుని మసలుకోండి. మీరేమన్నా పెద్ద మొనగాళ్లా’.. అంటూ మండల తెలుగు తమ్ముళ్లు పేర్ల శేషారెడ్డి, రామిరెడ్డి, ధనుంజయ, శివ అండ్ గ్యాంగ్ చెలరేగిపోయారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో టిఫెన్ బెరైటీస్ కంపెనీ లీజుకింద మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ పార్టీ నేతలు ఆ కంపెనీ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.దీంతో.. లీజు ప్రాంతంలో నిరంతరం కాపాలా ఉండేలా టిఫెన్ బెరైటీస్ కంపెనీ ఐదుగురు సూపర్వైజర్లను నియమించుకుంది. అక్రమ కార్యకలాపాల నుంచి స్వీయ రక్షణ కోసం సోమవారం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి సోదరుడు శేషారెడ్డి రెండు వాహనాల్లో తన అనుచరులతో వెళ్లి నానాయాగీ చేశారు. సీసీ కెమెరాలు బిగించవద్దని హెచ్చరించారు. మా ప్రాంగణంలో బిగించుకుంటున్నామని సూపర్వైజర్లు వివరిస్తుండగా.. ‘తలకాయలు తీసుకెళ్తాం, మాకేమి కాదు, ప్రభుత్వం మాదే, అటు వెళ్తాం, ఇటు వస్తాం’.. అంటూ కత్తులతో బెదిరించారు.‘మాకు కేసులు కొత్త కాదు. జైలు జీవితం గడిపే వచ్చాం. మా ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే, మేం మైనింగ్ చేసుకుంటాం. మీరెవరు అడ్డుచెప్పడానికి’.. అంటూ తెలుగు తమ్ముళ్లు రెచి్చపోయారు. చివరికి.. సీసీ కెమెరాలు అమర్చనీయకుండా అడ్డుకుని వెనక్కి పంపేశారు. పైగా.. ఇక్కడ కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో.. యాజమాన్య ప్రతినిధుల సూచనల మేరకు సూపర్వైజర్లు వేముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పనులు అడ్డుకున్నారు.. టిఫెన్ బెరైటీస్ కంపెనీ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు వెళ్లాం. అక్కడికి శేషా రెడ్డితో పాటు మరి కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేశారు. సీసీ కెమెరాల పనులను అడ్డుకున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచెయ్యొద్దని హెచ్చరిస్తూ మమ్మల్ని వెనక్కి పంపేశారు. – రామాంజనేయరెడ్డి (కంపెనీ సూపర్వైజర్), వేల్పుల దాడి చేసేందుకు యత్నం.. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు మా కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించేందుకు వెళ్లాం. కత్తులతో వచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేయబోయారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తే సహించేదిలేదు.. ఇకపై మీరిక్కడ కనిపించకూడదు.. కనిపిస్తే తీవ్ర పరిణమాలుంటాయని హెచ్చరించారు. – నాగేంద్రారెడ్డి (కంపెనీ సూపర్వైజర్), చింతలజూటూరు -
ఉచిత ఇసుకకు ‘టెండర్’!
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి : ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్‌లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్ చేసి రీచ్‌లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు. తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్‌లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్ లోపలికి సైతం వెళ్లనీయలేదు. మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్ చేసే సమయంలో వారిని కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్‌కు టెండర్ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది. కర్నూలులో నోటిఫికేషన్ ఇవ్వకుండానేకర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వకుండానే టెండర్‌ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్ శాఖ వెబ్సైట్లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. ఒకే టెండర్ దాఖలైతే టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్ సిస్టం (డివైస్) బాగా లేదని, టెండర్ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు. పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్‌ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది. 2, 3 రోజులే సమయం.. అంతా రహస్యంసరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్‌ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్ టెండర్లు పిలిచింది. ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్ టెండర్‌కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. -
అడ్డూ.. అదుపు లేదు
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో మట్టి, గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. దేవుని మాన్యం... అటవి భూమి... ప్రభుత్వ పోరంబోకు... పంట పొలం... అనే తారతమ్యం లేకుండా తవ్వేస్తోంది. భారీ యంత్రాలతో 30 అడుగుల మేర తవ్వి పచ్చటి పొలాలను, ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేస్తోంది. రోజూ వందలాది టిప్పర్లు, లారీల ద్వారా మట్టి, గ్రావెల్(చిన్న చిన్న రాళ్లతో కూడిన మట్టి)ను తరలించి కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో మగ్గురు అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఈ మట్టి, గ్రావెల్ దందా సాగుతోంది. – సాక్షి టాస్క్ఫోర్స్రైతులు నోరెత్తకుండా చేసిన మట్టి మాఫియా నేతలు.. ఆ తర్వాత కాంట్రాక్టర్లను టార్గెట్ చేశారు. గూడూరు డివిజన్ పరిధిలో గత ప్రభుత్వం సముద్రతీరం నుంచి జాతీయ రహదారిని కలుపుతూ రూ.2,203 కోట్లతో చేపట్టిన సాగరమాల, భారతమాల పనులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో మట్టి మాఫియా నేతలు సమావేశమయ్యారు. పనులు యథాతథంగా కొనసాగాలంటే కమీషన్ల రూపంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగినంత ఇస్తేనే మట్టి, గ్రావెల్ తీసుకువెళ్లేందుకు అనుమతిస్తామని హెచ్చరించారు. అప్పటికే వారం నుంచి పనులు ఆగిపోవడంతో భయపడిన కాంట్రాక్టర్లు వారు అడిగినంత రెండు విడతల్లో ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అలా మొదటి విడతలో పలువురు కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మామూళ్లు ముట్టజెప్పిన తర్వాతే మట్టి, గ్రావెల్ తరలింపునకు అనుమతిచ్చినట్లు ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. దేవుడి భూమిలో పాగా..చిల్లకూరు మండలం కలవకొండ పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉన్న 246 ఎకరాలను మట్టి మాఫియా హస్తగతం చేసుకుంది. ఇదే రెవెన్యూ పరిధిలో స్థానిక రైతుల ఆధీనంలో ఉన్న భూములు, పొన్నవోలు, తిక్కవరం పరిధిలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కొద్ది రోజులుగా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తోంది. ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మాఫియా వద్ద ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి మట్టి, గ్రావెల్ కొనుగోలు చేస్తున్నారు. మిగిలినవారు యూనిట్‌కు రూ.350 చెల్లించి తీసుకువెళుతున్నారు. గూడూరు డివిజన్ పరిధిలోని చేడిమాల, కోట, గూడూరు రూరల్, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో కూడా యథేచ్చగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నేతల అనుమతులు ఉన్న వాహనాలను ఎవ్వరూ ఎక్కడా ఆపటానికి వీల్లేదని మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే..» ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గూడూరు డివిజన్ పరిధిలో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ముగ్గురు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలో ఉన్న సీఎం చంద్రబాబు ముఖ్య అనుచరుడిగా పేరొందిన కాంట్రాక్టర్ తెరపైకి వచ్చారు. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అప్పటి వరకు వివిధ అభివృద్ధి పనుల కోసం కొనసాగుతున్న మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలను ఆపేయాలని చెప్పారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.» ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండో రోజు డివిజన్ పరిధిలోని రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో సీఎం ముఖ్య అనుచరుడు, ఓ ఎమ్మెల్యే, గతంలో ఖమ్మం నుంచి మావోయిస్టులు హెచ్చరించడంతో పారిపోయి ఇక్కడికి వచ్చిన నాయకుడు, స్థానికంగా ఉన్న మరో నాయకుడు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడ ఏయే పనులు జరుగుతున్నాయి... ఆ పనులకు మట్టి, గ్రావెల్, ఇసుక ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. » మట్టి, గ్రావెల్, ఇసుక బాగా ఎక్కడ లభిస్తాయి.. ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. రహదారుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు మట్టి, గ్రావెల్ ఎలా విక్రయిస్తున్నారు.. అనే వివరాలపై ఆరా తీశారు. మట్టి తవ్వకాలు చేపట్టే అవకాశం ఉన్న భూముల రికార్డులను కూడా తెప్పించుకున్నారు. » ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే చిల్లకూరు, పెళ్లకూరు, గూడూరు రూరల్, కోట, వాకాడు మండలాల నుంచి ఎంపిక చేసుకున్న రైతులను పిలిపించారు. ఆ రైతుల ఆధీనంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి మట్టి, గ్రావెల్ తవ్వకాలకు ఎవ్వరూ అడ్డుచెప్పకుండా ఉండేలా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. వారికి కొంత నగదును ముట్టజెప్పి ఎవ్వరూ నోరెత్తకూడదని హుకుం జారీచేశారు.టీడీపీ నాయకుల అనుచరులు కాపలా!మట్టి మాఫియా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్న భూముల వద్ద టీడీపీ నాయకుల అనుచరులు కాపలా ఉంటున్నారు. ఎన్ని లారీలు, టిప్పర్ల ద్వారా ఎన్ని యూనిట్ల మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారనే వివరాలను వారు పుస్తకాల్లో నోట్ చేసుకంటున్నారు. ప్రస్తుతం డివిజన్లో మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. -
ఇసుకపై ఇరకాటం..!
సాక్షి, అమరావతి: ఇసుక పేరుతో సాగుతున్న దోపిడీ వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో ఆ తప్పంతా అధికార యంత్రాంగంపై నెట్టివేసేందుకు సీఎం చంద్రబాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకలో దాదాపు 40 లక్షల టన్నులు మాయం చేసి అందినకాడికి విక్రయించి పచ్చముఠాలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకూ తరలించారు. నిత్యం తవ్వుకో తమ్ముడూ అంటూ రీచ్‌ల్లోనూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఇతర మీడియాల్లోనూ దీనిపై కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. వైఎస్ జగన్ సర్కారు హయాంలో కంటే ఇసుక ధర ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గతంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోందని ప్రస్తావించారు. స్టాక్ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా విక్రయించినప్పుడు కళ్లు మూసుకుని బుకాయించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీన్ని అధికారులపై నెట్టివేసే యత్నాలపై యంత్రాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్రంలో 59 ఇసుక యార్డుల్లో ఇక 24.08 లక్షల టన్నులు ఇసుక మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఎర్రమట్టి దిబ్బ తవ్వకాలపై అధికారుల్లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్న వైనంపై గనుల శాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఎర్రమట్టి దిబ్బల్లో ఈనెల రెండో వారంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో జూలై 17న ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన జిల్లా యంత్రాంగాన్ని పంపి, మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసింది. తెరవెనుక సూత్రధారులను వదిలేసి, నిడిగట్టు సచివాలయం ఇన్చార్జ్ ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవాలని చూసింది. దీనిపై మరోసారి జూలై 18న ‘చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఇక గనుల శాఖ ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఎర్రమట్టి దిబ్బలను తవ్విన ప్రదేశం తీరప్రాంత క్రమబదీ్ధకరణ మండలి సీఆర్‌జెడ్ జోన్–1 సునిశితమైన పరిధిలోకి వస్తుందని గనుల శాఖ ప్రాథమికంగా అంచనావేస్తూ.. దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నేరళ్ల వలస గ్రామం సర్వే నం.:118/5ఏ (పాత సర్వే నెం :49/1)లో ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ బిల్డింగు సొసైటీ (బిల్డింగ్ హౌస్ సొసైటీ)లోని 278.95 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు నిర్వహించినట్లు గనుల శాఖ అధికారులు నిర్థారించారు. అక్రమ లేఔట్ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం ఎర్రమట్టి దిబ్బల్లో 39,454 క్యూబిక్ మీటర్ల కంకరతో కూడిన ఎర్రమట్టి ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్–1966ను ఉల్లంఘించారని నిర్థారించిన అధికారులు సొసైటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 148 అడుగుల బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు హడావుడి చేశారు. -
పోలవరం కాలువ గట్టు మట్టి బొక్కేస్తున్నారు
ద్వారకాతిరుమల: తమ అక్రమ సంపాదన కోసం టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఏం చేసినా అడిగే వారు లేరన్న ధైర్యంతో బరితెగిస్తున్నారు. జేబులు నింపుకోవడమే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలవరం కుడి కాలువ గట్లపై కొందరు తెలుగు తమ్ముళ్లు కన్నేశారు. 24 గంటలూ యథేచ్ఛగా కాలువ గట్టును తవి్వ, ఎంతో విలువైన మట్టిని తరలించేస్తున్నారు.టిప్పర్ మట్టిని వేలాది రూపాయలకు అమ్మి, జేబులు నింపుకొంటున్నారు. ఈ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్టు బలహీనపడిపోతోందని, వరదల సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని ఎం.నాగులపల్లిలో పోలవరం కుడికాలువ గట్టును గత కొంత కాలంగా తవ్వి మట్టి తరలిస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలు, సూచనలతో స్థానిక సంస్థలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఈ దందా నడిపిస్తూ డబ్బు దండుకుంటున్నారు. పొక్లెయిన్ సహాయంతో తవి్వన మట్టిని టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏవిధమైన అనుమతులూ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దూరాన్ని బట్టి ధరమట్టిని తరలించే దూరాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం నుంచి ఏలూరుకు వెళ్లే ఒక్కో టిప్పర్ నుంచి రూ. 7 వేలు, భీమవరం పరిసర ప్రాంతాలకు వెళ్లే ఒక్కో టిప్పర్ నుంచి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లను చదును చేయడానికి, చేపల చెరువుల గట్ల నిర్మాణానికి ఈ మట్టిని వినియోగిస్తున్నారు. రైతులకు తప్పని ఇక్కట్లు తవ్వకాలు జరుగుతున్న కాలువ గట్టు వెంబడి వ్యవసాయ భూములు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిప్పర్ల ధాటికి కాలువ గట్టు మార్గం పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా మారుతోందని, వేగంగా వెళుతున్న టిప్పర్ల వల్ల ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు భయపడుతున్నారు. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఆరా తీస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గురువారం ఉదయాన్నే ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు ప్రారంభించారు. మహిపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డితోపాటు మైనింగ్‌కు సంబంధించి కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు హైదరాబాద్, పరిసరాల్లోని మొత్తం ఏడుకు పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు దాదాపు 11 గంటలపాటు సాగాయి. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై మధుసూధన్ రెడ్డిపై పటాన్చెరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మధుసూదన్‌రెడ్డిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను, డిజిటల్ డివైజ్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ఇంట్లోని వ్యక్తులు ఎవరినీ బయటికి రానీయలేదు. అలాగే వారి ఫోన్లను కూడా ఈడీ బయటకు అనుమతించలేదు. నివాసాల వద్ద ఉన్న కార్లలో కూడా తనిఖీలు చేసి అధికారులు కొన్ని కాగితాలను తీసుకెళ్లారు. నిబంధనల అతిక్రమణపై కేసు నమోదు కేంద్ర పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు వంటి ఆరోపణలపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా సంతోష్ గ్రానైట్ మైనింగ్, ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. సంబంధిత అనుమతుల గడువు ముగిసినా కూడా మధుసూదన్‌రెడ్డి మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంటూ ఇటీవల అధికారులు క్రషర్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ విచారణలో లక్డారంలో మధుసూధన్‌రెడ్డికి చెందిన కంపెనీలు నిర్వహిస్తున్న అనేక అక్రమ మైనింగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి. మహిపాల్‌రెడ్డి, మధుసూధన్రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే రూ.3 కోట్లతో మహిపాల్ రెడ్డి అల్లుడు లాండ్‌క్రూజర్ కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి డబ్బు ఎక్కడిది అన్న కోణంలోనూ ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.కొండను తవ్వి ఎలుకను పట్టారు ఈడీ తనిఖీలకు తాము పూర్తిగా సహకరించామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. సోదాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్నాక అధికారులు వెళ్లిపోయారన్నారు. కొన్ని దస్తావేజులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను వెంట తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత దాడిగా ఆయన అభివరి్ణంచారు. దేశం యావత్తు ఈడీ అధికారుల తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. -
CM Ramesh: గనులపై కన్ను... పోటీకి దన్ను
భారీ బెల్లం మార్కెట్‌తోపాటు మైనింగ్‌కు కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే సీఎం రమేష్ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న కొండలను పిండి చేసి అక్రమార్జనకు తెరలేపేందుకే ఇంతదూరం వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా అనకాపల్లి చుట్టుపక్కలున్న మైన్లతోపాటు నర్సీపట్నంలో ఉన్న రంగురాళ్లను దోచేందుకే చంద్రబాబు డైరెక్షన్లో అడుగుపెట్టారనే చర్చ నడుస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా బరిలో నిలిచేందుకు బీ–ఫారం తీసుకునే సమయంలో పక్కనే మైనింగ్ డాన్ ఉండటం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు చెబితేనే వచ్చాను.. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉంటానని ప్రకటించుకున్న సీఎం రమేష్ మాటల్లో మర్మం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలోని కొండలను నుగ్గు చేసి భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టిన వెంగమాంబ శ్రీనుతో కలిసి బీ–ఫారం తీసుకున్న ఫొటోలు చక్కర్లు కొట్టడంతో నాన్ లోకల్ నేత పక్కా స్కెచ్ తేటతెల్లమవుతోంది. వెంగమాంబ పేరుతో మైనింగ్ అధికారులను వెర్రిమాలోకాలను చేసి అక్రమ మైనింగ్‌తో దర్జాగా కోట్లాది రూపాయల మేర దండుకున్న చరిత్ర శ్రీనివాస్ చౌదరికి ఉంది. ఖజానాకు రావాల్సిన రాయల్టీ వగైరాలను ఎగ్గొటి సొంత జేబులు నింపుకున్న సదరు ఉల్లంఘనుడి సహాయ సహకారాలతో ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాకుండా తనకు తానుగా ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా చెప్పుకుంటూ ఇటు అల్లూరి నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న వనరులను దోచేందుకే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉంటానంటూ చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అనకాపల్లి జిల్లాలోని గనులను దోచుకునేందుకే ఈ ఘనుడు వచ్చాడని అర్థమవుతోంది. ఇదీ వెంగమాంబ బాగోతం...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ బరిలో సీఎం రమేష్ ఉండాలని నిర్ణయించుకున్న సమయంలోనే మైన్స్పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పారీ్టకి దగ్గరగా ఉండి... 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వెంగమాంబ క్వారీ సంస్థ అధినేత శ్రీనివాస్ చౌదరి బీజేపీకి దగ్గరగా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్ కూడా శ్రీనివాస్ చౌదరికి దగ్గరయ్యారు. ఎంతగా దగ్గరయ్యారంటే.... బీ–ఫారం తీసుకునే సమయంలోనే అక్రమ మైనింగ్ వీరుడితో చెట్టాపట్టాలేసుకునేంతగా.. అక్రమ మైనింగ్ డాన్‌గా వీవీఆర్ స్టోన్‌క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరికి పెట్టింది పేరు. అక్రమ మైనింగ్ అధికారులతో కుమ్మక్కై కోట్లాది విలువ చేసే వనరులను దోచుకున్న వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చాడు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యరి్థగా వచ్చిన సీఎం రమే‹Ùకు అత్యంత ఆప్తుడిగా ఎన్నికల ప్రచారాల్లో శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేస్తున్నాడు. సీఎం రమేష్ ఎంపీ అయితే జిల్లాలో ఎక్కడా కొండలు లేకుండా అనకొండ శ్రీనివాస్ చౌదరి దోచుకుంటారనే అనుమానాలున్నాయి. అయితే కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ లాంటి వారిని ఓడగొడితేనే ఇలాంటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని స్ధానిక ప్రజలు భావిస్తున్నారు. అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నెం.193, 303లో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ ఖనిజ సంపదను అక్రమంగా దోచేసి మైనింగ్ చేయడంతో మైన్స్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత ఏడాది జూలై 8న క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేసి శ్రీనివాస్ చౌదరికి దాదాపు రూ.33 కోట్ల జరిమానా విధించారు. అయినా లెక్కచేయకుండా మైనింగ్ డాన్ శ్రీనివాస్ చౌదరి స్ధానిక మైనింగ్ అధికారులతో చేతులు కలిపి యథేచ్ఛగా మైనింగ్ కొనసాగిస్తున్నారు. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతుందని స్థానికులు చేసిన ఫిర్యాదులను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమంటే లెక్కలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాకు సంబంధించి నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, శ్రీనివాస్ చౌదరి ఆగడాలకు తొత్తులుగా పనిచేస్తున్నారని అప్పట్లో ముగ్గురు అధికారులను, విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీవీవీ సత్యనారాయణరెడ్డిని ఏలూరు బదిలీ చేశారు. వెంగమాంబ స్టోన్ క్రషర్స్‌లో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఏకంగా 5 లక్షల 68 వేల 923 క్యూబిక్ మీటర్ల ఖనిజం దోచుకున్నారని మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీ ప్రతాప్‌రెడ్డి అప్పట్లో నిర్ధారించారు. దీనికి రూ.32.36 కోట్ల మేర జరిమానా విధించారు. అయినప్పటికీ ఆగకుండా అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి గ్రామీణ జిల్లాగా పచ్చని వ్యవసాయ గ్రామాలతో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ చౌదరి లాంటి అక్రమ మైనింగ్ డాన్లు జిల్లాలో ఖనిజాన్ని దోచేస్తున్నారు. వీరికి తోడు సీఎం రమేష్ లాంటి వాళ్లు వస్తే జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు డైరెక్షన్లోనే..వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆయన రాజ్యసభ అభ్యరి్థత్వంపై వేటు పడలేదు. దర్జాగా చివరి వరకూ ఆ పదవిని అనుభవించారు. తిరిగి రాజ్యసభకు వెళ్లాలని భావించినప్పటికీ ఆ అవకాశాన్ని బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తహతహలాడిన చంద్రబాబు... అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం తన వ్యక్తికే ఉండాలని భావించారు. మొదటగా ఈ సీటు నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా పావులు కూడా కదిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న భారీ గనులను దృష్టిలో ఉంచుకున్న బాబు... ఈ సీటు నుంచి నాగబాబు బరిలో ఉండటాన్ని ఇష్టపడలేదు. దీని ఫలితంగానే ఈ సీటును బీజేపీ గట్టిగా కోరడం... పవన్ ఈ సీటును వదులుకోవడం జరిగిపోయాయి. ఫలితంగా సీఎం రమేష్ తెరమీదకు వచ్చారు. ఈ వ్యవహారమమంతా బాబు డైరెక్షన్లోనే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు
పటాన్ చెరు టౌన్, పటాన్చెరు: అక్రమ మైనింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్‌పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్‌చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడుమధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
లక్షల టన్నుల సున్నపు రాయి అక్రమంగా తవ్వి తరలించేసిన యరపతినేని
-
అక్రమ మైనింగ్‌పై చర్యలు వేధింపులా?
సాక్షి, అమరావతి: ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి. నేరం చేస్తే నేరమని చెప్పాలి. ఈనాడు పత్రిక నేరమే కరెక్టు అంటుంది. తప్పులు చక్కగా చేయొచ్చంటుంది. తప్పు చేసే వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వేధింపులంటూ రాతల్లో రోత పుట్టిస్తుంది. రాష్ట్రంలో ‘మైనింగ్’పై ఇలాంటి రోత కథనమే మరొకటి రాసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు గనుల శాఖ చేపట్టిన తనిఖీలు, విధిస్తున్న జరిమానాలపైనా వక్రభాష్యాలు చెబుతోంది. అడ్డగోలుగా గనులను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపుగా, వేధింపులుగా చిత్రీకరిస్తోంది. ఇలా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ సోమవారం ఓ తప్పుడు కథనం ప్రచురించింది. మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ, తనిఖీలు గనుల శాఖ ప్రధాన విధి. దాన్ని కూడా తప్పు పడుతూ ఈనాడు పత్రిక రాజకీయాలు అంటగడుతోంది. అక్రమ క్వారీయింగ్ చేసే వారు రాజకీయ నేతలైతే వారికి మినహాయింపు ఇవ్వాలనే ధోరణిలో వాదిస్తోంది. మైనింగ్ అక్రమార్కులపై ఆ పత్రిక ఒక్క ముక్క రాయకపోగా, అక్రమార్కులను ప్రోత్సహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇవీ వాస్తవాలు ► నెల్లూరు జిల్లాలో 5 ఎకరాలు లీజుకు తీసుకుని దాదాపు 50 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తుంటే స్థానికులు ఫిర్యాదు చేశారు. గనుల శాఖ అధికారులు అక్కడ క్వారీలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కళ్లు చెదిరే దారుణాలు, అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి. వాటన్నింటి విలువ రూ.142 కోట్లుగా తేలింది. ఆ మొత్తాన్ని అధికారులు జరిమానాగా విధించారు. ఈ చర్య ఈనాడుకు తప్పుగా, కక్ష సాధింపుగా కనపడుతోంది. ► సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ఎన్‌హెచ్ – 42లో ముదిగుబ్బ బైపాస్ ప్రాంతంలో నితిన్ సాయి సంస్థ రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తొలుస్తోంది. దాన్నుంచి వచ్చిన రాయిని మొబైల్ క్రషర్ ద్వారా బయటికి తరలించి, విక్రయిస్తోంది. ఈ సమాచారం తెలిసి గనుల శాఖ అధికారులు తనిఖీ చేశారు. సుమారు రూ.15 కోట్ల విలువైన మెటల్‌ను అక్రమంగా విక్రయించినట్లు తేలింది. దీనిపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టడం ఈనాడు వక్రనీతికి అద్దం పడుతోందని గనుల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తన్నారు. ► అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్ వద్ద ఉన్న కొన్ని కంకర క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గతంలో వాటికి జరిమానాలు విధిస్తూ అధికారులు నోటీసులిచ్చారు. వీటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అక్కడ వారి వాదన చెల్లలేదు. జరిమానాలు చెల్లించకపోవడం, న్యాయస్థానాల నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో చాలా క్వారీల్లో మైనింగ్ జరగడంలేదు. దీన్ని కూడా ఆ పత్రిక వక్రీకరించింది. క్వారీలను వేధిస్తున్నారంటూ అడ్డగోలుగా రాసింది. గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లోనూ అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ తనిఖీ చేసింది. ఉల్లంఘనలు బయటపడడంతో కేసులు నమోదు చేసింది. ఇది కూడా ఈనాడుకు కక్ష సాధింపుగా కనపడింది. అక్రమాలను నిస్సిగ్గుగా సమర్ధించింది. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం విజిలెన్స్ స్క్వాడ్లతో అక్రమ మైనింగ్‌పై ఉక్కు పాదం మోపుతుంటే దాన్ని వక్రీకరిస్తూ కథనాలు రాయడం సరికాదు. మైనింగ్ అక్రమాలపై టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 కు వచ్చే అన్ని ఫిర్యాదులపైనా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. 2014 – 2019 మధ్య అక్రమ మైనింగ్‌పై కేవలం 424 కేసులు నమోదైతే, 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లలోనే 786 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు రాజకీయ ఉద్దేశాలను ఆపాదించేలా ఈనాడు పత్రిక కథనం ప్రచురించడం దారుణం. అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ చర్యలు తీసుకోవడం నేరమా? తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని వేధింపుల కింద ఈనాడు పత్రిక చిత్రీకరిస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయ దురుద్దేశాలను అంటగడతారా? ఇటువంటి తప్పుడు కథనాల వల్ల ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. – మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
‘స్పందన’ ఫిర్యాదుతో అక్రమ మైనింగ్ బట్టబయలు
సాక్షి, అమరావతి: స్పందనలో అందిన ఫిర్యాదు ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.వందల కోట్ల విలువైన అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది. రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకున్న తీసుకున్న భూమిలో స్టోన్ క్రషర్, వే బ్రిడ్జిలు, క్వార్టర్లు నిర్మించడంతోపాటు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఒక్క టన్ను మెటల్ తవ్వకున్నా తవ్వినట్లుగా స్థానిక మైనింగ్ అధికారులు పర్మిట్లు జారీ చేసేశారు. చుట్టుపక్కల గడువు ముగిసిన లీజు ప్రాంతాల్లో యధేచ్చగా తవ్వకాలు జరిపారు. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ దాదాపు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను అక్రమంగా తవ్వి భారీగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.200 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైమాటే ఉంది. ప్రత్యేక బృందం తనిఖీలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరంలో రోడ్డు మెటల్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నట్లు గత నెలలో కలెక్టరేట్‌కు స్పందన ద్వారా ఫిర్యాదు అందింది. స్థానికంగా రెండు గ్రామాల్లో తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిగ్గు తేల్చేందుకు మైనింగ్ శాఖాధికారులు ప్రతాప్‌రెడ్డి, రామకృష్ణప్రసాద్, శివపార్వతి, గోవిందరావు, షేక్ అబ్దుల్లా సభ్యులుగా మైనింగ్ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారం రోజులపాటు విస్తృతంగా తనిఖీలు జరిపిన బృందం అక్రమాలు నిజమేనని తేల్చింది. ఈమేరకు మైనింగ్ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించింది. ♦ జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వే నెంబర్ 10, 15లో గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్‌కు 9.8 ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ భూమిలో తవ్వకాలు జరపకుండా స్టోన్ క్రషర్ యూనిట్ ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు, సర్వెంట్ క్వార్టర్లను నిర్మించారు. ఒక్క టన్ను ఖనిజం తవ్వకపోయినా మైనింగ్ అధికారులు 28 వేల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను తవ్వినట్లు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లు ఉపయోగించారు. లీజు ప్రాంతాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైంది. వేరే చోట తవ్విన 700 క్యూబిక్ మీటర్లకుపైగా రోడ్ మెటల్‌ను అక్కడ నిల్వ చేశారు. ♦ జలదంకి మండలం అన్నవరం గ్రామం 851 సర్వే నెంబర్లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు నిర్వహిస్తోంది. అక్కడ సుమారు 5 లక్షలకుపైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను అక్రమంగా తవ్వినట్లు తేల్చారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగుణమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి పేర్లతో గతంలో పలు రోడ్డు మెటల్ లీజులున్నాయి. వాటి లీజు గడువు ఎప్పుడో ముగిసిపోయింది. అయితే వాటిలో పాగా వేసిన గురు రాఘవేంద్ర కంపెనీ అందులో కూడా యథేచ్చగా తవ్వకాలు జరిపింది. సుమారు 7 లక్షల క్యుబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను తవ్వినట్లు తనిఖీ బృందం నిర్థారించింది. మొత్తం 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు జరిపినట్లు తేలింది. అన్నవరంలో అక్రమంగా తవ్విన రోడ్డు మెటల్‌ను గట్టుపల్లిలో ఏర్పాటు చేసిన క్రషర్‌కి తరలించి విక్రయించారు. ఈ అక్రమ తవ్వకాల మొత్తం విలువ రూ.140 కోట్లుగా తనిఖీ బృందం నివేదిక సమర్పించింది. అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్‌ను తాము పెద్దగా వినియోగించలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు వినియోగం లెక్కలు సేకరించగా 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. ఒక టన్ను ఖనిజం ఉత్పత్తికి 2.5 యూనిట్లు వినియోగం అవుతుంది. ఈ లెక్కన రూ.200 కోట్ల మేర ఆ యూనిట్లో రోడ్డు మెటల్‌ను ప్రాసెస్ చేసినట్లు తేలింది. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ సంస్థలు అక్రమ తవ్వకాలు నిర్వహించినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు స్టేట్మెంట్లు ఇచ్చారు. -
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్ విజిలెన్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014–19 మధ్య అక్రమ మైనింగ్‌పై 424 కేసులు నమోదవగా, 2019–22 మధ్యలో 643 కేసులు నమోదైనట్లు చెప్పారు. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించినట్లు తెలిపారు. ద్రవిడ విశ్వ విద్యాలయం భూముల్లో 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 2014 నుంచి 2019 వరకు అక్రమ మైనింగ్‌పై కేవలం 38 కేసులు నమోదు చేయగా, 2019 నుంచి 2023 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల 96 కేసులు నమోదయ్యాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు 2014–19 మధ్య కాలంలో బినామీల ద్వారా పెద్ద ఎత్తున లేటరైట్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దానిపైనా చర్యలు తీసుకుని జరిమానా విధించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల మైనింగ్ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. 2018–19 ఆరి్థక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ రూ.1,950 కోట్లు కాగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.4,756 కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గ్రావెల్, రోడ్ మెటల్ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో 41.62 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.12.62 కోట్ల మైనింగ్ ఆదాయం లభించిందని చెప్పారు. 2019–22 వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 65.24 కోట్ల ఆదాయం లభించిందన్నారు. గత ప్రభుత్వం కంటె ఈ ప్రభుత్వంలో మూడేళ్ళలోనే నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం
రాంచీ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సోరెన్ స్పందించారు. తనను ఎమ్మెల్యేగా తొలగించాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసిందని, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గవర్నర్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సోరెన్ చెప్పారు. అలాగే బీజేపీ తనపై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని సోరెన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులపైనా ఇలాంటి కేసులనే కేంద్రం పెడుతుందని జోస్యం చెప్పారు. రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్న తనకు సమన్లు పంపిన తీరు, విచారణ జరగుతున్న విధానం చూస్తుంటే తాను ఏదో దేశం వీడి పారిపోతానేమో అన్నట్లుగా చేస్తున్నారని సోరెన్ మండిపడ్డారు. ఇప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే దేశం విడిచిపారిపోయారని, ఒక్క రాజకీయనాయకుడు కూడా అలా చేయలేదని వివరించారు. తాను రెండేళ్ల కాలంలో రూ.1000కోట్ల మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారని, కానీ ఆ వ్యవధిలో మైనింగ్‌లో మొత్తం రూ.750కోట్ల వ్యాపారమే జరిగిందని సోరెన్ వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్రంపై సెటైర్లు వేశారు. చదవండి: గుజరాత్ ఎన్నికల వేళ ఆప్ నేత ఓవరాక్షన్.. కేసు నమోదు! -
మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్‌కమ్‌టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసింది తానేనని బీజేపీ లాయర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ దాడులపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ.. 'మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నేనే ఫిర్యాదు చేశా. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి 2020లో కంప్లైంట్ ఇచ్చాను. 2021లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని షిప్పింగ్ కార్పోరేషన్ చెన్నైని ఈడీ సూచించింది. పది రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సూచించినా.. ఇంతవరకు ఇవ్వలేదు. మీడియా ద్వారా ఈడీ దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. దాదాపు రూ.749 కోట్ల పెనాల్టీ (వడ్డీతో కలిపి) మైనింగ్ చేస్తున్న వారు కట్టాల్సి ఉంది' అని తెలిపారు. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) -
ప్రాణాలు తీసిన బంగారం గని.. 21 మృతదేహాలు లభ్యం
జోహన్నెస్‌బర్గ్: అక్రమ మైనింగ్ కూలీల ప్రాణాలను బలి తీసుకుంది. బంగారం గనిలో అనుమతి లేకుండా తవ్వకాలు సాగిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 21 మృతదేహాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ నగరానికి పశ్చిమాన ఉన్న క్రుగెర్స్‌డార్ప్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 19, గురువారం ఉదయం 2 మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలియజేశారు. గనిలో మరో చోట చనిపోయివారి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు తాము అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ప్రైవేట్ బంగారం గని, ఇక్కడ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని చెప్పారు. క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో గనులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ తరచుగా గనుల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది జూలైలో ఓ గనిలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన 8 మంది మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, వారివద్దనున్న సొత్తును దోచుకున్నారు. -
అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టం
సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలిపేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా తవ్వకాలు జరిగాయా, లేదా అనే వ్యవహారాన్ని తేలుస్తామంది. దీనిపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెల 17న దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫు వాదనలు వినిపిస్తున్నందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని న్యాయవాది మహేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. బెదిరింపుల విషయాన్ని లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వారిపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడ్డ హైకోర్టు తమ ముందు హాజరైన ఎస్ఐ చంటిబాబును వివరణ కోరింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. మైనింగ్ ఆపాలంటూ తాము ఆదేశాలు ఇచ్చిన రోజునే ఫిర్యాదుదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే అరెస్టుకు ఆదేశాలిస్తామని ఎస్ఐను హెచ్చరించింది. ఒంటిపై ఉన్న యూనిఫాంను ఎలా తీయించాలో తమకు బాగా తెలుసంది. గ్రావెల్ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇదీ కేసు.. తోటపల్లి పరిధిలో గ్రావెల్ తవ్వకాలు జరుపుకునేందుకు బసవపూర్ణయ్యకు తాత్కాలిక అనుమతి మంజూరు చేస్తూ గనుల శాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ జె.లక్ష్మణరావు, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు తవ్వకాలు జరపొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మరో సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం గ్రావెల్ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన రైతులపైనే ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకున్న ధర్మాసనం మైనింగ్ నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. -
విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. – సతీష్‌కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్!
చండీగఢ్: హర్యానా డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్‌ను పోలీసులు గంటల్లోనే పట్టుక్నునారు. నూహ్‌లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నూహ్‌లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మధ్యాహ్నం తన టీమ్‌తో వెళ్లారు తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. అక్కడ మైనింగ్ చేస్తున్న డంపింగ్ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం డీఎస్పీ ఆపుతున్నా లెక్కచేయకుండా వాహనాన్ని ఆయనపై నుంచే పోనిచ్చాడు. అనంతరం సురేంద్రసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలై ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ట్రక్కును ఆపే సమయంలో డీఎస్పీతో పాటు గన్‌మెన్, డ్రైవర్ ఉన్నారు. కానీ వారు ప్రాణభయంతో ట్రక్కు దగ్గరకురాగానే పక్కకు దూకారు. డీఎస్పీ మాత్రం అలాగే ఉండిపోవడం వల్ల ట్రక్కు ఆయనపై నుంచి వెళ్లి చనిపోయాడు. ఈ ట్రక్కును డ్రైవ్ చేసింది నిందితుడు ఇక్కారే అని పోలీసులు తెలిపారు. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం ఎదురైంది. అక్రమంగా మైనింగ్ జరుగుతుందంటూ మీడియాను తీసుకొని పెదకాకాని మండలం అనుమర్లపూడికి వెళ్లిన దూళిపాళ్లను అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతితో మట్టి తవ్వుతుంటే అక్రమ క్వారీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గొడవ పెట్టేందుకే ఇక్కడకు వచ్చారా అంటూ దూళిపాళ్లను నిలదీశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో అంతులేని అక్రమాలు చేశారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన) -
టీడీపీ నేత అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలో తెలుగుదేశం పార్టీ నేత ఎల్.వి.వి.ఆర్.వి.ప్రసాద్ 12 హెక్టార్ల (30.14 ఎకరాలు) విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని దాదాపు 200 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మనుగడలోలేని సర్వేనంబరుతో తప్పుడు అనుమతులు పొంది కోట్ల రూపాయల మేర ఖనిజ సంపదను దోచేశారని, ఆ సర్వేనంబర్లలో ఖనిజ తవ్వకాలు చేపట్టకుండా సదరు నేతను ఆదేశించాలని కోరుతూ మద్దూరు గ్రామానికి చెందిన వై.రంజిత్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. నిజనిర్ధారణ చేసేందుకు హైకోర్టు న్యాయవాది అశ్వత్థనారాయణను అడ్వొకేట్ కమిషన్‌గా నియమించింది. అడ్వొకేట్ కమిషన్‌కు ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి సర్వేయర్ సహాయంతో పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అడ్వొకేట్ కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు పిటిషనర్ న్యాయవాది బి.చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. అక్రమ మైనింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సాయంతోనే ఎల్.వి.వి.ఆర్.వి.ప్రసాద్ అక్రమ మైనింగ్ చేయగలిగారని పేర్కొన్నారు. ఈ అక్రమ మైనింగ్‌పై ఫొటోలతో సహా అధికారులకు వివరించినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. -
చంద్రబాబు రివర్స్ డ్రామా.. ఇదీ వాస్తవం
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట. అవసరానికి ఎన్ని అబద్ధాలైనా అవలీలగా ఆడేస్తారు. చెప్పిన అబద్ధాన్నే వందసార్లు వల్లించి అదే నిజమని నమ్మించేందుకు యత్నిస్తుంటారు. తాను చేస్తేనే సక్రమం.. ఇతరులు చేస్తే అక్రమం.. ఇదే ఆయన నైజం. ఇంతా ఎందుకంటే.. కుప్పంలో ఇటీవల పర్యటించిన బాబు ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై బురద చల్లారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ నేతలు మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తీరా అసలు ‘ఘనులు’ టీడీపీ నాయకులే అని తెలియడంతో ప్లేటు మార్చేశారు. తమ పార్టీ వాళ్లు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకులంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. కథ అంతటితో అయిపోలేదు.. మళ్లీ తమ్ముళ్లను ఉసిగొల్పి నిరసన నాటకాలు ఆడించారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్షనేత ఎందుకిలా మాట్లాడుతున్నారు.. కుప్పంలో మైనింగ్కి సంబంధించి అసలేం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. సాక్షి, తిరుపతి: 2019కి ముందు.. సరిగ్గా చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గం అక్రమ మైనింగ్‌కు అడ్డా చంద్రబాబు హయాంలో పచ్చచొక్కాల నాయకులు అడ్డూ అదుపు లేకుండా ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకున్నారు. జిల్లా మొత్తంమీద అక్రమ మైనింగ్ ఎక్కువ జరిగింది ఎక్కడంటే స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కావడం గమనార్హం. ఇక్కడి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు ప్రధాన ఆదాయ వనరు అడ్డగోలు తవ్వకాలే. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్‌కు బ్రేకులు పడ్డాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు అక్రమ క్వారీలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి దాడులు నిర్వహించారు. లెక్కకి మించి కేసులు పెట్టి జరిమానాలు విధించారు. టీడీపీ నేతల క్వారీలోనే నిలుచుని వైఎస్సార్సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ ప్రెస్మీట్లో మాట్లాడుతున్న చంద్రబాబు(ఫైల్) ఇప్పుడు కొత్త నాటకం మాటలు.. చేతలతో ప్రజలను బురిడీ కొట్టించే విద్యలో ఆరితేరిన చంద్రబాబు అండ్ కో తాజాగా మరో నాటకానికి తెర లేపారు. ఎప్పుడో ఆగిపోయిన క్వారీలు ఇంకా సాగుతున్నాయని రెండు రోజుల క్రితం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు చిత్తూరులో నిరసన తెలిపారు. దీనికి కొనసాగింపుగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. ముద్దనపల్లె గ్రామంలో అక్రమ మైనింగ్ యథేచ్చగా జరుగుతోందని, దీని వెనుక వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఇదీ వాస్తవం కుప్పం ప్రాంతంలో అక్రమ క్వారీల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార యంత్రాంగం 2021 అక్టోబర్ నుంచి తనిఖీలు ముమ్మరం చేసింది. మహా చెక్ పేరిట అన్ని క్వారీల అనుమతులు, పరిధి, తరలిస్తున్న బ్లాకుల సమాచారాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించింది. ముద్దనపల్లెలో సాగుతున్న దందాను పూర్తిస్థాయిలో కట్టడి చేసింది. కడప, అనంతపురం నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించి అనధికారిక క్వారీలపై ఉక్కు పాదం మోపింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 550 పైగా క్వారీ బ్లాకులను సీజ్ చేసింది. చంద్రబాబు పర్యటన అనంతరం జనవరి 13న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి నేరుగా ఇక్కడి క్వారీలను పరిశీలించారు. బాబు రివర్స్ డ్రామా అక్రమ మైనింగ్‌కు అలవాటు పడిన టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ చంద్రబాబును ఆశ్రయించారు. దీంతో ఆయన రివర్స్ డ్రామాకు తెరతీశారు. గత నెల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మైనింగ్ అంశాన్ని తీసుకువచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు సంధించారు. శాంతిపురం మండలం ముద్దనపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 104, 213లోని అటవీ భూముల్లో వైఎస్సార్సీపీ నేతలు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నాంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జనవరి 8న బాబు ఈ క్వారీలను సందర్శించి అధికార పార్టీపై నిందలు మోపేందుకు ఆపసోపాలు పడ్డారు. అదీ టీడీపీ ఎంపీటీసీ నామాలప్ప, ఆయన మామ వెంకటేశుకు చెందిన క్వారీలోనే నిలబడి మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఆ సమయంలోనే పక్కన ఉన్న నాయకులు ఇది మన పార్టీ వారిదేనని బాబుగారి చెవిన వేశారు. అంతే.. వెంటనే మాట మార్చేశారు. ఇక్కడ క్వారీలు మన వాళ్లు చేసుకుంటే పర్వాలేదు. బయటి వ్యక్తులు మాత్రం వ్యాపారాలు చేయకూడదని ప్లేటు ఫిరాయించారు. అధినేత మాటలకు ఉత్సాహం పుంజుకున్న అక్రమార్కులు, టీడీపీ నేతలు వెంటనే గజమాలతో బాబును సత్కరించారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు అవాస్తవం ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు వందశాతం అవాస్తవం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కుప్పం నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనే అక్రమ మైనింగ్ సాగడం లేదు. ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. – పి.వేణుగోపాల్, మైనింగ్ శాఖ ఏడీ -
అక్రమ మైనింగ్ బాధ్యులపై కొరడా
సాక్షి, అమరావతి/శాంతిపురం: అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిని వదిలిపెట్టేదిలేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. పర్యావరణానికి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పలు అక్రమ క్వారీలను మూసివేశామని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ముద్దనపల్లి రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్న ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్, ఏడీ పీ వేణుగోపాల్‌తో కలిసి గురువారం శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని వారు తనిఖీ చేశారు. అటవీశాఖ ఆధీనంలోని ఈ భూముల్లో అక్రమంగా కొందరు వ్యక్తులు మైనింగ్ చేస్తున్నారని, సమాచారం అందిన ప్రతీసారి దాడులు నిర్వహించి, వాహనాలు, యంత్రాలు, గ్రానైట్ సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెంకట్‌రెడ్డికి వివరించారు. శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23న ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సర్వే నంబరు 104, 213 పరిధిలోని అటవీ భూముల్లో భారీగా గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. మహాచెక్‌లో భాగంగా ఇటీవల ఇదే ప్రాంతంలో 4 బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 6 కంప్రెసర్లను, 2 హిటాచీ యంత్రాలను సీజ్ చేసినట్లు వారు చెప్పారు. ఈ ప్రాంతాలను పరిశీలించి వీజీ వెంకటరెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అవి.. ► అటవీశాఖ పరిధిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌పై ఆ శాఖ ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అటవీ శాఖ డీఎఫ్‌ఓకు లేఖ రాయడంతో పాటు ఇక్కడి పరిస్థితిని వివరించి అటవీ అధికారుల నిఘాను పెంచేలా చూడాలి. ► ఫారెస్టు యాక్ట్–1980 ప్రకారం.. అక్రమార్కులపై కేసులు నమోదయ్యేలా చూడాలి. ఆ భూముల్లోకి ఎవరూ వెళ్లకూడదు ద్రవిడ వర్సిటీ పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్‌పై గతంలో దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేసినట్లు అధికారులు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ..వర్సిటీలోని హరప్పా భవనం సమీపంలో ఉన్న భూముల్లోకి ఎవరూ వెళ్లకుండా గాడి కొట్టించి, భద్రతా సిబ్బందిని నియమించాలని.. అనుమతిలేకుండా ఎవరినీ ఈ ప్రాంత పరిధిలోకి రాకుండా చూడమని వర్సిటీ అధికారులను కోరాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ప్రత్యేక నిఘా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖ అధికారుల బృందాలతో మొబైల్ తనిఖీలు కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఇతర రాష్ట్రాలకు ఖనిజాలను తరలించకుండా చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశామన్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా గనుల శాఖ ఈ మధ్యకాలంలో రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్‌లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని వేలం ద్వారా విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతితో దీనిపై ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
బెడిసికొట్టిన పచ్చ బాబుల అక్రమ మైనింగ్ డ్రామా
-
అందరి చూపు.. రంగురాళ్ల వైపు!.. వారం రోజుల్లో కోట్ల వ్యాపారం
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్‌సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది. తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్) పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్) నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ -
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..
వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి బొల్లికొండ ఫణికుమార్: అది రక్షిత అటవీ ప్రాంతం. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. దాని పైనే ఉంది చిన్న గిరిజన గ్రామం వంతాడ. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేది. ఇప్పుడు ఆ కొండపై ప్రతి చోటా లోయలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వందల మీటర్ల లోతుకు తవ్వి వదిలేసిన ఎర్రమట్టి లోయలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మెరిసే మట్టే అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం. అక్కడే లేటరైట్ కూడా ఉంది. వాటిపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. అంతే అడవి స్వరూపమే మారిపోయింది. ఐదేళ్లలో ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖనిజాన్ని తవ్వేశారు. లేటరైట్‌తోపాటు దాని పేరు చెప్పి వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అమ్మేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్టులోని గిరిజనాపురం, లింగంపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ తవ్వకాలు జరిగాయి. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. టీడీపీ హయాం.. అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగం 2013లో కేంద్రం నుంచి అండ్రు మినరల్స్ సంస్థ వంతాడ పరిసరాల్లోని 200 ఎకరాల డిఫారెస్టేషన్కి అనుమతి సంపాదించింది. అదే సంవత్సరం డిసెంబర్ 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విడగొట్టి 8 లేటరైట్ లీజులు మంజూరు చేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో టీడీపీ అధినేతకు తెరచాటు సంబంధాలు ఉండడంతో ఈ డిఫారెస్టేషన్ ప్రక్రియ సాధ్యమైంది. లీజుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే వాటిని ఇచ్చేశారు. అనంతరం కొద్ది కాలానికే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ అడవిని ఊహించని స్థాయిలో కొల్లగొట్టేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగంలా నడిచింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో సన్నిహితంగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయారు. పరిధి దాటి అడవిని కబళించినా, గిరిజనుల కడుపు కొట్టినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఒకే కుటుంబంలో 8 మందికి ఎడాపెడా లీజులు ఒక కుటుంబంలో పది మంది ఉంటే ప్రభుత్వం ద్వారా ఎంత మందికి లబ్ధి ఉంటుంది. ఉంటే ఒకరో, ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ పథకాలు వర్తిస్తాయా? అర్హత ఉన్నా అందరికీ లబ్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. పేదల కోసం అమలు చేసే పథకాలు, ఉపాధి కల్పించే ఉద్యోగాలకే బోలెడు నిబంధనలుంటాయి. అలాంటిది ఒకే కుటుంబంలో 8 మందికి మైనింగ్ లీజులు ఇస్తే.. అదీ అత్యంత విలువైన లేటరైట్ లీజులు.. బరితెగించి ఇలా లీజులు ఇప్పించింది చంద్రబాబే. అండ్రు మినరల్స్ యజమాని అండ్రు రమేష్‌బాబు. ఆయన పేరుతో ఒక లీజు మంజూరు చేశారు. ఆయన భార్య అండ్రు సుజాత పేరుతో మరో లీజు. రమేష్‌బాబు దగ్గరి సోదరుడు (పెదనాన్న కుమారుడు) శ్రీనివాస్ పేరుతో మరో లీజు. శ్రీనివాస్ తల్లి సత్యవతి, భార్య ఉషారాణి పేరుతో రెండు లీజులు. వీరి దగ్గరి బంధువులైన మన్యం వెంకటేశ్వరరావు, మన్యం వెంకట రజని, వెంపాటి వీర్రాజులకు మరో మూడు లీజులు. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఎడాపెడా లేటరైట్ లీజులు ఇచ్చేశారు. ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా లీజులు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. గనుల శాఖలో వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక కుటుంబానికి అన్ని లీజులు మంజూరు చేయడంలోనే కుమ్మక్కు స్పష్టమవుతోంది. ఐదు రెట్లు ఎక్కువ ఖనిజం అక్రమంగా తరలించారు! అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వినట్లు రికార్డుల్లో చూపింది అండ్రు మినరల్స్. దానికి రూ.88.30 కోట్ల సీనరేజి ఫీజు కట్టింది. నిజానికి దాని కంటే నాలుగైదు రెట్ల ఎక్కువ ఖనిజాన్ని అనధికారికంగా తవ్వి తరలించినట్లు భావిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చూసిన మైనింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ఎ గ్రేడ్ (మెటలర్జికల్) లేటరైట్ మెట్రిక్ టన్ను రూ.200, బి గ్రేడ్ (నాన్–మెటలర్జికల్) లేటరైట్ టన్ను రూ.100కిపైగానే ఉంది. ఎ గ్రేడ్ లేటరైట్‌ను 30 శాతం, బి గ్రేడ్ లేటరైట్‌ను 70 శాతం తరలించారు. దీని విలువ వందల కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దోచేసింది వేల కోట్లు ! పైకి లేటరైట్ అని చూపిస్తున్నా అదంతా బాక్సైట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టింది. అండ్రు మినరల్స్ చేసిన ఎగుమతుల్ని బట్టి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వేదాంత లిమిటెడ్ (ఒడిశా)కు ఐదేళ్లలో 32 లక్షల టన్నుల ఖనిజాన్ని సరఫరా చేసినట్లు ఈ కంపెనీ రికార్డుల్లో చూపింది. వాస్తవానికి ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అండ్రు కంపెనీ లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వేసి అమ్మేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే చైనాకు ఎగుమతి చేసిన 4.5 లక్షల టన్నుల ఖనిజం కూడా బాక్సైట్ అని భావిస్తున్నారు. బాక్సైట్ టన్ను రేటు మార్కెట్లో రూ.500 నుంచి వెయ్యి వరకు ఉంటుంది. ఈ లెక్కన అండ్రు మినరల్స్ లేటరైట్ ముసుగులో బాౖMð్సట్‌ను అమ్మి రూ. వేల కోట్లను అక్రమంగా సంపాదించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గనుల్లో తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో రెండు స్టాక్ యార్డ్లు నిర్వహించారు. అందులో రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే క్రషింగ్ యూనిట్లు పెట్టారు. అక్కడే లేటరైట్‌ను ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి అమ్ముకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వేశారు.. అవి కనపడకుండా పూడ్చి మొక్కలు నాటారు.. కేటాయించిన లీజు ప్రాంతం 200 ఎకరాలే అయినా దాన్ని దాటి తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బ్లాకులో (మొత్తం 8 బ్లాకులు) 25 ఎకరాలే వాళ్ల పరిధి. ఆ మార్కింగ్ లోపే తవ్వకాలు జరపాలి. కానీ దాన్ని దాటి అదనంగా ప్రతి బ్లాకులో 5 నుంచి 10 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్లాకులతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల విడిగా కూడా తవ్వేశారు. ఇలా 50 ఎకరాల కంటే ఎక్కువ అడవిని తొలిచేశారు. ఈ అక్రమ తవ్వకాలు బయటపడకుండా గొప్ప పన్నాగమే పన్నింది అండ్రు కంపెనీ. తవ్వేశాక మిగిలిన పనికిరాని రాళ్లు, మట్టితో ఆ గోతులను పూడ్చేశారు. తవ్వకాల పరిమాణం తెలియకుండా నాటిన నీలగిరి చెట్లు వాటిపై మళ్లీ మొక్కలు నాటేశారు. దీంతో అనధికారికంగా తవ్వకాలు జరిపిన చోట్ల ప్రస్తుతం మొక్కలే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎంత పరిమాణంలో అక్రమ తవ్వకాలు జరిగాయో కనిపెట్టడం అధికారులకు సాధ్యం కావడంలేదు. మైనింగ్ శాఖ నిర్వహించే సాధారణ డీజీపీఎస్, ఈటీఎస్ సర్వేలతో ఎంత తవ్వారో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్ తవ్వకాల్లో ఇదో కొత్త టెక్నిక్‌గా అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల తనిఖీలు చేసినా అక్రమాలు బయటపడకుండా ఉండేలా అండ్రు మినరల్స్ తన పలుకుబడిని, ఆర్థిక బలాన్ని ఉపయోగించింది. అధిక లోడుతో లారీల తరలింపు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ప్రతిరోజు వందలాది లారీల్లో ఖనిజాన్ని తరలించారు. తవ్విన చోటు నుంచి స్టాక్ యార్డుకు ఒక్కో లారీ ప్రతిరోజూ 25 నుంచి 30 ట్రిప్పులు తిరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఒక లారీలో 12 టన్నుల ఖనిజాన్ని తరలించడానికే అనుమతి ఉంది. కానీ దానికి రెట్టింపు ఖనిజాన్ని లారీలో వేసేవారు. ఒకోసారి 30 టన్నులు కూడా లారీలో ఉండేదని సమాచారం. ఎప్పుడైనా మైనింగ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రం 12 టన్నులే వేసేవారు. ఆ తర్వాత మామూలే. మైనింగ్ నిబంధనల ప్రకారం తవ్విన ఖనిజాన్ని తరలించే లారీకి పర్మిట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ లారీలో ఎంత పరిమాణం ఉందనేది చూడరు. దీన్ని ఆసరాగా తీసుకుని అండ్రు కంపెనీ పరిమితికి మించి ఇష్టానుసారం ఖనిజాన్ని తవ్వేసి తరలించేసింది. ఇప్పటికే స్టాక్ యార్డుల్లో రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు జరిమానా వసూలు చేయాల్సివుంది. అటవీ శాఖకు యూజర్ చార్జీలు ఎగనామం తవ్వకాలు జరిపిన ప్రాంతం అంతా రిజర్వు ఫారెస్టు. అటవీ భూమిని మైనింగ్ కోసం కన్వర్ట్ చేసుకున్నారు. ఇలా చేసిన అటవీ భూమిలో తవ్విన ఖనిజానికి టన్నుకు రూ.10 అటవీ శాఖకు యూజర్ చార్జీగా చెల్లించాలి. 2013లో జీఓ నంబర్ 63 ప్రకారం ఈ యూజర్ చార్జీలు కచ్చితంగా కట్టాల్సిందే. అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్ తవ్వారు. దానిపై యూజర్ చార్జీల కింద రూ.8.3 కోట్లకుపైగా అటవీ శాఖకు చెల్లించాల్సి వుంది. కానీ ఆ చార్జీలను కూడా అండ్రు మినరల్స్ కట్టలేదు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అటవీ శాఖాధికారులు కూడా దీనిపై నోరు మెదపలేకపోయారు. అండ్రు మినరల్స్ తవ్విన ఖనిజాన్ని నిల్వ చేసే స్టాక్ యార్డ్ టీడీపీ మళ్లీ వస్తే ఇంకా కుమ్మేయడానికి స్కెచ్ ఐదేళ్లలో అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసిన అండ్రు కుటుంబం టీడీపీ పెద్దల దన్నుతో అడవిని ఇంకా తవ్వేయడానికి ప్రణాళిక రూపొందించింది. 2019 ఎన్నికల్లోను మళ్లీ టీడీపీ గెలుస్తుందని అప్పుడు ఇంకా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో అదే ప్రాంతంలో మరిన్ని లీజులకు దరఖాస్తు చేసుకుంది. ఈసారి వంతాడ గ్రామం వెనుక ఉన్న అడవిని సర్వే చేసి హద్దులు కూడా నిర్ణయించింది. సుమారు 600 ఎకరాలను లీజుకు తీసుకునేందుకు మైనింగ్ శాఖకు దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుమతులు కూడా తెచ్చుకుని య«థేచ్ఛగా తవ్వకాలు చేసేవారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. మైనింగ్ కోసం వంతాడ కొండపై రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. మైనింగ్‌కు అనుమతి ఉన్నా రోడ్డు వేయడానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రోడ్డు కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా అది అధికారులను ప్రలోభపెట్టి తీసుకున్నట్లు చెబుతున్నారు. రిజర్వు ఫారెస్టులో అండ్రు సంస్థ నిర్మించిన రోడ్డు రక్షణ చర్యలూ లేవు మైనింగ్ ప్రాంతంలో పెద్దగా రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ చేసే చోట, స్టాక్ యార్డుల్లో సుమారు 500 మంది పనిచేసేవారు. ఖనిజాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాల సిబ్బంది వందల సంఖ్యలో ఉండేవారు. వారికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పని చేయించుకున్నారు. రాత్రి సమయాల్లో వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని చెబుతున్నారు. పనిచేసే వారిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అధికారం అండతో మైనింగ్ చేసే చోట తీసుకోవాల్సిన కనీస చర్యల్ని అండ్రు కంపెనీ తీసుకోలేదని చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి ఇవ్వలేదు.. అక్కడి రోడ్లను నాశనం చేశారు మరోవైపు మైనింగ్ జరిగే ప్రాంతంలో ఉన్న వంతాడ గ్రామవాసులకు పెద్దగా ఉపాధి కల్పించలేదు. అతికొద్ది మందికి మాత్రమే చిన్నచిన్న పనులు ఇచ్చినా ఎక్కువ మందిని బయట ప్రాంతం నుంచే తీసుకువచ్చారు. దీంతో వందల కోట్ల విలువైన ఖనిజాన్ని ఆ ప్రాంతం నుంచి తరలించుకుపోయినా అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఐదేళ్లపాటు ఓవర్ లోడు వాహనాలను నిరంతరాయంగా నడపడంతో ఆ ప్రాంతంలో రోడ్లు నాశనమయ్యాయి. స్టాక్ యార్డులో నిల్వ ఉన్న ఖనిజం లంపకలోవ–ప్రత్తిపాడు రోడ్డు చిద్రమైపోయింది. చివరికి ఖనిజాన్ని తరలించే టిప్పర్లు కూడా వెళ్లడం కష్టంగా మారడంతో అండ్రు కంపెనీ కోసం టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.12 కోట్లతో రోడ్డు మంజూరు చేసి నిర్మించింది. అనుమతి లేకుండా పెదశంకర్లపూడి వద్ద ఏలేరు ఎడమ కాలువ గట్టును మైనింగ్ వాహనాల రాకపోకలకు వినియోగించింది. దీనివల్ల కాలువ గట్టు ధ్వంసమై కుంగిపోయింది. పెద శంకర్లపూడి వద్ద ఏలేరు కాలువపై ఉన్న వంతెన అండ్రు లారీల రాకపోకలతో కుంగిపోయింది. మైనింగ్ తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్యంతో గిరిజనులు సాగు చేసే తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటలు, సీతాఫలం దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు మైనింగ్ కోసం ఈ ప్రాంతంలో నీటి వనరులను అండ్రు సంస్థ పెద్దఎత్తున వినియోగించింది. బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేసింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. అండ్రు మినరల్స్ జరిపిన ఖనిజ తవ్వకాలు.. వృత్తంలో అక్కడే వదిలేసిన యంత్రాలు ఎవరీ అండ్రు.. అండ్రు మినరల్స్ యజమాని రమేష్‌బాబు. తన ఇంటి పేరుతోనే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. గతంలో అక్కడ స్టోన్ క్వారీలు ఉండేవి. క్రషర్లు నిర్వహించేవారు. క్రషర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2013లో తన కుటుంబ సభ్యుల పేరు మీదే లేటరైట్ లీజులు తీసుకున్నారు. పూర్తిగా లేటరైట్ మైనింగ్‌పైనే దృష్టి పెట్టారు. రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం పెట్టారు. టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తో సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. చిన్న క్రషర్ యజమాని ఇప్పుడు మైనింగ్ ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లు మైనింగ్ రంగంలో ఉన్న పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేశ్ అండతోనే. టీడీపీ హయాంలో స్వయంగా లోకేశ్ ఈ లీజుల్లో తవ్వకాలను పర్యవేక్షించేవారని సమాచారం. స్థానిక టీడీపీ నేతలు, కొందరు మంత్రులకు ఈ తవ్వకాల్లో భాగమున్నట్లు చెబుతున్నారు. లారీలు తిరుగుతూనే ఉండేవి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వేవాళ్లు. పెద్ద టిప్పర్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఆ క్వారీలు లేకముందు అంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి గోతులున్నాయి. ఆ క్వారీల వల్ల మా పిల్లలకు ఏమైనా ఉద్యోగాలిప్పిస్తారనుకున్నాం. అది కూడా లేదు. పెద్ద మిషన్లతో తవ్వుతుంటే మట్టితో మా తోటలు పాడైపోయేవి. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండిపోయాం. – మాతే బాలమ్మ, వంతాడ ఇక్కడ ఖనిజం తవ్వుకున్నారు.. ఇక్కడ ఉద్యోగాలివ్వలేదు మా కొండపై ఐదేళ్లు ఎర్రమట్టి తవ్వుకుని వెళ్లారు. దానికి చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. మా ఏరియా మట్టితో కోట్లు సంపాదించినోళ్లు మా ఊర్లో పది మందికి కూడా ఉద్యోగాలివ్వలేదు. గట్టిగా మాట్లాడిన నలుగురైదుగురిని సూపర్వైజర్లుగా పెట్టుకున్నారు. క్వారీలు రాకముందు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది జరగలేదు. మా పంటలు పాడైపోయాయి. ఉపాధి తగ్గిపోయింది. – కుడే రాంబాబు, వంతాడ ఇష్టానుసారం తవ్వుకున్నారు మా ప్రాంతంలో ఖనిజాన్ని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లారు. కానీ మా ప్రాంతాలను పట్టించుకోలేదు. అండ్రు కంపెనీ లారీల వల్ల మా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వంతెనలు కుంగిపోయాయి. ఆ లారీల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పాడైన రోడ్లు బాగు చేస్తామన్నారు కానీ చేయలేదు. – అన్నిక సత్తిబాబు, ఇ.గోకవరం, ప్రత్తిపాడు మండలం ప్రాథమికంగా అక్రమాలు బయటపడ్డాయి.. అండ్రు మినరల్స్ తవ్వకాలపై చాలా ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణకు ఆదేశించాం. అందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. స్టాక్ యార్డులో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం లెక్కకు మించి ఉంది. దీంతో ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాం. తవ్విన చోట మళ్లీ పూడ్చి మొక్కలు నాటారు. దీంతో అసలు ఎంత తవ్వారో తెలియడంలేదు. అందుకే త్రీ డైమెన్షన్లో డ్రోన్ సర్వే చేయాలని నిర్ణయించాం. ఈ కంపెనీ తవ్వకాలు జరపకముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు శాటిలైట్ చిత్రాలను తెప్పిస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ డైరెక్టర్ ఇవీ చదవండి: Andhra Pradesh: పోలవరం.. శరవేగం ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే భారీ అక్రమ మైనింగ్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని వెల్లడించారు. దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, 2014 నుంచి 2019 వరకు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ తెరలేపారని అన్నారు. ఆండ్రూస్ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని తెలిపారు. టీడీపీ నేతలతో ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా 2లక్షల టన్నుల మైనింగ్ చేసినట్టు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వేదాంత, విదేశాలకు సరఫరా చేయడంతో బాక్సైట్ తవ్వినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు డీఎంఎల్ విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు మైనింగ్ జరిగిన ప్రాంతంలో విచారిస్తున్నామని, డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు. వందల కోట్లు అక్రమాలు జరిగాయని, వాటన్నింటి పైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ అధికారుల పాత్ర ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చదవండి: లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్ -
అధికారుల నిర్లక్ష్యంతోనే వనరుల దోపిడీ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్రకృతి వనరుల దోపిడి యథేచ్ఛగా సాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తూ ఉండటంవల్లే అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండాపోతోందని తెలిపింది. ప్రధాన కాలువను మూసేసి దానిపై ఏకంగా రోడ్డే వేసేశారంటే అధికారుల చర్యలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు రాత్రికి రాత్రే జరగవని తెలిపింది. వీటిపట్ల తాము మౌనంగా ఉండబోమని.. వేగవంతమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలువురు ప్రభుత్వాధికారులకు, మైనింగ్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిటాల గ్రామ పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నా, భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించి కొండలను పిండి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పరిటాల గ్రామానికి చెందిన మాగంటి ధర్మారావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనంత వెంకట దుర్గారావు వాదనలు వినిపిస్తూ.. పరిటాలలో జరుగుతున్న మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ప్రభుత్వమే తెలియజేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యంవల్లే యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తాము తగిన విధంగా స్పందిస్తామని స్పష్టంచేసింది. ఏకంగా ప్రధాన కాలువనే మూసివేశారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై దాఖలైన వ్యాజ్యం సెప్టెంబర్ 6న విచారణకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. రెండింటిని కలిపి ఆ రోజు విచారిస్తామంది. -
టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు . కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత పట్టాభి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1993లో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్‌పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారన్నారు. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందని, ఎప్పటినుంచో ఉందనడానికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంటే, వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దేవినేని ఉమా ఏడాదిన్నరగా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. -
మైనింగ్ పేరుతో హైడ్రామా.. గొల్లపూడిలో ఉద్రిక్తత
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ) : కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ హైడ్రామాకు తెరలేపింది. నిజ నిర్ధారణ పేరుతో అక్కడకు వెళ్లి హడావుడి చేసేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. అక్కడ మైనింగ్ జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశారు. ఈ క్రమంలోనే జి.కొండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి టీడీపీ నేతలు దళితులపై దాడిచేసే వరకూ వెళ్లింది. ఈ కారణాలతోనే దేవినేని ఉమాను పోలీసులు అరెస్టుచేశారు. మీడియా హడావుడితో తరచూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ఉమాకు మొదటి నుంచి అలవాటైన విద్యగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కానీ, ఈసారి అది బెడిసికొట్టి ఆయనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేక వ్యవహారం మొత్తాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. రగడ సృష్టించి ఏదో జరిగిపోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడానికి నిజనిర్ధారణ కమిటీ ముసుగులో వ్యూహం రచించారు. కానీ పోలీసులు ఈ పథకాన్ని ముందే పసిగట్టడంతో వారి ప్రయత్నం సఫలం కాలేదు. టీడీపీ హయాంలోనే విచ్చలవిడి మైనింగ్ వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగానే కొండపల్లి సహా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా నేతృత్వంలో అనేకచోట్ల అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారం కోల్పోయాక ఏమీ జరక్కపోయినా కొండపల్లి అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించి రాజకీయంగా లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. చివరికి ఈసారి దాన్ని మరింత రచ్చచేసి అలజడులు సృష్టించడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఇలా ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉమా కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళ్లిపోయారు. ‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు ఉమాపై కేసులు దుర్మార్గం : చంద్రబాబు దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులే దాడిచేసి రివర్స్ కేసు పెట్టడం దారుణమన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉమా కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీలపై దాడి చేశారంటూ దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే చెట్లను కొట్టేస్తుండడంతో ఉమాతోపాటు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని బాబు ప్రశ్నించారు. డీజీపీ గౌతం సవాంగ్ ప్రవర్తన అన్యాయంగా ఉందన్నారు. ఈ దాడులకు టీడీపీ భయపడబోదన్నారు. టీడీపీతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. రెండేళ్ల నుంచి వారిపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను అర్ధాంతరంగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. సీనియర్ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గొల్లపూడిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దళితులు దళిత ద్రోహి చంద్రబాబు గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక దళితులు.. టీడీపీ నేతలు తమపై చేస్తున్న అరాచకాలపై ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారికి గ్రామంలోని బీసీలు మద్దతు పలికారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా ప్లకార్డులు పట్టుకుని ‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘దాడికి గురైన దళితులను కాకుండా దాడిచేసిన వారిని పరామర్శించడానికి వెళ్తారా చంద్రబాబూ..?’ అంటూ వారు మండిపడ్డారు. ఒకానొక దశలో వారు ముందుకు చొచ్చుకు రావడంతో, పోలీసులు బలవంతంగా వెనక్కి నెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న పోలీసులు రెండు గంటల తర్వాత వారిని వెనక్కి పంపించేశారు. అనంతరం.. గ్రామానికి చెందిన దళిత నాయకులు కేతేపల్లి కోటేశ్వరరావు (దావీదు), గేరా సుమన్‌కుమార్, యడవల్లి శారమ్మ, చీదెళ్ల రవి, నందిపాముల సత్యం తదితరులు మాట్లాడుతూ.. తమపై టీడీపీ నేతల దౌర్జన్యాలు, దూషణలు పెచ్చుమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నేతల వరుస దాడులను చూస్తుంటే చంద్రబాబే వారిని ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. -
కొండపల్లి అటవీ ప్రాంతం.. శాటిలైట్ చిత్రాలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రధాన కాలువను పూడ్చేసి, ఏకంగా దానిపై నుంచి రోడ్డువేసి, స్టోన్ క్రషర్ల నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు.. అటవీ భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదంటే నమ్మాలా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలువను ఆక్రమించిన మాట వాస్తవమేనని చెబుతున్న అధికారులు, అటవీ భూమి మాత్రం ఆక్రమణకు గురికాలేదని చెబుతున్న మాటలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలని భావిస్తున్నామని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతం జియో కోఆర్డినేట్స్ సాయంతో శాటిలైట్ చిత్రాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, అటవీ భూమిలో విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది స్టోన్ క్రషర్ల యజమానులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలపై మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పిల్... కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కొండపల్లి రిజర్వ్ అటవీ భూములను ధ్వంసం చేస్తూ మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కూడా ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాలువ పూడ్చేసి రోడ్డేసేశారు ఈ సందర్భంగా పిటిషనర్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ స్పందిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వం గడువు కోరిందని తెలిపారు. ఈ సమయంలో అధికారుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ప్రధాన పంట కాలువను పూడ్చేసిన మాట వాస్తవమేనని.. అక్కడ స్టోన్ క్రషర్లను నిర్మించుకుని రోడ్డు కూడా వేసుకున్నారని వివరించారు. 2018లోనే నోటీసులు జారీచేశామని, దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకుని చెబుతానని సుమన్ తెలిపారు. అధికారులు చెబుతున్న దాన్నిబట్టి అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాలేదన్నారు. మరోసారి ఆక్రమణలను పరిశీలించండి.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన కాలువనే పూడ్చేసి దానిపై రోడ్డేసి నిర్మాణాలు చేసిన వాళ్లు అటవీ ప్రాంతాన్ని ఆక్రమించలేదంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించింది. ఆక్రమణలను మరోమారు పరిశీలించాలని.. జియో కోఆర్డినేట్ సాయంతో అటవీ ప్రాంతం శాటిలైట్ చిత్రాలను తీసి తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. -
అక్రమ మైనింగ్ చేసింది టీడీపీ వాళ్లే
సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్ పేరుతో తనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. టీడీపీలో ఉంటేనే కమ్మ కులంగా ఎల్లో మీడియా భావించడం దుర్మార్గమన్నారు. దేవినేని ఉమా ఆరోపిస్తున్న మైనింగ్ జరిగిన ప్రాంతం అటవీ భూమా? రెవెన్యూ భూమా? నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. అటవీభూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్, శ్రీధర్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనుమతులిచ్చింది వాళ్లే ‘ఇవి రెవెన్యూ భూములని, వీటికి సర్వే నంబర్లు కేటాయించాలని టీడీపీ హయాంలో జేసీ విజయకృష్ణన్ నివేదిక ఇచ్చారు. ఇవి రెవెన్యూ భూములు కాదని దేవినేని ఉమా రద్దుచేయించి, తరువాత కేఈ కృష్ణమూర్తితో స్టే ఇప్పించారు. సర్వేనంబర్ 143లో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నుబోయిన రాధాకు లీజు అనుమతి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో 2016 డిసెంబర్ 4న దేవినేని ఉమా ఆ క్రషర్‌ను ప్రారంభించాడు. ఈ సర్వేనంబర్‌లో 105 ఎకరాలు డాక్టర్ సుదర్శన్‌రావుకిచ్చారు. ఇవి అటవీ భూములంటూ దేవినేని హైడ్రామా చేస్తున్నాడు. 15 సార్లు క్వారీ భూముల వద్దకు వెళ్లాడు. నాకు సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్ చేస్తున్నానంటూ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నాడు. డాక్టర్ సుదర్శన్‌రావు రాయల్టీలు చెల్లించినా లీజు పునరుద్ధరించలేదు. 20 ఏళ్ల కిందట జరిగిన మైనింగ్ అంతా కృష్ణప్రసాద్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా భయపడం’ అని కృష్ణప్రసాద్ అన్నారు. -
బొజ్జన్న కొండకు మైనింగ్ ముప్పు
అనకాపల్లి: ఏకశిలా స్థూపాలు.. కొండలో తొలచిన గుహలు.. వాటిలో ఇరవై గదులు.. ధ్యాన బుద్ధ విగ్రహాలు వంటి ప్రత్యేకతలెన్నో బొజ్జన్నకొండ సొంతం. విశాఖ జిల్లా శంకరం గ్రామంలోని బొజ్జన్నకొండ, లింగాల కొండలపై గల ఈ బౌద్ధ స్థలాలు క్రీ.శ. 4–9 శతాబ్దాల మధ్య నిర్మితమైనట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రధాన స్థూపం రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంటుంది. ఇటుకలతో కట్టిన బౌద్ధ విహారాలు, చైత్యం, భిక్షువుల గదులు ఉన్నాయి. 1907లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 4వ శతాబ్దం నాటి సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలం నాటి నాణేలు దొరికాయి. ఇంతటి విశిష్టత గల బొజ్జన్నకొండలోని ప్రధాన గుహతోపాటు అనేక అపురూప కట్టడాలకు క్వారీ పేలుళ్లతో ప్రమాదం పొంచి ఉంది. 30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో 16 స్తంభాలపై విశేషంగా నిర్మించిన ఈ గుహాలయంలోని స్తంభాల పెచ్చులూడుతున్నాయి. మైనింగ్ ప్రకంపనల వల్లే ఈ ప్రమాదం ఏర్పడుతోందని నిపుణుల అంచనా. బ్యూరో ఆఫ్ మైనింగ్ నిర్వహించిన సర్వేలో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొజ్జన్నకొండ, లింగాలకొండలోని అపురూప శిల్ప సంపదకు నిత్యం నష్టం వాటిల్లుతూనే ఉంది. శతాబ్దం క్రితం వెలుగులోకి.. బొజ్జన్నకొండ చరిత్ర 1906లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బయటపడిన శాసనాలు, బౌద్ధ శిథిలాలు, అవశేషాలు నాటి చరిత్రను తేటతెల్లం చేశాయి. దక్షిణ భారతదేశంలో విశిష్టత ఉన్న బౌద్ధారామంగా బొజ్జన్నకొండకు గుర్తింపు ఉంది. ఈ కొండలోని హారతి అనే స్త్రీ మూర్తి శిల్పాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారట. మత విద్వేషాలతో కొందరు ఇక్కడి శిల్ప సంపదను నాశనం చేశారు. కొండ పైభాగాన దంగోడు గొయ్యికి ఓ భారీ రంధ్రముంటుంది. దీనిపై రాళ్లు విసిరే సంప్రదాయం ఉండగా.. పురావస్తు శాఖ రంగంలోకి దిగి దానిని నిలిపివేయించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. మైనింగ్ బాబులతో ముప్పు బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల సమీపంలోని మార్టూరులో 140 హెక్టార్లలో ఓ కొండ ఉంది. దానిని బినామీ పేర్లతో కొందరు బడా వ్యక్తులు లీజుకు తీసుకుని 30 ఏళ్లుగా భారీగా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో బ్యూరో ఆఫ్ మైనింగ్ ఇక్కడి పరిస్థితులపై పరిశీలన జరిపి బొజ్జన్నకొండ పరిధిలో 3 నుంచి 6 కిలోమీటర్ల లోపల బ్లాíస్టింగ్‌లు చేస్తే అత్యంత విలువైన శిల్ప సంపదకు నష్టం వాటిల్లుతుందని తేల్చింది. అయినా.. ఇక్కడి గుహలకు, ఇటుక నిర్మాణాలకు ముప్పు వాటిల్లేవిధంగా మార్టూరులో దర్జాగా క్వారీ తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అటకెక్కిన లోకాయుక్త దర్యాప్తు మార్టూరు, గుంకల్లోవ గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్–1లో ఎన్ని క్వారీలున్నాయి, ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో తేల్చాలంటూ మార్టూరు గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించారు. అప్పట్లో దర్యాప్తు జరపగా.. విచిత్రంగా 72 క్వారీలకు సంబంధించి అసలు యజమానులు 10 మంది మాత్రమే దొరికారు. మిగిలిన యజమానులు కాగితాల్లో ఉన్నారే తప్ప వారి అడ్రసులు అధికారులకు చిక్కలేదు. దీంతో బినామీ పేర్లతో క్వారీలను కొనసాగిస్తున్నారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. కానీ.. కొన్నాళ్లకే లోకాయుక్త దర్యాప్తు సైతం అటకెక్కింది. విచారణ చేపడతాం బొజ్జన్నకొండ వంటి పురావస్తు కట్టడాలకు మైనింగ్ వల్ల నష్టం కలుగుతోందని ఇప్పటికే ఫిర్యాదులొచ్చాయి. గతంలో వచ్చిన నివేదికలు, నిజంగా క్వారీ కార్యకలాపాల వలన ఎంత నష్టం జరుగుతుందనే అంశాలపై ఆరా తీసి కచ్చితమైన చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్‌రెడ్డి, ఏడీ, మైనింగ్ విజిలెన్స్ -
సింగరేణి అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సింగరేణి అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఆగ్రహం వ్యక్త చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేస్తున్నారని మండిపడింది. నందునాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ చేపట్టింది. కాగా, అదనపు మైనింగ్‌పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేయొద్దని సింగరేణిని ఎన్జీటీ ఆదేశించింది. ఇప్పటికే చేపట్టిన అక్రమ మైనింగ్‌కు నష్టపరిహారం చెల్లించాని పేర్కొంది. కాలుష్య బారిన పడిన బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని తెలిపింది. అంతేకాకుండా గ్రీన్‌బెల్ట్‌పై నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాగా తదుపరి విచారణను వచ్చేనెల(ఆగస్టు) 12కు వాయిదా వేశారు. -
నెల్లూరులో ఇసుక దుమారం: రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లిలో టీడీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలను రైతులు నిలదీశారు. తమ పొలాలకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తోలుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే, టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన రైతులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌పై దౌర్జన్యానికి దిగారు. కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దుమారం రేగింది. పెన్నా ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించడంతో పెన్నా ఇసుక రీచ్‌లో అఖిలపక్షం పర్యటించింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేసి.. పేదల ఇండ్ల స్థలాల్లో తువ్వ ఇసుక నింపామని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షాన్ని మంత్రి కోరారు. పెన్నా నదిలో ఇసుక తీసిన గుంటలను పరిశీలించిన అఖిలపక్షం నేతలు.. జీరో వాల్యూ ఇసుక మాత్రమే జగన్నన్న కాలనీల ఫిల్లింగ్ కి తరలించారని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం అదే మొండి ఆరోపణలు వినిపిస్తోందని, ఒక దశలో టీడీపీ నేతల వైఖరి పట్ల మిగిలిన పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివాదం చేయడం కోసమే ఆరోపణలు చేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
దొంతమూరులో అక్రమ మైనింగ్‌పై విచారణ జరపండి
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, జి.దొంతమూరు గ్రామంలో కొందరు వ్యక్తులు లీజు పరిధులు దాటి చేస్తున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ నివేదికను తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జి.దొంతమూరు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో లీజు పొందిన పరిధి 6.14 సెంట్ల భూమిని దాటి ఉయ్యూరి వీర్రాజు, 3.54 ఎకరాల భూమిని దాటి నెల్లిమర్ర శ్రీనివాసరావు చేస్తున్న మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జి.దొంతమూరు గ్రామంలో ఉయ్యూరి వీర్రాజు, నెల్లిమర్ర శ్రీనివాసరావులు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, లీజు పరిధి దాటి మైనింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకరరావు వాదనలు వినిపిస్తూ, కంకర మైనింగ్ లీజు ఇవ్వొద్దని, దీని వల్ల రంగంపేట పరిధిలో పర్యావరణ సమస్యలు వస్తాయని వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతాన్ని దాటి మిగిలిన చోట్ల వీర్రాజు, శ్రీనివాసరావులు కోట్ల రూపాయల విలువైన కంకరను తవ్వేస్తున్నారని, వీటిని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినా లాభం లేకపోయిందని తెలిపారు. కనీసం ఎలాంటి తనిఖీలు కూడా చేయలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కోర్టు ముందున్న ఆధారాలను బట్టి చూస్తే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్లో కొంత బలం ఉందని ఈ న్యాయస్థానం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందన్నారు. అలాగే మైనింగ్ లీజు పరిధి దాటి వీర్రాజు, శ్రీనివాసరావులు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. -
కర్ణాటకలో క్వారీల దందా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అక్రమ క్వారీల జాతర నడుస్తోంది. వివిధ జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమార్కులు కొండలను కరిగించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వారీల్లో పేలుళ్ల కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బ తింటోంది. దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పేలుళ్లకు జిలెటిన్‌స్టిక్స్‌ను ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. ఒకేసారి అధిక మొత్తంలో కొండలను పిండి చేసేందుకు అధిక పేలుడు సామర్థ్యం ఉన్న జిలిటిన్స్టిక్స్ను వినియోగిస్తున్నారు. శివమొగ్గ జిల్లా హుణసోడు సమీపంలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ క్వారీలు, నిబంధనలు పాటించకుండా సాగుతున్న జిలెటిన్‌స్టిక్స్ రవాణాపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఏయే జిల్లాల్లో.. మండ్య, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, శివమొగ్గ, చామరాజనగర, బీదర్, దక్షిణ కన్నడ తదితర జిల్లాల్లో అక్రమ క్వారీలు భారీగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ, నాగమంగల, కే.ఆర్.పేట తాలూకాలోని ఇలా జిల్లాలోని అనేక చోట్ల అక్రమ రాళ్ల క్వారీల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల వల్ల క్వారీల సమీప గ్రామాల్లోని ఇళ్లు దెబ్బ తింటున్నాయి. తవ్వకాలను నిషేధించాలని పేదలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ క్వారీలపై అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తుంటారు. ఐదేళ్ల కాలంలో అక్రమ క్వారీలపై సుమారు 2,450 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 1,126 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గనులు, భూగర్భ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో దాడులు నిర్వహించి అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్న 7,938 వాహనాలను జప్తు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. క్వారీ నిర్వాహకులకు అటవీ సంరక్షణ చట్టం 1980 2(1), 2(3), అటవీ సంరక్షణ చట్టం 2003 (6), కేంద్ర, పరిసర శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సుమారు 20 లేదా 30 ఏళ్లకు సరిపడా అనుమతి ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక వ్యాప్తంగా సుమారు 13 వేల ఎకరాల్లో వేల సంఖ్యలో కాంట్రాక్టు పద్ధతిన క్వారీలు కొనసాగుతున్నాయని అధికారుల ద్వారా తెలిసింది. రాజకీయ నేతల అండ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు క్వారీ నిర్వాహకులే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటారని సమాచారం. ఈ క్రమంలో క్వారీలు నిర్వహించే వారిపై ఎన్ని కేసులు నమోదైనా తప్పిస్తూ ఉంటారని ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నట్లు తేలితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఒకరికి కూడా శిక్ష పడిన దాఖలా లేదు. ఇష్టానుసారంగా జిలెటిన్‌స్టిక్స్ తరలింపు ఇక క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్‌స్టిక్స్‌ను సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అత్యధిక ప్రమాణాల్లో పేలుడు పదార్థాల నిర్వహణకు అనుమతి లేదు. ఒక చోట నుంచి మరో స్థలానికి పేలుడు పదార్థాల రవాణాకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ తదితర వస్తువులను ప్రత్యేకంగా నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడు పదార్థాలను మిగతా వాటితో కలపకూడదు. అనుమతులు పొందిన తర్వాతనే క్వారీల్లో బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష -
అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డికి భారీ జరిమానా
-
జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా
సాక్షి, అనంతపురం : యాడికి: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డికి ఏపీ మైనింగ్ శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఉపాధి కల్పన పేరిట దాదాపు 1,605 ఎకరాల భూమిలో లక్షలాది మెట్రిక్ టన్నుల డోలమైట్, లైమ్‌స్టోన్‌ను అమ్ముకున్న ఆయనకు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించని పక్షంలో ఆస్తుల జప్తునకు ఆదేశించింది. త్రిశూల్ íసిమెంట్ పరిశ్రమను స్థాపించేందుకు జేసీ దివాకర్‌రెడ్డి 13ఏళ్ల క్రితం తన పని మనుషుల పేరిట అనుమతులకు దరఖాస్తు చేశారు. అనుమతులు మంజూరయ్యాక వారికి కొంత భాగం కేటాయించి తన కుటుంబ సభ్యులకు 80 శాతంపైగా వాటాలను బదలాయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి ‘త్రిశూల్’ అక్రమాలపై అప్పట్లో కోర్టులో దావా వేశారు. దీంతో జేసీ మోసాలు వెలుగుచూశాయి. త్రిశూల్ పేరుతో 1,605 ఎకరాల భూమిని తీసుకుని ఏళ్లు గడిచినా అక్కడ పరిశ్రమలు స్థాపించకపోవడం అతిపెద్ద మోసమైతే, ఆ భూములలో నుంచి విలువైన ఖనిజాన్ని లక్షలాది మెట్రిక్ టన్నులు తవ్వి విక్రయించారు. అంతేకాక.. గతంలోనే 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్‌స్టోన్, డోలమైట్ ఖనిజాన్ని తవ్వి విక్రయించుకున్నారనీ నిర్ధారించారు. ఈ ఖనిజం విలువ రూ.100 కోట్లు ఉంటుందని, ఆ సొమ్మును జరిమానాగా చెల్లించాలని.. లేకపోతే ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తు చేపడతామని గనుల శాఖ అధికారులు గత వారం నోటీసులు జారీచేశారు. (ఏం 'జేసీ'నారో?) సమాచారమివ్వని తహశీల్దార్లు త్రిశూల్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటులో జేసీ అండ్ కో అక్రమాలను నిగ్గు తేల్చిన మైనింగ్ అధికారులు జరిమానా విధించడానికి ముందే తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాల తహసీల్దార్లకు జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ, వారు నివేదికను ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జేసీ ఆస్తుల వివరాలను ఇవ్వాలని మైనింగ్ అధికారులు మరోసారి ఆయా తహశీల్దార్లను కోరినట్లు తెలిసింది. (ఉల్లం‘గనుల్లో బినామీలు’) -
మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులకు అక్రమ మైనింగ్ ఉచ్చు మెల్లమెల్లగా బిగుస్తోంది. అక్రమ మైనింగ్‌పై నమోదు చేసిన కేసుల విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దూకుడు పెంచింది. గుంటూరులోని యరపతినేని నివాసం, ఆఫీస్‌తో పాటు, దాచేపల్లి, నడికుడి, పిడుగు రాళ్లకు చెందిన నిందితుల ఇళ్లు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులు చేపట్టారు. శాటిలైట్ సర్వే ద్వారా మైనింగ్ మాఫియా ఏ మేరకు సహజ వనరులను కొల్లగొట్టిందో అంచనా వేస్తామని వెల్లడించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ 17 మందిపై కేసు నమోదు చేయగా నిందితుల్లో 13 మంది యరపతినేని బినామీలు, అనుచరులే. సీబీఐ లోతైన విచారణ దిశగా అడుగులు వేస్తుండటంతో మైనింగ్ మాఫియా, టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో సాక్ష్యాలతో హైకోర్టు ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో నడుస్తున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2018లో అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి పిడుగురాళ్ళ మండలం సీతారామపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపురాయిని దోచేసినట్లుగా చూపారు. దీంతో తాము ఒడ్డున పడ్డామని మైనింగ్ మాఫియా ఊపిరి పీల్చుకుంది. అయితే అప్పట్లో అధికారులను మేనేజ్ చేసి దోచి, దాచేసిన లెక్కలు శాటిలైట్ సర్వే ద్వారా బయటపడనున్నాయి. టీజీవీ కృష్ణారెడ్డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా సేకరించిన శాటిలైట్ సర్వే ప్రకారం కేసానుపల్లి, నడికుడిల్లో 2015 జూలై నుంచి 2017 జనవరి వరకూ, సీతారామపురంలో 2015 సెప్టెంబర్ నుంచి 2017 మార్చి నాటికి 68.53 లక్షల మెట్రిక్ టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు అంచనా. (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా) కోనంకి వద్ద అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రం 2017 జూలై నెలలో ఈ సాక్ష్యాలను ఆయన హైకోర్టుకు సైతం అందించారు. 2016లో దాఖలు చేసిన పిల్లో 2014–15 మధ్య 34లక్షల మెట్రిక్ టన్నులు దోచేసినట్టు పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన శాటిలైట్ సర్వే ఆధారాలకు, 2017 జనవరి నుంచి 2018 జూలైల మధ్య జరిగిన అక్రమ మైనింగ్ శాటిలైట్ అంచనాలు తోడైతే సుమారు 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరకూ లైమ్ స్టోన్‌ను మైనింగ్ మాఫియా దోచేసినట్టు తెలుస్తోంది. సీబీఐ శాటిలైట్ సర్వే అంచనాల ఆధారంగా చేపట్టే లోతైన విచారణలో మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆర్జన, ఇతర ఆర్థిక నేరాలు బయటపడతాయేమోనని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వేల కోట్ల అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, అధికారుల సహకారం తదితర అంశాలు కూడా సీబీఐ వెలుగులోకి తీయాలని రాజకీయంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దాడులు... వేధింపులు గత ప్రభుత్వ హయాంలో యరపతినేని కనుసన్నల్లో నడిచిన అక్రమ మైనింగ్‌పై కోర్టులను ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారిని చిత్రహింసలకు గురిచేశారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసులను బనాయించారు. అందరి పాత్రలూ వెలికితీయాలి పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల సహజ సంపదను కొల్లగొట్టారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారుల పాత్ర ఉంది. సామాన్యుడు ట్రాక్టర్ మట్టి సొంత అవసరాల కోసం తీసుకెళ్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే అధికారులు రూ.వేల కోట్ల సహజ సంపదను దోచేస్తుంటే అప్పట్లో కళ్లు మూసుకుని కూర్చున్నారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. ఇలా అక్రమ మైనింగ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. – టి.జి.వి. కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
ఉల్లం‘గనుల్లో బినామీలు’
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు నమోదు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో యరపతినేని బినామీల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు బినామీలపై కేసు నమోదు కావడంతో మిగిలినవారు భయపడుతున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరట ఇస్తున్నా ముందు ముందు తమ పేర్లు, పాత్ర బయటపడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన బినామీలు, అనుచరులను అడ్డుపెట్టుకుని పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. బుధవారం 17 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఆరుగురు యరపతినేని బినామీలేనని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. అక్రమ మైనింగ్‌పై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మరికొందరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యరపతినేని బినామీలపై కేసులు నమోదవ్వడంతో అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఘట్టమనేని బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు తదితరులు ఆందో ళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరటనిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ మొదలైతే తమ పేర్లు, పాత్ర బయపడుతుందని భయం వారిని వెంటాడనుంది. యరపతినేని బినామీల చరిత్ర ఇదీ.. ఏ–1 నెల్లూరి శ్రీనివాసరావు : కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు పెట్రోలు బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ టీడీపీలో యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేశానుపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం నెల్లూరు శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా లైమ్‌స్టోన్‌ను తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూశాడని ప్రచారం. అక్రమ మైనింగ్ పుణ్యమా అని పెట్రోల్ బంకులో పనిచేసిన శ్రీనివాసరావు నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. ఏ–6 బత్తుల నరసింహారావు: 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటీవ్ సొసైటీని రద్దు చేసి యరపతినేని అండతో కొత్త సొసైటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు. కేశానుపల్లిలో 25 ఎకరాలు, నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోని అంజనీపురం కాలనీ పక్కనే ఉన్న జేపీ సిమెంట్, ప్రభుత్వ భూములు సుమారు 150 ఎకరాలు ఆక్రమించేశారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా అండతో వడ్డెర సొసైజీలోని యరపతినేని అనుచరులతో లైమ్ స్టోన్‌ను దోచేయడంలో కీలకపాత్ర పోషించాడు. నడికుడి, కేశానుపల్లిల్లో అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్స్, తదితర వ్యవహారాలను చూసుకున్న నరసింహారావు కుమారుడు బత్తుల రాంబాబుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఏ–7 మీనిగ అంజిబాబు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు 2014 టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతను ఒక సభ్యుడుగా మారాడు. ఇతను క్వారీ వద్ద కాపలాగా ఉంటూ రోజువారి టిప్పర్లలో లైమ్‌స్టోన్‌ను ఏఏ మిల్లులకు తరలించారనే వివరాలను బుల్లెబ్బాయి ద్వారా యరపతినేనికి తెలిపేవాడు. అక్రమ మైనింగ్ జరిగే క్వారీల్లో కొందరు కురాళ్లను అంజిబాబు నిఘా కొనసాగించేవాడు. కూలీలకు డబ్బు చెల్లించడం, క్వారీవైపు ఇతరులు ఎవ్వరినీ కన్నెత్తకుండా చేయడం లాంటివి చేస్తూ చోటా డాన్‌లా ఇతను వ్యవహరించాడు. ఏ–9 గ్రంధి అజయ్‌కుమార్: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గ్రంధి అజయ్ కొండమోడులో యరపతినేని కనుసన్నల్లో నడిచే అక్రమ క్వారీ వ్యవహారాలను చూసుకున్నాడు. ఏ–12 గుదె వెంకట శివకోటేశ్వరరావు: పిడుగురాళ్లకి పట్టణానికి చెందిన గుదె వెంకట శివకోటేశ్వరరావు అలియాస్ కోటి అక్రమ మైనింగ్‌కు మందు గుండు సామాగ్రి సరఫరా చేస్తూ మైనింగ్ కార్యక్రమాలను పరిశీలిస్తుంటాడు. మిల్లులకు సరఫరా చేసిన లైమ్‌స్టోన్ తాలుకూ డబ్బును వసూలు చేసి ఏ రోజుకు ఆ రోజు యరపతినేనికి లెక్కలు చెప్పడం వంటి కార్యకలాపాలు ఇతనే చూసుకున్నాడు. ఏ–16 నీరుమల్ల శ్రీనివాసరావు: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ క్రీయాశీల నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామిల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుప్పంలో టీడీపీ నేత బరి తెగింపు..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీకి చెందిన మైనింగ్ మాఫియా బరి తెగించింది. అనుమతులు ఉండవు.. నిబంధనలు పాటించరు.. చేసే దంతా దందానే.. అడ్డు చెప్పే వారి మీద దాడులు.. ఇది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పచ్చ నేతల బరితెగింపు.. అక్రమంగా మైనింగ్ నిర్వహించడమే కాకుండా పేదలకు మంజూరు చేసిన ఇండ్ల స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించి, అడ్డు వస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండతో రెచ్చిపోయిన పచ్చ నేతలు ఇప్పుడు కూడా బరి తెగింపుకు పాల్పడుతున్నారు. శాంతిపురం మండలంలో టీడీపీకి చెందిన నేత మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. ముళ్ళూరు కృష్ణాపురంలో టీడీపీకి చెందిన జయరామి రెడ్డి చాలా సంవత్సరాలు గా మైనింగ్ నిర్వహిస్తున్నారు. తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 11/4 లో 3.54 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి ఉందని చెప్పు కొంటాడు.. అది కూడా అనుమానమే. అయితే ఆస్థలం ప్రభుత్వ ఆసుపత్రి కి కేటాయించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నిర్ణయించారు.. అయిన ఇప్పటికి టీడీపీ నేత ఆస్థలంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. గత టీడీపీ పాలనలో ఏకంగా పది ఎకరాలు ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక పేదలు.. అధికారులను కోరారు.. దీంతో 28 మందికి అధికారులు ఇంటి స్థలాలు కేటాయించారు.. చదును కార్యక్రమాలు కూడా చేస్తుండగా టీడీపీ నేత జయరామి రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకోవడంతో స్థానికులు ధర్నాకు దిగారు.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముళ్ళూరు కృష్ణాపురంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించారని, కానీ కొందరు అడ్డుకొంటున్నారని శాంతిపురం ఎమ్మారో విజయలక్ష్మి అన్నారు. టీడీపీ నేత జయరామి రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలో గతంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయిన పట్టించు కోలేదు.. ఇప్పుడు స్థానికులనే బెదిరిస్తూ దాడులకు ఉసి గొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతడికి చంద్రబాబు కు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు అండదండలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
మైనింగ్ మాఫియాపై విజి‘లెన్స్’
దొండపర్తి(విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు భూములు పంచుకుంటే.. వారి అనుచరులు, సానుభూతిపరులు కొండలు మింగేశారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రతి ఒక్కరూ రెచ్చిపోయారు. ల్యాండ్, మైనింగ్ మాఫియాగా చెలరేగిపోయారు. వారి అక్రమాలకు కొండలు సైతం కరిగిపోయాయి. అనుమతులు ఒక చోట తీసుకొని మరోచోట మైనింగ్ చేస్తూ సాగించిన అక్రమాలు జిల్లాలో ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకుని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు ఆయా సంస్థలకు భారీ స్థాయిలో రూ.33,02,61,364 అపరాధ రుసుం విధించారు. జిల్లాలో అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నంబర్ 251లో రెండు చోట్ల 7.05 హెక్టార్లు, 7.50 హెక్టార్లలో ఉన్న కొండలను పి.వెంకటేశ్వరరావు పేరు మీద మైనింగ్ కోసం లీజుకు ఇచ్చారు. అనుమతులకు మించి తవ్వకాలు జరపడంతో స్థానికుల ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అనుమతులకు మించి తవ్వకాలు వాస్తవానికి సదరు వ్యక్తికి 3,41,708 క్యూబిక్ మీటర్లు మెటల్ తవ్వకాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెట్టింపు స్థాయిలో మైనింగ్ చేపట్టారు. గతంలో ఈ తవ్వకాలపై ఫిర్యాదులు అందినప్పటికీ.. అప్పటి మంత్రులు మైనింగ్ అధికారులపై ఒత్తిడి చేసిన నేపథ్యంలో వారు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఏకంగా అనధికారికంగా 2,97,245.28 క్యూబిక్ మీటర్లు అధికంగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్ 193లో 0.838 హెక్టార్లలోను, సర్వే నంబర్ 303లో 2.08 హెక్టార్లలోనూ వీవీఆర్ క్రషర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మైనింగ్‌కు అనుమతులు తీసుకుంది. అయితే అనుమతులు పొందిన చోటే కాకుండా మరోచోట కూడా యథేచ్ఛగాగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు దాడుల్లో గుర్తించారు. భారీ జరిమానా సీతానగరంలో జరిగిన ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానికులు మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గనుల శాఖ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి బృందం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ సంస్థలకు ఏకంగా రూ.33,02,61,364 అపరాధ రుసుం చెల్లించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ఇంతటి భారీ స్థాయిలో పెనాల్టీ వేయడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మరికొన్ని అక్రమ మైనింగ్‌లపై దృష్టి వీటితో పాటు జిల్లాలో మరో 8 చోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వాటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన మైనింగ్ మాఫియా ఆగడాలు ఇపుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. -
‘ఖనిజం’లో కంత్రీలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఖనిజ సంపదకు లోటు లేదు. అపారమైన ఖనిజ సంపద మన జిల్లా సొంతం. కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం అంతంతే. జిల్లా వ్యాప్తంగా గరివిడి, దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, కొత్తవలస, చీపురుపల్లి, మెరకముడిదాంతో పాటు పలు ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మార్కెట్లో ఎంతో విలువున్న ఈ ఖనిజ సంపద తరలించేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన గంపగుత్త విధానం ఒక కారణమైతే... అనధికార తవ్వకాలు.. అక్రమంగా తరలింపు రెండో కారణం. గనుల శాఖ లెక్కలను బట్టి జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడాది మరీ ఘోరంగా ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీని వల్ల రవాణా కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా కారణంగా అదికాస్తా మరింత దిగజారింది. అనుమతులు తక్కువ.. తవ్వకాలు ఎక్కువ... జిల్లాలో ఏడాదిన్నరగా ఖనిజ సంపద ఉన్నా తవ్వకాలు, రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. లేబర్ కొరతతో పాటు అనుమతులున్న కంపెనీలను మించిన అనధికార కంపెనీల నిర్వహణ ఒక కారణంగా ఉంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో ఒకరి పేరున క్వారీ అనుమతులుంటే మరొకరు నిర్వహించడం సాధారణమయిపోయింది. దీనిని గతంలో అధికారులు గుర్తించినా... వారికి నామమాత్రపు జరిమానాలు వేసి ఆ తరువాత వారికే పేర్లు మార్చుకునే అవకాశాలు ఇచ్చారని తాజాగా బొబ్బిలి ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గిన క్వార్ట్జ్, కలర్ గ్రానైట్ల తవ్వకాలు జిల్లాలో ఆరు రకాల క్వారీలుండగా అందులో కలర్ గ్రానైట్, క్వార్ట్జ్ల తవ్వకాలు తగ్గిపోయాయి. మరో పక్క మాంగనీస్, తదితర క్వారీల తవ్వకాల్లోనూ వృద్ధి కానరావడం లేదు. 2018–19 సంవత్సరంతో పోలి్చతే 19–20 సంవత్సరంలో భారీగా తవ్వకాలు పడిపోయాయి. ఈ ఏడాది నుంచి చూసుకుంటే గత ఆరు నెలలుగా తవ్వకాలు, ఉత్పత్తి నెమ్మదిగానే కనిపిస్తోంది. గంపగుత్త కాంట్రాక్టులతోనే అనధికారిక క్వారీలు గత ప్రభుత్వం ఎటువంటి అంచనాలు, రిపోర్టులు లేకుండా గంపగుత్తగా లైసెన్సులు జారీ చేసిందనీ, అందుకు కాంట్రాక్టర్లు(లైసెన్సుదారులు) తమకు ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుకుని లబి్ధపొందారన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. దీనికి తోడు ఒక క్వారీ దగ్గర తవ్వి మరో క్వారీ పేరున(లీజు కాలం అయిపోయినందున)రవాణా చేసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మైనింగ్ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి జరిమానాలు తూతూమంత్రంగా వేసినట్టు ఇప్పటికీ పలువురు చెబుతుంటారు. కొత్తగా వేలం విధానం ప్రభుత్వం కొత్తగా క్వారీలను వేలం విధానంలో ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. జీఎస్ఐ(జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కొన్ని చోట్ల సర్వే చేసి ఏ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజం ఉన్నదో దానిని విలువ కట్టి, తవ్వకాలు, నిర్వహణలను బేరీజు వేసుకుని ధర నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన శాఖా పరమైన సిబ్బంది తక్కువ ఉండటంతో అన్ని చోట్లా ఈ విధానం అమలుకు వీలు పడదు. కాబటివ్ట కొన్ని చోట్ల థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయించి వేలం పద్ధతిలో కేటాయించే ఆలోచన చేస్తోంది. కొత్తవిధానానికి కసరత్తు చేస్తున్నాం జిల్లాలో కొత్త ఖనిజ తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు పరిచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్న ఖనిజ సంపదను సక్రమ మార్గంలో రవాణా చేసి ప్రభుత్వాదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పూర్ణ చంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ అండ్ మినరల్స్, విశాఖపట్నం -
మాజీ మంత్రి కుటుంబ సభ్యుల నిర్వాకం
దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జిల్లా మాజీ మంత్రి కుటుంబ సభ్యుల అక్రమాలకు జిల్లాలో కొండలు తరిగిపోయాయి. బినామీల పేరుతో అనుమతులు పొంది గత ప్రభుత్వ హయాంలో చేసిన మైనింగ్ అక్రమాలు బయటకొస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకొని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు సదరు సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుము విధించారు. జిల్లాలో రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో సర్వే నెంబర్ 1లో 4.10 హెక్టార్లలో ఉన్న కొండను హిమాని స్టోన్ క్రషర్ అనే సంస్థకు 2009లో మైనింగ్ కోసం 15 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 2024 వరకు వీరికి లీజు సమయం ఉంది. 47,060 క్యూబిక్ మీటర్లకే అనుమతి... వాస్తవానికి ఈ సంస్థ 47,060 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తవ్వకాలకు మాత్రమే అనుమతులు పొందింది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోదరుడు, కుమారుల హస్తం ఉండడంతో అధికారులు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అనుమతులు పొందిన దాని కంటే అధికంగా 1,36,126.08 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న కొండ ప్రాంతంలో 6,073.6 క్యూబిక్ మీటర్లు అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేసేసింది. జిల్లాలో భారీ పెనాల్టీ రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై దృష్టిసారించిన గనుల శాఖ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి బృందం గురువారం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హిమానీ స్టోన్ క్రషర్ సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుమును 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు బి.రవికుమార్, ఎం.సురేష్‌కుమార్, జి.సత్యమూర్తి, ఆర్.అమ్మాజి పాల్గొన్నారు. జిల్లాలో 11 అక్రమ మైనింగ్‌లు? దీంతో పాటు జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఇతర ప్రాంతాల్లో 11 చోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాథమిక పరిశీలనలో నాలుగింటిపై త్వరలో దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన బినామీ సంస్థల ద్వారా ఈ మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి రూ.100 కోట్లకు పైగా పెనాల్టీ విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఉపేక్షించొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు కనిపించకూడదని, అక్రమ మద్యం తయారీ అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా నిరోధంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇన్ని విప్లవాత్మక కార్యక్రమాల మధ్య బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా లాంటివి మన ఉద్దేశాలను దెబ్బ తీస్తాయన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ ఉండకూడదు. ఇసుక అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా, మద్యం రవాణా ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామాల్లో 11 వేలకు పైగా ఉన్న మహిళా పోలీసులతో పాటు మహిళా మిత్రలను సమర్థవంతంగా వాడుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచండి. ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగించాలి. కలిసి కట్టుగా ఫలితాలు సాధించాలి. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థత పెంచుకోవాలి. -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ
-
క్వారీ.. కొర్రీ
అనంతపురం టౌన్: క్వారీ నిర్వాహకులు...ప్రభుత్వ ఖజానాకు కొర్రీ పెడుతున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే సహజ వనరులను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం విజిలెన్సు అధికారులు జిల్లాలో వ్యాప్తంగా క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 60 క్వారీలకు రూ.100కోట్లకుపైగా జరిమానాలు విధించారు. అయినా నేటికీ పైసా వసూలు కాలేదు. దీనిపై దృష్టి సారించాల్సిన గనులశాఖ అధికారులు ఏమాత్రం పట్టిచుకోకపోవడం లేదు. దీంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. వసూళ్లు శూన్యం.. 2018 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 40 క్వారీలపై విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయలీ్టకి.. క్వారీల్లో చేపట్టిన తవ్వకాలకు పొంతన లేకపోవడంతో దాదాపు 30 క్వారీలకు రూ.46.84 కోట్లు జరిమానా విధించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 37 కేసులు నమోదు చేసి రూ.32.19 కోట్ల మేర జరిమానా విధించారు. గనులశాఖ అధికారులు నేటికీ పైసా వసూలు చేయలేదు. యథేచ్ఛగా తవ్వకాలు.. క్వారీ నిర్వాహకులు జరిమానాలు చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. జరిమానా కట్టని క్వారీలను సీజ్ చేయాలని గనులశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో గనులశాఖ విజిలెన్స్ అధికారులు నెలరోజులుగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మడకశిర, పెనుకొండ, గోరంట్ల మండలాల క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ వాహనాలను సీజ్ చేశారు. ఇక శెట్టూరు మండలంలోని గ్రానైట్ క్వారీలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండగా... అక్కడి క్వారీల నిర్వాహకులు తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తరలిస్తున్నారు. దీంతోపాటు పెనుకొండ నియోజకవర్గంలో రోడ్డు మెటల్ క్వారీలకు దాదాపు రూ.10 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయితే అక్కడ సైతం తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వాహకులు జరిమానా విధించిన క్వారీల్లోనే తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. నోటీసులు జారీ చేశాం జరిమానా విధించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఇప్పటికే క్వారీ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశాం. నిర్ణీత గడువులోగా జరిమాన సొమ్ము చెల్లించకపోతే క్వారీలు సీజ్ చేస్తాం. జరిమానా విధించిన క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులకు సిఫార్సు చేస్తాం. – ఓబుల్‌రెడ్డి, గనులశాఖ ఏడీ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేసు త్వరలో సీబీఐకి
పల్నాడు ప్రాంతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల, ఎత్తిపోతల వంటి నీటి ప్రాజెక్టుల రాకతో పచ్చని పంటల సాక్షిగా రైతుల నవ్వులు కళ్ల ముందు కదలాడతాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు తెరదీశారు. వందల కోట్ల రూపాయల సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు. అడిగిన వారిని పోలీసులతో కుళ్లబొడిపించారు. అప్పటి ప్రభుత్వ అండతో అవినీతి కేసుల నుంచి తప్పించుకున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో యరపతినేని పాపం పండింది. అక్రమ మైనింగ్ భరతం పట్టేందుకు న్యాయస్థానాల అనుమతి తీసుకుంది. ఇప్పటి వరకు సీబీసీఐడీ ఆధ్వర్యంలో సాగిన విచారణ మరో వారంలో సీబీఐ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన యరపతినేనిసహా ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో పల్నాడు ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గురజాల నియోజకవర్గంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను దండుకున్నారు. మైనింగ్ మాఫియాలో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటుగా మరి కొందరిని బాధ్యులుగా చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. టీడీపీ అండదండలతో యరపతినేని అప్పట్లో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైకోర్టు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సీబీఐ అధికారులు అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను సీఐడీ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు. వెలుగు చూసిందిలా.. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదిలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఆదేశాలతో మైనింగ్ మాఫియాకు పాల్పడిన వారిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టలేదు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు. రోజుల వ్యవధిలో... నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీఐడీ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీఐడీ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అక్రమార్కుల గుండెల్లో వణుకు కేసు సీఐడీ అధికారులకు వెళుతున్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో బినామీల పేరిట దాచుకున్న సొత్తునంతా కక్కిస్తారని భయపడుతున్నారు. ఎప్పుడు తమను విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్‌కు వెళతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. -
ఉల్లం‘గనులు’
నిబంధనలు అతిక్రమిస్తున్నా అదుపు లేదు.. ప్రాణాలు పోతున్నా లెక్క లేదు.. ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా ఖాతరు లేదు.. యథేచ్ఛగా గనులను దొలిచేస్తున్నారు.. కాసులు కొల్లగొడుతున్నారు.. క్వారీల నిర్వహణలో నియమ నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. బ్లాస్టింగ్‌లకు అత్యంత ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. దీంతో క్వారీలను నిర్వహిస్తున్న మేస్త్రీలు కాసులు సంపాదిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం, రక్షణ కిట్లు ఇవ్వకపోవడంతో పొట్ట కూటి కోసం రాయి పనిచేస్తున్న క్వారీ కార్మికులు గాయాలు పాలై అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిపై నిఘా వేయాల్సిన అధికార యంత్రాంగం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాక్షి, పొందూరు: ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళుతున్నాయి. క్వారీ చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి విస్తీర్ణం చాలా తక్కువ మేరకు ఉంటుంది. దానికి మూడు, నాలుగు రెట్ల మేరకు కొండను పేల్చేస్తున్నారు. కొండ ఎత్తు మూడు నుంచి నాలుగు వందల మీటర్లు ఉంటే దాని కింద సుమారు రెండు నుంచి మూడు వందల మీటర్లు లోతు వరకు దొలిచేస్తున్నారు. ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను రాళ్లుగా మార్చి కోట్లు కూడబెట్టుకొంటున్నారు. మైనింగ్ అధికారులు క్వారీ పనికి ఇచ్చిన అనుమతుల మేరకు కిందకు కొంత పరిమితి వరకు మాత్రమే వెళ్లి రాయిని తీయాల్సి ఉంటుంది. అయితే అపరిమితంగా రాయిని దొలిచేస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు కుటుం బాలు వీధిన పడుతున్నాయి. మండలంలో రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట, రెడ్డిపేట సమీపాల్లో క్వారీ లు నిర్వహిస్తున్నారు. సుమారు 100 మంది మేస్త్రీలు ఇక్కడ క్వారీలను నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన లీజుదారులు 16 మంది ఉండగా అక్రమ లీజుదారులు కనీసం 100 మంది వరకు ఉన్నారు యథేచ్ఛగా జిలెటిన్ స్టిక్స్ వాడకం.. కొండను బ్లాస్టింగ్ చేసేందుకు లైసెన్సు ఉండాలి. కాని మండలంలో ఎవరికీ లైసెన్సులు లేవు. తక్కువ పరిమాణంలో మందును ఉపయోగించి బ్లాస్టింగ్ చేసేందుకు ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ పరిమాణంలో పేలుడు పదార్ధాలు, భారీ విస్ఫోటనం కలిగించే జిలెటిన్ స్టిక్స్, భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేటు ఉపయోగిస్తున్నారు. కూరగాయలు అమ్మడానికి వీధుల్లో తిరుగుతున్న మాదిరిగా ఇంటింటికీ పేలుడు పదార్ధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఈ పేలుడు పదార్ధాలను విక్రయించి ఖాళీగా ఉన్న ఇళ్లల్లోను, పలువురు వారి సొంత ఇళ్లల్లోను నిల్వ చేస్తున్నారు. వాస్తవానికి క్వారీలలో పేలుళ్లు నిర్వహించాలంటే పోలీసు, ఎక్స్‌ప్లోజివ్ డిపార్ట్మెంట్ (న్యూఢిల్లీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. వారి గైడ్‌లైన్స్ మేరకు మాత్రమే సాధారణ పేలుడు పదార్ధాలు ఉపయోగించాలి. అది కూడా నిపుణుడైన, సుశిక్షితుడైన వ్యక్తి మాత్రమే బ్లాస్టింగ్ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా కార్మికులకు రక్షణ కలుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అయితే ఇక్కడ బ్లాస్టింగ్లు అక్షర జ్ఞానం లేని కూలీలను, జిలెటిన్ స్టిక్, డిటొనేటర్ అంటే తెలియని అమాయకులతో õనిర్వహిస్తున్నారు. బాంబుల హోరు.. జనం బేజారు.. జిలెటిన్ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్ధాలతో మండలంలోని కొండలను పేల్చుతున్నారు. పొందూరుకు చుట్టుపక్కల ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్ క్వారీలు ఉన్నాయి. గత రెండు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాంబుల మోతతో పొందూరు చుట్టుపక్కల గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. శుక్రవారం పలువురి క్వారీల్లో కంప్రెషర్ ఉపయోగించి రాళ్లకు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుడుకు సిద్ధం చేస్తుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. మృత్యుబారిన పలువురు కార్మికులు.. కొండలకు బెజ్జాలు పెడుతున్నప్పుడు, కొం డపైకి ఎక్కుతున్నప్పుడు, ట్రాక్టర్లోకి రాళ్ల ను ఎత్తుతున్నప్పుడు, బ్లాస్టింగ్లు జరుపుతున్నప్పుడు కార్మికులు మృత్యుబారిన పడుతున్నారు. కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడిన వారు ఉన్నారు. 2019 జనవరి 2న ఇల్లయ్యగారిపేట జరిగిన బ్లాస్టింగ్‌లో కెంగువ రామారావు మృతి చెందగా.. 2018 జూన్ 26న క్వారీలో నుంచి ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకొస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి మహదాస్యం నాగరాజు, 2015 జూన్ 13న కొండపై నుంచి జారిపడి కొంచాడ శ్రీను మృతి చెందారు. ఇలా ఎందరో మృత్యు ఒడిని చేరారు. ఇంత జరుగుతున్నప్పటికీ మృతుల కుటుంబాలకు సరైన న్యాయం జరగటం లేదు. వారికి నామమాత్ర పరిహారం అందిస్తూ పోలీసులకు, మైనింగ్ అధికారులకు లక్షల్లో ముట్టచెబుతున్నారు. బ్లాస్టింగ్లు జరపొద్దని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవటం లేదు. పై స్థాయిలో అధికారులు కచ్చితంగా బ్లాస్టింగ్లు జరపవద్దని చెబుతున్నారు. కింది స్థాయిలో అమలుకు లొసుగులు అడ్డువస్తున్నాయేమో గాని బ్లాస్టింగ్లు మాత్రం ఆపడం లేదు. క్వారీలను పరిశీలించిన సీఐ.. మండలంలోని క్వారీలను జేఆర్ పురం సీఐ హెచ్ మల్లేశ్వరరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. రాపాక, ఇల్లయ్యగారిపేట క్వారీలను పొందూరు పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. బ్లాస్టింగ్లు ఎక్కడైనా జరుగుతున్నాయా? అని తెలుసుకునేందుకు పర్యటించామని చెప్పారు. అక్రమంగా పేలు ళ్లు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. అతిక్రమిస్తే లీజు రద్దు.. క్వారీల నిర్వహణ కచ్చితంగా లీజుదారులే చేయాలి. అది కూడా వారికి మైనింగ్ అధికారులు కేటాయించిన కొండలో నిబంధనలను అధిగమించకుండా క్వారీ నిర్వహించాలి. అనుమతి ఇచ్చిన కొండ విస్తీర్ణం దాటి క్వారీ నిర్వహిస్తే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి లీజు రద్దుకు సిఫార్సు చేస్తాం. – టి.రామకృష్ణ, తహశీల్దార్, పొందూరు అక్రమార్కులపై కఠిన చర్యలు.. క్వారీల్లో జిలెటిన్ స్టిక్స్, పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులది. మైనింగ్‌కు ఇచ్చిన విస్తీర్ణం కంటే ఎక్కువ క్వారీ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజు రద్దు చేస్తాం. –సత్యనారాయణ, గనులు, భూగర్భ శాఖ ఏడీ అక్రమ పేలుళ్లకు క్వారీ లీజుదారులే బాధ్యులు క్వారీ నిర్వహణకు బ్లాస్టింగ్లు జరపొద్దని హెచ్చరించాం. ప్రమాదకర పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే విడిచిపెట్టం. ఎక్కడైనా అక్రమంగా బ్లాస్టింగ్లు జరిగితే క్వారీ లీజుదారులే బాధ్యులవుతారు. అరెస్టులు కూడా చేస్తాం. –హెచ్.మల్లేశ్వరరావు, సీఐ, జేఆర్ పురం -
మైనింగ్ మాఫియాకు మూడినట్టే..!
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై పల్నాడు ప్రజల్లో, యరపతినేని బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణతో గత ఐదేళ్లుగా యరపతినేని సాగించిన ఖనిజ దందా, మనీలాండరింగ్, భూమాఫియా వ్యవహారాలు బట్టబయలవుతాయని మేధావులు, అధికారులు అంటున్నారు. ‘తెల్ల సున్నపురాయి తవ్విన గోతులను కొలిస్తే ఎన్ని టన్నులు అక్రమంగా (మైనింగ్ లీజు, పర్మిట్లు లేకుండా) తవ్వారో తేలిపోతుంది. దీంతో ఖజానాకు ఎంత రాయల్టీ, పెనాల్టీ ఎగవేశారో బట్టబయలవుతుంది. ఖజానాకు జరిగిన నష్టంతోపాటు అపరాధ రుసుం కూడా వసూలు చేయడానికి సీబీఐ విచారణ దోహదపడుతుంది. యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్, ప్రశ్నించినవారిపై పెట్టిన అక్రమ కేసులు, సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయట్టబయలవుతాయి. దీంతో ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని అధికారులతోపాటు టీడీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న టీడీపీ నేతలు హడలిపోతున్నారు. తమ గుట్టు రట్టు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. యరపతినేనికి సహకరించిన అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. యరపతినేని కేసు పూర్వాపరాలివీ.. - టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు - ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు వేల టన్నుల పేలుడు పదార్థాల వినియోగం - ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ - అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్ దాఖలు చేసిన కె.గురవాచారి.. - అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు - అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన 11 మందిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్ అధికారులు - ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కకట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యం అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త - హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి - గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్ నిజమైన దోషులను శిక్షించాలి పల్నాడులో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి కేసును సీఎం సీబీఐకి అప్పగించారు. నిజమైన దోషులను శిక్షించాలి. దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలి. –కాసు మహేశ్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే శుభపరిణామం అక్రమాలు, అన్యాయం చేసినవారు చట్టానికి ఎప్పుడూ అతీతులు కారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించడం శుభ పరిణామం. – టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
మాయమవుతున్న మాంగనీస్
జిల్లాలోని నాణ్యమైన మాంగనీసు మాయమవుతోంది. అనుమతుల్లే కుండానే ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. అక్రమార్కుల జేబుల్లోకి నగదురూపంలో చేరిపోతోంది. ఇటీవల అనుమతుల్లేకుండా తరలిస్తున్న నాలుగు లారీల మాంగనీసు పట్టుబడడంతో గనుల అక్రమతవ్వకం బహిర్గతమైంది. మంగనీసు కొండలు తరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకచోట తవ్వకానికి అనుమతి తీసుకొని మరోచోట అనధికారికంగా, అధికంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇటీవల దొంగ పర్మిట్లతో రవాణా చేస్తున్న 120 టన్నుల మాంగనీస్ పట్టుబడింది. నాలుగు లారీల్లో తరలిస్తున్న మాంగనీస్ ఖనిజం ఎక్కడ నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. జిల్లాలో ఇదే విధంగా మరికొన్ని చోట్ల కూడా గనుల అక్రమ రవాణా, తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరందుకోంది. నిల్వల్లో ప్రథమం.. రాష్ట్రంలో ఎక్కడా లేని నాణ్యమైన మాంగనీసు విజయనగరం కొండల్లో 14 మిలియన్ టన్నులు ఉంది. 40 వేల ఏళ్ల కిందట ఏర్పడిన మాంగనీస్ భూ ఉపరితలానికి 22 మీటర్ల లోతులో ఇక్కడ లభిస్తోంది. దీంతో విజయనగరం మాంగనీసు గనులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని గరివిడి, మెరకముడిదాం, చీపురుపల్లి, పూసపాటి రేగ, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి మండలాలతో పాటు జిల్లాలోని పార్వతీపురంలో కూడా మాంగనీస్ గనులున్నాయి. ఈ గనుల నుంచి ఏటా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మాంగనీస్ నిల్వలను తరలిస్తున్నట్టు అంచనా. అయితే, అధికారులు మాత్రం లక్షా 50వేల టన్నులు మాత్రమే వెళ్తోందని లెక్కగడుతున్నారు. అంటే ఒకే పర్మిట్‌తో రెండు మూడు లారీలు వెళ్తుండడంతో పాటు తనిఖీలు జరుగకుండా వెళ్తున్నవి అధికంగా ఉంటున్నాయి. లైసెన్స్‌లు రద్దుచేసినా ఆగని తవ్వకాలు.. బొబ్బిలి మండలం మెట్టవలస పంచాయతీ బోడిమెట్ట కొండ 182 సర్వే నంబర్లో గతంలో ఏడుగురికి లైసెన్సులుండేవి. పరిశ్రమలు ఉన్న గ్రోత్ సెంటర్‌ను ఆనుకునే బోడి మెట్టకొండ ఉంది. ఇక్కడ 34.37 ఎకరాలు (13.915హెక్టార్లు) విస్తీర్ణంలో సంవత్సరానికి రూ.50వేల చొప్పున లైసెన్సులను ఏడుగురు వ్యక్తులకు ఉండేవి. అయితే, ఇందులో లైసెన్సుదారులు వారికి కేటాయించిన పరిధి దాటి తవ్వకాలు చేపట్టడం, నిబంధనలు అతిక్రమించడంతో సుమారు ఐదుగురి లైసెన్సులు రద్దుచేశారు. అయినప్పటికీ వారు ఇంకా అదే ప్రదేశంలో అక్రమ తవ్వకాలు చేపడుతుండడం గమనార్హం. చీపురుపల్లి నియోజకవర్గంలో మాంగనీస్ గనులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా జరుగుతుంటుంది. అయితే, ఇటీవల అక్కడి పెద్దపెద్ద మైనింగ్ కంపెనీలు మై నింగ్‌ను నిలిపివేశాయి. దీంతో మైనింగ్ ఎక్కడా జరగడం లేదనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యం గా ఈ నెల 23న ఎస్కే సర్వాగీ అండ్‌కో ప్రైవేట్ లిమి టెడ్ పేరుతో రూ.12 లక్షల విలువైన 240 టన్నుల మాంగనీస్‌ను ఆరు లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి చీపురుపల్లి మండలంలో సర్వాగి మైనింగ్‌ను మూసేశారు. అక్కడ తవ్వకాలు జరగడం లేదు. మరలాంటప్పుడు ఆ కంపెనీ పేరుతో ఆరు లారీల మాంగనీస్ ఎక్కడి నుంచి తవ్వి తీసుకువస్తున్నారనేది మిస్టరీగా మారింది. విజిలెన్స్ కేసులుంటే బంధువులకు లైసెన్సులు.. గనుల అక్రమ తవ్వకాలపై అధికారులు అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో బోడిమెట్ట కొండ ప్రాంతంలో ఉన్న లైసెన్సుదారులు అధికంగా తవ్వకాలు, పరిధిని మించి క్వారీ మెటల్ సేకరణ చేస్తుండడంతో మైనింగ్ విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. కొంత మెటల్‌ను సీజ్ చేసింది. లైసెన్సులను రద్దు చేసింది. అదే లైసెన్స్‌దారులు వారి బంధువుల పేరున మళ్లీ లైసెన్సులు తెప్పించుకుని మళ్లీ క్వారీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. లైసెన్సులు..సబ్ లైసెన్సులు: లైసెన్స్ తీసుకున్న గనుల నిర్వహకులు తవ్వకాలకు సబ్ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. గనులుండే కొండప్రాంతాన్ని భాగాలుగా చేసి సబ్ లైసెన్సులకు ఇస్తున్నారు. నెలకు కొంత మొత్తాన్ని లైసెన్సు దారులకు ముట్టజెప్పేందుకు ఒప్పందాలు చేసుకుని గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు. వీరి విషయం అధికారులకు తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన గనుల ప్రమాదాల్లో అమాయక కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 398, 447 చట్టాలకు తూట్లు : క్వారీలు, చెరువులు, ఇసుక రేవుల్లోని వనరులను విక్రయించుకుంటూ వ్యాపారం చేసుకునే వారు మైన్స్ అండ్ మినరల్స్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ చట్టాలను బేఖాతరు చేస్తూ ఇసుక అక్రమ తవ్వకాలు, నిల్వల దందా సాగుతూనే ఉంది. అధికారులు «గుర్తించిన ఇసుక రిచ్‌లను మాత్రమే వినియోగించక పోవడం, అధికారికంగా నిర్ణయించిన ధరలను అమలు పరచకపోవడం, అక్రమ రవాణాపై ఉన్న నిబంధనలు, ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా ఇసుక, గ్రావెల్ వంటివి అవసరమైన వారు మైన్స్ అండ్ మినరల్స్లోని యాక్ట్ 379, 447 ప్రకారం మండల తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐలతో కూడిన అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఎవరూ పాటించడం లేదు. చర్యలు తీసుకుంటాం: లైసెన్సులు ఉన్నవారే గనుల తవ్వకాలు జరపాలి. పరిధి దాటి జరుపకూడదు. బొబ్బిలి లోని మెట్టవలస క్వారీల్లో లైసెన్సులున్న వారు తవ్వకాలు జరపలేదని ఇటీవల చేపట్టిన పరిశీలన అనంతరం మా సిబ్బంది తెలిపారు. ఓ సారి పరిశీలిస్తాం. చీపురుపల్లిలో పట్టుబడిన మాంగనీస్ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ జరుపుతున్నాం. – డాక్టర్ ఎస్వీ రమణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, విజయనగరం నిబంధనలు ఉల్లంఘించిన ‘సర్వాగీ’ చీపురుపల్లి: ఎస్.కె.సర్వాగీ మైనింగ్ పరి శ్రమ నిబంధనలు ఉల్లంఘించింది. అనుమతులు లేకుండా మాంగనీస్ తవ్వకాలు జరిపి వేరే ప్రాంతాలకు చెందిన పర్మిట్లతో అక్రమ రవాణాకు పాల్పడింది. ఇది కచ్ఛితంగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా భూగర్భ గనులశాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తమనాయుడు అన్నారు. మండలంలోని పెదనడిపల్లి రెవెన్యూ పరిధిలో ఎస్.కె.సర్వాగీ మైనింగ్ తవ్వకాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ నెల 23న రాత్రి చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి మైనిం గ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు మాంగనీసు లారీలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ లారీల సమాచారాన్ని ఈ నెల 24న జిల్లా భూగర్భ గనులశాఖకు చేరవేశారు. దీంతో రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తమనాయుడు సర్వాగీ పరిశ్రమలో మైనింగ్ తవ్వకాలు, అనుమతులు, హద్దులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన ఆరు మాంగనీసు లోడు లారీల్లో రెండింటికే అనుమతులు ఉన్నాయన్నారు. మిగిలిన నాలుగు లోడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్ పర్మిట్లు చూపించి, చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి, ఇటకర్లపల్లి మైనింగ్‌లు నుంచి నాలుగు లారీల్లో మాంగనీరు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. చీపురుపల్లి మండలంలో సర్వాగీ పరిశ్రమకు చెందిన మైనింగ్లలో తవ్వకాలు జరగడం లేదని, అయినప్పటికీ మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్ పర్మిట్లు పెట్టి మాంగనీసు రవాణా చేయడం నేరమన్నారు. దీనికి జిల్లా అధికారులు అపరాధ రుసుము విధిస్తారని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?
సాక్షి, అమరావతి/సాక్షి అమరావతి బ్యూరో: టీడీపీ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసి తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండ మోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఎటువంటి అనుమ తులు తీసుకోకుండా అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు చేస్తున్నారని, అలాగే రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ ఛార్జీలు ఎగవేశారంటూ గతంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సీల్డ్ కవర్లో ధర్మాసనం ముందుంచారు. నిబంధనలకు విరుద్ధంగా యరపతినేని భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని తేలిందని ఏజీ చెప్పారు. ఈ వ్యవహారంలో 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 24 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వేగంగా ఎందుకు సాగడం లేదని ప్రశ్నించింది. పలు శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోందని, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సి ఉందని శ్రీరామ్ వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేస్తే సాంకేతిక అంశాల్లో కూడా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని ఎందుకు కోరకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, తాము అలా కోరడం సబబు కాదని ఏజీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి తమ ముందున్న వ్యాజ్యమే అడ్డమని భావిస్తే, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమార్కులకు శిక్ష తప్పదు –కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ ద్వారా అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ వ్యక్తికి శిక్ష తప్పదు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. మనీలాండరింగ్, అక్రమ ఆస్తులు తదితర అంశాలపై లోతుగా విచారణ చేయాలి. వ్యవస్థలను భ్రష్టు పట్టించి అడ్డగోలుగా సంపాదించినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది –టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డవారు చట్టానికి అతీతులు కాదు. వీరి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులో న్యాయం జరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తుంది. తద్వారా గ్రామాలకు మైనింగ్ సెస్ వచ్చి అవి అభివృద్ధి చెందుతాయి. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు పూర్వాపరాలివీ.. – టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు – ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ – అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్ దాఖలు చేసిన గురజాలకు చెందిన కె.గురవాచారి – అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు – అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన నలుగురిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్ అధికారులు – ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కపెట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా నిర్లక్ష్యం – అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త – హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి – గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్ – 33 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయి అక్రమ మైనింగ్ జరిగినట్లు, రాయల్టీ, పెనాల్టీ రూపంలో రూ.156 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు తేల్చిన భూగర్భ గనుల శాఖ -
చేయితడిపితే చాలు గ్రీన్ సిగ్నల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో జాతీయ రహదారిపై గ్రానైట్ అక్రమరవాణా అధికారుల సహకారంతో జోరుగా సాగుతోంది. ఎలాంటి బిల్లులు చెల్లింపుల్లేకుండానే గ్రానైట్‌ను అధికారులే నెలవారీ మామూళ్లతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అధికలోడుతో వెళ్తున్న గూడ్స్, గ్రావెల్, కంకర, గ్రానైట్ లోడింగ్‌తో లారీలు నిత్యం రవాణా సాగిస్తూనే ఉన్నాయి. అడపాదడపా మాత్రమే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో మాత్రమే ఈ విషయం బయటపడుతోంది. విజిలెన్స్ తనిఖీలు లేనప్పుడు మాత్రం యథావిధిగా అక్రమరవాణా సాగుతుంది. ప్రతిరోజూ వెళుతున్నా.. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, అద్దంకి, సంతనూతలపాడు పరిధిలో విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీలు నుంచి క్వాలిటీను ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తుంటారు. ఇంకా శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీల నుంచి కూడా తరలుతోంది. ప్రకాశం నుంచి వెళ్లే గ్రానైట్‌కు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. క్వాలిటీ గ్రానైట్ పలకలను మాత్రం బెంగళూరు, చెన్నై, కేరళ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ సుమారు 30 నుంచి 50 వాహనాల్లో వివిధ రకాల గ్రానైట్ ముడిసరుకు, క్వాలిటీ పలకలు కూడా పంపిస్తున్నారు. గ్రానైట్ సరుకును క్వాలిటీని బట్టి ఏ, బీ, సీ, డీగా విభజించి క్వారీ యజమానులు విక్రయాలు చేస్తారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి.. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నిత్యం తరలివెళ్లే గ్రానైట్‌కు ఎలాంటి బిల్లులుండవు. మైనింగ్, కమర్షియల్ ట్యాక్స్‌కు చెల్లించాల్సిన ట్యాక్స్‌లు చెల్లించకుండానే అధికారులకు నెలవారీ మామూళ్లు ఫిక్స్ చేసి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గ్రానైట్ క్వారీ నుంచి తీసే ముడిసరుకు క్వాలిటీని బట్టి క్యూబిక్ మీటర్ వంతున మైనింగ్ శాఖకు ట్యాక్స్ చెల్లించాలి. బిల్లు చెల్లించి మైనింగ్ జీయాలజీ నుంచి ట్రాన్సిల్పాస్ తీసుకుని సరుకు రవాణ సాగించాలి. అనంతరం గ్రానైట్ తరలింపునకు కమర్షియల్ ట్యాక్స్‌కు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్కు మాత్రం ఒక శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. కానీ ఆయా శాఖలకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. అలాగే ఓవర్ టన్నేజీ ఒక్కో వాహనంలో సుమారు 50 టన్నుల వరకు గ్రానైట్ ముడి సరుకును రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. పైలెట్ల ద్వారా.. ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే గ్రానైట్ వాహనాల అక్రమరవాణాకు పైలెట్ సహకారం ఉంటుంది. సహకరించే అధికారులకు వాహనాల నంబర్లు ఇస్తారు. వారు కాక ఇతర శాఖల అధికారులకు వాహనాలు పట్టుబడితే రూ.లక్షల్లో పెనాల్టీలు చెల్లించాల్సి రావడంతో వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు ప్రత్యేకముఠా పైలెట్‌లా వ్యవహరిస్తోంది. పది కిలోమీటర్ల ముందుగా పైలెట్ వాహనం ఉంటుంది. రహదారులపై ఎలాంటి అధికారులు తనిఖీలు లేవని నిర్ధారించుకున్న తర్వాత గ్రానైట్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. ఒకవేళ విజిలెన్స్ అధికారుల తనిఖీలుంటే మాత్రం ఆ వాహనాలను హైవే పక్కన నిలిపివేస్తారు. ఇలా పైలెట్‌లా వ్యవహరించే ముఠాకు ప్రత్యేక నగదు అందుతుంది. ► జిల్లాలో 2017–18లో ఎలాంటి పత్రాల్లేకుండా సరిహద్దులు దాటే వాహనాలపై విధించిన అపరాధరుసుం : రూ.4 కోట్లు ► 2018–19లో విధించిన మొత్తం : రూ.4.55 కోట్లు ► 2017–18లో నిబంధనలు ఉల్లంఘించడంతో విధించిన జరిమానా : రూ.11.69 కోట్లు ► 2018–19లో విధించిన అపరాధరుసుం: రూ.11.23 కోట్లు పై గణాంకాలు జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతుల్లేకుండా, బిల్లులు చెల్లించకుండా అక్రమ రవాణా సాగిస్తున్న వాహనాల నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిమానా రూపంలో చేసిన వసూళ్లు. ఇవే కాకుండా గత రెండునెలలుగా మరో ఆరుసార్లు హైవేపై అక్రమరవాణాను గుర్తించి సుమారు మరో రూ.4 కోట్ల వరకు జరిమానా రూపంలో వసూలు చేశారు. ఇదంతా విజిలెన్స్ అధికారులు అడపాదడపా హైవేపై తనిఖీలు జరిపినప్పుడే మాత్రమే వచ్చినవి. నిత్యం తనిఖీలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు మరెంతో లాభం చేకూరుతుంది. అధికారుల మామూళ్ల కక్కుర్తి.. వ్యాపారుల అక్రమార్జన వెరసీ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడుతోంది. కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్, మైనింగ్, పోలీస్ అధికారుల సహకారంతో రవాణా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికలోడుతో.. కంకర, గ్రావెల్, సిలికాను తరలించే వాహనాలు కూడా పరిమితికి మించి అధికలోడుతో ఉంటున్నాయి. అలాగే బిల్లుల్లేకుండా బియ్యం, ధాన్యం రవాణా సాగుతోంది. నెల్లూరు టూ చెన్నై వరకు నిత్యం జరుగుతున్నా ఏ శాఖ అధికారులు పట్టుకున్న దాఖలాల్లేవు. విజిలెన్స్ అధికారులు చేసే అడపాదడపా దాడుల్లో మాత్రమే కొన్ని వాహనాలు పట్టుబడుతున్నాయి. రవాణా శాఖ అధికారులకు ప్రతి వాహనం నుంచి దళారుల ద్వారా మామూళ్లు అందుతున్నాయి. అలా చెల్లించిన వాహనం నంబర్ ఆ శాఖ అధికారుల జాబితాలో ఉంటుంది. వాటిని మాత్రం తనిఖీ చేయరు. బిల్లుల్లేకుండా వెళ్లే వాహనాలే కాదు కంకర, గ్రావెల్, సిలికా లారీలు పరిమితికి మించి అధికలోడుతో వెళ్లే వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో హైవేపై డ్యూటీలకు కొందరు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీసులు సైతం హైవేపై స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నారు. రెండేళ్లపాటు పనిచేస్తే చాలు నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జాగా ఉండొచ్చనే భావనతో ఉన్నారు. -
తమ్ముడు.. కుమ్ముడు...!
సోమందేపల్లి మండలం సర్వే నంబర్ 64లో రోడ్డు మెటల్ క్వారీకి గనులశాఖ అధికారులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కుమార్తె బీకే రోజా పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 20,500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వుకోవాలని సూచించారు. అయితే ఈ క్వారీలో దాదాపు 90 వేల క్యూబిక్ మీటర్లకుపైగా అక్రమంగా తవ్వకాలు జరిపారు. 2018 నవంబర్ 1న క్వారీని పరిశీలించిన రాష్ట్ర గనులశాఖ అధికారులు దీన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తెలిసి రూ.98 లక్షలు జరిమానా విధించారు. అయితే బీకే కుటుంబం జరిమానా చెల్లించకపోగా... నేటికీ తవ్వకాలు జరుపుతూ రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అనుమతులు ఉండవు.. తవ్వేస్తారు. రాయల్టీ చెల్లించరు.. రవాణా చేస్తారు. లీజు ఒకచోట పొంది మరో ప్రాంతంలో తవ్వేస్తారు. ఎవరూ పట్టించుకోరు. కొండలను పిండిచేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి పైసా చెల్లించరు. జిల్లాను పట్టి పీడించిన మైనింగ్ మాఫియా దెబ్బకు ‘అనంత’లోని గనులు, కొండలు నామ రూపాల్లేకుండా పోయాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో...గత ఐదేళ్లలో టీడీపీ నేతలు సహజ వనరులన్నీ దోచేశారు. అక్రమార్జనకు అలవాటుపడిన వారంతా నేటికీ దందా నడిపిస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీలు- 320 గ్రానైట్ క్వారీలు- 120 రోడ్ మెటల్ క్వారీలు- 200 పర్యావరణ అనుమతులున్న క్వారీలు- 120 సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో సహజవనరులకు మాత్రం కొదవలేదు. అందుకే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వీటిపైనే కన్నేశారు. మనీ కోసం మైనింగ్ మాఫియా నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి రూ.కోట్లు సంపాదించారు. క్వారీలు, గనులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్లుమూసుకోవడంతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు. 120 క్వారీలకే అనుమతులు జిల్లా వ్యాప్తంగా 320లకుపైగా క్వారీలుండగా...వీటిలో 120 గ్రానైట్ క్వారీలు, 200 రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. ప్రతి క్వారీకి పర్యావరణ అనుమతులు తప్పని సరి. లేని వాటిని సీజ్ చేయాలని కేంద్ర పర్యావరణ అధికారులు భూగర్భ గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే జిల్లాలో 120 క్వారీలకు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి అనుమతులు లేకున్నా... ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న లీజు ప్రాంతంలో కాకుండా సమీపంలోని ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలను గుర్తించలేకపోతున్నారు. గనులశాఖకే ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ ఆమ్యామ్యాలకు అలవాటుపడిన వారంతా కళ్లుమూసుకుని చోద్యం చూస్తున్నారు. ప్రతినెలా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ తరలింపు జిల్లాలోని రోడ్డు మెటల్ క్వారీల నుంచి ప్రతి నెలా 12 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా మెటల్‌ను తరలిస్తున్నారు. ఈలెక్కన ప్రతి క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించి పర్మిట్లు తీసుకుంటే... ప్రతినెలా రోడ్డు మెటల్ క్వారీలనుంచే ప్రభుత్వానికి దాదాపు రూ.12 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉంది. అయితే క్వారీ నిర్వాహకులు మాత్రం 2 లక్షల క్యూబిక్ మీటర్లకు కూడా రాయల్టీ చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్లకుపైగా.... ఏడాదికి దాదాపు రూ.120 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోంది. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వహకులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పర్మిట్లకు రాయల్టీ చెల్లించి అక్రమంగా రోడ్డు మెటల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సైతం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎల్.నారాయణ చౌదరి దందా ఎక్కువే మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్.నారాయణ చౌదరి 2015లో సోమందేపల్లి మండలంలోని సర్వే నంబర్లు 509లోని 3 హెక్టార్లు, 2 హెక్టార్లు చొప్పున రెండు రోడ్డు మెటల్ క్వారీలకు లీజు తీసుకున్నాడు. 2016–17 సంవత్సరంలో క్యూబిక్ మీటరుకు కూడా రాయల్టీ చెల్లించలేదు. 2017–18లో మాత్రం ఒక క్వారీకి 6,500 క్యూబిక్ మీటర్లకు గానూ రూ.6.50 లక్షలు, మరో క్వారీ తరఫున 1,300 క్యూబిక్ మీటర్లకు రూ.1.30 లక్షలు చెల్లించాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.8 లక్షల్లోపే రాయల్టీ చెల్లించాడు. క్వారీలో మాత్రం నేటికీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ మూడేళ్లకాలంలో ఇంతతక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించిన క్వారీలు జిల్లాలోనే లేకపోవడం గమనార్హం. అయితే గనులశాఖ అధికారులు మాత్రం ఈ క్వారీలను పర్యవేక్షించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం క్వారీని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ రెండు క్వారీల నుంచే దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని తరలించుకు పోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వాటిని చూసే సాహసం కూడా చేయడం లేదు. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఏస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇన్చార్జి అధికారితోనే ఇబ్బందులు గనుల శాఖ అనంతపురం ఏడీగా పనిచేస్తున్న వెంకట్రావును ఆరు నెలల క్రితం అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో తాడిపత్రి ఏడీగా ఉన్న వెంకటేశ్వరరెడ్డికి అనంతపురం డివిజన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వారం రెండు రోజులు మాత్రమే అనంతపురం డివిజన్లోని క్వారీ వ్యవహారాలు చూస్తున్నారు. అందువల్లే అక్రమ క్వారీలపై నిఘా ఉంచలేకపోతున్నారు. ఇద్దరు ఆర్ఐలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రాయల్టీ ఎగవేత ఇలా.... ప్రతి నెలా తరలించే మెటల్ క్వారీ: 12 లక్షల క్యూ.మీ రాయల్టీ రూపంలో ఖజానాకు చేరాల్సిన మొత్తం : రూ.12 కోట్లు్ల క్వారీ నిర్వాహకులు నెలలో చెల్లిస్తున్న మొత్తం: రూ.2 కోట్లు ఏడాదికి ప్రభుత్వానికి అందకుండా పోతున్న మొత్తం: రూ.120 కోట్లు చర్యలు తీసుకుంటాం సోమందేపల్లి మండలంలోని రోడ్డు మెటల్ క్వారీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన కొందరు క్వారీ నిర్వాహకులకు జరిమానా విధించాం. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు పంపాం. కొందరు కోర్టులను ఆశ్రయించడం వల్ల వారికి నోటీసులు పంపలేదు. కోర్టు ఉత్తర్వులు రాగానే జరిమానా సొమ్మును పైసాతో సహా వసూలు చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ -
గుండుమల.. గ్రానైట్ దందా!
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మెటల్ క్వారీ మడకశిర మండలం మెళవాయి గ్రామంలోనిది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరుడు జయప్ప దీనికి లీజు పొందారు. హెక్టార్ విస్తీర్ణంలో ఉన్న ఈ క్వారీకి పర్యావరణ అనుమతులు లేవు. అయినప్పటికీ ఆరేళ్లుగా రోడ్డు మెటల్‌ను తవ్వేసుకుంటున్నారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 622–2లో ఐదు హెక్టార్లను 2016 మార్చి నెలలో అధికారులు ఎమ్మెల్సీ మరో సోదరుడు జి.సుభాష్ పేరుతో క్వారీకి లీజు ఇచ్చారు. ఈ క్వారీకి భూగర్భ, గనులశాఖ నుంచి అనుమతులు లేవు. అయినా అధికారం అండతో తవ్వకాలు చేపట్టిన ఎమ్మెల్సీ సోదరుడు...రాయల్టీ కూడా చెల్లించకుండానే మూడేళ్లుగా రోడ్డు మెటల్‌ను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయనో ప్రజాప్రతినిధి.. పైగా పెద్దల సభకు ప్రాతినిథ్యం. ఈ పెద్దమనిషి.. వక్రబుద్ధితో దోపిడీదారుని అవతారమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. అక్రమార్కులకు మార్గదర్శిగా మారారు. అధికార అండతో కొండలను పిండిచేసి రూ.కోట్లు కూడబెట్టాడు. తమ్ముళ్లు, బంధువుల పేరుతో గనులను లీజుకు తీసుకుని అనుమతులు లేకుండానే ఖనిజం తవ్వడంతో పాటు.. రాయల్టీ సైతం ఎగ్గొట్టి సరిహద్దు దాటించేస్తున్నాడు. సాక్షి, అనంతపురం టౌన్: మడకశిర.. కర్ణాటక ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం. రెండు, మూడు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వస్తుంది. ఇదే క్వారీ నిర్వాహకులకు కలిసి వస్తోంది. క్వారీల కోసం భూములను లీజుకు తీసుకుంటున్న వారు...ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి అత్యంత విలువైన ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కూడా అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఎమ్మెల్సీ అండ.. తమ్ముళ్ల దందా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40కిపైగా గ్రానైట్, రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. వీటిలో 25కు పైగా గుండుమల తిప్పేస్వామి బంధువుల పేరుతో ఉన్నాయి. ఈ క్వారీల నుంచి ఖనిజ తరలింపు కోసం చెల్లించిన రాయల్టీకి తవ్విన ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. వందల క్యూబిక్ మీటర్లకు అనుమతులు పొంది వేల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా లీజు పొందని ప్రాంతాల్లో సైతం హద్దులు దాటి తవ్వకాలు చేపట్టారు. అంతా గుండుమల కనుసన్నల్లో.. మడకశిర ప్రాంతంలో జరిగే గ్రానైట్ వ్యాపారం అంతా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లోనే సాగుతుంది. క్వారీల్లో సింహభాగం కుటుంబీకులవే. దీంతో ఇతరులెవరైనా క్వారీలు లీజు పొందిన ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడవాల్సిందే.. క్వారీలో వాటా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది. దీంతో గుండుమల తిప్పేస్వామి సోదరులకు అన్ని క్వారీల్లోను వాటాలున్నాయి. వారి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు గుండుమల చంద్రప్ప, శివానందప్ప, రాధాకృష్ణలు మడకశిర మండలం జాదరహళ్లి గ్రామంలో నాలుగు గ్రానైట్ క్వారీలను 2012 సంవత్సరంలో లీజుకు తీసుకున్నారు. లీజులు మాత్రమే పొందిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.1,600 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. ఆరేళ్లుగా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను తరలించి సొమ్ము చేసుకున్నారు. జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు నడుపుతున్న క్వారీలో అనుమతి పొందిన దానికంటే.. అదనంగా తవ్వకాలు చేసినట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. ఏకంగా రూ.2 కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా అక్రమ దందాను మాత్రం అరికట్టలేకపోయారు. రాయల్టీ ఊసేలేదు రోడ్డు మెటల్‌కు బెంగళూరులో మంచి డిమాండ్ ఉంది. మడకశిర కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అందరూ ఇక్కడి నుంచే మెటల్‌ను తరలిస్తున్నారు. అందువల్లే ఇక్కడి క్వారీల నుంచి రోజూ పదుల సంఖ్యల్లో వాహనాల్లో రోడ్డు మెటల్ తరలిపోతుంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ రోడ్డు మెటల్‌కు రూ.100 ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అయితే ఏ ఒక్క క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించడం లేదు. అసలు పర్మిట్లే తీసుకోవడం లేదు. ఎవరైనా అధికారి వాహనాన్ని ఆపితే... గుండుమల పేరు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా ఆ వాహనాలను ఆపే సాహసం చేయడం లేదు. అందువల్లే గుండమల గ్రానైట్, మెటల్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రూ.కోట్లలో జరిమానా విధించినా.. మడకశిర మండలం మళ్లినాయకనహళ్లి, ఆమిదాలగొంది, జాదరహాళ్లి, అగళి మండలం హెచ్డీ హళ్లి గ్రామాల్లో గుండుమల తిప్పేస్వామి సోదరులు కలర్ గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారు. ఈ క్వారీలపై గతంలో కొందరు ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర గనులశాఖ అధికారులు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లలో తనిఖీలు చేశారు. అయితే తీసుకున్న పర్మిట్లకు, తవ్వుకున్న ఖనిజానికి పొంతన లేకపోవడంతో గనులశాఖ అధికారులు క్వారీల్లో కొలతలు వేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ. కోట్లలో జరిమానా విధించారు. ఇక జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు.. అనుమతి పొందిన దానికంటే... అదనంగా తవ్వకాలు చేసినట్లు గుర్తించి ఆ క్వారీకి రూ.2 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయినా క్వారీ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నేటికీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన ఖనిజ సంపదను తరలిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చర్యలు తీసుకుంటాం పర్యావరణ అనుమతులు లేకుండా క్వారీల్లో తవ్వకాలు చేపట్టకూడదు. మడకశిర నియోజకవర్గంలోని క్వారీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజులను రద్దు చేస్తాం. ఇక రాయల్టీ చెల్లించకుండా ఖనిజం తరలిస్తున్న వారిపై చర్యలకు ఆదేశిస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, ఏడీ భూగర్భ, గనులశాఖ -
పోట్లదుర్తి బ్రదర్సా...మజాకా..
అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. నాలుగేళ్లుగా కొండను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా మౌనం దాల్చారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండికొట్టి కోట్లాది రూపాయలు ఆర్జించిన తర్వాత నోటీసులిచ్చి సరిపెట్టారు. నిబంధనలు మేరకు అపరాధ రుసుం వసూలు చేయడానికి ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న తప్పునకే సామాన్యులపై విరుచుకుపడే అధికార యంత్రాంగం పోట్లదుర్తి బ్రదర్స్ పట్ల ఎప్పటిలా భక్తి చాటుకుంటూనే ఉన్నారు. సాక్షి, కడప : ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ క్రషర్ ఏర్పాటు చేసి కొండను కొల్లగొట్టారు. నాలుగేళ్లుగా ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా డైనమేట్లతో పేల్చి కంకర కొట్టారు. ఈ శబ్దాలకు చిన్నదుద్యాల గ్రామస్థుల ఇళ్లు నెర్రలుబారినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ప్రభుత్వం గణనీయంగా ఆదాయం కోల్పోతున్నా అధికారమత్తు నుంచి తేరుకోలేదు. పెద్దఎత్తున అక్రమ వ్యవహారం ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని భావించి ఎన్నికలు సమీపించడంతో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మైనింగ్ అనుమతులు లేకుండానే.... మైనింగ్ అనుమతులు లేకుండా పోట్లదుర్తి బ్రదర్స్ క్రషింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. పోట్లదుర్తికి చెందిన జి చెన్నకేశవనాయుడు (సురేష్‌నాయుడు బినామీ)కు చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్ 242లో 10.11హెక్టార్లులో మైనింగ్ లీజు దక్కింది. 2015లో లీజు లభించినా మైనింగ్ అనుమతులు పొందలేదు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నిమిత్తం లేకుండా అక్రమంగా మైనింగ్ కొనసాగించారు. గతేడాది నవంబర్ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ యర్రగుంట్ల మైనింగ్ ఏడీ నోటీసు మాత్రమే జారీ చేశారు. అవేవీ లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్ తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. 5లక్షల క్యూబిక్ మీటర్లు మైనింగ్.... పోట్లదుర్తి బ్రదర్స్ నేతృత్వంలో చేపట్టిన క్రషింగ్ యూనిట్ ద్వారా 5.10లక్షల క్యూబిక్ మీటర్లు స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు యర్రగుంట్ల మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు నిర్ధారించారు. ఇందుకు రూ.21.67కోట్లు అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా ఫిబ్రవరి 27న డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసుకు 90రోజుల లోపు జవాబు ఇవ్వాలి. కానీ 120 రోజులు గడుస్తున్నా పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి జప్తు చేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అటువైపు కన్నెత్తి చూసే సాహాసం చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాటి స్వామిభక్తిని నేటికీ అధికార యంత్రాంగం కొనసాగిస్తుండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా నోటీసు మేరకు ఆర్ఆర్ యాక్టు ప్రయోగించాల్సిన ఆవసరముంది కలెక్టర్ హరికిరణ్ జోక్యం చేసుకుంటే తప్పా పోట్లదుర్తి నాయుడు నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం దక్కే అవకాశం లేదని జిల్లా వాసులు విశ్వసిస్తున్నారు. -
కొండంత అండ! ‘ఘను’డవే!
అధికారం అండగా టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. కొండలు.. గుట్టలు.. దేన్నీ వదల్లేదు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ టీడీపీ నేతకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారు రూ.2కోట్ల పెనాల్టీ విధించారు. ఈ వ్యక్తి పైసా చెల్లించకపోవడం చూస్తే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థమవుతోంది. ఇకపోతే.. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు(మే 18న) మూడు హెక్టార్లలో కొండను తవ్వుకునేందుకు గనుల శాఖ అధికారులు మళ్లీ అనుమతివ్వడం గమనార్హం. ఈ వ్యవహారంలో రూ.50లక్షల దాకా చేతులు మారినట్లు సమాచారం. సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన టీడీపీ నేత ఎం.శ్రీకాంత్‌రెడ్డి ఎస్వీ కన్ట్ర్సక్షన్స్ పేరుతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. తాను చేపట్టే పనులకు రోడ్డు మెటల్ కోసం గత ప్రభుత్వం ఈయనకు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.1505లో ఒక హెక్టారు(2.50 ఎకరాలు)లో అనుమతులు పొందాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎక్కడ రోడ్డు పనులు జరిగినా ఆ పనులను ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. తనకు అనుమతులిచ్చిన ప్రాంతంలో మెటల్ కోసం కొండను పూర్తిగా తవ్వేశాడు. ఆ తర్వాత దక్కించుకున్న రోడ్డు పనులకు పెద్ద మొత్తంలో మెటల్ అవసరం రావడంతో ఆయన కన్ను ఆ పక్కనే ఉన్న కొండపై పడింది. హద్దులు చెరిపేసి సుమారు మరో రెండెకరాల వరకు కొండను ఆక్రమించి పూర్తిగా తవ్వేశాడు. విజిలెన్స్ దాడులతో వెలుగులోకి.. టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి అక్రమ మైనింగ్ విషయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి రావడంతో 2016లో తనిఖీలు చేసి అక్రమ మైనింగ్ నిజమేనని ధ్రువీకరించారు. ఆ మేరకు అప్పట్లో షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ మైనింగ్‌ను మరోసారి పరిశీలించి 1966 ఏపీఎంఎంసీ రూల్ 26(2) ప్రకారం ఆయనకు 2017 ఏప్రిల్ 25వ తేదీన రూ.1,76,96,800 పెనాల్టీ విధించారు. కానీ సదరు టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజిలెన్స్ అధికారులు విధించిన పెనాల్టీ సొమ్ములో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెనాల్టీ విధించిన తర్వాత ఇప్పటికీ.. అంటే పది నెలలుగా మైనింగ్ సాగుతూనే ఉంది. ఈ లెక్కన విజిలెన్స్ అధికారులు తిరిగి సర్వే చేస్తే దోపిడీ రూ.10కోట్లకు పైగానే తేలుతుందని అంచనా. కొండను తవ్వేసిన దృశ్యం మరో క్వారీకి అక్రమ అనుమతి ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు ఎగ్గొట్టిన టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి ఈ మధ్యే జిల్లా గనులశాఖ అధికారులు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.294లో 2.910 హెక్టార్లలో కొండను తవ్వుకోవడానికి అక్రమంగా అనుమతులిచ్చారు. అది కూడా గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు.. అంటే మే 18న గనులశాఖ అనుమతినివ్వడం గమనార్హం. వాస్తవంగా ఆ సర్వే నెంబర్లో రోడ్ మెటల్‌కు అనుమతులివ్వకూడదు. ఎందుకంటే కేవలం మినరల్ శాండ్ కోసం గత చంద్రబాబు ప్రభుత్వమే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ నిబంధనలకు తిలోదకాలివ్వడమే కాకుండా కోట్ల రూపాయల పెనాల్టీని ఎగ్గొట్టిన అదే వ్యక్తికి గనులశాఖ అధికారులు అనుమతులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలాంటి వాటికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనుమతివ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయనకు బదులు గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి ఇవ్వడం కొసమెరుపు. అనుమతులు రద్దు చేస్తాం టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి కదిరి మండలం సైదాపురం పరిధిలో ఇచ్చిన గనుల లీజును తక్షణం రద్దు చేస్తాం. నేను కూడా రెండు నెలల క్రితమే కొత్త బాధ్యతలు తీసుకున్నా. శ్రీకాంత్‌రెడ్డి గతంలో అక్రమ మైనింగ్ విషయంలో ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు చెల్లించాలనే విషయం నా దృష్టికి రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. విషయాన్ని పరిశీలించి కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ, అనంతపురం -
ఆగని బీద బ్రదర్స్ దందా..
సాక్షి, కావలి(కర్నూలు) : అధికారం అండతో బీద సోదరులు ప్రారంభించిన గ్రావెల్ దందాను ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. సొంత అవసరాలకు సామాన్యులు ట్రక్కు గ్రావెల్ తరలిస్తుంటే నానా హంగామా చేసే అధికార యంత్రాంగం బీద సోదరులు నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత మైనింగ్ శాఖాధికారులు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న బీద సోదరుల గ్రావెల్ దందాపై దృష్టి సారించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిత్యం వందల టిప్పర్లతో వెయ్యి ట్రిప్పుల గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఏడాదిన్నరగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. ఒప్పందాల ప్రకారం ఇంకా 15 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ రవాణా చేయాల్సి ఉంది. బీద బద్రర్స్ గ్రావెల్ దందాతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో చిల్లి పడింది. గ్రావెల్ దందా ఒక ఎత్తైతే.. గ్రావెల్ తవ్వకాలు సాగించిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఇసుక తరలించి డంప్‌లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఇందు కోసం గ్రావెల్ గోతుల్లో బోర్లు కూడా వేసుకుని, అన్ని వసతులు సిద్ధం చేసుకున్నారు. మొన్నటి వరకు టీడీపీలో కీలక నేతలుగా చెలామణి అయిన సోదరులు సొంత మండలాన్ని కేంద్రంగా చేసుకుని గ్రావెల్ దందాకు తెర తీశారు. అధికారం అండతో నిబంధనలకు విరుద్ధంగా బీద సోదరులు తమ బినామీల పేర్లతో గ్రావెల్ తవ్వకాల కోసం కొద్ది మొత్తంలో భూములను రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి లీజుకు తీసుకున్నారు. అయితే సుమారు 170 ఎకరాలను ఆక్రమించారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం ఆరడుగుల మేర గ్రావెల్ తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే వంద ఎకరాలకు పైబడి 10 నుంచి 17 అడుగుల మేర లోతులో తవ్వేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు వందల రూ.కోట్ల సీనరైజ్ ఎగ్గొట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. అల్లూరు మండలం నార్త్ ఆములూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏడాదిన్నర నుంచి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర, బీద గిరిధర్ సౌజన్యంతో కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబర్ 349/5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, సర్వే నంబర్ 351/3, 4, సర్వే నంబర్ 350/1, 2, 3, 4, 5, 6, 7, 348/14, 329/1 తదితర సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యమైన గ్రావెల్ ఇక్కడే జిల్లాలోని బిట్రగుంట–గూడూరుల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులను శ్రీనివాస ఇడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) చేస్తోంది. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో గ్రావెల్‌తో నేలను చదును చేయడం అత్యంత కీలకమైన పని. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే రైలు పట్టాలు బిగిస్తారు. అయితే నేలను చదును చేయడానికి అవసరమైన గ్రావెల్ నాణ్యమైనది, జిగురు ఎక్కువ శాతం ఉండేది అవసరం. ఈ లక్షణాలు కలిగిన గ్రావెల్ అల్లూరు మండలం నార్త్ ఆములూరులోని ప్రభుత్వ భూముల్లో ఉంది. ఏడాదిన్నర క్రితం ఈ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన నిర్మాణ సంస్థ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బీద సోదరులను ఆశ్రయించింది. కోట్లాది రూపాయలు చేతులు మారడంతో గ్రావెల్ తవ్వకాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో బిట్రగుంట నుంచి గూడూరు వరకు ఇక్కడ నుంచి గ్రావెల్‌ను మూడో లైన్‌కు నిర్మాణానికి తరలిస్తున్నారు. 50 వేల క్యూబిక్ మీటర్ల వరకే అనుమతి అయితే బీద సోదరులు వివిధ అవసరాల కోసం తమ బినామీల పేర్లతో 110 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. గ్రావెల్ తవ్వకాల కోసం ఇక్కడ పది.. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో 50 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ వంద ఎకరాల్లో ఎంత అవసరమో అంత గ్రావెల్ యథేచ్ఛగా తవ్వకాలు చేసుకుని తరలించుకోవచ్చని నిర్మాణ సంస్థకు అప్పగించారు. వాస్తవానికి 25 లక్షలు క్యూబిక్ మీటర్ల గ్రావెల్ నిర్మాణ సంస్థకు అవసరం కాగా, ఇప్పటి వరకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. 100 టిప్పర్లు, ఐదు పొక్లెయిన్లు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం తవ్వకాలు చేస్తూనే ఉంది. రోజుకు వెయ్యి ట్రిప్పులు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అనుమతించిన ప్రభుత్వ భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు చేసేస్తున్నారు. 10 నుంచి 17 అడుగుల లోతులు వరకు తవ్వకాలు చేసి తరలిస్తున్న గ్రావెల్ వల్ల ఏర్పడిన గోతుల్లో టిప్పర్లు మరమ్మతులు చేసే గ్యారేజ్‌లు, సిబ్బంది విడిది గదులను ఏర్పాటు చేసుకొన్నారు. బోరు పాయింట్‌ను నిర్మించి నీటిని వినియోగించుకొంటున్నారు. సమీపంలో ఉన్న పైడేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి గ్రావెల్ తరలించగా ఏర్పడిన భారీ గోతులనే ఇసుక డిపోలుగా మలుచుకొని నిల్వ చేస్తున్నారు. బీద సోదరులు అండదండలతో ప్రారంభమైన ఈ అక్రమ గ్రావెల్ తరలింపు దందా రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గ్రావెల్ తరలింపు నిర్విరామంగా జరుగుతున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారిక అంచనాల ప్రకారం రూ.300 కోట్లు విలువ చేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తవ్వేసిన గ్రావెల్‌కు సంబంధించి ఇంజినీరింగ్ సంస్థకు జరిమానాలు విధించడంతో పాటు తవ్వకాలను ఆపేయడమా? సీనరైజ్ వసూలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. -
సీఎం రమేష్ బ్రదర్స్...అక్రమాలు అదుర్స్
నిన్న మొన్నటి వరకు జిల్లాలో ఆయనో మోనార్క్. నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు ఆయన మాట ముందు బలాదూర్. తాను చెప్పిందే నిబంధన, సూచించిందే ఆదేశం అన్నట్లుగా సాగింది. ఎంపీ హోదాతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబించారు. ఆయన అండ చూసుకొని సోదరుడు జిల్లాలో ప్రకృతి సంపదను దోచుకోవడం, దాచుకోవడం చేశారు. కొండంత దోపిడీ కొనసాగించారు. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల కేంద్రంగా కోట్లాది రూపాయలు అక్రమార్జన చేపట్టారు. సాక్షి, కడప: పోట్లదుర్తి బ్రదర్స్ ఈ పేరు చెప్పగానే ఎంపీ రమేష్, సురేష్నాయుడుగా జిల్లావాసులు గుర్తుపట్టగలరు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీరు ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పేందే వేదం అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోట్లదుర్తి గ్రామానికి చెందిన జి.చెన్నకేశవనాయడు (సురేష్ నాయుడు బినామీ) పేరుతో 2015లో స్లాబ్‌స్టోన్ మైనింగ్ లీజు ఇప్పించారు. ఆపై ఎలాంటి మైనింగ్ అనుమతులు పొందకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. అందులో లక్షలాది క్యూబిక్ మీటర్లు రాయిని వెలికితీసి, కంకర కొట్టి కోట్లాది రూపాయాలు అక్రమంగా గడించారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. మైనింగ్ లీజుతోనే సరి.... పోట్లదుర్తి గ్రామానికి చెందిన చెన్నకేశవనాయుడు పేరుతో 2015 నుంచి 2025 వరకు స్లాబ్ స్టోన్ నిమిత్తం మైనింగ్ లీజు లభించింది. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్ 242లో 10.11హెక్టార్లలో మైనింగ్ లీజు దక్కింది. అయితే అందులో మైనింగ్ చేసేందుకు కాలుష్యనియంత్రణ మండలి అనుమతి పొందాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తూ పక్కనే క్రషర్ ఏర్పాటు చేసి కంకర కొడుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కాగా 2018 నవంబర్ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నోటీసు జారీ చేశారు. అవేవి లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. అధికారులు నోటీసులతో సరిపెట్టడం మినహా అక్రమ మైనింగ్‌ను నియంత్రించే సాహసం లేయలేకపోయారు. ఈ క్రమంలో అప్పటి అధికార టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఎంపీ రమేష్ క్రషర్‌ను మూయించే చర్యల్లో భాగంగా పరస్పర దాడులు సైతం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. 5లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్.... ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ 5.10లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నిర్ధారణ చేశారు. అందులోభాగంగా రూ.21.67కోట్లు అపరాధ రుసుం వేశారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేయడం, ఆపై 5లక్షల10వేల260 క్యూబిక్ మీటర్ల రాయిని డైనమేట్లు పెట్టి పేల్చి యంత్రాల ద్వారా కొండను పెకళించారు. నిబంధనల మేరకు ప్రభుత్వానికి రూ.21.67కోట్లు చెల్లించాలని మైనింగ్ ఏడీ డిమాండ్ నోటీసును 2019 ఫిబ్రవరి 27న జారీ చేశారు. ఇవేవి పట్టించుకోకుండా పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. ఈవిషయమై మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరణ కోరగా, డిమాండ్ నోటీసు జారీ చేసిన విషయం వాస్తమేనని, అయితే గడువులోపు నిర్వాహకుల స్పందన చూసి తదుపరి ఆర్ఆర్ యాక్టు అమలు చేస్తామని వెల్లడించారు. కలెక్టర్ గారు దృష్టి సారించండి... ఓ వైపు ప్రజాధనం, మరోవైపు ప్రకృతి సంపద ఆధారంగా అక్రమార్జన చేయడంలో పోట్లదుర్తి సోదరులకు పెట్టింది పేరు. ఈక్రమంలోనే పోట్లదుర్తి సమీపంలో పెన్నానది ప్రవాహానికి భూములు కోతకు గురి కాకుండా ఉండేందు ఈఏడాది జనవరి 29న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే మైనర్ ఇరిగేషన్ యంత్రాంగం 2019 ఫిబ్రవరి 1న ప్రొటెక్షన్‌వాల్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. 4.44శాతం అదనంగా సింగిల్ టెండర్‌కు ఎంపీ రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్కు రూ.3.08కోట్లకు అప్పగించారు. ఇవే పనులను పెన్నానదిలో ప్రభుత్వ భూమి అక్రమించిన ప్రాంతానికి ప్రజాధనం వెచ్చించి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. మరోవైపు చిన్నదుద్యాల గ్రామంలో వారి పేరుతో మైనింగ్ లీజు లేకపోయినా ఇప్పటీకీ కొండను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు గుర్తించి దాదాపు రూ.21.67కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన తర్వాత 90రోజులు వరకు గడువు ఉంటుంది ఈలోపు మరింత స్పీడుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నోటీసుతో సరిపెట్టడం మినహా అక్రమమైనింగ్‌కు అడ్డుకునే పరిస్థితి జిల్లా యంత్రాంగంలో కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ హరికిరణ్ ప్రత్యేక చొరవ చూపి అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతోపాటు, అక్రమ మైనింగ్ ద్వారా నిల్వ ఉన్న కంకరను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏమేరకు చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే! -
అక్రమార్కులకు వేసవి ‘బొనాంజ’
సాక్షి, తణుకు : వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మట్టి పేరుతో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. ఒక పక్క అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండగా మరోపక్క ప్రభుత్వానికి ఎలాంటి కన్వర్షన్ ఫీజులు చెల్లించకుండానే పూడికలు చేపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పెద్ద ఎత్తున పొలాలను పూడ్చుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తణుకుతో పాటు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డెల్టాలోని తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు తదితర పట్టణ సమీప ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. జాతీయ రహదారిపై సైతం అపసవ్య దిశలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఏవి? ఇళ్ల స్థలాలకు అనువుగా వరిచేలను లేఅవుట్లుగా మార్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి 3 శాతం రుసుం చెల్లించడంతో పాటు భూమార్పిడి చేయించుకోవాలి. అనంతరం వరిచేలను పూడ్చడానికి మట్టి అవసరం అవుతుంది. చేలల్లో మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వుకోవడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. గనుల శాఖకు రుసుం చెల్లించి అనుమతులు తెచ్చుకుని మట్టితో పూడ్చుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే తణుకు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు అనుకుని ఉన్న భూములను కొబ్బరి ఇతరత్రా పంటలు వేసుకుంటున్నామనే సాకుతో పూడికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు మాత్రమే చెల్లించి మట్టి అనుమతులు తీసుకోకుండా పూడికలు కానిచ్చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధితో పాటు మండలం పరిధిలోని దువ్వ, తేతలి, ముద్దాపురం, మండపాక తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే పూడికలు కానిచ్చేస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖకు చెందిన అధికారులు సైతం మామళ్ల మత్తులో జోగుతూ ఇష్టానుసారం మట్టిని తవ్వుకుంటూ తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వందల ఎకరాల్లో పూడికలు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్లాది రూపాయిల ఫీజులను ఎగ్గొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నియంత్రణ లేని వాహనాలు ఒకపక్క అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్న అక్రమార్కులు వాహనాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లు, లారీల్లో మట్టిని ఎత్తుగా వేసుకుని అతి వేగంగా రహదార్లుపై నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వ జాతీయ రహదారి ఆనుకుని పెద్ద ఎత్తున పూడ్చుతున్న నిర్వాహకులు వాహనాలను ఇష్టానురీతిగా నడుపుతున్నారు. జాతీయ రహదారి నుంచి వరిచేలల్లోకి సబ్ రోడ్లు నిర్మించేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గమనించకుండానే మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు ఒక్కసారిగా హైవేపైకి దూసుకువస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు డ్రైవర్లు సైతం చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సినిమా పాటలు వింటూ రోడ్డుపై వెళ్లే వారికి దారి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు డ్రైవర్లకు కనీసం లైసెన్సులు లేకపోగా ఒక్కో వాహనంలో మైనర్లే డ్రైవింగ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి సక్రమంగా అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించేలా అధకారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు తప్పనిసరి మట్టి పూడిక చేసినా లేక పొలాల్లోని మట్టిని తవ్వి తరలించుకోవాలనుకున్నా గనుల శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు సాగించాలి. – ఎల్.శివకుమార్, తహసీల్దార్, తణుకు -
ఇసుకాసురులకు ముఖ్య నేత అండ!
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి.. అడ్డగోలుగా, అక్రమంగా ఇసుకను తవ్వేసి వేలాది కోట్ల రూపాయాలు దోచుకున్న ఇసుక స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. పర్యావరణానికి విఘాతం కలిగించిన ఇసుక స్మగ్లర్ల నుంచి నెలలోగా రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేసి.. డిపాజిట్ చేయాలని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) ఈనెల 4న ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి సిద్ధమైన గనుల శాఖ అధికారులపై ముఖ్య నేత కన్నెర్ర చేశారు. ప్రకాశం బ్యారేజీలో పూడిక తీత పేరుతో డ్రెడ్జింగ్ చేయకుండా, భారీ ప్రొక్లెయిన్లను రంగంలోకి దించి.. కృష్ణా నదీ గర్భాన్ని దాదాపు 37 రీచ్‌లలో అడ్డగోలుగా తవ్వేసిన వ్యవహారంలో ముఖ్య నేత పాత్రపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ఎనిమిది రీచ్‌లలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వించారు. కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి.. వేలాది కోట్ల రూపాయాలను దోచేయడంలో ముఖ్య నేతకు వాటాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా తరలించడంపై రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్, తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోనీ, రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ తరఫున అనుమోలు గాంధీ, బొలిశెట్టి సత్యనారాయణ గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖనే పిటిషన్‌గా పరిగించిన ఎన్జీటీ కేసును విచారించింది. సీఎం అధికారిక నివాసానికి కూత వేటు దూరంలో భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను వ్యతిరేకించినందుకు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు తమపై దాడులకు పాల్పడ్డారని ఎన్జీటీకి వివరించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి, స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇసుక దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ స్వరూపం దెబ్బతిందని, గట్లు బలహీన పడ్డాయని, పర్యావరణానికి విఘాతం కలిగిందని వివరించారు. ఈ వ్యవహారంపై నిశితంగా అధ్యయనం చేసి.. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)ని గత ఏడాది డిసెంబర్ 21న ఎన్జీటీ ఆదేశించింది. దోపిడీకి అద్దం పట్టిన నివేదిక ఎన్జీటీ ఆదేశాల మేరకు సీపీసీబీ, ఏపీపీసీబీ అధికారుల బృందం జనవరి 17, 18 తేదీల్లో సీఎం అధికారిక నివాసానికి సమీపంలోని కృష్ణా నదిలో పెనుమాక, వెంకటపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం(ఫెర్రీ) ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేసింది. ఆయా రీచ్‌లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తేల్చింది. ఎనిమిది రీచ్‌లలో రోజుకు 2,500 ట్రక్కుల ద్వారా దాదాపు 34,650 టన్నుల ఇసుకను తవ్వేసి.. రవాణా చేస్తున్నట్లు తేల్చింది. నదీ గర్భంలో 25 అడుగుల లోతు వరకూ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని.. మర పడవల ద్వారా ఇసుకను ఒడ్డుకు తరలిస్తున్నారని వెల్లడించింది. ఇసుక తవ్వకాలు ఏడాది పొడవునా జరుగుతున్నాయని తెలిపింది. మర పడవల్లోని డీజిల్ ఇంజిన్ల కారణంగా చమురు నదిలోకి వెళ్లి కాలుష్యం ఏర్పడుతోందని, భారీ ట్రక్కుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని నివేదించింది. తాము తనిఖీ చేసిన 8 ఇసుక రీచ్‌లలో ఐదింటిలో మాత్రమే బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ అనే సంస్థ రూపొందించిన యాప్ ద్వారా ట్రక్కుల వివరాలు నమోదు చేస్తున్నారని, మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి నమోదూ చేయడం లేదని తేల్చింది. లింగాయపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా చేపట్టిన అక్రమ తవ్వకాలపై ఎలాంటి డేటా అందుబాటులో లేదని వివరించింది. ఇబ్రహీంపట్నంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని, వందలాది మర బోట్లు, వాహనాల ద్వారా ఇసుక రవాణా జరుగుతోందని నివేదించింది. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.071 టీఎంసీలు మాత్రమేనని.. భారీగా ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే భవానీ ద్వీపం వంటి ద్వీపాలు దెబ్బతిన్నాయని, నది గట్లు బలహీననడ్డాయని, భూగర్భ జలాలు క్షారయుతంగా మారాయని, నది స్వరూపం పూర్తిగా దెబ్బతినిందని, ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎన్జీటీకి నివేదించాయి. ఈ నివేదికతో పూర్తిగా ఏకీభవించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్ల నుంచి రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేసి, నెల రోజుల్లోగా తమ వద్ద డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవాస్తవాలతో అక్రమాలను కప్పిపెట్టే ఎత్తు ఎన్జీటీ ఇచ్చిన తీర్పు టీడీపీ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. ఇసుక స్మగ్లర్లకు జరిమానా విధిస్తూ.. నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన గనుల శాఖ ఉన్నతాధికారులపై ముఖ్య నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్జీటీ తీర్పును అమలు చేస్తే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అదే జరిగితే తన వాటాల బాగోతం బట్టబయలు అవుతుందని భావించి ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారంఫిటిషన్ దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ప్రకాశం బ్యారేజీలో పూడిక తీసిన ఇసుకను తరలిస్తున్నారే తప్ప ఎక్కడా అక్రమంగా ఇసుకను తవ్వలేదని, తమ వాదనను వినకుండా ఎన్జీటీ ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేలా గనుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి పిటిషన్ వేశారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీలో పూడికతీత పరిమాణం చాలా తక్కువ. అయితే ఆ పూడిక తీత ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నదీ గర్భాన్ని చిద్రం చేసి వేలాది కోట్ల రూపాయాలు కొల్లగొట్టారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సర్కారు అవలంభిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎమ్మెల్యే రాజు అక్రమార్క
వరసగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించిన చోడవరం ప్రజలకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు చేసిందేంట్రా బాబు అంటే.. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అట్టడుగు స్థానంలో నిలిపి, అవినీతి, అక్రమాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లడం. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు పొంది గ్రానైట్ గనులను ఎమ్మెల్యే అండ్ కో దోచుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా రాజు గనులకు ఎసరు పెడుతుంటే.. ఆయన అనుచరగణం అందినకాడికి దోచుకోవడంలో ఆరితేరిపోయారు. ఇసుక, మట్టి, కంకర, గ్రావెల్ ఇలా అన్నింటిని చెరబట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరు చెప్పి పర్సంజేట్లు, మామూళ్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్వయంభూ విఘ్నేశ్వరుడు వెలసిన ఆధ్యాత్మిక ప్రాంతం.. ఎందరో రైతులు, కార్మికుల బతుకుల్లో తీపిని పంచుతున్న గోవాడ సుగర్స్.. విస్తరాకుల తయారు చేయడంలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కొత్తకోట.. శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, వరాహా నదుల ప్రవాహం... మెట్ట.. మాగాణి ఆయకట్టు కలగలిసిన ప్రాంతం ‘చోడవరం’. అలాంటి ఈ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో వేసిన సీసీ రోడ్లు తప్పితే ఐదేళ్ల టీడీపీలో పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. అంతెందుకు నదులన్నీ ఈ నియోజకవర్గంలోనే ప్రవహిస్తున్నా.. నాలుగో వంతు పంచాయతీలకు గుక్కెడు మంచి నీళ్లు దొరకని దుస్థితి ఉంది. ప్రజలు.. తమ బాగోగులు చూస్తారని అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా అంటే.. కనిపించిన కొండను పిండి చేయడం, తద్వారా కోట్లు వెనుకేసుకోవడం, ప్రభుత్వ భూమల ఆక్రమణలో ఆరితేరిన అనుచరగణానికి అండగా నిలవడం.. ఇసుక అక్రమ వ్యాపారాల్లో దండుకోవడం.. ఇలా అవినీతిలో రా‘రాజు’గా వెలుగొందుతున్నారు. – సాక్షి టాస్క్‌ఫోర్స్ ‘రాజు’ గారి గుప్పిట్లో గనులు జిల్లాలో గ్రానైట్ కింగ్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు చోడవరం ఎమ్మెల్యే రాజుదే. ఎక్కడైనా కొండ కనిపిస్తే చాలు ఒక బిడ్ వేసి ఆ కొండను పిండి చేసి కోట్లు ఎలా కూడబెట్టాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని సొంత పార్టీ నాయకులే చెబుతుంటారు. సొంత సర్వేయర్లతో సర్వే చేయిస్తారు. విలువైన గ్రానైట్ ఉన్నట్టయితే ఓ దరఖాస్తు పడేస్తారు. ఆ తర్వాత ఎవరైనా దరఖాస్తు చేస్తే మొదట దరఖాస్తు చేసుకున్న వారికే క్వారీ లీజు అనుమతులు కేటాయించాలన్న గనుల శాఖ నిబంధన మేరకు ఈయన దరఖాస్తు తెరపైకి వస్తుంది. ఆ సమయంలో గుడ్‌విల్‌గా కొంతసొమ్ము తీసుకుని తాను సిఫార్సు చేసిన వారికి లీజు హక్కులు దక్కేలా చక్రం తిప్పుతారు. ఇంకా మంచి గ్రానైట్ పడితే అక్కడ స్లీపింగ్ పార్టనర్‌గా ఉంటారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో గ్రానైట్ కొండలను వెలుగులోకి తీసుకు రావడమే కాదు వాటిని తానే సొంతం చేసుకుని దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా వరసగా రెండు సార్లు ఎన్నికయినప్పటికీ కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాజకీయ పలుకుబడితో పలు గ్రానైట్ క్వారీలకు లీజులు సంపాదించుకున్నారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈయన క్వారీ సామ్రాజ్యానికి అడ్డులేకుండా పోయింది. మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాల్లోనూ, మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కొన్ని తన పేరిట, మరికొన్ని బినామీల పేరిట ఎమ్మెల్యే రాజుకు క్వారీలు ఉన్నట్టుగా ఆయన అనుచరులే చెబుతున్నారు. తవ్వకాలకు అడ్డు చెబితే బెదిరింపులే.. తక్కువ హెక్టార్లకు లీజు పొంది రెట్టింపు విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వేసి అడ్డంగా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అడ్డు తిరిగిన రైతులను, గ్రామస్తులను తన అధికార బలంతో భయబ్రాంతులకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. తన పేరున ఉన్న ఎరుకవాడ క్వారీ వద్ద ఇలాంటి సంఘటనే జరిగింది. తమ క్వారీకి ఆనుకుని ఉన్న రైతుల పొలాలను లీజుకు తీసుకోవాలని భావించి తక్కువ ధరను ఇవ్వచూపారు. దీనికి వారు నిరాకరించారు. క్వారీలో జరిగే బ్లాస్టింగ్లు కారణంగా రాళ్లు దిగువన ఉన్న పొలాల్లోకి వచ్చి పడి పంటలు నష్టపోతుండటంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన కూడా చేశారు. ఆ రైతులను తన అధికారంతో కొంత ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరికీ తెలుసు. ఈ క్వారీని నెలకు రూ.లక్ష చొప్పున గుడ్‌విల్ కింద వేరొకిరి ఇచ్చేశారు. వమ్మలి జగన్నాథపురంలో ఉరలోవ కొండ గ్రానైట్ క్వారీలో ఎమ్మెల్యేకు ప్రధాన భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఈ క్వారీ చుట్టు పక్కల ఉన్న రైతుల భూములను తక్కువ ధరకే దక్కించుకుని తన బినామీదారుల పేరున పెట్టారు. క్వారీకి రోడ్డు వేసేందుకు కొందరు భూములను ఇవ్వాలని కోరగా వారు అంగీకరించకపోవడంతో అధికారంతో వారిని బెదిరించి రోడ్డు వేయించారు. ఇక్కడ 15 హెక్టార్లకు లీజు అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు 25 హెక్టార్లకు పైనే అక్రమంగా క్వారీ చేసి రూ.లక్షలు సంపాదించినట్టు తెలిసింది. రావికమతం మండలంలో ఇటీవల మరుపాక కొండ వేరొకరి పేరున క్వారీకి లీజు వేయించిన ఎమ్మెల్యే స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులు ఆందోళనకు దిగి గొడవ చేయడంతో తాత్కాలికంగా క్వారీ తవ్వకాలు ఆపారు. అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే.. టి.అర్జాపురం, డోలన్నపాలెం, అజయ్పురం, జెడ్.బెన్నవరం క్వారీలకు వేరొకరి పేరున లీజులు వేయించి చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి రూ.లక్షలు తీసుకుని అమ్మేసుకున్నట్టు సమాచారం. తోటకూరపాలెం, గుడ్డిప క్వారీల్లో ఎమ్మెల్యేకు కొంత భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. ఈ క్వారీలకు చుట్టూ భూములు లీజుకు తీసుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే సహకారం అందించినట్టు సమాచారం. కొట్నాబిల్లి గ్రానైట్ క్వారీ తన కుటుంబ సభ్యుల పేరున కొంత కాలం నిర్వహించి, తర్వాత స్లీపింగ్ పార్టనర్‌గా వేరొకరికి లీజు అనుమతులు అమ్మేశారు. ఈ వ్యవహారంలో కొంత డబ్బు గుడ్‌విల్‌గా కూడా తీసుకున్నట్టు తెలిసింది. కోటవురట్ల సమీపంలో కూడా ఈయనకు క్వారీ ఉంది. అంతే కాకుండా ఇతర జిల్లాలో కూడా కొన్ని క్వారీలు ఈయన సొంతంగానూ, బినామీల పేరున నిర్వహిస్తున్నట్టు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈయన వ్యాపారానికి మరింత అడ్డులేకుండా పోయింది. గ్రానైట్ క్వారీలకు అడ్డు వచ్చే వారిని తన అధికారంతో ఎలా ఇబ్బందులుపెడుతున్నారో గతంలో ఆయా క్వారీల వద్ద ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. గ్రానైట్, క్వార్జ్, ఇతర గనుల క్వారీ వ్యాపారం చేసే యజమానులందరూ వడ్డాది కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి రాజకీయంగా అండగా ఉంటూ గనుల దోపిడీలో ఈయన కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పనుల్లో దోపిడీ ప్రధానంగా సాగునీటి చెరువు, పంట కాలువల్లో పూడికలు తీయడం, అవసరమైన చోట స్లూయీస్‌లు, మదుంలు నిర్మించడం వంటి పనులను నీరు చెట్టు నిధులతో చేశారు. నియోజకవర్గంలో సుమారు రూ.15 కోట్లతో నామినేటెడ్ పద్ధతిలో నీరు–చెట్టు పథకంలో పనులు చేశారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూడికలు తీసిన చెరువుల్లోనే మరలా నీరు–చెట్ల నిధులతో యంత్రాలను ఉపయోగించి అరకొరగా పూడికలు తీసి, దాదాపు రూ.5 కోట్ల దోపిడీకి పాల్ప డ్డారు. ఉదాహరణకు నర్సాపురంలో ఒకే చెరువుకు మూడుసార్లు పూడికలు తీసినట్టు చూపించించి టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు సత్యనారాయణ సుమారు రూ.20 లక్షల మేర నిధులు పక్కదారి పట్టించారు. కొన్ని చెరువులకు కట్టిన స్లూయీస్‌లు, మదుంలు వర్షాలకు వెంటనే కొట్టుకుపోవడంతో ఈ పనుల్లో నాణ్యతా లోపం బట్టబయలైంది. సీనరేజ్ కట్టకుండానే చెరువుల్లో తీసిన మట్టిని అమ్మడం ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర అక్రమంగా కొందరు టీడీపీ నాయకులు సంపాదించుకున్నారు. ప్రభుత్వ జాగా.. వేసేయ్ పాగా.. చోడవరం మండలంలో వెంకన్నపాలెం, గంథవరం, రాయపురాజుపేట, శీమునా పల్లి, ఖండిపల్లి, చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం, చోడవరం, బెన్నవోలు, అంబేరుపురం, ముద్దుర్తి, దుడ్డుపాలెం, నర్సయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో ప్రభుత్వ బంజరు, కొండ పోరంబోకు భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు. 2004 నుంచి ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాల్లో అక్రమంగా డీ ఫారం పట్టాలు పొందారు. వెంకన్నపాలెం రెవెన్యూ పరిధిలో 432, 436 సర్వే నంబర్లలో సుమారు 317 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉండగా టీడీపీ నాయకులే సుమారు 70ఎకరాల మేర సీఎల్డీపీ పథకంలో అక్రమంగా భూ పట్టాలు పొందారు. విషయం ఏమిటంటే.. ఇక్కడ సాగులో ఉన్న వెంకన్నపాలేనికి చెందిన రైతులకు ఈ భూములపై హక్కులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యే సహకారంతో ఇతర ప్రాంతానికి చెందిన మోతుబరులైన టీడీపీ నాయకులకు డీ ఫారం పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఒకే చోట 500 ఎకరాలకు పైబడి బంజరు భూమి ఉండటంతో దొరికిన కాడికి ఆక్రమించుకుని ఎవరికి వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఈ పట్టాలన్నీ రద్దు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదన కూడా పెట్టారు. ఉదాహరణలివిగో... వెంకన్నపాలెం రెవెన్యూలో సర్వే నం.432లో కొండ బంజరులో టీడీపీ నాయకుడు, మా జీ వైస్ ఎంపీపీ ఉరుకుటి పెదరాము నాయుడు 5 ఎకరాలు ఆక్రమించి, మామిడి, జీడిమామిడి, యూకలిఫ్టస్ మొక్కలు వేసి సాగు చేస్తున్నారు. మరో 2 ఎకరాలకు ఆయన భార్య కాంతమ్మ పేరున డీ ఫారం పొందారు. పక్కనే ఉన్న మరో 3 ఎకరాలను కూడా ఆక్రమించేసుకున్నారు. వీటి విలువ అరకోటి పైమాటే. సబ్బవరం రోడ్డులో 530, 531 సర్వే నంబర్లలో రూ.3కోట్ల విలువైన సుమారు 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ స్థానిక నాయకుడు, మాజీ సర్పంచ్ బూరా వెంకటరమణ, ఆయన అనుచరులు కలిసి ఆక్రమించుకున్నారు. ఈ భూమిని అనకాపల్లి, చౌడువాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు రియల్టర్ల్లకు అమ్మేశారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో వారు సర్వే చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ ఆక్రమణలు ఆగలేదు. చోడవరం మండలంలో రూ.15 కోట్ల విలు వైన 120 ఎకరాలు ఆక్రమణలకు గురి కాగా, బుచ్చెయ్యపేట మండలంలో రూ.25 కోట్లు, రావికమతంలో రూ.30కోట్ల విలువైన బంజరు భూములు టీడీపీ నేతల చెరలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. రూ.8 కోట్ల తడిసిన పంచదార గోల్మాల్ గోవాడ సుగర్స్‌లో రూ.8 కోట్ల గోల్మాల్ వ్యవహారంలో టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే కుడిభుజంగా ఉన్న ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు రూ.లక్షలు దోచుకున్నారనే ఆరోపణ ఉంది. హుద్‌హుద్ సమయంలో అధికార టీడీపీకి చెందిన చైర్మన్ గూనూరు మల్లు నాయుడు ఆధ్వర్యంలో పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు సహకారంతో తడిసిన పంచదార అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగింది. దీనిపై రైతులు, అఖిలపక్షాలు ఆందోళనలు చేయడం, అప్పటి ఎండీతో పాటు 6 గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాని ఫ్యాక్టరీలో ఏ పని జరిగిన అది చైర్మన్ దృష్టిలో లేకుండా, ఆయన నిర్ణయం లేకుండా జరగదు. అధికార పార్టీకి చెందిన పాలకవర్గం కావడంతో చైర్మన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా అవసరం లేక పోయిన కాంట్రాక్టు పద్ధతిలో టీడీపీ కార్యకర్తలను చైర్మన్, ఎమ్మెల్యే అనుచరులను గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలో చైర్మన్ రూ.లక్షలు దండుకున్నారు. పాలకవర్గం వచ్చాక విజ్ఞాన, విహార యాత్రలు పేరుతో కొంత, అవసరానికి మించి ఓవరాయిలింగ్ పనులకు అదనపు దుబారా ఖర్చులు చేసి భారీగా చైర్మన్ కమీషన్లు తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, వ్యాపారం శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా నదుల్లో ఇసుక అక్రమ వ్యాపారం వెనుక టీడీపీ నాయకులు ఉన్నారు. తన సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఈ వ్యాపారానికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏటా సుమారు రూ.4 కోట్ల మేర ఇక్కడ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన ఇసుక లారీలు, ట్రాక్టర్లు పట్టుకుంటే వెంటనే ఎమ్మెల్యేనే నేరుగా ఫోన్లు చేసి విడిపించడంతో పోలీసు, రెవెన్యూ, మైన్స్ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చోడవరం జెడ్పీటీసీ సభ్యుడు మత్స్యరాజు కుటుంబసభ్యులతోపాటు గోవాడ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, జుత్తాడ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పల్లా అర్జున, సింహాద్రిపురానికి చెందిన టీడీపీ నాయకుడు, గవరవరం సర్పంచ్ చప్పగడ్డ అప్పలనాయుడు, దుడ్డుపాలేనికి చెందిన కొందరు ఇసుక మాఫియా సభ్యులు, లక్ష్మీపురం, భోగాపురం, విజయరామరాజుపేట, వడ్డాది, రావికమతం, కరక ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల భూములనూ వదల్లేదు రావికమతం మండలంలో ఆక్రమణల్లో ఎక్కువ మేర భూములు కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములే. ఇవన్నీ ఆయా గ్రామాల్లోని నిరుపేద గిరిజన, దళిత మహిళల వద్దే ఉన్నాయి. అయితే కొత్తకోట గ్రామంలో సర్వే నంబర్ 244–2 ఏ లోనూ, 219లో 8సెంట్ల గ్రామ కంఠం భూములు మాత్రం వాస్తవంగా శారద మహిళా మండలి పేరుతోనూ, శ్రీ సీతారామ యువజన సంఘం పేరుతో పట్టాలున్నాయి. ఇవి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెల్లంకి మోదినాయుడు చేతిలో ఉన్నాయి. పి.పొన్నవోలు రెవెన్యూలో 400 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డ బొట్టా సూర్యారావు కుటుంబ సభ్యుల పేరున, విశాఖకు చెందిన బడా వ్యాపారులు చేతుల్లో బినామీ పేర్లతో ఉండగా, కొత్తకోట గ్రామకంఠం భూముల్లో శారద మహిళా మండలి భవనం, దాని పక్కనే సుమారు రూ.40 లక్షలు విలువైన 4 సెంట్ల స్థలం, వెల్లంకి వారి రామకోవెల వద్ద శ్రీ సీతారామ యువజన సేవా సంఘం పేరుతో విలువైన భూమి టీడీపీ నాయకుడి చేతిలో ఉన్నాయి. నీరు–చెట్టు నిధులు దోచుకున్నారు నర్సాపురం గ్రామంలో చెరువును పూడికలు తీయకుండానే తీసినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి గ్రామ జన్మభూమి కమిటీ ప్రతినిధులైన టీడీపీ నాయకులు రూ.15 లక్షల వరకు నిధులు దోచుకున్నారు. ఒకే చెరువుకు మూడుసార్లు పని చేసినట్టుగా చూపించడంతోపాటు గతంలో ఎన్ఆర్జీఎస్ పనులు చేసిన చెరువులోనే నీరుచెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకున్నారు. వీరికి ఎమ్మెల్యే మద్దతు పలకడంతో అధికారులెవ్వరూ చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ విషయమై గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. – దొడ్డి హనుమంతు, నర్సాపురం, చోడవరం మండలం -
తిరుపతి: అడపారెడ్డిపల్లిలో అక్రమ మైనింగ్
-
తిరుపతిలో రెచ్చిపోయిన టీడీపీ మైనింగ్ మాఫియా
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో టీడీపీకి చెందిన గ్రానైట్ మాఫియా రెచ్చిపోయింది. తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డి పల్లె వద్ద టీడీపీ నేత మేఘనాథనాయుడుకు చెందిన అక్రమ మైనింగ్‌ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేఘనాథనాయుడు తన అనుచరులతో గ్రామస్తులపై కత్తులతో దాడి చేయించాడు. ఈ దాడిలో సురేంద్రరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా టీడీపీ నేత అనుచరులు తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఎంఆర్‌పల్లి ఎస్ఐకు గాయాలయ్యాయి. అయితే తనపై దాడి జరిగనప్పటికీ.. ఎస్సై ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఇంటికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. -
అక్రమ మైనింగ్‌కు అడ్డాగా కొత్తగూడెం జిల్లా
-
ప్రాణాలతో లేకున్నా.. కనీసం శవాలనైనా తీసుకురండి!
వాళ్లంతా నిరుపేదలు... మూటలు మోస్తూ, రిక్షా తొక్కుతూ జీవనం సాగించే సాధారణ కూలీలు... రోజంతా కష్టపడినా వంద రూపాయలకు మించి సంపాదించలేరు... అటువంటి అసహాయులకు ఒక్కరోజు కష్టానికే రూ. 2 వేల వేతనం చెల్లిస్తానంటూ ఆశ చూపాడో ఓ వ్యాపారి. అతడి మాటలు నమ్మిన ఆ బడుగు జీవులు తమ బతుకులు బాగుపడతాయని భావించారే తప్ప... తమ జీవితాలు ఇరుకైన ర్యాట్‌హోల్‌లో చిక్కుకొని ‘నీళ్ల’పాలు అవుతాయని ఊహించలేకపోయారు. 21 రోజులైనా సదరు బొగ్గు కార్మికుల జాడను కనుక్కోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలిస్తే... ప్రాణాలతో కాకపోయినా సరే వారి చివరిచూపు దక్కినా తమకు కాస్త ఊరటగా ఉంటుందంటూ బాధితుల కుటుంబాలు రోదిస్తున్న తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తోంది. జాడ ఇంకా తెలియరాలేదు మేఘాలయలోని జయంతియా కొండల్లోని తవ్వుతున్న అక్రమ గనిలో బొగ్గు వెలికి తీసేందుకు వెళ్లి గల్లంతైన 15 మంది కార్మికుల కోసం... 15 మంది గజ ఈతగాళ్ల బృందం, 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు(నీటిని తోడే యంత్రాలు) అక్కడికి చేరుకుని ఇప్పటికి దాదాపు వారం రోజులైంది. అయినప్పటికీ వారి జాడ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. నేటివరకు (బుధవారం) ఆరుగంటలకోసారి 7.20 లక్షల లీటర్ల నీటిని తోడుతున్నామని రక్షణా బృందాల అధికార ప్రతినిధి తెలిపారు. గనిలో ఎండిపోయిన చెక్క నిర్మాణాలు అడ్డుగా ఉండటం వలన ఈతగాళ్లకు ఆటంకం కలుగుతోందని.. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కోల్ ఇండియాకు చెందిన శక్తిమంతమైన సబ్మెర్సిబుల్ పంపులు అందుబాటులోకి తెచ్చి నిమిషానికి 500 గ్యాలన్ల చొప్పున నీటిని తోడి సహాయక చర్యలు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులు.. యథావిధిగా అక్రమాలు జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ వాటా పది శాతం. చాలా ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ వ్యాపారులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉండటంతో.. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగు(ర్యాట్‌హోల్స్)ను పోలిన గుంతను నిలువుగా తవ్వుతారు. బొగ్గు కనిపించాక అక్కడి నుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల నదులు పొంగినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరులో గనిలోకి భారీగా నీరు చేరడంతో.. అందులోకి దిగిన 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు గానీ 15మంది మాత్రం చిక్కుకు పోయారు. శవాలు దొరికినా చాలు.. ప్రస్తుతం గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆ అక్రమ గనిలో ఇరుక్కున్న తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ... ‘ ఆ గనికి చెందిన సర్దార్ నా కుమారుడు(18), సోదరుడు(35), అల్లుడి(26)కి పని ఇప్పిస్తానని చెప్పాడు. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల కూలీ వస్తుందని ఆశ చూపాడు. దాంతో వాళ్లు ఆ గనిలోకి దిగారు. ఐదురోజులపాటు అక్కడ పనిచేశారు. సురక్షితంగానే ఉన్నారు. కానీ ఆరో రోజు (డిసెంబరు 13) పనికి వెళ్లిన ఆ ముగ్గురు ఇంతవరకు తిరిగి రాలేదు. నా భార్య, కూతురు, ముగ్గురు మనుమలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదు’ అంటూ షోహర్ అలీ అనే వ్యక్తి తన కుటుంబ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కిరాయిలకు ఇళ్లు చూపించి రోజుకు 200 రూపాయలు సంపాదించే నేను.. 500 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్లు చిక్కుకున్న ఆ గని దగ్గరికి ఎలా వెళ్లగలను. నా దగ్గర ప్రస్తుతం మా అందరి తిండి ఖర్చులకు మాత్రమే డబ్బులు ఉన్నాయంటూ తన దీనస్థితిని మీడియాకు వెల్లడించాడు. క్రిష్ణ లింబూ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘మా బావ కూడా ఆ మృత్యు కుహరంలో చిక్కుకున్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప అతడు బతికి ఉండే అవకాశమే లేదు. అయితే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు శవం దొరికినా చాలు. బాధిత కుటుంబాలకు వారి కొడుకులు, మనుమలు, భర్త, తండ్రి, సోదరుల కడసారి చూపైనా దక్కాలి కదా’ అంటూ ఆవేదన వెళ్లగక్కాడు. మైనింగ్ మాఫియా ధన దాహానికి వీరి కన్నీటి గాథ తాజా ఉదాహరణ మాత్రమే. ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కారణంగా వేలాది మంది కార్మికులు(ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం), నిజాయితీపరులైన కొంతమంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎంతో బలవంతులైన మైనింగ్ మాఫియాను కట్టడి చేయాలని భావిస్తే రాజకీయంగా ముప్పు ఏర్పడుతుందనే భయంతో గత ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వెనకుడుగు వేయడంతోనే అక్రమ వ్యాపారుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏదేమైనా ప్రభుత్వ వైఫల్యం, ఆకలి కష్టాలు వెరసి ఎంతోమంది కార్మికులు వీరి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం మరింత విచారకరం. ప్రస్తుతానికైతే... ఏదో ఒక అద్భుతం జరిగి ఈ ర్యాట్‌హోల్‌లో బంధీలుగా ఉన్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం. -
మృత్యు కుహరంలో...
ఊరూ పేరులేని...తమకంటూ ఎలాంటి గుర్తింపూ లేని నిర్భాగ్యులు గత పక్షం రోజులుగా మేఘా లయలోని జయంతియా కొండల్లో తవ్వుతున్న అక్రమ గనిలో చిక్కుకున్న తీరు మన ప్రభుత్వాల సమర్థతను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఆ అక్రమ గనిలో ప్రమాదం ముంచుకొచ్చే సమయానికి ఎందరు న్నారో, వారిలో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ గని నిర్వాహకుడు చెబుతున్న ప్రకారమైతే 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు. 15మంది చిక్కుకు పోయారు. అక్రమ గనికి సమీపంలో ప్రవహించే లీతీన్ నది ఉప్పొంగి ఆ నీరంతా అందులోకి చేరిం దని అంటున్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, మైనింగ్ పనిలో పాల్గొనేవారికి అవసరమైన రక్షణ ఉపకరణాలేవీ ఇవ్వకుండా అధికారుల అండతో సాగిస్తున్న ఈ దుర్మార్గం గురించి పర్యావరణవా దులు ఎన్నో ఏళ్లనుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే పోయాయి. కనీసం వారి పిటిషన్లలో ఏముందో చదివి ఉన్నా ఇప్పుడు జరిగిన ప్రమాద తీవ్రత తెలిసేది. నీళ్లు తోడటానికి పక్షం రోజులుగా వినియోగిస్తున్న పంప్సెట్లు పనికిరావని ఇన్నాళ్లకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది. ఆపరేషనంతా పూర్తయ్యేసరికి ప్రమా దంలో చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉంటారా అన్నది అనుమానమే. మేఘాలయలో ఉన్న బొగ్గు నిక్షేపాల పరిమాణం 64 కోట్ల టన్నులకు మించి ఉంటుందని చెబుతున్నారు. జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఆ రాష్ట్రం వాటా పది శాతం. మొన్నటి వరకూ మేఘా లయ ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ మైనింగ్ ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అక్రమ మైనింగ్ యధావిధిగా సాగుతోంది. మేఘాలయలో బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగును పోలి ఉండేలా నిలువుగా తవ్వుతారు. బొగ్గు తారసపడ్డాక అక్కడినుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ విధానం అశాస్త్రీయమైనదని, దీనివల్ల బొగ్గు వెలికి తీసేవారి ప్రాణాలకు ముప్పు కలగడంతోపాటు పర్యావరణం కూడా నాశనమవుతుందని పర్యావ రణవాదులు వాదిస్తున్నారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల వరద ముంచెత్తినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. 2007–14 మధ్య వీటిలో దాదాపు 15,000మంది మరణించి ఉంటారని ఇంపల్స్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జయంతియా కొండలపై కురిసే వర్షాల వల్ల ఏర్పడ్డ నదులు క్షీణదశకు చేరుకుంటున్నాయి. ఎక్కడి కక్కడ గనుల్లో నీరు నిల్వ ఉండిపోవడమే ఇందుకు కారణం. పైగా వెలికి తీసిన బొగ్గును బయటే వదిలేయడం వల్ల నదీ జలాల్లో ఆమ్లాలు అధికమై అవి తాగడానికి, పంటలకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. జనం ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇన్ని ప్రమాదాలు ఇమిడి ఉన్న మైనింగ్ చుట్టూ రాజకీయాలు పరిభ్రమించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్పీపీ–బీజేపీ కూటమిలోని పార్టీలు, గతంలో రాష్ట్రాన్నేలిన కాంగ్రెస్ కూడా మైనింగ్ యజమానులకు మద్దతుగానే నిలబడ్డాయి. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినవారిలో 30శాతంమంది గనుల యజమానులే. ఎన్జీటీ ఉత్తర్వుల వల్ల తమ జీవనాధారం దెబ్బతిన్నదని, వీటిని వెనక్కు తీసుకోవాలని మైనింగ్ యజమానులు ఉద్యమిస్తే అన్ని పార్టీలు వత్తాసు పలికాయి. పర్యావరణానికి మేం ఒక్కరమే హాని కలిగిస్తున్నామా అన్నది మైనింగ్ యజమానుల ప్రధాన ప్రశ్న! ఎన్జీటీ నిషేధాన్ని ఎత్తేయించడానికి మొన్న ఫిబ్రవరి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అప్పటి ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం వల్లే కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైం దని చెబుతారు. తాము అధికారంలోకొస్తే 8 నెలల్లో దీన్ని పరిష్కరిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. ఆతర్వాత ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంత్రులతో ఒక కమిటీని కూడా నియమిం చారు. అదెంతవరకూ వచ్చిందోగానీ ఈలోగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వెలికి తీసిన బొగ్గు నిల్వల్ని అమ్మడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనుమతుల్ని వచ్చే జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. కానీ మైనింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా సాగిపోతూనే ఉన్నాయి. వాటి జోలికి పోతే రాజకీయంగా ముప్పు కలుగుతుందని పార్టీలన్నీ భయపడటంతో అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. బొగ్గు మాఫియా ఎంత బలంగా పనిచేస్తున్నదో చెప్పడానికి 2015 లో జరిగిన ఎస్ఐ హత్యే ఉదాహరణ. చట్టవిరుద్ధంగా తరలుతున్న 32 బొగ్గు లారీలను పట్టుకున్నం దుకు మర్బనియాంగ్ అనే ఎస్ఐని మాఫియా కొట్టి చంపితే ఈనాటికీ అతీగతీ లేదు. ఆయన్ను హత్య చేశారని ఒక పోస్టుమార్టం నివేదిక చెప్పగా, మరో నివేదిక దాన్ని ఆత్మహత్యగా తేల్చింది. అక్రమ మైనింగ్ యాజమాన్యాల దుశ్చర్యలు అన్నీ ఇన్నీ కాదు. మైనింగ్ కలుగులన్నీ కేవలం ఒక మనిషి ప్రవేశించడానికి సరిపోయేంత ఇరుగ్గా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోపలికి పంపడానికి వీలుంటుంది. పైగా దృఢకాయులు పనికిరారు గనుక మైనర్ బాలల్ని ఎక్కు వగా ఇందుకోసం వినియోగిస్తారు. వీరు వందల అడుగుల లోతులకు వెళ్లి అక్కడ అడ్డంగా సొరంగం చేస్తూ బొగ్గు సేకరించాలి. ఈ పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇస్తారు. ఇదంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరించిన పార్టీలు, ప్రభుత్వమూ కూడా ఈ పాపంలో భాగస్వాములు. చట్టవిరుద్ధమైన మైనింగ్‌ను ఆపలేకపోవడమే కాదు...కనీసం ప్రమా దంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలన్న అవగాహన కూడా లేకుండా విలువైన సమయాన్ని వృధా చేసిన పాలకుల తీరు క్షమార్హం కాదు. ఇప్పటికైనా మృత్యు కుహరాలను శాశ్వతంగా మూసేందుకు చర్యలు తీసుకోవాలి. -
అక్రమ మైనింగ్‌కు ఖాకీ సహకారం
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ పనులు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి బయల్దేరుతున్న తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. మైనింగ్ పనుల వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు విధించారు. అక్రమాలకు సహకరిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యల్లనూరు: యల్లనూరు మండలం కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మూడు నెలల నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకపోయినా మైనింగ్ జరుపుతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోలేదు. శనివారం అక్రమ మైనింగ్ పనులను అడ్డుకోవడానికి 600 మంది కార్యకర్తలు, కూచివారిపల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి బయల్దేరడానికి సిద్ధమైన తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు. ఎవ్వరూ మైనింగ్ ప్రాంతానికి వెళ్లకుండా తిమ్మంపల్లి, కూచివారిపల్లితో పాటు అటువైపు వెళ్లే అన్ని అన్ని గ్రామాల దారుల వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై మండిపాటు అక్రమ మైనింగ్ పనులను అడ్డుకునేందుకు వెళుతున్న తమను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఆయన తిమ్మంపల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జేసీ సోదరుల అక్రమాలపై మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కానీ ఆయన ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగా బ్లాక్‌మేల్ చేశావో అదే తరహాలో తాడిపత్రి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. అనుమతులు లేకుండానే మైనింగ్ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంపీ జేసీ మైనింగ్ నిర్వహిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇదివరకే తాడిపత్రి ప్రాంతంలోని కోనుప్పలపాడు దేవాలయ ప్రాంతంలో మైనింగ్ నిర్వహించడంతో దేవాలయం చీలికలు ఏర్పడిందన్నారు. దేవాదాయ, అటవీ భూములను సైతం వదిలిపెట్టకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుకోటలో కూడా అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ.. ఇటీవలే అనుమతులు తీసుకున్నారన్నారు. జూటూరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల భూములను పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. తాడిపత్రి సమీపంలోని పెన్నా పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ రోజూ వందలాది లారీల రాయిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాలా మందికి మైనింగ్ చేసుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ జేసీ దివాకర్‌రెడ్డి వారిని అడ్డుకుంటున్నారన్నారు. తను మాత్రం మైనింగ్ జరుపుకుంటున్నారన్నారు. కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ గురించి అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పనులకు పోలీసులు కూడా సహకరిస్తుండటం బాధాకరమన్నారు. జేసీ ఆదేశాల మేరకే తనను మైనింగ్ ప్రదేశానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని, పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు. -
మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలు..
సాక్షి, కర్నూలు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో అక్రమంగా చేపడుతున్న ఎర్రమట్టి తవ్వకాలను ప్రజలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో చేపట్టిన అక్రమ తవ్వకాలను గ్రామ నాయకులు, రైతులు అడ్డుకున్నారు. సుమారు 500 మంది రైతులు చెరువు వద్దకు చేరుకుని తవ్వకాలు జరుపుతున్న జేసీబీ, ప్రొక్లెయిన్లను, టిప్పర్లను వెనక్కు పంపారు. అనంతరం అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను, నాయకులను వెనక్కి పంపించారు. అయితే మంత్రి అఖిల ప్రియ పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. -
జాతి సంపదను భక్షిస్తుంటే చూస్తూ ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: పల్నాడులో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయల మేర సీనరేజీ చార్జీలను ఎగవేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జాతి సంపదను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబో మని హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇదే న్యాయస్థానం 2015లోనే ఆదేశాలిచ్చినా అమలు చేయకుండా అధికారులు నిద్రపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము సీబీఐ, కాగ్‌లను ప్రతివాదు లుగా చేస్తే అధికారులు ఇప్పుడు మేల్కొని ఉరుకులు పరుగులు పెడుతున్నారని ధర్మా సనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్ర మంగా ఎంత ఖనిజాన్ని తవ్వేశారు? ఎంత మొత్తంలో పన్నులు, సీనరేజీ ఎగవేశారు? తదితర అంశాలపై ఆడిట్ జరిగి తీరాల్సిం దేనని, ఈ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అక్రమ మైనిం గ్ చేసే అసలు పెద్దలను వదిలేసి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను బలి చేయడం ప్రభుత్వ శాఖల్లో అలవాటుగా మారిపోయిం దని వ్యాఖ్యానించింది. ఇది ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని పేర్కొంది. వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు తాము ఆదేశాలు ఇచ్చిన తరువాత కొన్ని చిన్న తరహా కంపెనీలపై పెనాల్టీ, ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావుడి చేయడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. ముందు ఆ కంపెనీలకు నోటీసులిచ్చి వాటి వాదనలు విన్న తరువాత చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటివరకు పెనాల్టీ, ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకెళ్లవద్దని గనులశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు మరికొన్ని గ్రామాల్లో అనుమతులు లేకుండా య«థేచ్ఛగా లైమ్‌స్టోన్ తవ్వకాలు నిర్వహించడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతోపాటు బాధ్యులను గుర్తించి అక్రమ మైనింగ్ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ ఆదేశించింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌స్టోన్ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా మరోసారి విచారించింది. -
రూటు మార్చిన మైనింగ్ మాఫియా
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్‌ను ఆపేయాలంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలోని మైనింగ్ మాఫియా కొత్త రూటు ఎంచుకుంది. లీజుదారుల నుంచి నయానో భయానో క్వారీలను సొంతం చేసుకుని ఆ తర్వాత అనుమతులు రప్పించి కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలోని మాఫియా పథకం రచించింది. దీనికి ఓ మైనింగ్ అధికారి సహకారం కూడా ఉందని తెలుస్తోంది. ఈ అక్రమ దందాకు సంబంధించి ఆదివారం రాత్రి మైనింగ్ మాఫియాకు చెందిన ఓ ముఖ్యుని కోల్డ్ స్టోరేజీలో మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము చెప్పిన ధరకే తెల్లరాయి కొనాలని హుకుం జారీ చేశారు. మరోపక్క లీజుదారులను ఎక్కడ లేని నిబంధనలతో మైనింగ్ అధికారి బెంబేలెత్తించారు. క్వారీలన్నింటిని మాఫియాకు అప్పజెప్పేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. లీజుదారుల నుంచి మైనింగ్ మాఫియా చేతుల్లోకి క్వారీలు వెళ్లగానే నిబంధనలను సడలించేందుకు రంగం సిద్ధం చేశారు. క్వారీలన్నీ తమ చేతికి రాగానే అక్రమాలకు పాల్పడుతూ.. నిబంధనల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నట్లు చూపడానికి ఈ ఎత్తు వేశారు. మైనింగ్ మాఫియాకు ఎదురు చెప్పలేక మిల్లర్లు, క్వారీల లీజుదారులు మౌనంగా ఉండిపోతున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అధికారులు.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అక్రమ క్వారీలను నిలిపివేయాల్సిన అధికారులు ఈ ప్రాంతంలోని అన్ని క్వారీలను నిలిపివేశారు. క్వారీ లీజుదారులపై కేసులు నమోదు చేయడం దగ్గర్నుంచి మిల్లర్లకు నోటీసులు జారీ చేయడం వరకు అన్ని అధికారపార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో చకచకా చేసేశారు. వారికి నోటీసులు ఇవ్వడంతోపాటు, కేసుల్లో ఇరికించడం వల్ల తాము చెప్పినట్లు వింటారనేది వారి ఆలోచన. అనుకున్న విధంగానే మిల్లర్లకు ట్రాన్సిట్ పాస్‌లు నిలిపివేయించారు. వారు బంద్‌కు దిగగానే తిరిగి వాటిని అధికారులతో ఇప్పించి మిల్లర్లు, క్వారీ లీజుదారులను తాము చెప్పినట్లుగా వినేలాచేశారు. కేసుల భయంతో మిల్లర్లు, క్వారీ లీజుదారులు కూడా ఇష్టంలేకపోయినా మైనింగ్ మాఫియా ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. క్వారీలన్నీ లాగేసుకునేందుకు పథకం క్వారీ లీజుదారులకు అనుమతులిచ్చేందుకు నిబంధనలు సాకుగా చూపుతూ వారిని భయాందోళనకు గురిచేసి తమ భూములు మాఫియాకు అమ్ముకునేలా అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాచేపల్లి మండలంలోని తంగెడ, పిడుగురాళ్లలో అక్రమక్వారీకి పక్కనే ఉన్న మరో క్వారీని అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కొనుగోలు చేసి తవ్వకాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనుమతులు ఉన్న క్వారీలను సైతం మూడు నెలలుగా నిలిపివేయించి తెల్లరాయి కొరత సృష్టించడం ద్వారా మిల్లర్లను, సున్నపురాయి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. మైనింగ్ మాఫియా తప్ప, మరెవరూ క్వారీలను నడపలేరనే పరిస్థితికి అక్కడి వారిని తీసుకు వస్తున్నారు. అనుమతులు ఇప్పించాక తెల్లరాయిని ఎంతకు కొనాలో కూడా మాఫియా ఆదివారం రాత్రి సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ట్రక్కు తెల్లరాయి రూ.1500 ఉండగా, దాన్ని రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. తాము చెప్పిన ధరకు కొనుగోలు చేస్తే ఎవ్వరికీ ఇబ్బందులు ఉండవని, లేని పక్షంలో ఈ సంక్షోభం ఇలానే కొనసాగుతుందంటూ మిల్లర్లను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలు వీరికి వర్తించవు.. అనుమతులున్న క్వారీలను నిర్వహించేందుకు సైతం నిబంధనలను సాకుగా చూపి అనుమతించని మైనింగ్ అధికారులు.. ఈ భూములను అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కొనుగోలు చేయగానే అవన్నీ మరిచిపోనున్నారు. వారికి అనుమతులు మంజూరు చేసేందుకు వేగంగా ఫైళ్లు కదులుతున్నాయని తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో భారీ దోపిడీకి అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దందాలో అటు మిల్లర్లు, ఇటు సున్నపురాయి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీకి చెం దిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఎమ్మెల్యే చింతమనేని అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు సన్నద్ధమయ్యారు. చింతమనేని అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసిన నేతలు.. ఇక నీ ఆగడాలను సాగనివ్వమం టూ నిరసన దీక్ష చేపట్టారు. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యానికి తెరదించడంతో పాటు, చింతమనేని అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం నిరాహారదీక్ష చేపట్టారు. తన అక్రమాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయనే భయంతో చింతమనేని అనుచరగణంతో వైఎస్సార్ సీపీ దీక్షను అడ్డుకునేందుకు కుటిలయత్నాలు చేశారు. వైఎ స్సార్ సీపీ దీక్షా శిబిరానికి సమీపంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ధర్నా చేసేందుకు శిబిరాన్ని ఏర్పా టు చేసే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతలు పోటీ దీక్ష ఏర్పాటు చేయటంతో పోలీ సులు భారీ సంఖ్యలో మోహరించారు. పరిస్థితి చేయిదాటకుండా ఇరువర్గాల శిబిరాలను పోలీసులు తొలగించారు. రాయన్నపాలెంలో అబ్బయ్యచౌదరి దీక్ష అక్రమ మైనింగ్‌పై యుద్ధభేరి మోగించిన సమన్వయకర్త అబ్బయ్యచౌదరి గోపన్నపాలెం నుంచి బయలుదేరి పెదవేగి మండలం రాయన్నపాలెంలో నిరాహారదీక్ష చేపట్టారు. ఇక్కడ శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దెందులూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అక్రమాలపై విచారణ చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీక్షలకు వెల్లువెత్తిన సంఘీభావం రాయన్నపాలెంలో అబ్బయ్యచౌదరి చేపట్టిన నిరా హార దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కోటగిరి శ్రీ«ధర్, చింతలపూడి, ఉంగుటూరు, కైకలూరు సమన్వయకర్తలు వీఆర్ ఎలీజా, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో దోపిడీకి సీఎం ఆద్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకుంటున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం శోచనీయమన్నారు. ఈ దోపిడీకి సీఎం చంద్రబాబు ఆద్యుడని, ఇసుక, మట్టి, నీరు–చెట్టు పథకాల్లో పూర్తిగా అవినీతికి పాల్పడ్డారని, గుంటూరు జిల్లా గురజాలలో నాలుగున్నరేళ్ల నుంచి వందల కోట్ల విలువైన సున్నపు రాళ్లు అక్రమంగా తరలించారని గుర్తుచేశారు. హైకోర్టు సైతం ఆక్షేపించి చర్యలు తీసుకోమని ఆదేశించినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. ఎన్ని పోరాటాలకైనా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి అక్రమ మైనింగ్ చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌ను, ఆయనకు సహకరిస్తున్న అధికారులను దోషులుగా నిలబెడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. చింతమనేని దౌర్జన్యాలు సిగ్గుచేటు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ కేసులు దోపిడీలపై పలుమార్లు కలెక్టర్‌కు వినతుల అందజేసినా కనీసం స్పందించకపోవడం వారి భాగస్వామ్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. ఉద్యమం ఆగదు నిరాహార దీక్షకు దిగిన అబ్బయ్యచౌదరి మాట్లాడు తూ చింతమనేని ప్రభాకర్‌కు భయపడే రోజులు పో యాయన్నారు. అక్రమ మైనింగ్‌ను నిలువరించే వర కూ ఉద్యమం చేస్తానని ప్రకటించారు. చింతమనేని అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. సీబీఐ విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: పల్నాడులో జరిగిన రూ.లక్షల కోట్ల మైనింగ్ మాఫియా అవినీతిలో బడా బాబుల హస్తం ఉంది కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐ విచారణ జరక్కుండా సీబీసీఐడీ దర్యాప్తుకు ఆదేశించారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే భోగాపురం ఎయిర్‌పోర్టు టెండరు రద్దు, పల్నాడు మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. దమ్ముంటే పల్నాడు మైనింగ్‌లో సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాలును స్వీకరించాలని బొత్స డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి బాగోతాలు బద్దలయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అమాయకులపై కేసులా? సీఐడీ విచారణలో ప్రధాన నిందితులను పక్కనబెట్టి కూలీలు, సూపర్వైజర్లు, మేస్త్రీల మీద కేసులు బనాయించి వారినే ముద్దాయిలుగా చూపుతూ పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. మాఫియాలో చంద్రబాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హస్తం ఉందని, వారి పేర్లు చెప్పొద్దని స్థానికులను బెదిరిస్తున్నారన్నారు. వీరి పేర్లు, టీడీపీ పెద్దల పేర్లను చెప్పొద్దని పోలీసులు ప్రజలను బెదిరించడం సిగ్గు చేటన్నారు. దోపిడీ కోసమే టెండర్ రద్దు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వేసిందని, ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా.. టెండర్‌ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు కలిసి టెండర్‌ను రద్దు చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా లేఖ రాసిన నేపథ్యంలోనే భోగాపురం టెండర్లలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తమ పార్టీ ప్రధానికి లేఖ రాసిందని, దానికి సాంకేతిక పరిజ్ఞానం లేదని అప్పటి మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారన్నారు. పస్తుతం ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. సహాయక చర్యలేవీ? రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటన్నారు. జిల్లాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులను పంపాలని తమ పార్టీ కోరుతోందన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా, విజయవాడ ప్రాంతాల్లోని ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరద ప్రాంతాల్లో జిల్లాల కలెక్టర్లు తప్ప ఎవరూ కార్యక్రమాలను పర్యవేక్షించటం లేదన్నారు. ఆ ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి తక్షణం సహాయ కార్యక్రమాలు చేయాలన్నారు. రూ.కోట్లు తగలేసి ఇలాగేనా నిర్మించేది? చిన్నపాటి వర్షాలకే రాజధానిలోని సచివాలయం, అసెంబ్లీ లీకులు అవుతోందన్నారు. వందలాది కోట్లు కుమ్మరించి నిర్మించిన తాత్కాలిక సచివాలయం పట్టుకుంటే పడిపోతుందని బొత్స మండిపడ్డారు. చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన భవనాల్లో లీకేజీల పర్వం కొనసాగుతోందని, పైకప్పు, గోడలు కూలిపోయే ఫొటోలు చూస్తే బాధగా ఉందన్నారు. ప్రజాధనం దోపిడీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. విషజ్వరాలు వచ్చినా పట్టించుకోరా? ఉత్తరాంధ్రలో విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, పీహెచ్సీలలో ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు రోగులు పడుకుంటున్నారని, విజయనగరం పీహెచ్సీలో అసలు డాక్టర్లే లేరన్నారు. 108 అంబులెన్స్‌లు లేక మనుషులను మంచాలపై మోసుకొస్తున్నారన్నారు. పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని, అవినీతి చేద్దామనే ఉద్దేశంతోనే మంత్రులున్నారు తప్ప ప్రజల కోసం పని చేయడం లేదన్నారు. -
లీకేజీలపై సమాధానమేంటి?
-
గనుల దోపీడీలో సీబీఐ విచారణకు సిద్ధమా ?
-
గోవాకూ కేరళ గతే!
పణజీ: వీలైనంత త్వరగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే గోవాలో కూడా కేరళ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరిస్తున్నారు. గోవా కూడా పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు చేపడుతోందన్నారు. ‘పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకు గోవా మినహాయింపు కాదు. కచ్చితంగా కేరళ తరహా ముప్పు గోవాకు కూడా వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ç గోవాలో రూ.35 వేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని కమిటీ వెల్లడించిందని గుర్తు చేశారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు చేకూరడంతో కొండలను తొలచివేస్తున్నారని పేర్కొన్నారు. -
నిగ్గు తేల్చేనా?
అక్రమ మైనింగ్ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటి దొంగలను రక్షించేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తే ఎక్కడ గుట్టురట్టవుతుందోననే భయంతో.. తమ చెప్పుచేతల్లో ఉండే సీబీ సీఐడీకి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు మైనింగ్ అధికారులు చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగానే సీబీసీఐడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మైనింగ్ తిమింగలంపై కాకుండా.. కేవలం అమాయకపు చేప పిల్లలపైనే కేసులు నమోదు చేశారు. సాక్షి, గుంటూరు: ఏ రోజుకారోజు కొత్త పాత్రలు ప్రవేశిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అక్రమ మైనింగ్‌లో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ పెద్దల వివరాలు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి హైకోర్టు ఆగ్రహంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, దాచేపల్లి మండలం నడికుడి, కోనంకి గ్రామాల్లో నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే విచారణ చేపట్టిన మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్‌కు సూత్రధారులైన అధికార పార్టీ ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లను బలిపశువులను చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కథ ఇక్కడితో ఆగలేదు.. 13న పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేయడం, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అక్రమార్కులను తప్పించేందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సీబీసీఐడీ అధికారులకు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ïసీబీసీఐడీ ఏడీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో, డీఐజీ కాలిదాసు రంగారావు పర్యవేక్షణలో ఎనిమిది మంది డీఎస్పీలు, 14 మంది సీఐలు ఎనిమిది బృందాలుగా ఏర్పడి అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. 20 ప్రశ్నలు సంధించిన పోలీస్ శాఖ.. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్‌పై సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు 31 లక్షల మెట్రిక్ టన్నులు తెల్లరాయిని అక్రమంగా తవ్వి దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ మైనింగ్ అధికారులకు 20 ప్రశ్నలు సంధించింది. అయితే వీటికి మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలతో సహా ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణను నివేదిక రూపంలో సీబీసీఐడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ అ«ధికారులు పెట్టిన కేసులపైనే విచారణ.. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధమైన సీబీసీఐడీ నిజాలను నిగ్గు తేలుస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలను బలపరుస్తూ సీబీసీఐడీ అక్రమ మైనింగ్‌పై మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేపట్టకుండా మైనింగ్ అధికా>రులు ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా అమయాకులపై పెట్టిన కేసుల విచారణను కొనసాగించనునన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మైనింగ్ డీడీ, ఏడీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టిన కేసులపై దర్యాప్తు కొనసాగిస్తే అసలు నేరస్థులు బయట వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దొంగలు బయటపడతారా..? పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, అతని ముఖ్య అనుచరులను తప్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు శతవిధాల ప్రయత్నించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్టు బయటపడుతుండటంతో సీబీఐకు విచారణ అప్పగిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీబీసీఐడీకు విచారణ బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీస్ శాఖలోని కొంత మంది అధికారుల పాత్ర అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నీరుగార్చేందకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ అయినా నిజాలు నిగ్గు తేల్చి అసలు దొంగలను పట్టుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
మైనింగ్ మాఫియా సరికొత్త డ్రామా!
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్‌కు పాల్పడి తాము తవ్విన తెల్లరాయిని మాత్రమే మిల్లుల్లో దించుకోవాలని గత నాలుగేళ్లుగా భయపెట్టి దౌర్జన్యంగా కోటి టన్నులకు పైగా కొల్లగొట్టిన పల్నాడులోని మైనింగ్ మాఫియా కేసు నుండి బయటపడేందుకు ఇప్పుడు కొత్త అంకానికి తెరతీసింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటివరకూ మిల్లర్లకు నోటీసులు ఇప్పించి వారిని భయాందోళనకు గురిచేసింది. కానీ, కేసు తీవ్రతతో ఇంకా మథనపడుతున్న మాఫియా సూత్రధారులు ఇప్పుడు తాజాగా తాము చెప్పినట్లు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం.. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ మాఫియా సూత్రధారులు వడ్డవల్లి బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లులు పిడుగురాళ్ళ, నడికుడి ప్రాంతాల్లోని మిల్లర్ల యజమానులను దగ్గరుండి కలెక్టరేట్‌కు తీసుకొచ్చి వారిని కలెక్టర్ వద్దకు పంపారు. వీరు మాత్రం బయటే ఉండిపోయి కొత్త కథను నడిపించారు. ఇందులో భాగంగా ముందుగా.. మైనింగ్‌ను నిలిపివేయడంవల్ల కూలీలు ఉపాధి కోల్పోతున్నారని వారితో కలెక్టర్‌కు వినతిపత్రం ఇప్పించారు. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే తాము, కూలీలు ఇబ్బందులు పడుతున్నామని వారి నోటితో చెప్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం వారిని గుంటూరు నగరంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి తాము అండగా ఉంటామంటూ మిల్లర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో.. ఇప్పటికే తమకు మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారని, మిగతా శాఖలకు చెందిన అధికారులు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, అవైనా తమకు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేను మిల్లర్లు వేడుకున్నట్లు సమాచారం. అయితే, గతంలో మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలిసినప్పటికీ ఎదురు తిరిగితే కేసుల్లో ఇరికిస్తారనే భయంతో ఇష్టంలేకపోయినా మైనింగ్ మాఫియా ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి మిల్లర్లకు ఏర్పడింది. ఇదిలా ఉంటే.. నిజంగా ఎమ్మెల్యేకు, మైనింగ్ మాఫియాకు తమపై ప్రేమ ఉంటే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న మూడు క్వారీలను మాత్రమే నిలిపివేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే, మిగతా క్వారీలను సైతం ఎందుకు మూయించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు మిల్లర్లు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం. -
కొల్లగొట్టింది కోటి టన్నులు!
సాక్షి, గుంటూరు: సున్నపురాళ్లలో కొల్లగొట్టింది కొండంత.. లెక్కల్లో చూపించేది మాత్రం గోరంత! పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో సాగుతున్న మైనింగ్ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అక్రమాలపై సర్వే చేసిన అధికారులపైనే చర్యలు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున సాగిన అక్రమ మైనింగ్ 31 లక్షల టన్నులు మాత్రమేనంటూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంపై అనుమానాలు ముసురు కుంటున్నాయి. ఈ నివేదిక ఆధారంగా మైనింగ్ డీడీ, ఏడీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవంగా అక్కడ దోచేసిన సున్నపురాయి కోటి టన్నులకు పైగానే ఉంటుందని శాటిలైట్ సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నారు. దీన్ని దాచిపెట్టి కూలీలు, కార్మికులపై కేసులు బనాయించి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని తప్పించే యత్నాలు సాగుతున్నాయి. మైనింగ్ వ్యవహారంలో బాధ్యులుగా చేస్తూ మంగళవారం రాత్రి సస్పెన్షన్ వేటు వేసిన మైనింగ్ డీడీ, ఏడీల నేతృత్వంలోనే అక్రమ క్వారీయింగ్‌పై సర్వే జరిగిన విషయం తెలిసిందే. మైనింగ్ ఏడీ జగన్నాధరావు ఫిర్యాదు ఆధారంగా 17 మందిపై కేసులు సైతం నమోదయ్యాయి. మైనింగ్ డీడీ, ఏడీలు నిజంగానే తప్పు చేసి ఉంటే వారి నేతృత్వంలో జరిగిన సర్వే కూడా తప్పేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులను కూడా పునఃపరిశీలించి మైనింగ్ మాఫియాలో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ప్రకారమే 68.53 లక్షల టన్నులు.. మైనింగ్ అధికారుల నివేదికను బట్టి చూస్తే పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికూడి ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా కేవలం 31 లక్షల టన్నుల సున్నపురాయిని మాత్రమే తవ్వినట్లుగా చూపారు. అయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాటిలైట్ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2017 జనవరి నాటికే 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి చెబుతున్నారు. ఈమేరకు సాక్ష్యాలను సైతం ఆయన హైకోర్టుకు అందించారు. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వతేదీ వరకు అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. శాటిలైట్ సర్వే జరిగిన తరువాత 19 నెలల్లో సుమారుగా మరో 30 లక్షల టన్నుల సున్నపురాయిని దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం మూడు క్వారీల్లో కలిపి ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ఇలా ఏకంగా కోటి టన్నుల తెల్లరాయిని కొల్లగొట్టిందని అంచనా వేస్తున్నారు. దీని విలువ సుమారుగా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మైనింగ్ లెక్కల ప్రకారం అక్రమంగా ఆర్జించిన సొమ్ముపై పది రెట్లు వరకు పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. మైనింగ్ మాఫియా దోచేసిన దాంట్లో నాలుగో వంతు కూడా మైనింగ్ అధికారులు లెక్కల్లో చూపకపోవడాన్ని బట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు, బాధ్యులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రక్షించేందుకే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశించినా పక్కదారి పట్టించే యత్నాలు మైనింగ్ మాఫియాలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన జోలికి వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే నిర్వహించకుండా తూతూమంత్రంగా లెక్కలు చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరు బయటకు రాకుండా అమాయకులకు నోటీసులు జారీ చేస్తూ విద్యుత్ మీటర్ రికార్డులు, 18 ఏళ్ల రికార్డులు చూపాలంటూ మిల్లర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మైనింగ్ మాఫియాలో సూత్రధారుల పేర్లు లేకుండా వారి వద్ద పనిచేసే కూలీలను, కార్మికులను కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకొనే ప్రయత్నం జరుగుతోంది. కొందరు అధికారులను ఈ వ్యవహారంలో బలిపశువులుగా మార్చి వారిపై చర్యలు తీసుకున్నట్లుగా హైకోర్టుకు నివేదించేందుకు సర్కారు సిద్ధమైంది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగించి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గుంటూరు అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ..!
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకే అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ గనులను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు ప్రయోగించి అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజులు గడువిచ్చామని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ గనుల వ్యవహారంలో సీఐడీ విచారణ వల్ల ఏమీ జరగదని, సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న భూములను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
‘పర్యటన అడ్డుకున్నా.. ఉద్యమాన్ని ఆపలేరు’
సాక్షి, గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని వాయిదా వేయగలిగారనీ, కానీ టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. మైనింగ్ అక్రమాలు వెల్లడైతే ప్రభుత్వం ఇరుకునపడుతుందని యరపతినేని వణికిపోతున్నారని అన్నారు. అందినకాడికి దోచుకున్న యరపతినేని మైనింగ్ కేసులో తన దగ్గర పనిచేసే డ్రైవర్, వాచ్మెన్, గుమాస్తాలను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన రెండువేల కోట్ల పెనాల్టీని పల్నాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో అక్రమ మైనింగ్ జరిగిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ప్రజా తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో యరపతినేనికి త్వరలో చూపిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు దారుణమైన ఓటమి తప్పదని మహేష్‌రెడ్డి హెచ్చరించారు. -
ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం
-
నిర్బంధాలతో నిజాలను దాచలేరు
సాక్షి, గుంటూరు/దాచేపల్లి(గురజాల)/తాడేపల్లిరూరల్/మాచర్ల: నిర్బంధాలతో నిజాలను దాచలేరు అని రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్లు కొల్లగొడుతూ.. అమాయలకుపై కేసులు పెట్టి అక్రమార్కులు తప్పించుకోవాలని చూడటంపై నిజనిర్ధారణకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాల్సింది పోయి తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారో, ఆటవిక పరిపాలనలో ఉన్నారో అర్థంకావడంలేదు. ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేల అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతారా? ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు. టీడీపీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో ప్రకృతి వనరులన్నింటినీ దోచుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు సంఘటనా స్థలానికి వెళితే నిజాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేయిస్తోంది.చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు అక్రమ మైనింగ్‌లో వాటాలు ఉన్నాయికాబట్టే వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకుంటున్నారు. – బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం అక్రమ మైనింగ్ జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని నిజాలను పూడ్చేయాలని చూడడం అప్రజాస్వామికం. జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను గృహనిర్భంధం చేయడం, అరెస్టులు చేయడం చూస్తుంటే పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు ఉంది. అక్రమాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి, ప్రజలతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరుల బండారం బయటపడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే యరపతినేనిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆమేరకు ఆదేశాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే యరపతినేని సీఎం వద్దకు వెళ్లి తాను కేసులో ఇరుక్కుంటే లోకేశ్‌కు, పార్టీకి ఖర్చు చేసిన లెక్కలన్నీ బయటకు వస్తాయని భయపెట్టారు. ప్రభుత్వానికి పోలీసులకు పది రోజులు సమయం ఇస్తున్నాం. ఈలోపు ఓ తేదీ నిర్ణయించి అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడం. – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ తీరు విచిత్రంగా ఉంది అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు విచిత్రంగా ఉంది. దోషులను పట్టుకుని అవినీతిని అరికట్టాల్సింది పోయి దానిపై పోరాడుతున్న వారిని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని ఏ గ్రామంలో అడిగినా ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులు ఖనిజాలను ఏ స్థాయిలో దోచుకున్నారో చెబుతారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 21లోపు విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డ పెద్దల పేర్లు బయటపెట్టకుండా దోషులను తప్పించాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతానికి బయల్దేరితే సీఎం సహా టీడీపీ నేతలు గడగడలాడుతున్నారు. గతంలో ఓబులాపురం మైనింగ్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ వేశారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్షాన్ని అక్కడకు వెళ్లనీయకపోవడం చూస్తుంటే భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని తేటతెల్ల మవుతోంది. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన మండలి ప్రతిపక్ష నేత అక్రమమైనింగ్‌లో బాబు, లోకేశ్‌లకు వాటాలు ప్రజాస్వామ్య ముసుగులో అక్రమ నిర్భంధం జరుగుతోంది. గురజాల నియోజకవర్గంలో రాజ్యాంగం, చట్టాలు అమలు జరగడం లేదు. కోనంకి, కేసానుపల్లి, నడికుడి గ్రామాల్లో గత నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలను ఈ కేసులో ఇరికిస్తున్నారు. వాస్తవాలు దాచిపెట్టి కోర్టు కళ్లకు గంతలు కట్టవద్దు. అక్రమ మైనింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వాటాలు ఉండబట్టే ఈ వ్యవహరంపై స్పందించడం లేదు. ఎమ్మెల్యే యరపతినేని వారికి వాటాలు పంచుతున్నారు. అక్రమమైనింగ్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీసీ నేత కుందుర్తి గురవాచారిని ఎమ్మెల్యే బెదిరించి పోలీసులతో తీవ్రంగా కొట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లోకేశ్ బినామీ యరపతినేని చంద్రబాబు కుమారుడు లోకేశ్ బినామీ అయిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ. వందల కోట్ల అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. దానిపై నిజనిర్ధారణకు వైఎస్సార్సీపీ నేతలు దాచేపల్లి వెళుతుంటే పోలీసులు సాయంతో ప్రభుత్వం అడ్డగించటం దారుణం. అధికార పార్టీ నాయకులు, మైనింగ్ మాఫియా కారకులైన వారు కొంతమందిని రెచ్చగొట్టి భారీ ప్రదర్శన చేస్తే.. దానికి అనుమతించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయటం హేయమైన చర్య. నిర్బంధాలతో వాస్తవాలను దాచలేరు. రాబోయే రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం. వందల మంది పోలీసులతో జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్భందించటం మానవహక్కులను హరించటమే. – ఎమ్మెల్యే పీఆర్కే, వైఎస్సార్సీపీ విప్ సీబీఐ విచారణ జరిపించాలి జిల్లాలో ఏం జరిగినా నరసరావుపేటలో ఉంటున్న నన్ను గృహనిర్బంధం చేస్తున్నారు. ఈనెలలో ఇది రెండోసారి. నరసరావుపేట మొత్తం ప్రశాంతంగా ఉంటే, కాసు ఇంటి వద్ద, నా ఇంటి వద్ద మాత్రం 144 సెక్షన్ ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదు. అధికార పార్టీ నేతలు మాత్రం నడిరోడ్లపై ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా పట్టించుకోవడం లేదు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచేస్తుంటే నిలదీయడానికి వెళుతున్నవారిని నిర్బంధిస్తున్నారు. పిడుగురాళ్లలో టీడీపీ నేతలు ర్యాలీ చేస్తే లా అండర్ ఆర్డర్ గుర్తుకు రాలేదా?. ఎమ్మెల్యే యరపతినేని అక్రమ క్వారీయింగ్‌పై సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు బయటపడతాయి. ఇప్పటికైనా అమాయకులై కేసులు ఎత్తివేసి నిజమైన దోషులను శిక్షించాలి. అప్పటి వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. –డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేత గురవాచారి హైకోర్టులో పిల్ వేస్తే దీనిపై చర్యలు తీసుకోమని ఇచ్చిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దోచుకున్న అక్రమ మైనింగ్‌కు పెనాల్టీతో సుమారుగా రూ. 2 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉంది. హైకోర్టు ఆగ్రహంతో అధికారులు చర్యలు తీసుకుంటారని 15 రోజులు వేచి చూశాం. యరపతినేని, ఆయన అనుచరులను కాపాడుతూ అమాయకులకు నోటీసులు ఇచ్చి కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్వారీల్లో పనిచేసుకునే వారికి క్వారీలు అప్పగించి వారికి జీవన భృతి కల్పించాలి. – కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త -
అక్రమ మైనింగ్‌కు ఖాకీ కవచం
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు/ఏఎన్‌యూ/ తాడేపల్లి రూరల్/ పిడుగురాళ్ల: మైనింగ్ అక్రమాలపై పరిశీలనకు ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సోమవారం పల్నాడులో పర్యటించకుండా టీడీపీ సర్కారు పోలీసుల ద్వారా అడ్డుకుంది. పల్నాడుతోపాటు గుంటూరు జిల్లావ్యాప్తంగా అష్టదిగ్బంధం చేయడం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలందరికీ నోటీసులు జారీ చేయడంతోపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పల్నాడులో 144 సెక్షన్ విధించి అక్రమ క్వారీయింగ్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటించకుండా అడ్డుకున్నారు. మైనింగ్ అక్రమాల పరిశీలనకు బయల్దేరిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్దే అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేత కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను నరసరావుపేటలో ఇంటి వద్దే అడ్డుకున్నారు. నడికూడిలో రైలు దిగిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి ఆయన స్వగ్రామానికి తరలించారు. ఊరూరా పోలీసులు పల్నాడులో పలు చోట్ల విపక్ష పార్టీ నేతలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు. అక్రమ క్వారీయింగ్ జరుగుతున్న పిడుగురాళ్ళ, మాచవరం, దాచేపల్లి మండలాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను జల్లెడ పట్టారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఏ నలుగురు కలిసి ఉన్నా కేసులు నమోదు చేస్తామంటూ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ చర్యలను తీవ్రంగా నిరసించిన వైఎస్సార్సీపీ నేతలు పది రోజుల్లోగా క్వారీలను సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాసు ఇంటికి భారీగా చేరుకున్న శ్రేణులు పోలీసులు తెల్లవారుజామునే గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్లను ముట్టడించి గృహ నిర్భంధం చేయడంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయకుండా కాసు మహేష్‌రెడ్డి ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని కాసుకు మద్దతుగా నిలిచారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల కంటపడకుండా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ పోలీసుల కంటపడకుండా నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీతో మాట్లాడి కాసు మహేష్‌రెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసానుపల్లి, నడికూడి, కోనంకిలో జరిగిన మైనింగ్ అక్రమాలను వివరించారు. గంట గడువు కోరి స్పందించని పోలీసులు అనంతరం దాచేపల్లికి బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటి గేటు బయట పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాచేపల్లి వెళ్లేందుకు తననైనా అనుమతించాలని కాసు మహేష్‌రెడ్డి కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని గంట సమయం ఇవ్వాలని పోలీసులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. అయితే ఆ తరువాత కూడా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో పది రోజుల్లోగా మైనింగ్ ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. సంతకానికి బొత్స ససేమిరా తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు కాకుండా దుగ్గిరాల స్టేషన్‌కు తరలించారు. బొత్సను అడ్డుకోవడానికి నిరసనగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ధర్నాకు దిగారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి, పెదకూరపాడు సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్‌నాయుడు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి ధర్నాలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు వర్షంలోనే స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు ఉదయం 11.20 గంటల నుంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా 3 గంటల పాటు స్టేషన్ వరండాలోనే బొత్సను నిర్భంధించారు. సంతకం చేస్తే వదిలిపెడతామన్న పోలీసుల ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మేమేమైనా దొంగలమా? రౌడీలమా? దోపిడీ చేసేవాళ్లని వదిలేసి మమ్మల్ని సంతకాలు చేయమనడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. రాత్రి అయినా సరే ఇక్కడే పడుకుంటానని, సీఎంకు చెప్పినా డీజీపీకి చెప్పినా భయపడబోనని, సంతకం చేసేది లేదని బొత్స స్పష్టం చేయడంతో చివరకు ఆయన్ను పంపించారు. మీడియాపై పోలీసుల చిందులు బొత్సను పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించనట్లు తెలియడంతో ఈ వార్త కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను లోపలకు రావద్దని, ఫొటోలు తీయవద్దని పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అప్పటికే చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలంటూ మీడియా సిబ్బంది వద్ద కెమెరాలు లాక్కోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మాచర్లలో పిన్నెల్లి, గామాలపాడులో జంగా గృహ నిర్భంధం వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మాచర్లలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఆర్కే ఇంటి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆయన స్వగ్రామమైన గామాలపాడులో పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఈ విషయం తెలియడంతో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఆయన్ను నడికూడిలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు రైలు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం టీజీవీని కారంపూడి మండలం గాదెవారిపల్లెలోని ఆయన స్వగృహానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు. పోలీసుల తీరు పట్ల కృష్ణారెడ్డి మండిపడ్డారు. -
‘ఘనుడు’ సేఫ్ బడుగులే బలి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అక్రమంగా దోచేసిన సొమ్ముతో ఇతరుల పేరిట ఇళ్లు, పొలాలు, ఇంటి స్థలాలు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసి, అసలు దోషులు తప్పించుకోవడం చూస్తుంటాం. అయితే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరింత బరితెగించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు రాకుండా అమాయకులను బలి చేస్తున్నారు. వారిపైనే కేసులు నమోదు చేయించారు. తనకు బదులుగా కేసులు మీద వేసుకుంటే ప్రభుత్వానికి కట్టాల్సిన జరిమానాలు తానే చెల్లిస్తానని, కేసుల నుంచి బయటపడేందుకు సహకరిస్తానని యరపతినేని ముందుగానే బేరం మాట్లాడుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచన మేరకు అనామకుల నుంచి ముందుగానే ఆధార్ కార్డులు సేకరించిన మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసులకు మొత్తం 17 మందిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్లో కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు ‘నిందితులను’ అరెస్టు చేయకుండా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. ఈ కేసుల్లో బలిపశువులుగా మారిన వారంతా చిన్నాచితక కూలీలు, పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. కేసులు నమోదైన 17 మందిలో 13 మంది ఎమ్మెల్యే బినామీలు కాగా, మిగిలిన నలుగురు ఎమ్మెల్యే యరపతినేని అవినీతి అక్రమాలపై పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టే యత్నం మైనింగ్ మాఫియా ఆగడాలపై ఇటీవల సాక్షాత్తూ హైకోర్టులు, లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేసానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలోని క్వారీల్లో 28 లక్షల టన్నుల మొజాయిక్ చిప్స్‌ను(తెల్లరాయి) అక్రమంగా దోచుకున్నట్లు నిర్ధారించారు. మైనింగ్ ఏడీ జగన్నాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మైనింగ్ మాఫియా సూత్రధారి, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు, ఈ మాఫియాలో ముఖ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పేర్లు లేవు. అక్రమ మైనింగ్‌పై ఈ నెల 21న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో గనులను దోచుకున్నవారిపై చర్యలు తీసుకున్నామంటూ కోర్టుకు నివేదించి, న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టేందుకు అమాయక కూలీలపై కేసులు పెట్టి, అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదైన వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ కుట్ర ఎంత పకడ్బందీగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మైనింగ్ కేసులు నమోదైన అనామక కూలీలు, సామాన్యులు 1.క్వారీల కాపలాదారుడిపై కేసు పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు అనే టీడీపీ కార్యకర్త 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా క్వారీయింగ్ చేసి దోచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోచేసిన తెల్లరాయి విలువ రూ.80 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత విలువైన తెల్లరాయిని తవ్వి సొమ్ము చేసుకున్న అంజిబాబు కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే.. ఎకరం పొలం కూడా లేని అంజిబాబు 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందు వరకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతడు ఒక సభ్యుడు మాత్రమే. క్వారీల వద్ద కాపలాగా ఉండేవాడు. అలాంటి అంజిబాబు 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేయడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. 2.మందుగుండు సరఫరా చేసే వ్యక్తిపై కేసు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గుదె వెంకటశివకోటేశ్వరరావు అలియాస్ కోటి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు సీతారాంపురం క్వారీల నుంచి 2.64 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా తరలించినట్లు మైనింగ్ అధికారులు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశాడు. పిడుగురాళ్ల పట్టణంలో సాధారణ ఇంట్లో నివాసం ఉండే శివకోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ క్వారీల్లో పేలుళ్లకు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తుంటాడు. ఇతడు నేరుగా తెల్లరాయిని తవ్వి, తరలించిన దాఖలాలు లేవు. 3.మధ్యతరగతి వ్యక్తి రూ.45 కోట్లు దోచేశాడా? కేసానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు గతంలో ఓ పెట్రోల్ బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యరపతినేని కేసానుపల్లిలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలను నెల్లూరి శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా తెల్లరాయిని తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూస్తుంటాడు. ఆర్థిక లావాదేవీలన్నీ యరపతినేనికి కుడిభుజంగా ఉండే ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తుంటారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుడి భుజాలుగా ఉన్న ఇద్దరిని వదిలేసి బినామీగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావుపైనే కేసు నమోదు చేశారు. ఇతడికి ఎకరం పొలం, చిన్న ఇల్లు మాత్రమే ఉంది. మధ్యతరగతి కుటుంబం. మైనింగ్ అధికారులు తేల్చిన లెక్క ప్రకారం నెల్లూరి శ్రీనివాసరావు రూ.45 కోట్ల విలువైన తెల్లరాయిని దోచేశాడట! 4.ఎమ్మెల్యే అనుచరుడి బినామీ అవతారం దాచేపల్లి పట్టణానికి చెందిన బత్తుల నరసింహారావు క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ టీడీపీ కార్యకర్తగా, యరపతినేని అనుచరుడిగా కొనసాగేవాడు. ఇతడికి సెంటు భూమి కూడా లేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటివరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటివ్ సొసైటీని రద్దు చేశారు. ఎమ్మెల్యే అండతో కొత్త సొసైటీని ఏర్పాటు చేశారు. దానికి బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బత్తుల నరసింహారావు 4.25 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై కేసు నమోదైంది. ఈయన దోచేసిన తెల్లరాయి విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 5.టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ కార్యకర్త. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామీల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప ఒక్క సెంటు భూమి కూడా లేదు. అయితే, మైనింగ్ మాఫియా ఇచ్చిన సొమ్ముతో ఇటీవల కొండమూడు ప్రాంతంలో రెండెకరాల పొలం కొన్నట్లు సమాచారం. అధికారుల లెక్కల ప్రకారం నీరుమళ్ల శ్రీనివాసరావు దోచేసిన తెల్లరాయి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 6.చిన్న స్థాయి కూలీ మరో బినామీ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వర్ల రత్నం 11,356 టన్నుల తెల్లరాయిని అక్రమ క్వారీయింగ్ చేసి దోచేసినట్టు అధికారులు నిర్ధారించారు. వాస్తవానికి ఇతడికి ఎకరం పొలం కూడా లేదు. పేద కుటుంబానికి చెందినవాడు. ఒక ట్రాక్టర్ ఉంది. దాన్ని సీతారాంపురం క్వారీల్లో లీజుకు పెట్టి అక్కడే కూలీగా పనిచేస్తుంటాడు. ఇతడికి అధికారులు మైనింగ్ దోపిడీదారుగా చిత్రీకరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వర్ల రత్నం దోచేసిన తెల్లరాయి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయితే, ఆయన ఇప్పటికీ ఆ క్వారీలో కూలీగానే పనిచేస్తున్నాడు. తమ వద్ద కూలీగా పనిచేస్తూ ట్రాక్టర్ నడుపుకునే సామాన్యుడిని మభ్యపెట్టి కేసులో ఇరికించినట్లు స్పష్టమవుతోంది. 7.నెలవారీ జీతగాడు గనులు దోచేశాడట! గ్రంథి అజయ్‌కుమార్.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, యరపతినేని అనుచరుడు. మైనింగ్ క్వారీల నిర్వాహకుడు అంజిబాబు వద్ద రూ.10 వేల నెలవారీ జీతానికి పని చేస్తుంటాడు. గుమాస్తాగా పని చేసే ఇతడిని అధికారులు మైనింగ్ దోపిడీదారుగా సృష్టిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇతను 67,039 టన్నుల తెల్లరాయిని దోచుకున్నాడు. దీని విలువ రూ.8 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వాస్తవానికి ఇతను అంజిబాబు కింద పనిచేసే గుమాస్తా మాత్రమే. తన బినామీ వద్ద పనిచేసే నెలవారీ జీతగాడిని కేసులో ఇరికించి, తాను తప్పించుకోడానికి ఎమ్మెల్యే కుట్ర పన్నారు. 8.ట్రాక్టర్ డ్రైవర్‌పై అక్రమ మైనింగ్ కేసు రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన ఓర్సు ప్రకాశ్ సీతారాంపురం తెల్లరాయి గనుల్లో ట్రాక్టర్లు బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రకాశ్ 6,643 టన్నుల తెల్లరాయిని అక్రమంగా దోచేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 9.అప్పులున్న వ్యక్తి అక్రమంగా దోచేశాడా? రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన నంద్యాల నాగరాజు క్వారీల్లో ట్రాక్టర్లు బాడుగకు పెట్టి జీవనం సాగిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం వరకూ దినసరి కూలీగా ఉండే నాగరాజు ఒకానొక సందర్భంలో కుటుంబ అవసరాల కోసం ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును సైతం చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. కానీ, అధికారుల దృష్టిలో మాత్రం ఇతడు మైనింగ్ మాఫియా సభ్యుడు. నాగరాజు 4,508 టన్నుల తెల్లరాయిని మింగేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. 10.నిరుపేద.. 51 వేల టన్నుల రాయిని మింగేశాడంటున్నారు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గతంలో క్వారీలో కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. ఇతడు చిన్న ఇల్లు తప్ప సెంటు పొలం కూడా లేని పేద కుటుంబానికి చెందినవాడు. ఓర్సు వెంకటేశ్వర్లు రూ.6 కోట్ల విలువైన 51,000 టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 11.సాధారణ కూలీపై కేసు నమోదు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. క్వారీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతడు రూ.5 కోట్ల విలువైన 40,000 టన్నుల సున్నపు రాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 12.కమిటీ సభ్యుడు కావడంతో కేసు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల ఏడుకొండలు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు మినహా సెంటు సొంత భూమి కూడా లేదు. గతంలో క్వారీల్లో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేత బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా ఏర్పడిన వడ్డెర సొసైటీలో సభ్యుడిగా చేరాడు. ఇతడు 2,400 టన్నుల సున్నపురాయిని దోచుకున్నాడంటూ కేసు పెట్టారు. కేవలం వడ్డెర సొసైటీలో కమిటీ సభ్యుడిగా ఉన్నందుకు ఒత్తిడి చేసి అక్రమ మైనింగ్ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. 13.ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తిపై కేసు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈర్ల వెంకట్రావు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఉండడానికి చిన్న ఇల్లు తప్ప వ్యవసాయ భూమి కానీ, సెంటు స్థలం కానీ లేవు. బ్యాంకు రుణంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి, క్వారీల్లో బాడుగకు పెట్టి నడిపిస్తున్నాడు. ఇతడు 9,600 టన్నుల సున్నపురాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
అక్రమాల లెక్క తేలేనా?
అరసవల్లి: శ్రీకాకుళం డివిజన్ మైనింగ్ అక్రమాల లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగిన ఆడిట్ అధికారులకు దిమ్మదిగిరే అనుభవం ఎదురయ్యింది. ఈ నెల 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు విశాఖపట్నంలో నిర్వహించిన మైనింగ్ ఆడిట్ ప్రక్రియకు కేవలం అభ్యంతరాలే తప్ప..అందుకు స్పందన దొరకక పోవడంతో సంబంధిత అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ముఖ్యంగా శ్రీకాకుళం డివిజన్లో గత కొన్నేళ్ల నుంచి బయటపడుతున్న మైనింగ్ అక్రమాల లెక్క సంగతి తేల్చేందుకు గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఆడిట్ ప్రక్రియను నిర్వహించారు. అయితే ఆడిట్ బృందానికి సమాధానం ఇచ్చే అధికారి ఒక్కరూ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో కేవలం జిల్లా కేంద్ర డివిజన్లో జరిగిన మైనింగ్ పనులపై అభ్యంతరాలతో అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శ్రీకాకుళం డివిజన్ అధికారులంతా గైర్హాజరే..! ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన మైనింగ్‌పై ఆడిట్ అధికార బృందం ఈనెల 6 నుంచి 10వ తేది వరకు డీడీ కార్యాలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాఖ జిల్లాలో విశాఖపట్నం ఏడీ, డీడీ, అనకాపల్లి ఏడీ, విజిలెన్స్ కార్యాలయాలు, అలాగే విజయనగరం ఏడీ, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఏడీ, టెక్కలి ఏడీ కార్యాలయాల్లో గత కొన్నేళ్లుగా జరిగిన మైనింగ్ వ్యవహారాలపై ఆడిట్‌ను నిర్వహించారు. ఈ ప్రక్రియకు కచ్చితంగా ఆయా కార్యాలయాల అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ)తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్‌తో సహా నాన్ టెక్నకల్ సిబ్బంది కూడా తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఆడిట్ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలకు వెంటనే సమాధానాలను నివేదిక రూపంలో అధికార బృందానికి అందజేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈ ఆడిట్ అభ్యంతరాల అంశంలో స్పందించేందుకు శ్రీకాకుళం డివిజన్ అధికారులు మినహా మిగిలిన జిల్లాల డివిజన్ల అధికారులు హజరయ్యారు. దీంతో శ్రీకాకుళం డివిజన్ అధికారులపై ఆడిట్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 87 అభ్యంతరాలకు సమాధానాలెక్కడ..? జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం డివిజన్లో మైనింగ్ అక్రమాలు పేట్రేగిపోతున్నాయన్న విమర్శలున్నాయి. తాజాగా నిర్వహించిన ఆడిట్ కార్యక్రమానికి కూడా స్థానిక డివిజన్ అధికారులు గైర్హాజర్ కావడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో మైనింగ్ అక్రమాలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు కొంద రు గనులశాఖ అధికారులు కూడా సహకరించడంతో అక్రమాలకు అడ్డూఆపు లేకుండా ఉన్నాయన్న విషయం ఇటీవల వంశధార నదికి వరదలు వచ్చినప్పుడు నిరూపితమైన సంగతి విదితమే. దీన్ని నిజం చేస్తున్నట్లుగా ఆడిట్ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాల్సిన డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది గానీ విశాఖ ఆడిట్ సమావేశాలకు హాజరుకాలేదు. శ్రీకాకుళం డివిజన్లో మొత్తం మైనింగ్ అక్రమాలపై అనుమానాలను, సందేహా లను ఆడిట్ అధికారులు వ్యక్తం చేశారు. మొత్తం 87 అభ్యంతరాలను అధికారులు లేవనెత్తారు. అయితే ఒక్క అభ్యంతరానికి కూడా డివిజన్ అధికారులు సమాధానం ఇవ్వలేదని తెలిసింది. శ్రీకాకుళం డివిజన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆడిట్ అధికార బృందం, మైనింగ్ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలావుంటే ఆడిట్ అభ్యంతరాలపై సమాధానాలు సకాలంలో పంపుతారా..లేదా అన్నదానిపై స్పష్టత కొరవడింది. దీంతో మైనింగ్ అక్రమాల నిగ్గు తేలనుందా లేదా..అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే..! త్వరలో నివేదికిస్తామన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఆడిట్ ప్రక్రియలో శ్రీకాకుళం డివిజన్ ఏడీ హాజరుకాలేదు. అయితే శ్రీకాకుళంలో ఏడీగా తమ్మినాయుడు ఇటీవలే రీ జాయిన్ అయిన కారణంగా, త్వరలోనే ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలను అందజేస్తామని చెప్పారు. ఆడిట్ అభ్యంతరాలకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. – ఎన్‌ఆర్‌వి.ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ (విశాఖ) -
గుట్టుగా గుట్ట తవ్వకాలు
మంచిర్యాలటౌన్ : కళ్ల ముందే ఖనిజ సంపదను కొల్లగొడుతున్నా వాటిని రక్షించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోనే గత ఆరు నెలలకుపైగా ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా క్వారీని నిర్వహిస్తున్నా, తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. క్వారీ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని తెలుసుకున్న కొందరు స్థాని కులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, రెండు ట్రాక్టర్లను క్వారీ వద్ద నుంచి బండ ను తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేశారు. అప్పటి వరకు అది ప్రభుత్వ భూమి అని, అందులోని బం డను పట్టపగలే యథేచ్ఛగా కొందరు కూలీలను పెట్టి మరీ ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి రాకపోవడంతోనే కొన్ని నెలలుగా గుట్టను కొల్లగొట్టడంతో ఆ ప్రదేశం అంతా గుంతలుగా మారింది. ఇది పాత మంచిర్యాల నుంచి రంగంపేట్‌కు వెళ్లే దారిలో అండాళమ్మ కాలనీ వద్ద గల కుమ్మరికుం ట చెరువు పక్కనే సాగుతున్న అక్రమ క్వారీ నిర్వహణ. రెవెన్యూ, మైనింగ్ శాఖల మధ్య సమన్వ యం లేకపోవడంతో యథేచ్ఛగా గుట్టను తవ్వు తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. లక్షల సంపద దోపిడీ పాత మంచిర్యాల నుంచి రంగంపేట్, ఆండాళమ్మ కాలనీకి వెళ్లే దారిలోనే మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే కుమ్మరికుంట చెరువు ఉంది. ఈ చెరువు పక్కనే ఉన్న ప్రదేశం అంతా ప్రభుత్వ భూమినే. 131 సర్వే నంబరులో దాదాపు 11 ఎకరాలకుపైగా మొత్తం క్వారీతో నిండిన ప్రదేశమే. అయితే ఈ భూమి కొంత అటవీప్రాంతంను ఆనుకుని ఉండడం, పూర్తిస్థాయిలో బండరాళ్లు లేకుండా అక్కడక్కడా మైదానప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ బండరాయి ఉన్నట్లుగా కనిపించదు. అయితే ఇటీవల మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంక్‌ను కుమ్మరికుంట చెరువుకు సమీపంలో నిర్మిస్తున్నారు. ఈ ట్యాంకు నిర్మాణంను ఓ కాంట్రాక్టర్ చేపడుతుండగా, నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో ఇక్కడ అంతా బండరాళ్లు బయటపడ్డాయి. ట్యాంకు నిర్మాణం కోసం ఇసుకను సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానుల కళ్లు అక్కడి బండరాళ్లపై పడింది. ఆ రాళ్లను ఎవరి అనుమతి తీసుకోకుండానే ప్రతీరోజు రెండు ట్రాక్టర్లతో 20కి పైగా ట్రిప్పులను తరలిస్తున్నారు. ఇందుకు కొందరు కూలీలను సైతం నియమించి, బేస్మెంట్కు ఉపయోగపడేలా రాళ్లను పగులకొట్టిస్తూ, అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు జరుగుతుండడంతో, ఇక్కడ అక్రమంగా గుట్టను తవ్వుతున్నట్లుగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. స్థానికులు కొందరు గుర్తించి, అడిగితే ట్యాంకు నిర్మాణంలో భాగంగా వచ్చిన బండరాయిని వారి అనుమతితోనే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అక్రమార్కులు చెప్పుకొచ్చారు. మరికొందరు అనుమతులు ఉన్నాయనుకున్నారు. ఆరు నెలలకు పైగా ఇక్కడి గుట్టను తవ్వకాలు జరపడంతో, గుట్టగా ఉన్న ఆ ప్రాంతం అంతా గుంతలుగా మారింది. బండరాయి ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1800ల నుంచి రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.40 వేలకు పైగా క్వారీ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారు. నెలకు రూ.12 లక్షకు పైగా ఆదాయం సమకూరుతుండగా, ఆరు నెలలుగా దాదాపుగా రూ.75 లక్షలకు పైగా విలువైన బండరాళ్లను అక్రమంగా ఇక్కడి నుంచి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎవరికి తెలియదట.. జిల్లా కేంద్రంలోనే గత ఆరు నెలలుగా కళ్లముందే అక్రమంగా క్వారీని నిర్వహిస్తున్నా ఇటు మైనింగ్ శాఖ అధికారులకు గాని, రెవెన్యూ శాఖ అధికారులకు గాని తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం ట్రాక్టర్ల ద్వారా బండరాయిని కూలీలను, జేసీబీని పెట్టి పగులకొట్టి తరలిస్తున్నా, ఇంత వరకు తమకు అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారన్న విషయం తెలియదని ఆ రెండు శాఖల అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీకే చెందిన కొందరు స్థానికులే ఈ అక్రమదందాకు పాల్పడుతున్నారని, అందుకే అధికారులు ఈ అక్రమ క్వారీని అడ్డుకోలేకపోయారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని గోదావరి నదిలో ఇసుకను అక్రమంగా తరలించి, మైనింగ్‌శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయలను అక్రమార్కులు కొల్లగొడుతుండగా, ఈ అక్రమ క్వారీ నిర్వహణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఖనిజ సంపదను ఎవరు పడితే వారు దోచుకెళ్తుంటే, అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారీని నిర్వహించేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కేవలం క్వారీ ప్రాంతంలోని సున్నపురాయిని తవ్వుకునేందుకు ఎంసీసీ కంపెనీ వారికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. జిల్లాలోని సబ్బెపల్లి, తిమ్మాపూర్, గూడెం, నాగారం, దేవాపూర్లలోని క్వారీలకు మాత్రమే తాము అనుమతి ఇచ్చాం. అక్రమంగా క్వారీని నిర్వహించి, బండరాళ్లను తొలగించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ ఈ అక్రమ క్వారీ నిర్వహణ తమ దృష్టికి రాలేదు. – శ్రీనివాస్, మైనింగ్ ఆర్ఐ మంచిర్యాల -
గనులను మింగిన ఆత్మలు!
సాక్షి, గుంటూరు: దశాబ్దాల క్రితమే చనిపోయిన వారి ఆత్మలు తెల్లరాయి గనులను అక్రమంగా తవ్వేస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నాయట! ఆత్మలు అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన స్వామి రామకోటయ్య అనే వ్యక్తి 2013లో అక్రమంగా గనులు తవ్వేశాడని, జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు ఆయన పేరుతో నోటీసు ఇచ్చారు. నిజానికి రామకోటయ్య 1998లోనే కన్ను మూశాడు. తన 20 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని, 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావు నెత్తీనోరూ బాదుకున్నా అధికారులు లెక్కచేయలేదు. ఆయనకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పించి, అమాయకులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసానుపల్లిలో పలువురికి మైనింగ్, విజిలెన్స్ అధికారులు నోటీసులిచ్చారు. రూ.1.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. దాచేపల్లికి చెందిన మరో ఐదుగురికి నోటీసులు అందాయి. విలువైన గనులను పట్టపగలే అడ్డంగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, దాంతో ఎలాంటి సంబంధంలేని తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని బాధితులు మండిపడుతున్నారు. సర్వే పేరిట అధికారుల హడావుడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోచేస్తూ, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టడంపై న్యాయస్థానం మండిపడింది. దీంతో హైకోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు రోజులపాటు సర్వే పేరిట హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని అమాయకుల మెడకు చుట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించడానికేనా? దాచేపల్లి పట్టణంతోపాటు కేసానుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు 2013 నుంచి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనింగ్ అంటే ఏమిటో కూడా తెలియని తమకు నోటీసులు అందడంతో భయాందోళనకు గురయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలో తమ పేర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మీ–సేవా కేంద్రాల్లో ఆరా తీశారు. ఎక్కడా తమ పేర్లు లేనట్లుగా గుర్తించి ఈసీలు తీసుకున్నారు. కేసానుపల్లికి చెందిన స్వామి రామకోటయ్య సర్వే నంబరు 336/6లో 16 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి, మొజాయిక్ చిప్స్ 5,834 మెట్రిక్ టన్నులు దోచుకున్నాడని, దాని విలువకు పది రెట్లు పెనాల్టీ వేసి మొత్తం రూ.28.23 లక్షలు చెల్లించాలంటూ 2013 ఆగస్టు 16 తేదీతో ఉన్న నోటీసును అధికారులు జారీ చేశారు. ఈ నోటీసును రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావుకు అందించారు. 1998లో తన తండ్రి రామకోటయ్య చనిపోయినట్లుగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రామలింగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నోటీసు తీసుకోకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. అదే గ్రామానికి చెందిన గుదె పేరయ్య సర్వే నంబరు 244లో 66 సెంట్ల విస్తీర్ణంలో 2015లో అక్రమ మైనింగ్‌కు పాల్పడి 32 వేల మెట్రిక్ టన్నుల మొజాయిక్ చిప్స్‌ను అక్రమంగా దోచేశాడని, పెనాల్టీ రూ.1.56 కోట్లు చెల్లించాలని 2017 మే 19 తేదీతో నోటీసు ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని పేరయ్య ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అలాగే మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో మైనింగ్ జరిగిన దాఖలాలు లేవని, ఆ ప్రాంతంలో ఎస్టీ కాలనీ ఉందని చెబుతున్నారు. సర్వే నంబరు 244 సమీపంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఉంది. మైనింగ్ మాఫియాను వదిలిపెట్టి, అమాయకులకు నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించేందుకే అమాయకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత గనులు తవ్వుతారా? ‘‘మా నాన్న స్వామి రామకోటయ్య 1998లో మరణించారు. సర్వేనంబర్ 336/6లో ఉన్న 16 సెంట్లలో మా నాన్న అక్రమంగా గనులు తవ్వారని, రూ.28,23,843 జరిమానా చెల్లించాలని అధికారులు నోటిసు ఇచ్చారు. ఈ నోటీసు 2013 ఆగస్టు 16న జారీ అయినట్లు ఉంది. మా నాన్న చనిపోయిన 20 ఏళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు. – స్వామి రామలింగేశ్వరరావు, కేసానుపల్లి అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు ‘‘అధికారులు 3 రోజుల క్రితం ఇంటికి వచ్చి మా నాన్న పేరయ్య పేరిట నోటీసులిచ్చారు. సర్వే నంబర్ 244లో ఉన్న 66 సెంట్ల స్థలంలో అక్రమంగా మైనింగ్ చేసినందుకు రూ.1.55 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఆ సర్వే నంబర్లో మాకు సెంటు స్థలం కూడా లేదు. గనుల కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు’’ – గుదె అనంతరామయ్య, కేసానుపల్లి చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం ‘‘కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు పంపాం. 2013, 2017లో కేసులు నమోదు కావడంతో ఆ తేదీలతోనే నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కేసు విచారణకు, ఈ నోటీసులకు సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం’’ – పాపారావు, మైనింగ్ డీడీ, ఇన్చార్జి విజిలెన్స్ ఏడీ -
చెంచుల భూముల్నీ చెరబట్టారు!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు, మైనింగ్ మాఫియా చివరకు.. రెక్కాడితే కానీ డొక్కాడని చెంచుల సాగు భూముల్నీ వదల్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో దౌర్జన్యంగా ఆ భూములను లాగేసుకుని అందులో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డు వస్తే చంపుతామని అమాయక గిరిజనాన్ని బెదిరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4.50 ఎకరాల్లో 12 అడుగుల లోతు తవ్వకాలు జరిపి కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయిని దోచుకున్నారు. అప్పటికీ ధన దాహం తీరకపోవడంతో మిగతా భూముల్లోకి సైతం చొరబడుతూ తవ్వకాలు జరుపుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ చెంచులు ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా వారి గోడు విన్ననాథుడే లేకుండా పోయారు. ఇటీవల అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అధికారులు ఆ భూముల్లో హడావుడిగా సర్వేలు నిర్వహిస్తున్న వైనాన్ని చూసి ఇప్పటికైనా తమ భూములను తమకు ఇప్పించాలని చెంచులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకునే భూములకు సంబంధించి వారికే పట్టాలు ఇవ్వాలంటూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జీవో జారీ అయ్యింది. ఆ జీవో ఆధారంగా కొండమోడు చెంచుకాలనీ వాసులు 18 మంది 36 ఎకరాల సాగు భూములకు పట్టాలు పొందారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను బాగుచేసుకుని పంటలు వేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు వారి చేతికందే సమయానికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు బుల్లి అబ్బాయి, అంజిబాబు, కోటి అనే వ్యక్తులు చెంచులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై చెంచులు స్థానిక తహసీల్దారు నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంతమందిని కలిసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులకు ఫిర్యాదులు చేయడం, ఆందోళనలకు దిగడం వంటివి చేస్తే మా ఎమ్మెల్యే ప్రస్తుతం సాగుచేసుకుంటున్న భూములు కూడా మీకు మిగలకుండా చేస్తారంటూ మైనింగ్ మాఫియా బెదిరింపులకు దిగడంతో ఆ అభాగ్యులు జీవనోపాధి కోల్పోయి కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి అక్రమ మైనింగ్‌ను నిలిపివేయించారు. ఇప్పటికైనా తమ భూములు తమకు దక్కేలా చూడాలని చెంచులు వారిని కోరుతున్నారు. అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తామన్నారు మాకు ప్రభుత్వం 2013లో పట్టాలు ఇచ్చింది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు అంజిబాబు, బుల్లి అబ్బాయిలు మా భూములు లాక్కొని అందులో క్వారీ కోసం తవ్వకాలు జరిపారు. ఇదేమని ప్రశ్నిస్తే.. అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపడానికి కూడా వెనుకాడమంటూ బెదిరింపులకు దిగారు. మా వద్ద నుంచి పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లాక్కున్నారు. – కందుకూరి చెంచుబాబు డబ్బులు తీసుకుని భూములిచ్చి ఉంటే ఏం చేయలేం కొండమోడు చెంచుకాలనీ వాసులు సాగు చేసుకునేందుకు గతంలో పట్టాలు ఇచ్చాం. వారిలో కొంతమంది పక్కనే మైనింగ్‌కు పాల్పడుతున్నవారి వద్ద డబ్బు తీసుకుని భూములు ఇచ్చేశారు. మిగతా వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. డబ్బు ఆశతో మైనింగ్‌కు భూములు ఇచ్చి ఉంటే మేము ఏమీ చేయలేం. – రవిబాబు, తహసీల్దారు, పిడుగురాళ్ళ ఎమ్మెల్యే తవ్వుకోమన్నారట.. మాకు పట్టాలు ఇచ్చిన భూముల్లో దౌర్జన్యంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే యరపతినేని తవ్వుకోమ న్నారని చెబుతున్నారు. మీరు ఏ అధికారికి చెప్పినా ఎవరూ పట్టించుకోరని కోటి అనే వ్యక్తి బెదిరించాడు. అతను చెప్పినట్టే ఎవరూ మమ్మ ల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను పొలం వదిలేసి కూలికి వెళుతున్నా. – చేవూరి అలివేలు వైఎస్ పెట్టిన భిక్షను లాగేశారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన జీవో ఆధారంగా మేము అప్పటి కలెక్టర్‌ను కలిశాం. ఆయన స్పందించి 18 మందికి 36 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. – వెంకటేశ్వర్లు, చెంచుకాలనీ పెద్ద -
కోర్టు ఆదేశాలతో కదిలిన మైనింగ్ శాఖ
గుంటూరు : గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగిందని హైకోర్టు గుర్తించింది. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ మైనింగ్ శాఖాధికారులు ఆగమేఘాల మీ కదిలారు. కోనంకి, కేశానుపల్లి, సీతారామాపురం సహా ఎనిమిది చోట్ల సర్వే చేసి అక్రమ తవ్వకాల లెక్కలు తీస్తున్నారు. దీనికి సంబంధించి యరపతినేనికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్, రెవిన్యూ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. -
మైనింగ్ అక్రమాలపై విచారణ మమ
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని క్వారీల ప్రాంతం... శనివారం ఉదయం 11 గంటల సమయం... అక్రమ మైనింగ్‌పై విచారణకు ప్రభత్వం ఏర్పాటు చేసి అధికారుల కమిటీ పర్యటన అప్పుడే ప్రారంభమైంది... క్వారీల్లో నిత్యం హోరెత్తించే పేలుళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అధికారుల బృందం క్వారీలను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు వెనుతిరిగింది. వారి వాహనాలు ఆ ప్రాంతం నుంచి కిలోమీటర్ కూడా వెళ్లకముందే.. క్వారీల్లో పేలుళ్లు మళ్లీ మొదలయ్యాయి. భారీ శబ్దాలతో క్వారీలు దద్దరిల్లిపోయాయి. కీలక మంత్రి ఇలాకాలో మైనింగ్ పర్మిట్లు నెల క్రితమే రద్దయినా యథాతథంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.పరిటాల శివారులోని దొనబండలో అక్రమ మైనింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సృందించింది. మైనింగ్ అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిది. కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులతో విచారణ కమిటీని నియమించారు. అధికారుల బృందం శనివారం పరిటాల కొండ పోరంబోకు భూముల్లో నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలను తూతూమంత్రంగా పరిశీలించి చేతులు దులుపుకుంది. అటవీ భూముల్లో అక్రమంగా సాగుతున్న తవ్వకాలపై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఒకవైపు సరిహద్దును మాత్రమే పరిశీలించి అంతా సక్రమంగానే ఉందనే నిర్ధారణకు వచ్చారు. ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల బృందం ఆటువైపు వెళ్లలేదు. క్వారీల హద్దులపై మరోసారి తనిఖీలు చేస్తామని అన్నారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతోందని చెప్పగా... ఆ విషయం మైనింగ్ సేఫ్టీ అధికారులు చూసుకుంటారని బదులిచ్చారు. తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, ఇంకేమీ ప్రశ్నించవద్దని మైనింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. మొత్తం 94 క్వారీలకుగాను, 20 క్వారీలను నిబంధనలు పాటించకపోవడంతో నిలిపివేశామని మైనింగ్ ఏడీ వైఎస్ బాబు తెలిపారు. ఆ 20 క్వారీలు యథాతథంగా పనిచేస్తున్నాయని, తమతో వస్తే చూపిస్తామని స్థానికులు చెప్పడంతో.. అలా జరగదంటూ దాటవేశారు. మైనింగ్ యథాతథం పరిటాల సమీపంలోని క్వారీల్లో సాగుతున్న అక్రమాలపై విచారణ కోసం అధికారుల బృందం వస్తోందని ముందుగానే సమాచారం అందుకున్న నిర్వహకులు మైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు తిరిగి వెళ్లిపోయిన వెంటనే క్వారీల్లో తవ్వకాలను ప్రారంభించారు. నెల క్రితమే పర్మిట్లు రద్దయినప్పటికీ క్వారీలు బ్లాస్టింగ్లతో హోరెత్తిపోయాయి. కంకర లోడ్లతో వాహనాలు తరలివెళ్లాయి. అక్రమాలు ఎక్కడా లేవట! అధికార పార్టీ నేతలే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అక్రమంగా కొనసాగుతున్న క్వారీల జోలికి వెళ్లొద్దని, అంతా సక్రమంగానే ఉన్నట్లు మీడియాకు చెప్పాలంటూ తమకు ఆదేశాలు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
డీజీపీఎస్ సర్వేతో అక్రమ మైనింగ్ గుర్తింపు
పెద్దేముల్ వికారాబాద్ : డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం)తో అక్రమ మైనింగ్‌ను గుర్తించవచ్చని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మైనింగ్ కార్యాలయంలో అధికారులు, సుద్ద, క్వారీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు పెద్దేముల్ మండలం కందనెల్లి తండా శివారులో ఉన్న క్రషర్ వద్ద హారితహారం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డీజీపీఎస్ సర్వే ద్వారా అక్రమాలను గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి లీజు తీసుకొని నిర్ణయించిన హద్దులు దాటితే డీజీపీఎస్ ద్వారా సులభంగా తెలుస్తోందని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో డీజీపీఎస్ ద్వారా చేపట్టిన సర్వే మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో సుద్ద, నాపరాయి, ఎర్రమట్టికి సంబంధించిన భూములు లీజు తీసుకొని.. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో కూడా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ సర్వే ద్వారా హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు. అనంతరం లీజుదారులకు డీజీపీఎస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. సుద్ద, క్వారీకి సంబంధించి అన్ని వ్యవహారాలు ఆన్లైన్లోనే చేయాలని ఆదేశించారు. సుద్ద ఫ్యాక్టరీల పరిసరాల్లో కాలుష్యం వెదజల్లకుండా మొక్కలు నాటాలని సూచించారు. తాండూరు ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ రవి, అధికారులు సాంబశివ, రమేష్ ఉన్నారు. -
చంద్రబాబు అండతోనే మైనింగ్ జరుగుతుంది
-
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు
-
యరపతినేని ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్
విజయవాడ: నాలుగేళ్లుగా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని గురజాల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో కాసు మహేశ్ విలేకరులతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ.270 కోట్ల దోపిడీ జరిగిందని విమర్శించారు. ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా యరపతినేని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో యరపతినేని కీలక సూత్రధారి అని లోకాయుక్త నిర్ధారించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా యరపతినేని ఆధ్వర్యంలో అక్రమమైనింగ్ జరుగుతుందన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి తీవ్రమైన అక్షింతలు వేసినా వీరికి బుద్ధిరాలేదని మండిపడ్డారు. మీకు దగ్గర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం అండదండలతోనే ఇదంతా జరుగుతుందని వ్యాఖ్యానించారు. వడవల్లి వెంకటేశ్వర్లు, ఘట్టమనేని నాగేశ్వరరావు, నెలూరి శ్రీనివాస రావు అనే ఈ ముగ్గురూ యరపతినేని బినామీలు అని ఆరోపణ చేశారు. -
మంత్రి ఇలాకాలో అక్రమ మైనింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి తూట్లు పొడుస్తూ కాలుష్యం వెదజల్లుతున్న అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించినా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం వీటికి తెరపడటం లేదు. పర్మిట్లు రద్దు చేసినా నెల దాటుతున్నా ఉన్నతస్థాయి అండదండలతో మైనింగ్ మాఫియా నిత్యం వేలాది టన్నుల కంకరను తరలిస్తోంది. జాతీయ రహదారి చెంతనే.. నందిగామ, మైలవరం నియోజవర్గాల పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాల దొనబండ సర్వేనంబర్ 801లో 1,204 హెక్టార్ల కొండపోరంబోకు భూములున్నాయి. సహజవనరులు విస్తరించిన ఇక్కడి భూముల్లో 94 క్వారీలు, 72 క్రషర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఈ క్వారీలున్నాయి. నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో వీటిని ఏర్పాటు చేయకూడదు. కానీ వంద మీటర్ల లోపే క్రషర్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 నుంచి 5 హెక్టార్ల చొప్పున 94 క్వారీల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 800 హెక్టార్లలో క్వారీలు తవ్వేశారు. కొండలను తొలిచేశారు. నిత్యం 500 వాహనాల్లో తరలింపు.. పరిటాల పరిధిలో మంత్రి సమీప బంధువులతోపాటు మోడరన్ క్రషర్, పవన్స్టోన్ క్రషర్, అయ్యప్ప క్రషర్, ఎన్ఎన్ఆర్ క్రషర్స్ యజమానులే అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల నుంచి పెద్ద బండరాళ్లను క్రషర్ ద్వారా 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, డస్ట్, బేబీ చిప్స్, జీఎస్బీ వెట్మిక్స్లా మార్చి నిత్యం 500 భారీ వాహనాల్లో 21,000 టన్నుల కంకరను రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం నుంచి భవన నిర్మాణాల వరకు రవాణా చేస్తున్నారు. 10 టైర్ల వాహనంలో 16 టన్నుల లోడ్ వెళ్లాల్సి ఉంటే 30 టన్నులు తరలిస్తున్నారు. 12 టైర్ల వాహనంలో 22 టన్నులకు బదులు 60 టన్నుల చొప్పున తరలిపోతున్నా పోలీస్, రవాణాశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. నిత్యం రూ. 1.2 కోట్ల విలువైన మెటల్‌ను తరలిస్తున్నారు. గుండెలు అదిరేలా బ్లాస్టింగ్లు.. పరిటాల క్వారీల్లో అనుమతులు లేకుండా నిత్యం రిగ్గు బ్లాస్టింగ్లు చేయడంతో దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపిస్తోంది. వాస్తవంగా క్వారీ నిర్వాహకులు 15 నుంచి 20 అడుగుల వరకు నిపుణుల పర్యవేక్షణలో బ్లాస్టింగ్ ద్వారా రెండు కొండ రాళ్ల మధ్య మట్టిని మాత్రమే తొలగించాలి. బ్లాస్టింగ్ చేసేటప్పుడు తప్పక హెల్మెట్ వాడాలి. బ్లాస్టింగ్‌లో డిప్లొమా చేసిన నిపుణులు ఉండాలి. పోలీస్, ఫైర్‌శాఖ అనుమతులు పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క నిబంధనా పాటించడం లేదు. బోర్లు వేసే రిగ్గు వాహనాలతో 150 నుంచి 200 అడుగుల వరకు గోతులు తవ్వి అమ్మోనియా, జెలిటిన్‌స్టిక్, యూరియా, గంధకం, సాల్టు నింపి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ప్రమాదకరమైన జెలిటిన్‌స్టిక్ వాడటంతో భూమి కంపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రితో మైనింగ్ మాఫియాకు బంధుత్వం ఉండటంతో ఎన్నికల సమయంలో నజరానాగా నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో రూ.30 కోట్లు ఫండ్‌గా అందచేసినట్లు చెబుతున్నారు. రాళ్ల కింద బతుకులు సమాధి క్వారీల్లో పనిచేసేందుకు ఒడిశా, వైజాగ్, జార్కండ్, చత్తీస్ఘడ్ ప్రాంతాల నుంచి వేలాది మందిని రప్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొండ రాళ్లు పడి పలువురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన విషయం కూడా వెలుగులోకి రానివ్వకుండా ప్రాణాలకు వెలకట్టి గుట్టుగా మృతదేహాలను తరలిస్తున్నారు. క్వారీల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే బెదిరించి వెళ్లగొడుతున్నారు. పర్మిట్లు రద్దు చేసినా.. భద్రతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, కాలుష్యం కారణంగా పరిటాల సమీపంలోని రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని కాలుష్య నియంత్రణ మండలి గత నెల 20న ఆదేశాలిచ్చింది. కానీ కంకర తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొనబండలో 40 క్వారీలకు పర్మిట్లు లేకపోయినా మెటల్‌ను తరలిస్తున్నారు. నిత్యం వే బిల్లులు లేకుండా క్వారీల నుంచి 500 లారీల కంకరను తరలిస్తున్నారు. లారీల బంద్ జరుగుతున్నా ఇక్కడ మాత్రం వాహనాలు తిరుగుతున్నాయి. వేబిల్లులు లేకుండా తరలిస్తున్నారు... వే బిల్లుల జారీ నెల రోజుల క్రితమే ఆపేసినా కంకర మాత్రం తరలుతోంది. నిత్యం రిగ్గు బ్లాస్టింగ్ పేలుళ్లతో బెంబేలెత్తిపోతున్నాం. భూకంపం వచ్చినట్లుగా కంపిస్తోంది. క్వారీల్లో అక్రమాలపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎన్ అమ్మారావు(గాంధీ), స్థానికుడు, పరిటాల నోటీసులు ఇచ్చినా ఆగడం లేదు... రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని పొల్యూషన్ కంట్రోలు బోర్డు ఆదేశించడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. పీసీబీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ క్వారీలను నడుపుతున్నారు. క్వారీలను నిలిపేందుకు నాకు ఇబ్బందులున్నాయి. – వైఎస్ బాబు, మైనింగ్ అధికారి -
అవినీతికి పరాకాష్ట
ఏపీలోని నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశానుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో జాతి సంపద దోచుకున్న అసలైన వ్యక్తులను వదిలేసి.. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న అనామకులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేస్తారా?.. ఇలాంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఏపీలో లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. అవినీతికి ఇది పరాకాష్ట. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తూ విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కూలీలపై కేసులు పెట్టి అసలు వ్యక్తులను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ శాఖ అధికారుల విచారణ తీరును కూడా తీవ్రంగా ఆక్షేపిస్తూ.. లేని నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతికినట్లు ఉందంటూ మండిపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లా కోనంకి, నడికుడి, కేశానుపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), కేంద్ర గనుల శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా వారిని ఈ కేసులో సుమోటోగా (తనంతట తాను) ప్రతివాదులుగా చేర్చింది. అంతేకాక అక్రమ మైనింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు జారీచేసింది. ఆయన వాదనలను వినదలిచామని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలు ఏమైనా తీసుకుని ఉంటే.. ఆ వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. – కోర్టు వద్దన్నా.. యరపతినేని అక్రమ మైనింగ్ చేస్తూనే ఉన్నారు ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశనుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో యథేచ్ఛగా లైమ్‌స్టోన్ తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతో పాటు బాధ్యులను గుర్తించి వారి నుంచి అక్రమ మైనింగ్ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌స్టోన్ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేరకు ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ.. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం దానిని మరోసారి విచారించింది. – కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు.. పిటిషనర్ తరుఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. కోనంకి, నడికుడి, కేశనుపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కొందరు స్థానికులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన లోకాయుక్త అధికారులు తమ నివేదికలో.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినా.. మైనింగ్ అధికారులు మాత్రం పెద్దల జోలికి వెళ్లకుండా స్థానికంగా పనిచేసే నలుగురు కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారని వివరించారు. కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. బాధ్యుల నుంచి దోచుకున్న సొమ్మును వసూలు చేసే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తర్వాత ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రెండు ట్రాక్టర్లను జప్తు చేసినట్లు వివరించారు. – అసలైనవారిని వదిలేసి అనామకులపై కేసులా? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఎంత మందిపై కేసు నమోదు చేశారు.. ఎంత మందిపై విచారణ ప్రారంభించారు.. ఎన్ని టన్నుల ఖనిజం అక్రమంగా తరలిపోయింది.. ఈ వివరాల సంగతేంటని ప్రశ్నించింది. ‘నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశనుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో ముగ్గురు, నలుగురు కూలీలపై కేసులు పెట్టినట్లున్నారు. ఆ ముగ్గురు నలుగురికి ఇంత పెద్ద స్థాయిలో రాత్రికి రాత్రే ఖనిజం తరలించడం సాధ్యమయ్యే పనేనా?! అవినీతికి ఇది పరాకాష్ట. జాతి సంపదను దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు సీరియస్‌గా వ్యవహరించడం లేదు. అక్రమ మైనింగ్ చేసినట్లు గుర్తించిన వారికి ఎటువంటి డిమాండ్ నోటీసులూ ఇవ్వలేదు. జరిగిన నష్టాన్ని రాబట్టేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే.. అధికారులు కచ్చితంగా అవినీతికి పాల్పడినట్టే. అటువంటి అవినీతిపరులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న వాళ్లపై కేసులు పెట్టిన అధికారులు.. ఖనిజ సంపద దోచుకున్న వారిపై పెట్టరా? అసలైన వ్యక్తులను వదిలేసి.. అనామకులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారణ చేస్తారా? ఇటువంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే.. లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, గనులశాఖ అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. -
‘అక్రమ మైనింగ్ సమాజానికి ప్రమాదకరం’
సాక్షి, హైదరాబాద్: సమాజానికి అక్రమ మైనింగ్ ప్రమాదకారిగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అక్ర మ మైనింగ్ వల్ల తీవ్ర స్థాయిలో పర్యావరణం ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించట్లేదని, ఎవరు తేలిగ్గా తీసుకున్నా తాము మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ బ్లాకుల కొలతలను తక్కువగా చూపుతూ పలు గ్రానైట్ సంస్థలు భారీ మొత్తంలో వందల కోట్ల రూపాయల మేర సీనరేజీని ఎగవేశాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌తో పాటు సీనరేజీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతా ఏజెన్సీస్, శ్వేతా గ్రానైట్స్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బాక్సి కంపెనీ, మైథిలీ ఆదిత్య, కేవీఆర్ ఏజెన్సీస్, అరవింద్ ఏజెన్సీస్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘లోకేష్‌కు కప్పం కడుతున్న ఎమ్మెల్యే’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతలు అధికార మదంతో ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సహజ వనరులను అడ్డంగా దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆగడాలకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కొడుకు లోకేష్ బాబుకు కప్పం కడుతూ మైనింగ్ పేరుతో శ్రీనివాస్ అందినంత దోచుకుంటున్నారని అంబటి ఆరోపించారు. గురజాలలో ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గురజాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి మట్లాడుతూ.. పవిత్రమైన పల్నాడులో గంజాయి, నాటు సారా ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. మైనర్ బాలికపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని మహేష్ రెడ్డి సవాల్ చేశారు. -
ఆదమరిస్తే అంతే.....
గరివిడి, విజయనగరం : మండలంలోని వెదుళ్లవలస పంచాయతీ మధుర గ్రామమైన ఆవగూడెంలో జరుగుతున్న మైనింగ్ ప్రమాదకరంగా మారుతోంది. సంబంధిత మైనింగ్ యజమానులు పరిమితులకు మించి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టకపోవడం వల్లే యాజమానులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి సమీపంలో ఓ కంపెనీ వారు మాంగనీస్ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ సేకరించిన మెటీరియల్‌ను గరివిడిలోని ఫెర్రో అల్లాయీస్ కర్మాగారానికి తరలిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ రస్తాలకు, రహదారులకు 20 గజాల దూరంలో మైనింగ్ చేపట్టాలి. అయితే ఆవగూడెంలో మాత్రం రహదారికి కేవలం ఐదు గజాల దూరం వరకు మైనింగ్ చేస్తూ వచ్చేశారు. పైగా మైనింగ్ లోతు కూడా సుమారు 300 అడుగుల లోతు ఉంది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగించే వారు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా పెను ప్రమాదం తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా గ్రామ సమీపంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. రహదారికి ఆనుకుని వర్షాధార కాలువ ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ వైపుగా ప్రయాణం చేయాలంటేనే వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు. అదే దారిలో మరికొన్ని.. మండలంలోని ఆవగూడెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా మైనింగ్ జరుగుతోంది. వెదుళ్లవలసతో పాటు దేవాడ గ్రామాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోంది. రహదారులకు అతి సమీపంలో మైనింగ్ జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడే పరిశీలనలకు వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏపీలో అక్రమ మైనింగ్: కేంద్రంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం విచారణ జరిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు నెలల కిందట నోటీసు ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ తీరు మారకపోతే.. అధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజే కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. -
మంత్రికి తెలిసే అక్రమ మైనింగ్!
గుంటూరు రూరల్: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలుసనీ, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా ఆపలేక పోయారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేదని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రావెల మీడియాతో మాట్లాడుతూ ఓబులునాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట, పేరేచర్ల, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో నారాయణస్వామి, అశోక్ అనే వ్యక్తులు అజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. -
మంత్రి ప్రత్తిపాటికి చెప్పినా...
సాక్షి, గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినా తన నియోజకవర్గంలో భూ అక్రమాలు ఆగడం లేదని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వాపోయారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో భూ అక్రమాలు జరగడం వల్ల తన పాత్ర ఉందని చాలా మంది అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్బుద్ధి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కాగా, మంత్రికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం ఏపీలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
10న కాంగ్రెస్‌లోకి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర
బొమ్మనహళ్లి: బళ్ళారి జిల్లా బీజేపీకి మరో ఎదురుదెబ్బ. జిల్లా హసపేట బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, కూడ్లిగి నియోజకవర్గం బీజేపీ నాగేంద్ర కూడా అదే బాటలో ఈ నెల 10వ తేదిన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య శనివారం మీడియాతో తెలిపారు. శనివారం నాగేంద్ర సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఈ విషయమై చర్చలు జరిపారు. 10వ తేదీన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బళ్లారి జిల్లాలో పర్యటిస్తారు. ఆ సమయంలో నాగేం«ద్ర కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఒకేజిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ కోల్పోవడం పార్టీ నాయకులను కలవరపరుస్తోంది. -
ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్
విశాఖ : రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో విజయ్‌కు పెద్ద మొత్తంలో షేర్లున్నాయని, దాన్ని అడ్డుకోవాలంటూ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయ్.. తనకు మైనింగ్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయనడం సత్యదూరమన్నారు. అబ్బాయి రెడ్డి, శ్రీనులతో తనను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. -
డీల్ డన్ !
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : కృష్ణా నదిలో అక్రమంగా డంప్ చేసిన రూ.30కోట్లకు పైగా విలువ చేసే ఇసుకను తరలించేందుకు డీల్ కుదిరింది. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఎలాగైనా తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవహారం చక్కబెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంలో తమతోపాటు సహకారం అందిస్తున్న వారికి డబ్బుల్లో వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ వాటాలను కూడా ప్రభుత్వ పెద్దలే నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రేపో.. మాపో భారీగా ఉన్న ఇసుక నిల్వలను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారీ ఎత్తున ఇసుకను నిల్వచేసిన వారిలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి బంధువు, ఒక సర్పంచ్ భర్త, అతని అనుచరుడు ఉన్నారు. అదును చూసి...: లింగాయపాలెం, రాయపూడి పరిధిలో కృష్ణా నదీ తీరాన రూ.30కోట్లకు పైగా విలువచేసే ఇసుక డంప్ చేసి ఉన్న విషయం తెలిసిందే. డ్రెడ్జర్లు, భారీ యంత్రాలతో రాత్రి, పగలు తేడా లేకుండా నదిలోని ఇసుకను తవ్వి నిల్వచేశారు. ఈ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ కథనాలపై స్పందించిన స్థానికులు.. ఇసుకను తరలించకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. దీంతో అక్రమార్కులు ఇసుకను తరలించకుండా కొద్దిరోజులు వేచిచూడాలని భావించారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో బేరం కుదరడంతో తరలింపునకు రంగంసిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కూలీల ఆశలపై నీళ్లు..: భూములు కోల్పోయి, ఉపాధి కరువైన కూలీలు ఈ అక్రమ ఇసుక నిల్వలను వినియోగించుకోవాలని భావించారు. అందులో భాగంగా కూలీలు కొందరు గృహనిర్మాణాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి ఉపాధి పొందాలని భావించారు. కొందరు కూలీలు ఇసుకను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇసుకాసురులు కృష్ణానది వద్దకు చేరుకుని కూలీల కదలికలను పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇసుక ఎవరు తరలించాలని చెప్పారు... క్వారీ ఎవరిది.. అని పలు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా తీసుకోవాలని చెప్పింది కదా? అందుకే గృహనిర్మాణాలకు తీసుకువెళుతున్నట్లు కూలీలు బదులిస్తున్నారు. మంత్రుల మంతనాలు..: ఈ క్రమంలో అక్రంగా నిల్వ చేసిన ఇసుకను తరలించేందుకు కాంట్రాక్టర్ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో సంబంధిత మంత్రి ఒకరు ఆ శాఖ అధికారులను క్వారీ వద్దకు పంపించారు. ఇసుక తామే నిల్వచేశామని కూలీలకు చెప్పించారు. ఇసుకను తీసుకువెళ్లడానికి వీల్లేదని కూలీలను హెచ్చరించారు. కూలీలు అధికారుల హెచ్చరికలకు బెదరకపోవడంతో... సదరు మంత్రితోపాటు గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి కలిసి ‘ముఖ్య’ నేత వద్ద ఇసుక పంచాయితీ పెట్టారు. వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ‘ముందుండి ఇసుకను తరలించే బాధ్యత మీదే’ అని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇసుక పంచాయితీ కొలిక్కి రావడంతో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో వాటాలు నిర్ణయించారు. డంప్‌చేసిన ఇసుకను ప్రతి రోజూ 700 లారీల ద్వారా హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు తరలిస్తారు. లారీ ఇసుక రూ.40వేల చొప్పున నిర్ణయించినట్లు తెలిసింది. రోజుకు 700 లారీల ఇసుక ద్వారా రూ.2.80 కోట్లు రాబట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని వాటాలుగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎకనమిక్ సిటీకి ప్రణాళికలు రూపొందించాలి : కలెక్టర్ విజయవాడ : జక్కంపూడిలో ఎకనమిక్ సిటీ ఏర్పాటు చేసి అక్కడ పరిశ్రమల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(ఎపిట్కో) అధికారులకు కలెక్టర్ బాబు.ఎ సూచించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎపిట్కో ఉన్నతాధికారులతో జక్కంపూడిలో ఎకనమిక్ సిటీ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎకనమిక్ సిటీలో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఉండాలన్నారు. అనంతరం ప్రింటింగ్, ఫుట్‌వేర్ వంటి పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలను ఎపిట్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎకనమిక్ టౌన్షిప్లో వివిధ కేటగిరీలకు చెందిన గృహసముదాయాలు ఉంటాయని చెప్పారు. ఎకనమిక్ సిటీలో 3,75,232 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల 32,650 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఇందుకోసం రూ.1,500 కోట్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో ఎపిట్కో వైస్ చైర్మన్ రామనాథం, ఇంజినీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
హమీలు గాలికొదిలేశారు: లక్ష్మణ్
యాదాద్రి: ఎన్నికల్లో ఇచ్చిన హమీలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. భూపాలపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నిరసన ర్యాలీకి వెళ్లారు. ఆయన జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరిలోని సంకల్ప్ హోటల్లో గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విదానాలను అవలంభిస్తోందని, వీటిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో బీజేపీ ఎప్పుడు ముందుటుందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారని ఎద్దేవ చేశారు. -
చినబాబు పచ్చజెండా!
అక్రమ మైనింగ్ షురూ! – మెల్లమెల్లగా ప్రారంభించిన తెలుగు తమ్ముళ్లు – రాత్రి సమయాల్లో జేసీబీతో తవ్వకాలు – చినబాబు కనుసన్నల్లోనే వ్యవహారం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అక్రమ మైనింగ్ మళ్లీ ప్రారంభమైంది. మెల్లమెల్లగా అధికార పార్టీ నేతలు ఈ దందాకు తెరతీశారు. అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో జేసీబీతో తవ్వకాలు చేపడుతున్నారు. పగలు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. కర్నూలుకు కూత వేటు దూరంలో ఉన్న వెల్దుర్తి మండలంలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీకి చెందిన చిన్నబాబు కనుసన్నల్లో సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. తోడుగా అక్రమ మైనింగ్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే జేసీబీలతో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అటువైపుగా కన్నెత్తి చూసేందుకు మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సాహసించని పరిస్థితి. ఈ మేరకు చిన్నబాబు నుంచి సీరియస్‌గా ఆదేశాలు ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామని ఆయా శాఖల అధికారులు వాపోతున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే.. వాస్తవానికి ఆరు నెలల క్రితం జరిగిన సమావేశంలో మైనింగ్ మూతపడిన విషయాన్ని సదరు చిన్నబాబు దృష్టికి అధికార పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లారు. మైనింగ్ జరిగితే తమకు ఆదాయ వనరుగా మారుతుందని.. అందువల్ల అక్రమ మైనింగ్ ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్‌ను మెల్లమెల్లగా ప్రారంభించుకోవాలని.. ఇందుకు సరైన సమయంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు తాజాగా చిన్నబాబు కాస్తా ఆమోదముద్ర వేయగానే తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ పట్టించుకోవద్దని ఇటు మైనింగ్ అధికారులతో పాటు అటు రెవెన్యూ, పోలీసులకు కూడా సదరు చిన్నబాబు నుంచి గట్టిగా ఆదేశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మూతపడిన చెక్‌పోస్టు జిల్లాలో అధికంగా మైనింగ్ నిల్వలు వెల్దుర్తి మండలంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ కూడా గతంలో జోరుగా సాగేది. పంట పొలాలతో పాటు వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖ భూముల్లోనూ అనుమతులు లేకుండా గతంలో అక్రమంగా తవ్వకాలను చేపట్టారు. అయితే, దీనిపై అనేక ఆరోపణలు రావడంతో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌శాఖల ఆధ్వర్యంలో రామళ్లకోటకు సమీపంలో చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ చెక్‌పోస్టు వద్ద కాపలా ఉంచారు. దీంతో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. అయితే, తిరిగి తాజాగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తమకు ఆదాయం లేకుండా పోతోందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్‌తో అధికారుల నోళ్లు మూయించి అక్రమ మైనింగ్‌కు తెరలేపారు. దీంతో చెక్‌పోస్టు వద్ద కూడా ఎలాంటి కాపలా లేకుండా నిరుపయోగంగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికే అక్రమ ఇసుకతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న తెలుగు తమ్ముళ్లు.. మైనింగ్ ఆదాయం కూడా తోడు చేసుకోవడం గమనార్హం. -
గ్రావెల్ అక్రమార్కులు టీడీపీ నేతలే
అక్రమ మైనింగ్ పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న మైనింగ్ ఏడీ బహిరంగ విచారణకు రావాలని టీడీపీ నేతలకు కాకాణి సవాల్ నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తరలింపులో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని, దొంగే దొంగ..దొంగ అని అరుస్తున్న చందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ గ్రావెల్ తరలింపులో తమ నాయకుల భాగస్వామ్యం ఉందని పత్రికల్లో వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన ఖండించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను అనేక మార్లు తాను కోరినట్లు గుర్తు చేశారు. జెడ్పీ సమావేశంలో, శాసనసభ సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిపారు. వెంకటాచలం మండలం కనుపూరులో అక్రమంగా గ్రావెల్ తరలింపులో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడికి భాగస్వామ్యం ఉందని పత్రికల్లో కథనంలో వాస్తవం లేదన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మైనింగ్ ఏడీ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు పట్టుకున్న పోలీసులు క్రిమినల్ పెడుతూ, భారీగా జరిమానా విధించడం దారుణమన్నారు. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తున్న యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గ్రావెల్ తవ్వకాలు చేపట్టిన యంత్రాలు సీజ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఖనిజ సంపదను కొల్లగొట్టే వారిపై వారిపై చర్యలు తీసుకుని యంత్రాలను సీజ్ చేయాలన్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు మీడియా సాక్షిగా బహిరంగ విచారణకు రావాలని సవాలు విసిరారు. ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలే వాస్తవాలు తెలియజేస్తారని చెప్పారు. పత్రికలు, మీడియా వాస్తవాలను వెల్లడించాలని హితవు పలికారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెట్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ముత్తుకూరు మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
అటవీభూముల్లో తవ్వకాలపై 'విజిలెన్స్'
సైదాపురం: అటవీ భూముల్లో మట్టి తవ్వకాలపై విజిలెన్స్ డీఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి విచారణ చేపట్టారు. షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు తారురోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ అటవీ అధికారుల అనుమతి లేకుండానే అడవిలో 900 మీటర్ల మేర మట్టిని తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీనివాసులునాయుడు అనే వ్యక్తి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొలకలపూండ్ల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సైదాపురం పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించారని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు రాతపూర్వకంగా తెలిపారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రావెల్ తవ్విన 900 మీటర్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందన్నారు. ఈ విషయమై అధికారులు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపితే అనుమతులు వస్తాయన్నారు. అప్పటి వరకు పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నెల్లూరు, వెంకటగిరి రేంజర్లు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌రెడ్డి, విజిలెన్స్ రేంజర్ సుబ్బారెడ్డి తదితరులున్నారు. -
మట్టి..గ్రావెల్ మాఫియా
యథేచ్ఛగా తమిళనాడుకు తరలింపు విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల వ్యాపారం సూళ్లూరుపేట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చా ఆ పార్టీ నేతలు అలీబాబా 40 దొంగల్లా మారారు. సంపాదనకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చెరువుల్లో మట్టి.. రిజర్వ్ ఫారెస్ట్‌లోని కొల్లగొట్టే మాఫియాగా మారారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలను చూస్తే వణికిపోతున్నారు. విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నా.. అధికారులు మాత్రం నిస్సాహాయస్థితిలో ఉన్నారు. నీరు–చెట్టు పథకంలో తీసిన మట్టిని రియల్ ఎస్టేట్ల వెంచర్లకు తోలుకుని రెండు వైపులా సొమ్ము చేసుకుంటున్నారు. సూళ్లూరుపేట, తడ మండలాల్లో చెరువుల్లో మట్టి తవ్వేసి చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, గ్రావెల్‌ను పగలూ, రాత్రి తేడా లేకుండా తరలించడం చూస్తుంటే జాతరలా ఉంది పరిస్థితి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాముల కాలువ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న టెక్స్టైల్ పార్కుకు తడ మండలంలోని కాదలూరు పెద్ద చెరువు, కొండూరు సోమయాజులు చెరువు, కాశింఖాన్కండ్రిగ చెరువు, చేనిగుంట వడగనేరి చెరువు, తడకండ్రిగ చెరువు, వెండ్లూరుపాడు చెరువు, సూళ్లూరుపేట మండలంలో ఇలుపూరు, మంగళంపాడు చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా చెరువుల్లో మట్టి తీసేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి అనుమతులు తీసుకోవడంతో స్థానిక అధికారులెవరూ ఆపే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ‘ ఊరు మనదే దోచేయ్’ అనే రీతిలో ఆ పార్టీ నేతల పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఎం.జానకి ఇచ్చిన అనుమతిలో చెరువుల్లో పద్ధతి ప్రకారం రెండు నుంచి నాలుగు అడుగుల లోతులో చెరువు అంతా మట్టి తీయాలని ఆదేశాలిచ్చారు. అలా కాకుండా చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడే పెద్ద పెద్ద బావులను తలపించేలా తవ్వేస్తున్నారు. భవిష్యత్‌లో వానలు తక్కువగా కురిస్తే గుంతల్లోనే నీళ్లు చేరిపోయి తూములు వరకు వచ్చే పరిస్థితులు లేవని రైతులు అందోళన చెందుతున్నారు. రిజర్వు ఫారెస్ట్‌లో గ్రావెల్ అక్రమ రవాణా చెరువుల్లో మట్టి దోపిడీ చేయడంతో పాటు తడ మండలం మాంబట్టు సమీపంలోని నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో గ్రావెల్‌ను తమిళనాడుకు అక్రమంగా యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంలో నిరుపేద దళితులకు ఇచ్చిన రిజర్వ్ ఫారెస్ట్ భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారే వచ్చి నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతలకు అప్పగించారు. దీంతో వీళ్లు మరో ఓబులాపురం గనుల తరహాలో అయిదారు హిటాచీలు పెట్టి వందలాది టిప్పుర్లతో తమిళనాడుకు గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. మాంబట్టు సెజ్‌లోని ఆపాచీ కంపెనీ, భారత్ లెదర్ కంపెనీ మధ్యలో డొంకదారిని వెడల్పు చేసి అటవీ శాఖ భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసుకుని గ్రావెల్‌ను పగలు రాత్రి తేడా లేకుండా తరలించేస్తున్నారు. అటవీ ప్రాంతమంతా ఓబులాపురం గనుల తరహాలో సుమారు ఒక తాటిమాను మునిగిపోయేంత లోతుగా తవ్వేసి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రస్తుతం సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో హైవే మీద వెళ్లాలంటేనే టిప్పర్లు స్పీడ్‌కు భయపడిపోతున్నారు. -
అడుగుపెడితే చచ్చిపోతాం...!
కొల్లేటికోట (కైకలూరు) : కొల్లేరు అభయారణ్యంలో మంచినీటి చెరువుల పేరుతో సాగుతున్న అక్రమ తవ్వకాలకు అంతు ఉండటం లేదు. నిన్నటి వరకు మండవల్లి మండలానికి పరిమితమైన తవ్వకాలు ఇప్పుడు కైకలూరు మండలానికి పాకింది. కొల్లేటికోటలో అభయరణ్యపరిధిలో సుమారు 60 ఎకరాలు చెరువు పనులను శుక్రవారం పొక్లయిన్‌తో ప్రారంభించారు. ఇప్పుడు అటవీ సిబ్బందిని అడ్డుకోవడానికి అక్రమార్కులు కొత్త రూట్ కనిపెట్టారు. అధికారులు ఆ పనుల వద్దకు వెళ్లకుండా టెంట్లు వేసి మహిళలను ముందు వరసలో పెట్టారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు, సిబ్బందితో లోపలకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఎవరినీ వెళ్లనివ్వలేదు. రెండు నెలల వ్యవధిలో కొల్లేరు ప్రాంతంలో గుమ్మళ్ళపాడు, చింతపాడు, పులపర్రు గ్రామాల్లో తాగునీటి చెరువుల పేరుతో చెరువులను తవ్వేశారు. అన్నింటా ఒకటే సూత్రం మహిళలను అడ్డుపెట్టడం. కొల్లేటికోట విషయానికి వస్తే మరీ అడ్డగోలు వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికే మంచినీటి అవసరాల నిమిత్తం 30 ఎకరాల తాగునీటి చెరువు ఉంది. దీనికి అధనంగా మరో 60 ఎకరాలు తవ్వుతున్నారు. విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. పురుగుమందు డబ్బాలతో బెదిరింపు.. కొల్లేటికోటలో మహిళలు మరో అడుగు ముందుకేశారు. అధికారులు, మీడియా లోపలకి వెళితే పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. పలువురు మహిళల చేతుల్లో పురగుమందు డబ్బాలు ఉన్నాయి. పులపర్రు, చింతపాడు గ్రామాల మాదిరిగా మహిళలను ముందు వరసలో ఉంచి, సూత్రధారులు వారి వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు. కనీసం లోపల జరిగే తంతును ఫొటోలు తీయడానికి వెళ్ళిన మీడియాను అనుమతించలేదు. షరామమూలుగానే కైకలూరు రూరల్ స్టేషన్లో ఓ ఆరుగురు పెద్దలపై అటవీశాకాధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. కొల్లేరులో చట్టాలు వర్తించవా..? కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకునే చెరువులు తవ్వాలని ఆయన పదేపదే చెబుతున్నా,అక్రమ చేపల చెరువుల తవ్వకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారపక్షం అండతో నియోజకవర్గ స్థాయి నాయకుడు తెరవెనుక మొత్తం కథ నడుపుతున్నాడు. రెండు నెలలుగా సుప్రీం కోర్టు తీర్పుకు కొల్లేరులో తూట్లు పడుతున్న జిల్లా స్థాయి అధికారులు కొ ల్లేరుపై కనీసం కన్నెత్తి చూడటం లేదు. చట్టాలను లెక్కచేయకుండా తవ్విస్తున్న సదరు పచ్చనేతకు ఓ ఏడాది పాటు చేపల చెరువు లీజు ఫ్రీగా ఇవ్వలనే కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది. కొల్లేరులో అక్రమ పరంపర కొనసాగుతుందా. అడ్డుకట్ట పడుతుందా అనేది అంతుచిక్కని ప్రశ్నంగా మారింది. -
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్
నెల్లూరు : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతుల గుండెల్లో సిలికా గునపం దించడానికి సిద్ధమయ్యారు. సిలికా ఖనిజానికి మంచి ధర రావడంతో ఆగమేఘాల మీద అందిన కాడికి తోడేసి సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రైతులు, సిలికా గనుల యజమానులకు జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కి యంత్రాలతో ఖనిజం బయటకు తీస్తున్నారు. ఈ వ్యవహారా న్ని అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుల మీదే కేసులు నమోదు చేయించారు. చిల్లకూరు మండలం వేళ్లపాలెం వద్ద గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రామకృష్ణ అద్దేపల్లి, వేళ్లపాలెం గ్రామాల్లో రెండు సిలికా గనులు కొనుగోలు చేశారు. అద్దేపల్లి నుంచి బల్లవోలు గ్రామం వరకు ఉన్న సొనకాలువ ఈ సిలికా గనుల సమీపం నుంచి వెళుతుంది. ఈ కాలువ కింద 400 ఎకరాల భూమి సాగవుతోంది. సిలికా గనుల యజమానులు యంత్రాలు పెట్టి ఖనిజాన్ని బయటకు తీస్తే సొనకాలువ దెబ్బ తింటుందని గతంలో రైతులు ఆందోళన చేశారు. దీంతో ఇక్కడ యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే సిలికా బయటకు తీసేలా గనుల యజమానులు, రైతుల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో గనుల యజమానులు సొనకాలువలకు ఎలాంటి ముప్పు లేకుండా తవ్వకాలు చేసుకుంటున్నారు. కొంత కాలంగా సిలికాకు భారీ డిమాండ్ రావడంతో ఎమ్మెల్యే రామకృష్ణ అద్దేపల్లి వద్ద ఉన్న మైను నుంచి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. దీంతో ఇటీవల ఆ గ్రామస్థులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు వారిని రాత్రి పూట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తవ్వకాలు అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరించి పంపారు. దీంతో అక్కడ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి సిలికాను తరలిస్తున్నారు. వేళ్ళపాళెం గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబరు 256పి లో ఉన్న 40 ఎకరాల సిలికా గనిలో గురువారం సాయంత్రం యంత్రాలను పెట్టి తవ్వకాలు చేపట్టేందకు సిద్ధం అయ్యారు. దీంతో రైతులు ఇటీవల బాగు చేసుకున్న సొనకాలువలు ఎక్కడ దెబ్బతిని పంటకు నీరు చేరకుండా పోతుందోనని తవ్వకాలను అడ్డుకున్నారు. వీరిలో 12 మంది టీడీపీకి చెందిన రైతులు, ఇతరులు ఒకరున్నారు. గని మేనేజర్ వెంటనే ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే గూడూరు డీఎస్పీ శ్రీనివాసులుతో మా ట్లాడారు. సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై అంకమ్మ రాత్రి 10 గంటల సమయంలో ఆ గ్రామానికి చేరుకుని కిరణ్‌రెడ్డి, శ్రీనివాసులు, రమేష్ అనే రైతులను అరెస్టు చేసి చిల్లకూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలస మయంలో ఈ ముగ్గురితో పాటు మరో 10 మంది రైతుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిడారి కొవ్వు కేక
సాక్షి దినపత్రికలో రెండు రోజులుగా వస్తున్న కథనాలపై అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అనంతగిరి మండలం శివలింగపురంలోని మౌంటేన్ వ్యూ ప్రైవేటు అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేశంతో ఊగిపోయారు. ఎవరో తన పేరు చెప్పి భూములు కొనుగోలు చేస్తే తానే కొన్నానని చెప్పడం సరికాదన్నారు. వాలసీ ప్రాంతంలో శెట్టి గంగాధరస్వామి మేనల్లుడు ముత్యాలు పేరున మైనింగ్ లీజు ఉందని చెప్పుకొచ్చారు. ముత్యాలు కష్టాల్లో ఉంటే సహాయం చేశానే గానీ తనకు మైనింగ్‌తో సంబంధం లేదన్నారు. హుకుంపేట మండలంలో క్వారీ తప్ప మైన్స్ ఏమీ లేవ ని తెలిపారు. ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. మీ పేరు చెప్పి అక్రమాలు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకుంటారా... అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. సాక్షితో పాటు ఇతర పత్రికల్లో కూడా భూదందాపై కథనాలు వచ్చాయని ప్రస్తావించినా ఆయన పట్టించుకోకుండా ఒక్క సాక్షినే లక్ష్యంగా చేసుకొని కువిమర్శలు చేశారు. ఆ జరిమానా ఏమైందో తెలుసుకుంటా.. ఆ క్వారీలో అక్రమ తవ్వకాలపై జరిమానా విధించిన విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. మైనింగ్ అధికారులు జరిమానా విధించి ఉంటారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుని జరిమానా వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. - ఎల్.శివశంకర్, సబ్‌కలెక్టర్ రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు పంపించాం అది కచ్చితంగా అక్రమ క్వారీనే. అక్రమ మైనింగ్ పై దాడులు చేసి కేసు నమోదు చేశాం. నోటీసులు ఇచ్చాం. అయినా బకాయిలు చెల్లించకపోవడం తో చివరికి రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు రిఫర్ చేశాం. -కె.సుబ్బారావు, మైనింగ్ విజిలెన్స్ ఏడీ -
ఎం.ఎల్.ఎ. మైనింగ్.. ల్యాండ్స్.. అధికారం..
అరకులోయ ఎమ్మెల్యే సరికొత్త భాష్యం {పజాప్రతినిధి ముసుగులో దందాలే.. దందాలు.. ఓ పక్క డీ ఫారం భూముల కబ్జా మరో వైపు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ ఇంకోవైపు సర్కారు నిధులతో క్యాంపు కార్యాలయాలు మన్యంలో అడ్డూఅదుపూ లేని కిడారి అరాచకాలు ప్రజాతీర్పును పక్కన పెట్టి పార్టీ ఫిరాయించడం ద్వారా ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.. పేదలను మాటలతో మభ్యపెట్టి జీవనాధారమైన వారి భూములను లాక్కున్నారు.. ఇవి చాలవన్నట్లు అక్రమ మైనింగ్‌తో ప్రకృతి సంపదను.. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.. గిరిజన ప్రజాప్రతినిధి ముసుగులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమాలను తవ్వినకొద్దీ విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.. ఈ దందాల కోసమే ఆయన పార్టీ ఫిరాయించి.. అధికార పార్టీలోకి జంప్ చేశారన్న వాదనలను తాజా విషయాలు బలపరుస్తున్నాయి. ఏజెన్సీలో ఇక తనను అడిగేవారు గానీ.. అడ్డుచెప్పేవారు గానీ లేరన్న ధీమాతో అంతులేని అక్రమాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యే అన్న పదానికే కొత్త భాష్యం చెబుతున్నారు. అదేదో సినిమాలో ఎమ్మెల్యే అంటే నువ్వనుకున్నది కాదే.. అంటూ హీరో హీరోయిన్ను ఉద్దేశించి పాడిన పాట తరహాలోనే.. ఎం.ఎల్.ఎ. పదంలోని ఎం.. అంటే మైనింగ్, ఎల్.. అంటే ల్యాండ్, ఏ.. అధికార దాహం.. అనే సరికొత్త నిర్వచనం ఇస్తూ చెలరేగిపోతున్నారు. విశాఖపట్నం: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి ఇటీవల పార్టీకి ద్రోహం చేసి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. అధికార పార్టీ ఆశ చూపిన ఆఫర్లే కారణమన్న వాదనలు అప్పట్లో వెల్లువెత్తాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలంలో తాజాగా వెలుగు చూస్తున్న అక్రమ మైనింగ్, భూదందాల పర్వం వాటిని నిజం చేస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పరిధిలో సుమారు 136 ఎకరాల ఢీ ఫారం భూములను పేద రైతులను మాయచేసి కాజేసిన ఎమ్మెల్యే కిడారి.. వాలాసి పంచాయతీలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న విషయం బయటపడింది. శివలింగపురం గ్రామానికి చెందిన భీమవరపు ముత్యాలు పేరిట వాలాసి పంచాయతీ తూబుర్తి గ్రామంలో సుమారు పదెకరాల కాల్సైట్ మైనింగ్ లీజు ఉంది. మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు శెట్టి గంగాధరస్వామి మేనల్లుడైన ముత్యాలు పేరిట ఈ లెసైన్స్ ఉన్నప్పటికీ అక్కడ గత ఐదేళ్లుగా మైనింగ్ నిర్వహించడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ముత్యాలు మైనింగ్ నిలిపివేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కిడారి దానిపై కన్నేశారు. మైనింగ్ చేపట్టేందుకు ప్రయత్నించినా లీజుదారు అందుకు అంగీకరించలేదు. ఇటీవలే అధికార పార్టీలో చేరి మళ్లీ మైనింగ్‌పై పడ్డారు. చక్రం తిప్పి లీజుదారునితో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు ప్రారంభించారు. గత నెలరోజులుగా ఇక్కడ విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 24 టన్నుల మేరకు కాల్సైట్ ఖనిజం తరలించినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న దుర్గా సొసైటీకి బినామీగా ఖమ్మం జిల్లాకు చెందిన అప్పారావు అనే వ్యాపారి వ్యవహరిస్తున్నారు. సదరు అప్పారావుతో కలిసి కిడారి పదెకరాల్లో మైనింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. పనిలోపనిగా నిమ్మలపాడులోని మూడు బ్లాకుల్లో ఉన్న సుమారు 50 ఎకరాల కాల్సైట్ గనులను కూడా నెలరోజుల క్రితంలీజుదారులపై ఒత్తిడి తెచ్చి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతగిరి మండలంలో ఎక్కడైనా మైనింగ్ భూములు కేటాయించాలని కోరుతూ విశాఖలోని మైనింగ్ శాఖ అధికారులపై కిడారి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పట! హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి(బ్లాక్ స్టోన్) క్వారీలో మైనింగ్‌పై మూడేళ్ల కిందట విమర్శలు వెల్లువెత్తాయి. కిడారి పేరిట లెసైన్స్ ఉన్న ఆ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి మంత్రి బాలరాజు హయాంలో రూ.60 లక్షల జరిమానా కూడా విధించారు. అప్పటి నుంచి తెరచుకోని ఆ క్వారీ సరిగ్గా కిడారి టీడీపీలోకి జంప్ చేయడానికి కొద్దిరోజుల ముందే మళ్లీ తెరచుకుంది. కిడారి ఒత్తిడి మేరకు అప్పటి జరిమానా విషయాన్ని కూడా గాలికొదిలేసి అధికారులు మైనింగ్‌కు అనుమతులిచ్చేశారు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో క్యాంపు కార్యాలయాలకు సోకులు : అరకులోయలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఐటీడీఏ నిధులతో నిర్మించిన రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఒక భవనంలో కిడారి పాగా వేశారు. సుమారు రూ.పది లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దారు. ఆయన వ్యక్తిగత కార్యాలయానికి ప్రభుత్వ నిధులతో సోకులు చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు పాడేరులో కూడా ఇదే మాదిరి రెంటల్ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తీర్దిదిద్దారు. -
గ్రా‘వెల్’ దోపిడీ
అక్రమంగా భారీ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మం డల స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని అక్రమార్కులు ఈ తంతుకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో దీనిని అడ్డుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులోనో..అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకో తలొగ్గి ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరే గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సీరియస్ అవుతున్నా మండల స్థాయి అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల కళ్లెదుటే జరుగుతున్న ఈ తంతు తమకు సంబంధించింది కాదులే..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి నుంచి మర్రి పాడు మండలం బాట వరకు 565వ జాతీయ రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన గ్రావెల్‌ను అక్రమంగా భారీగా తరలిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో మట్టిని కొల్లగొడుతున్నారు. రామాపురం,వరికుంటపాడు,చింతలగుంట, దుత్తలూరు, వేంపాడు తదితర ప్రాం తాల్లో పెద్దఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలించి రోడ్డు పనులకు వినియోగిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఆయా ప్రాం తాల్లోని అధికారులకు ముడుపులు అప్పజెప్పి తమ పని సులువుగా కానిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినప్పటికీ అధికారుల నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో స్థానికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతో గ్రామస్థాయి రాజకీయ నేతలు అవగాహనకు వచ్చి తామే దగ్గరుండి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవంగా రోడ్డుకు గ్రావెల్ తరలించాలంటే ముందు గా గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని లీడ్ పొం దాలి. కానీ ఈ వ్యవహారం పాక్షికంగానే జరిగింది. ప్రభుత్వ పథకాలకూ ఇదే తంతు ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో రూ.10 కోట్లతో పంచాయతీల్లో సిమెంటు రోడ్ల పనులు జరిగాయి. ఈ రోడ్ల మార్జిన్లలో మట్టి నింపేందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా గ్రావెల్ తరలించారు. జెడ్పీ నిధులతో జరిగే ఈ రోడ్డు పనులకు కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఇటీవల నియోజకవర్గంలో పలు మార్గాల్లో తారురోడ్లు వేశారు. వీటి మార్జిన్లు నింపేం దుకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సోమవారం విం జమూరులోని మల్లపరాజు చెరువు నుంచి భారీ ఎత్తున ప్రొక్లెయిన్ ద్వారా గ్రావెల్ తరలించారు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదన్నట్లుగానే తప్పించుకున్నారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కువ లోతుతో గుం తలు తీసినందున వర్షాకాలంలో వాటిలోకి నీరు చేరి కొ న్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు జైకొడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. -
కలెక్టర్ ఆఫీసు ముందే చితకబాదారు
అహ్మదాబాద్: అక్రమ మైనింగ్ ఆగడాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఓ సమాచార హక్కు కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి చావగొట్టారు. గుజరాత్ లోని తాపి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ.. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవడంతో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తనపై దాడి చేశారని సమాచార హక్కు కార్యకర్త రోమెల్ సుథారియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు డజను మంది తనపై దాడి చేసి.. తన వద్ద ఉన్న పత్రాలను లాక్కెళ్లారని, ఇందులో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆర్టీఐ పత్రాలు కూడా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై గవర్నర్ విచారణకు హాజరయ్యేందుకు తాను కలెక్టర్ కార్యాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటన ఐపీసీ సెక్షన్లు 143 (అక్రమంగా గుమిగూడటం), 323 (ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం) కింద కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. తాపి జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా రోమెల్ సుతారియా పోరాడుతున్నారు. జిల్లాలో 62 అక్రమ మైనింగ్, ఇసుక క్వారీలున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు వీటికి అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు. -
ఇసుక ర్యాంప్ వద్ద గ్రామస్తుల ఆందోళన
ఇసుక తవ్వకాలు జిల్లాలో మరోసారి వివాదానికి దారి తీశాయి. చోడవరం మండలం గవర వరం ఇసుక ర్యాంప్ వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇసుక ర్యాంప్ వద్ద అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఇసుక తవ్వకాల వల్ల పక్కనే ఉన్న వంతెనకు ప్రమాం పొంచి ఉందని తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో ఇసుక ర్యాంప్ లో తవ్వకాలు ఆగిపోయాయి. -
దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !
ఎర్రమట్టిని కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రభుత్వ,అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే గ్రావెల్ తరలింపు సర్కారీ ఖజానాకు రూ.కోట్లలో గండి కొండలు, చారిత్రక ప్రదేశాలు, గుట్టలు, అసైన్డ్భూములు, చెరువులు, అటవీభూములు ఖాళీగా కనిపిస్తే చాలు. రాత్రికి రాత్రే భారీ యంత్రాల సాయంతో తవ్వి జేబులు నింపుకోవటం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో కొనసాగుతున్న అక్రమ దందా ఇది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో అత్యంత విలువైన ఎర్రమట్టి నిల్వలు ఉన్నాయి. వంకాయలపాడు, బోయపాలెం, మైదవోలు, సంగం గోపాలపురం, చెంఘీజ్ ఖాన్పేట, యడ్లపాడు, పుట్టకోట ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి (రెడ్‌గ్రావెల్)పై అధికారపార్టీకి చెందిన కొంతమంది కన్ను పడింది. రాజధాని శంకుస్థాపనతో భూములకు రేట్లు పెరగటంతో రెడ్‌గ్రావెల్ కు డిమాండ్ ఏర్పడింది. రియల్ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణానికి, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎర్రమట్టి రవాణా చేస్తుంటారు. ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 300 వరకు ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాఫీయాను తలపిస్తున్న వ్యవహారం ... గతం నుంచి ఈ మట్టిని తవ్వటానికి అనుమతి పొందిన వ్యక్తులు మైనింగ్ అధికారులు సూచించన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. కేటాయించిన ప్రాంతంలో నిబంధనల మేరకు 18 అడుగుల లోతు వరకే తవ్వకాలు నిర్వహించాలి. ప్రాంత సరిహద్దుల్లో సుమారు మూడు అడుగుల భూమిని వదిలివేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అనుమతి పొందిన ప్రాంతంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఎకరాల మేర మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. మట్టిని తవ్విన ప్రాంతం అటవీభూమి, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశమా, ప్రభుత్వ భూమి అన్న నిబంధనలతో వీరికి పనిలేదు. యడ్లపాడు ప్రాంతంలో ఉన్న 17 వందల ఎకరాల ప్రభుత్వ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, టెక్స్టైల్ పార్కుకు కేటాయించిన 130 ఎకరాల భూముల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి... ఎర్రమట్టి అక్రమ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభు త్వానికి వాణిజ్యపన్నుల ద్వారా, మైనింగ్ సెస్సుల ద్వారా రావాల్సిన ఆదాయం అవినీతి అధికారులు, అధికారి పార్టీ నేతల చేతుల్లోకి చేరుతుంది. ఒక్కొక్క యూనిట్‌కు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.100 లు చెల్లించాలి. రెండు నెలల కాలంలో ఈ ప్రాంతం నుంచి 6 లక్షల యూనిట్ల తరలించారు. ఒక్కో యూనిట్ రెడ్ గ్రావెల్ ధర రూ. 2 వేలు ఉంది. మొత్తం 6 లక్షల యూనిట్లకు 12 కోట్ల రూపాయలను అక్రమ తవ్వకం దారులు తమ జేబుల్లో వేసుకున్నారు. దీంతో పాటు వాణిజ్యపన్నుల శాఖకు కూడా భారీ స్థాయిలో ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. మేడమ్ కల్పించుకోవడంతో... అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టేలోగా అక్రమార్కులకు వత్తాసుగా, ఇక్కడవ పవర్ పాయింట్‌గా వ్యవహరిస్తున్న ‘మేడమ్’ కల్పించుకోవడంతో వెనక్కు తిరిగి వెళుతున్నారు. గతంలో జిల్లా అటవీశాఖ అధికారి రెండు పొక్లయినర్లను సీజ్ చేసి అక్కడ ముగ్గురు బీటు అధికారులను కాపలా ఉంచారు. ఇది జరిగిన రెండో రోజు రాత్రి ఒంటిగంట సమయంలో 10 మంది యువకులు బీట్ అధికారులను బెదిరించి ఒక పొక్లయినర్‌ను తీసుకువెళ్లారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. -
అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే
- ఉడమలకుర్తి, చిన్నపల్లి గ్రామస్తుల ధర్నా - మద్దతు తెలిపిన ఎమ్మెల్యే చాంద్‌బాషా కదిరి: ‘‘తలుపుల మండలం గుండ్లకొండలో చేపట్టిన అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే.. లేదంటే అందరం ఇక్కడే ఏదైనా తాగి చచ్చిపోతాం..’’ అని ఆ కొండను ఆనుకొని ఉన్న చిన్నపల్లి, ఉడమలకుర్తి వాసులు హెచ్చరించారు. బుధవారం ఆ రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సుమారు 4 గంటల పాటు ధర్నాకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గుండ్లకొండలో తమ ఇలవేల్పు దేవుడు గుండ్లకొండరాజు గుడి ఉందని, మైనింగ్ లీజుదారులు ఆ గుడిని కూల్చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. కొండపై ఉన్న పురాతనమైన గుడి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని, తక్షణం లీజు అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనింగ్‌కు అనుమతులు కోరితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారని శాపనార్థాలు పెట్టారు. ఆ బ్లాస్టింగులతో తమ ఇంఇ గోడలు నెర్రెలు చీలడంతోపాటు వాటి శబ్దాలకు ఇళ్లలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అక్రమ మైనింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నపల్లి, ఉడమలకుర్తి గ్రామస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా హామీ ఇచ్చారు. ఆయన ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ఆ గ్రామస్తులతో కలిసి ఆర్డీఓతో మాట్లాడారు. తాను కూడా త్వరలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తానన్నారు. -
'అక్రమ మైనింగ్ నిర్వహిస్తే లెసైన్సుల రద్దు'
గుంటూరు వెస్ట్ : మైనింగ్ విభాగంలో అవినీతికి తావు లేకుండా చూడాలని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారి లెసైన్స్‌లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భూగర్భ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. గురువారం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మహిళా, శిశు సంక్షేమ, భూగర్భ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించి ప్రసంగించారు. మైనింగ్ విభాగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ఆవిధంగా వచ్చిన ఆదాయంతో పేదల సంక్షేమానికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరారు. అవసరమైతే అటువంటి వారి లెసైన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు మెరుగుపడాలని, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలని కోరారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కాలం పూర్తయిన మైనింగ్ లీజ్‌లను గుర్తించి వాటిని పునరుద్ధరించాలని, పునరుద్ధరించని వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, గనుల శాఖ డెరైక్టర్ సుశీల్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ అక్రమ మైనింగ్ సాధారణమే: మంత్రి
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులు అంత స్పష్టంగా లేకపోవడంతో.. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని అక్రమ మైనింగ్ ఇష్టారాజ్యంగా సాగుతోంది. చక్కి నది పొవునా ఇది కొనసాగుతోందని హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఈ అక్రమ మైనింగ్ మాఫియా పెద్దలు హిమాచల్ ప్రదేశ్ వాసులను విపరీతంగా వేధిస్తున్నారని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పంజాబ్ సర్కారు నిర్ణయం కోసం ఇంకా తాము వేచిచూస్తున్నామన్నారు. నిజానికి 2005 నుంచి ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం మీద చర్చలు నడుస్తున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో దీనిపై అసెంబ్లీలో ఘాటు చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని నూర్పూర్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలు మరీ ఎక్కువైపోవడంతో స్వతంత్ర సభ్యుడు రాకేష్ పఠానియా తాను స్వయంగా తుపాకి పట్టుకుని అక్కడ పోరాడతానని అప్పట్లో అసెంబ్లీలో హెచ్చరించారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. -
టీడీపీ ఎమ్మెల్యే వై.శ్రీనివాసరావు అక్రమ మైనింగ్
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: ఏపీలో అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తూ, ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిడుగురాళ్లకు చెందిన కుందుర్తి గురవాచారి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరావు, సీబీఐ జాయింట్ డెరైక్టర్, గనులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలతో కలసి పిడుగురాళ్ల, నడికుడి, కానస్నపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు పలు గ్రామాల్లో గత రెండేళ్లుగా ప్రభుత్వ భూములు, జేపీ సిమెం ట్స్‌కు లీజుకిచ్చిన భూముల్లో అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
సీబీఐ ఉచ్చు
*అక్రమ మైనింగ్‌లో కాంగ్రెస్ నేతలకు బిగుసుకుంటున్న వైనం *అనిల్‌లాడ్ అరెస్ట్‌తో బళ్లారి జిల్లాలోని గనులు యజమానుల గుండెల్లో దడ బళ్లారి : బీజేపీ నాయకులే బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ అసలు బండారం బయట పడింది. బుధవారం సాయంత్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్‌ను బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో బళ్లారిలో మళ్లీ అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల గుండెల్లో దడ మొదలైంది. ఇప్పటి వరకు బీజేపీకి చెందిన వారినే అక్రమ గనుల తవ్వకాల్లో అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ అధికారులు సమగ్ర తనిఖీలు చేస్తుండటంతో కాంగ్రెస్ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బళ్లారి జిల్లా సండూరులో గనులు తవ్వకాల్లో అనిల్‌లాడ్ రారాజుగా వెలుగొందారు. వీఎస్లాడ్, వీఎస్లాడ్ అండ్ సన్స్‌కు చెందిన గనుల తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. 2010లో ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌కు చెందిన వీఎస్ లాడ్ గనుల కంపెనీ నుంచి కార్వార ఎమ్మెల్యే సతీష్శైల్కు చెందిన మల్లికార్జున షిప్పింగ్ కంపెనీకి అక్రమంగా 1.50 లక్షల టన్నుల ఇనుప ఖనిజం సరఫరా చేశారనే ఆరోపణలు ఉండటంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. 2010 నుంచి ఆయనపై ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ తాను అక్రమ గనుల తవ్వకాలు చేపట్టలేదంటూ బూకాయిస్తూ వచ్చారు. బళ్లారి జిల్లాకు చెందిన అక్రమ గనుల తవ్వకాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రస్తుతం ఉచ్చు బిగుసుకుంటుండటంతో మిగిలిన అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల్లో దఢ మొదలైంది. బళ్లారి జిల్లాలోని హొస్పేట, సండూరు, బళ్లారి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖులకు అక్రమ గనుల తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అక్రమ గనులు తవ్వకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనిల్‌లాడ్ అరెస్ట్‌తో నోరు మూతపడినట్లయింది. బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన గనుల కంపెనీల్లో సీఈసీ ఇచ్చిన సీ క్యాటగెరీ నివేదికలో అనిల్‌లాడ్‌కు చెందిన గనుల కంపెనీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అక్రమ గనుల తవ్వకం కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటోంది. -
ఇసుక చుట్టూ తమ్ముళ్లు
బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. తెలుగు తమ్ముళ్లు ఇసుక చుట్టూ ముసురుతున్నారు. అడ్డదారుల్లో తరలించుకుపోతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. నిబంధనలను లెక్కచేయకుండా సరిహద్దులనూ దాటించేస్తున్నారు. నదుల్లోని ఇసుకను సముద్ర ఇసుకతో కల్తీ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు వనజాక్షిపై దాడి వ్యవహారంలో తమ అధినేత వైఖరి తేటతెల్లం కావడంతో ‘తమ్ముళ్లు’ తెగ రెచ్చిపోతున్నారు. కొన్నిచోట్ల రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మామూళ్లు చెల్లిస్తూ తమ జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. - అక్రమ తవ్వకాలు.. అడ్డొస్తే అఘాయిత్యాలు - సముద్ర ఇసుకతో భారీ కల్తీ - భారీగా మామూళ్లు.. పార్టీలు - చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారులు జిల్లాలోని పద్మనాభం మండలం పాండ్రంగిలో అధికారులకు ఇసుక తరలింపు సమాచారం ఇస్తున్నాడన్న కక్షతో సారిక కన్నయ్య హత్య, విశాఖ జిల్లా సరిహద్దులోని పాయకరావుపేట తాండవ నదిలో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజా, అతని గన్‌మెన్‌పై టీడీపీ నేతల దాడి ఘటనలతో ఇసుకాసురుల ఆగడాలు చర్చనీయాంశమవుతున్నాయి. గోస్తనీ నది ఇసుక అక్రమార్కులకు వరం గా మారింది. ఈ నదికి ఉప్పునీటి తాకిడి ఉన్నందున ఇసుక కట్టడాలకు పనికిరాదని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించలేదు. కానీ ఇసుక అక్రమార్కులకు, ప్రభుత్వ కట్టడాలకూ మాత్రం ఇదే పనికొస్తోంది. గోస్తనీ నది పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాల్లో సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పరివాహక ప్రాంతాలైన అనందపురం మండలం బోని, పద్మనాభం మండలం పద్మనాభం, మద్ది, పొట్నూరు, పాండ్రంగి, మునివానిపాలెం, సామియ్యవలస, భీమి లి మండలం మజ్జివలస, తాటితూరు, టి.నగరంపాలెం, తగరపువలస, మూలకుద్దు, టి.నాగమయ్యపాలేల్లో సింహభాగం తెలుగు దేశం వారి కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఏం చేస్తున్నారు?: భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో 500 ఎకరాల్లో 60-70 మీటర్ల ఎత్తున వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ సహజ సముద్ర ఇసుక దిబ్బలున్నాయి. అక్కడ ఇసుకను లారీలు/ట్రాక్టర్లలో గోస్తనీ తీరానికి తరలించి అక్కడ నది ఇసుక పోగుల పక్కన వేస్తారు. రోజుకు పద్మనాభం, భీమిలి మండలాల్లో వందకు పైగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు వెళ్తూనే ఉంటుంది. ఇలా 50 ఎకరాల్లో ఇసుకను మాయం చేసేశారు. శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చే నాణ్యమైన ఇసుక 8 యూనిట్లకు రూ.45 వేల ధర పలుకుతోంది. అదే గోస్తనీలో కల్తీ ఇసుక రూ.20-25 వేలకే లభిస్తోంది. ట్రాక్టరు (ఒకటిన్నర యూనిట్లు)కు రూ.3-5 వేలకే ఇస్తున్నారు. శ్రీకాకుళం ఇసుకతో పోలిస్తే చౌకగా దొరకడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాలకు దీనినే వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల క్రితం వంద లారీల్లో సముద్ర ఇసుక తరలిస్తూ పట్టుబడగా కేవలం ఏడు లారీలపైనే కేసులు పెట్టారు. ఇసుక అక్రమ రవాణాదార్ల నుంచి రూ.10 లక్షలు జరిమానా వసూలు చేశామని, గట్టి నిఘా పెట్టామని, కొందరిపై బౌండోవర్ కేసులు పె ట్టామని భీమిలి రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదీ సంగతి:ఇసుక అక్రమ రవాణా కాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులది, ఆయా గ్రామాల వీఆర్వోలది. కానీ నిత్యం యధేచ్ఛగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు తరలిపోతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల అటు ఇసుక అక్రమ రవాణాదార్లకే కాకుండా రెవిన్యూ అధికారులకూ పంట పండుతోంది. పద్మనాభం మండలంలోని ఓ వీఆర్వో ఏడాది కాలంలో ఏకంగా ఎనిమిది కార్లను కొనుగోలు చేయడం, మరికొందరు రిటైర్డు ఉద్యోగులు ఇసుక తరలింపునకు ఎడ్లబళ్లను కొనడం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇసుక అక్రమ తరలింపుదార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మామూళ్లతో పాటు ప్రతి ఆదివారం పార్టీలు ఇస్తారన్న ప్రచారం ఉంది. పాయకరావుపేట మండలం తాండవ నదిలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. తగినంత ఇసుక లభ్యత లేదంటూ అక్కడ రీచ్‌లను డ్వాక్రా మహిళలకు కేటాయించలేదు. కానీ పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు నిర్భీతిగా ఇసుక తవ్వించి సరిహద్దులు దాటించేస్తున్నారు. చౌకగా ట్రాక్టర్ ఇసుక రూ.800లకే విక్రయిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే దాడులకు తెగబడుతున్నారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
అక్రమ తవ్వకాలు అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజాపై దాడి డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం తుని రూరల్: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆదివారం మరోమారు రెచ్చిపోయింది.వారి అక్రమాలను అడ్డుకున్న సాక్షా త్తు ఎమ్మెల్యేపైనా దాడికి తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, అతని అనుచరులు దాడికి దిగిన వివాదం సద్దుమణగకముందే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి పాల్పడింది. ఎమ్మెల్యేను రక్షించే యత్నంలో ఉన్న ఆయన గన్మన్పైనా దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే రాజా, గన్‌మన్ ప్రస్తుతం తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుని మండలం డి.పోలవరంలో తాండవ నది పరీవాహక ప్రాంతంలో ఇసుకను నకిలీ వే బిల్లులతో టీడీపీకి చెందిన వారు తరలించుకుపోతూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇలా బొద్దవరం గ్రామానికి చెందిన మళ్ల నరసారావు, సోదరుడు సత్యనారాయణ పొలంలో వారు ఇసుకను తవ్వేస్తున్నారు. దీనిని భూ యజమానులు అడ్డుకున్నారు.ఆగ్రహించిన బర్ల గోవిందు, ఈశ్వరరావు అనే వారు భూ యజమాని నరసారావుపై దాడిచేసి గాయపర్చారు. బాధిత రైతులు ఫోన్లో ఎమ్మెల్యే రాజాకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు.ఆ సమయంలో 13 ట్రాక్టర్లు ఇసుకలోడుతో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయి.ఎమ్మెల్యే ట్రాక్టర్లకు అడ్డంగా తన వాహనాన్ని నిలిపి రెవెన్యూ, పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్లో వివరించారు. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు, రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు బంధువులు, అతని అనుచరగణం ట్రాక్టర్లకు అడ్డంగా ఉన్న ఎమ్మెల్యే కారును పక్కకు నెడుతుండగా వారించిన ఎమ్మెల్యే అనుచరులపై దాడులకు దిగారు. దీంతో ఎమ్మెల్యే రాజాకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన ఆయన గన్‌మెన్ నాగకన్నయ్యపైనా దాడిచేసి గాయపరిచారు. అక్కడికి చేరుకున్న సీఐ అప్పారావుకు ఎమ్మెల్యే రాజా ఫిర్యాదుచేశారు. అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయాలని కోరుతూ నకిలీ వే బిల్లులను చూపించారు. అనంతరం చికిత్సకోసం తుని వెళ్లారు. -
మొరం... అక్రమార్కుల పరం
నియోజకవర్గంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ వనరులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు.. అధికారులు తనిఖీకి వస్తే మామూళ్లతో సరిపెడుతున్నారు.. వారి ఉదాసీనత వల్ల కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి.. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది.. - యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు - ఏటా *2 కోట్ల వ్యాపారం - చోద్యం చూస్తున్న అధికారులు మండలంలోని అనంతపురం గుట్టల్లో, జమ్ములమ్మ రిజర్వాయర్ దగ్గర, కొండపల్లి, ముల్కలపల్లి పరిసర ప్రాంతాల్లో, సంగాల చెరువుశిఖం భూమిలో యంత్రాలతో అక్రమార్కులు మొరం తవ్వుతున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా యథే చ్ఛగా ఇతర ప్రాంతాలకు మొరంమట్టి తరలిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ శివారులోని పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. అలాంటిది అక్రమార్కులు సమతుల్యంగా ఉన్న భూమిని సైతం సుమారు పది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. ఇలా మూడు ప్రాంతాల్లో అక్రమంగా తవ్వి యథేచ్ఛగా మొరంమట్టిని తరలిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ధరూర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే, నెట్టెంపాడు పనుల కోసం గతంలో మట్టి తవ్వకాలు జరపడానికి అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయం విదితమే. అనుమతులు ఇచ్చిన క్వారీల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వర్షాకాలంలో మొరం కోసం తవ్విన గోతులు నీటితో నిండిపోతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను అక్రమంగా కొల్లగొట్టి మొరం తరలించారు. మల్థకల్ మండలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. లక్షల్లో వ్యాపారం... అక్రమార్కులు నిత్యం లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. గద్వాలలో కొనసాగుతున్న అక్రమ క్వారీల నుంచి ప్రతిరోజూ వందకుపైగా ట్రాక్టర్ ట్రిప్పుల మొరం తరలివెళుతోంది. మొరం రకాన్ని బట్టి ట్రిప్పు *400 నుంచి *600 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన నెలకు *15 లక్షల మొరం దందా అక్రమంగా కొనసాగుతోంది. అంటే ఏడాదికి *రెండు కోట్ల వరకు అక్రమార్కులు దండుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే కోట్ల రూపాయల పనులకు క్వారీ అనుమతులు తీసుకుంటున్నారు. మిగిలినచోట్ల మోటా కాంట్రాక్టర్లు, మండల, గ్రామస్థాయి నాయకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీనిని రోడ్లు, భవన నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న అక్రమార్కులకు కొందరు అధికారులు వంతపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా ఈ వ్యవహారంపై జిల్లా పాలనా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది. -
ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు
నూతన ఇసుక విధానం వచ్చినా... నివగాం సమీప వంశధార నదిలో రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనివెనుక ‘ఉపాధి’ పథకంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తుండగా, అక్రమ తవ్వకం దారుల నుంచి.. దేవుడి పేరిట వసూళ్లకు పాల్పడుతూ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తూరు: మండలంలోని నివగాం గ్రామ సమీప వంశధార నది వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతన్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. తవ్వకందారుల నుంచి కొం తమంది దేవుడు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తంతుపై ‘సాక్షి’లో పలు దఫాలు కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అక్రమ తవ్వకాల దందా రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో రోజూ వేలాది రూపాయులను దేవుడు పేరుతో కొంత మంది జేబులు నింపుకుంటున్నారు. సూత్రధారి ఈయనే.... అక్రమ వసూళ్ల వెనుక గ్రామంలో ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నివగాంలో పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇసుక తవ్వకందారుల నుంచి కొందరు రోజూ కొంతమొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నా రు. వీరిని ఇటీవల గ్రామస్తులు కొందరు నిలదీయంతో పెద్ద వివాదమే ఏర్పడిం దని, అయినా ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడంలేదని చెబుతున్నారు. దేవుడి పేరిట వసూలు చేస్తున్న మొత్తంలో కొం త సంబంధిత అధికారులకు చెల్లిస్తున్నామని, తవ్వకాలను ఎవ్వరూ అడ్డుకోలేరని సదరు అక్రమ తవ్వకందారులు బరి తెగించి చెబుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. రెండు నెలల నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఇంత వరకు పోలీస్, రెవెన్యూ అధికారుల నిఘాలేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక లోడ్లను పట్టపగలే బహిరంగంగా తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చర్యలు తీసుకుంటా... నివగాం వద్ద జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రాతపూరకంగా ఫిర్యాదు అందితే పరిశీలించి తగు చర్యలు తీసు కుంటానని కొత్తూరు తహశీల్దార్ డి. చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు నిఘా వేయాలని వీ ఆర్వో, వీఆర్ఏలను ఆదేశించామన్నారు. -
మాతా మన్నించు!
- జీర్ణోద్ధరణకు నోచుకోని వకుళామాత ఆలయం - పట్టించుకోని టీటీడీ - పాదయాత్రలు చేసి తిరిగి చూడని స్వామీజీలు - ఆగని అక్రమ మైనింగ్ - కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు తిరుమల వేంకటేశ్వర స్వామి తల్లి వకుళామాత కోసం నిర్మించిన ఆలయానికే రక్షణ లేకుండా పోయింది. ఒకప్పుడు నిత్య ధూపదీపనైవేద్యాలతో విరాజిల్లిన ఈ కోవెలనేడు రూపురేఖలు కొల్పోతోంది. మాఫియా మాయగాళ్లు విగ్రహాన్నీ కనుమరుగు చేశారు. శతాబ్దాల నాటి దేవాలయం శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారు లేరు. జీర్ణోద్ధరణకు టీటీడీ అధికారులు చొరవచూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి రూరల్: తిరుమల శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం దుస్థితికి చేరింది. మైనింగ్ మాఫియా దాడికి ఆలయ రూపురేఖలు లేకుండా పోతున్నాయి. అధికారులు, టీటీడీ నిర్లక్ష్యం వల్ల ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు. మొదట్లో ఆలయ పనులను అడ్డుకున్న స్థానికుల్లో తాజాగా మార్పు వచ్చినా పట్టించుకునే నాథుడే లేరు. తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ దుస్థితిపై ప్రత్యేక కథనం.. చరిత్ర ఘనం రాయలవారి కాలంలో 500 ఏళ్లక్రితం పేరూరు బండపై వకుళమాత ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో గంట మోగిన తర్వాతే తిరుమలలో తనకు నైవేద్యం పెట్టాలని శ్రీవారు చెప్పినట్లు పురాణాలు చెబుతుంటాయి. రూ.కోటితో ఫెన్సింగ్ స్వామిజీలు, హిందూ సంస్థలు, భక్తుల డిమాండ్‌తో టీటీడీ కదిలింది. ఆలయం చుట్టూ 4.50 ఎకరాలను బఫర్ జోన్‌గా రెవెన్యూ అధికారులు నిర్థారించి టీటీడీకి అప్పగించారు. అందులో రూ.కోటితో టీటీడీ ఫెన్సింగ్ వేసింది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తామని ప్రకటించింది. స్థానికుల ఆగ్రహం టీటీడీ, రెవెన్యూ అధికారుల చర్యలపై స్థానికులు మండిపడ్డారు. అసలు అది వకుళమాత ఆలయం కాదని కోర్టుమెట్లు తొక్కారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. స్వామిజీలు, హిందూ సంస్థల రంగప్రవేశం స్థానికులు వ్యతిరేకించడంతో స్వామిజీలు, హిందూ సంస్థలు రంగప్రవేశం చేశాయి. కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కోసం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసే వరకు శ్రీవారిని దర్శించుకోనని ప్రతిజ్ఞ చేశారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆలయాన్ని సందర్శించడం, అయ్యో...అనడం నిత్యకృత్యమైంది. ఆగని అక్రమ మైనింగ్ ఆలయం దుస్థితికి చేరిందని ఓ వైపు భక్తులు, హిందూ సంస్థలు మొత్తుకుంటున్నా ఆలయ పరిసరాల్లో అక్రమ మైనింగ్ ఆగనంటోంది. పట్టపగలే బండను కొట్టి రాళ్లను తరలిస్తున్నారు. -
జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించండి
- స్థాయి సంఘాల సమావేశాల్లో జెడ్పీటీసీల వినతి పాతగుంటూరు : జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు అడిగాం... ఇప్పటివరకు అధికారులు ఇవ్వలేకపోయారు... జిల్లా పరిషత్ భూముల్లో అక్రమ మైనింగ్, అటవీ భూముల ఆక్రమణలనూ పట్టించుకోవడంలేదు... అంటూ పలువురు జెడ్పీటీసీలు స్థాయి సంఘాల చైర్మన్లకు విన్నవించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్పర్సన్ చాంబర్, సీఈవో చాంబర్లో శనివారం ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 1వ స్థాయి సంఘం సమావేశం చైర్పర్సన్ షేక్ జానీమూన్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు గతంలో అడిగామని, ఇప్పటివరకు తెలియజేయలేదంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి అధికారులను ప్రశ్నించారు. దాచేపల్లి, నకరికల్లు మండలాల్లో జెడ్పీ నిధులు మంజూరైనప్పటికీ అక్కడి ఎమ్మెల్యేలు పనులు చేయకుండా అడ్డు తగులుతున్నారని , వాటిని పరిష్కరించాలని కోరారు. 2వ స్థాయి సంఘం సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని రాజుపాలెం, పిడుగురాళ్ళ జెడ్పీటీసీలు మర్రి వెంకటరామిరెడ్డి, వీరభద్రుని రామిరెడ్డిలు కోరారు. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన 3వ సమావేశంలో దాచేపల్లి జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను కొన్ని కంపెనీల యాజమాన్యం ఆక్రమించుకున్నాయని, వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో మత్స్యకారులకు మంజూరైన వలలు ఇవ్వాల్సిందిగా కోరారు. జానీమూన్ ఆధ్వర్యంలో జరిగిన 4వ స్థాయి సంఘం సమావేశంలో పీహెచ్‌సీలను మెరుగుపరచాలని, సిబ్బంది కొరత లేకుండా చూడాలని దుగ్గిరాల జెడ్పీటీసీ విజయలక్ష్మి సూచించారు. డాక్టర్లు లేక కొన్ని పీహెచ్‌సీల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. 5వ స్థాయి సంఘం సమావేశం చైర్మన్ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. బొల్లాపల్లి జెడ్పీటీసీ కె. సంతోషమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను సక్రమంగా రవాణా చేయాలని కోరారు. జెడ్పీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ స్థాయి సంఘం సమావేశంలో గుంటూరు రూరల్ మండలం జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించడంలేదన్నారు. బ్యాంకు అధికారులను ఒప్పించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని తెలిపారు. 7వ స్థాయి సంఘ సమావేశంలో పనులు కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
టిడిపి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్
-
సమాధులనూ వదలడం లేదయ్యా!
యడ్లపాడు : కొండలు, గుట్టలు, మట్టికట్టలు, ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్ అమ్మకాల ఆదాయం అక్రమార్కులకు సరిపోలేదు. అక్రమార్జనే ధ్యేయంగా మరుభూములలో సైతం మట్టి తవ్వకానికి శ్రీకారం చుట్టారు. నేరుగా తవ్వకాలు చేస్తే గ్రామస్తుల తెలిసి పోతుందని, శ్మశానం వెనుకవైపు నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు. తవ్విన గ్రావెల్‌ను తరలించేందుకు ఏకంగా సమాధుల మధ్య నుంచి మార్గం చేసుకున్నారు. ఆలస్యంగా దీనిని గమనించిన గ్రామస్తులు అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 200 కుటుంబాలకు అదే శ్మశానం... కొండవీడు కొండల అంచుల రాజప్రసాదాలు ఉన్న ప్రాంతంలోనే పూర్వం పుట్టకోట గ్రామం ఉంది. ఆయా కుటుంబాలకు చెందిన హిందూ శ్మశాన వాటిక అప్పటి రెడ్డిరాజులు శతృమూక రాజ్యంపై దండెత్తకుండా నిర్మించిన ఎర్రమట్టిపై అప్పట్లో శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎత్తయిన కొండలు కావడంతో మేఘాలు అడ్డుకోవడంతో తరుచు వర్షాలు కురవడం, నివాసాలకు చుట్టూ కొండలు ఆవరించుకొని ఉండటంతో వర్షపునీరంతా కొండవాగులా మారి గ్రామంపై విరుచుకు పడేది. వీటిని తట్టుకోలేక కొండలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తగా నివాసాలు ఏర్పరచుకున్నారు. కొత్తగా వేసుకున్నందున దీనికి కొత్తపాలెంగా పేరొచ్చింది. కుటుంబాలు మారినా శ్మశానాన్ని మాత్రం మార్చుకోలేదు. కొత్తపాలెంలో సుమారు 400 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో సగం కుటుంబాలకు కాల్పుకాగా, మిగిలిన వారు పూడ్పు ఆచారంగా వ్యవహరిస్తున్నారు. చారిత్రక మట్టికట్టకొడితే కొండవాగులు ఊరిని ముంచేస్తాయి... చారిత్రక మట్టికట్టను తవ్వడం వలన కొండమీదుగా వచ్చే వాగులు ఊరిని ముంచే ప్రమాదం ఉందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఒకవైపు చారిత్రక ఆనవాళ్లు కనుమరుగు అవ్వడంతోపాటుగా ఊరంతా జలముంపుకు గురయ్యే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి ఆగ్నేయదిశగా ఈ హిందూ శ్మశానం ఉంది. వణుకుల కుంటగా పిలుచుకునే ఈ శ్మశానం మధ్యలో నుంచి గ్రావెల్ తరలించే మార్గాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత పదిరోజులు రాత్రిపూట నిర్వీరామంగా తవ్వకాలు చేసి ట్రాక్టర్ల ద్వారా తరలించారని ఆరోపిస్తున్నారు. శ్శశానం వెనుక భాగంవైపుగా మట్టికట్టను సగం వరకు తవ్వేశారని ఇలాగే ఇంకొంత తవ్వితే పూర్తిగా శ్మశానం కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడమైన మట్టికట్ట తవ్వకం చేయడం వలన కొండవాగులు ఊరిపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమాధులు మధ్య దారి... సమాధుల మధ్యగా దారి ఏర్పాటు చేశారు. శ్మశానానికి వెనుక నుంచి తవ్వకాలు చేయడం ఏంటి? అసలు శవాలను తవ్వి అమ్ముకోబోయారా? సమాధుల్లో తవ్వితే మట్టి ఒక్కటే కాదు అందులోని శవాలు అమ్ముకున్నట్టే లెక్క. ఇది గ్రామస్తులందరికీ చెందిన శ్మశానం అని గుర్తుంచుకోవాలి. -మానం సాంబయ్య రోజు రాత్రిళ్లు మట్టి తవ్వుతున్నారు... పదిరోజులుగా రాత్రివేళ తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు గ్రామస్తులంతా ఫిర్యాదు చేస్తున్నాం. శ్మశానం ఎత్తయిన మట్టిపై ఉంది. ఈ కట్టను తవ్వడం వలన కొందపై నుంచి వచ్చే కొండవాగులు ఊరిపై పడతాయి. అధికారులు చారిత్రక కట్టడమైన మట్టికట్టకు రక్షణ కల్పించాలి. -
స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ వాస్తవం
హైకోర్టుకు గనులశాఖ నివేదన పర్మిట్లు లేకుండానే ఖనిజ రవాణా చేస్తున్నారని వెల్లడి సమాధానానికి గడువు కోరిన ప్రతివాదుల తరఫు న్యాయవాదులు అక్రమమని తేలితే చర్యలకు ఆదేశాలిస్తామన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి లీజుకు తీసుకోని ప్రాంతాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇలా తవ్వితీసిన రాయి, ఖనిజాన్ని తమ శాఖ నుంచి ఎటువంటి పర్మిట్లు పొందకుండానే రవాణా చేశారని తెలిపారు. ఈ అక్రమాలపై రూ.32.49 కోట్ల జరిమానా చెల్లించాలంటూ గత ఏడాది నోటీసులు జారీ చేసినా సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో ఆమెకు మంజూరు చేసిన లీజును రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు జారీ చేశామని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే గనుల శాఖ మంత్రికి లేఖ రాయడంతో రద్దు అంశం పెండింగ్‌లో పడిందని వివరించారు. డి.కె.అరుణ భర్త భరతసింహారెడ్డి మన్నాపురం గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు బి.కృష్ణమోహన్‌రెడ్డి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజా చర్యలకు ఆదేశాలిచ్చాం: మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు అదనపు కౌంటర్లను ధర్మాసనం ముందుంచారు. లీజు పొందని ప్రాంతంలో 5,67,900 క్యూబిక్ మీటర్ల మేర అక్రమ మైనింగ్ చేశారని, ఇందుకు చట్ట నిబంధనల మేరకు పదింతల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. తాజా పరిశీలన ఆధారంగా అక్రమ మైనింగ్ చేస్తున్నందుకు చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నామని, ఆ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమయంలో స్నిగ్ధారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి, డి.కె.భరతసింహారెడ్డి తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ సమాధానం ఇవ్వడానికి గడువునివ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. లీజు రద్దుకు ఆదేశాలిస్తాం ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిపుణులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేసి క్వారీయింగ్ జరుగుతున్న ప్రాంతానికి పంపి నివేదిక తీసుకోవాలని భావిస్తున్నామని తెలిపింది. క్వారీయింగ్ అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు, లీజు రద్దుకు సైతం ఆదేశిస్తామంది. -
మైనింగ్ మాయ!
కందుకూరు: అక్రమార్కుల కన్ను ప్రభుత్వ, అటవీ భూములపై పడింది. అనుమతులు తీసుకున్న చోట కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు అందినప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత తమకేమీ పట్టనట్లుగా మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతీన తవ్వకాలు.. మండల పరిధిలో వివిధ గ్రామాల్లో క్వారీలు, క్రషర్లు, చెరువు శిఖాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పులిమామిడి, లేమూరు, మీర్కాన్‌పేట, కందుకూరు తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు ఇష్టారీతిన కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా చోట్ల అనుమతులు ఒక దగ్గర తీసుకుని తవ్వకాలు మరో చోట నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం లేమూరులో సర్వేనంబర్ 356లో 20 గుంటలకు అనుమతులు తీసుకుని కంకెల కుంట శిఖం భూమిలో తవ్వకాలు జరుపుతున్నారంటూ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించి ఆందోళన చేశారు. చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అటవీ భూముల్లో... మురళీనగర్ సమీపంలోని సర్వేనంబర్ 74, 75ల్లో 22.32 ఎకరాల భూమిపై క్వారీకి అనుమతులు తీసుకుని నాలుగేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. కాగా ఆ భూమికి ఆనుకుని చిప్పలపల్లి అటవీ భూమి సర్వే నంబర్185లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు ఇటీవల మురళీనగర్, చిప్పలపల్లి గ్రామస్తులు పలువురు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం క్వారీకి వెళ్లే మార్గంమధ్యలో తవ్వి వాహనాల రాకపోకలను నిలువరించారు. నిత్యం అటవీ భూముల నుంచే టన్నులకొద్దీ విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, సర్వే చేయించి అటవీ భూములకు హద్దు రాళ్లను పాతాలని డిమాండ్ చేశారు. కటికపల్లి వద్ద నిర్వహిస్తున్న క్రషర్‌తో చుట్టు పక్కల పంటలు పండించలేకపోతున్నామని దుమ్మూధూళీ దట్టంగా కమ్ముకుని ఇబ్బందికరంగా మారుతోందంటూ గ్రామస్తులు ఇటీవల ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖ లాలు లేకుండాపోయాయి. మరోవైపు బేగంపేట పరిధి లో కొనసాగుతున్న మరో క్రషర్ నిర్వాహకులు రెండు నెలల క్రితం అటవీ భూముల నుంచి రోడ్డు వేసుకుని రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ అధికారులు లారీలకు చలానా విధించి రాకపోకలను నిలువరించారు. వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీలు యథచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల నుంచి మట్టిని అక్రమంగా తరలించి దందా నడుపుతున్నా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. ఫిర్యాదు చేస్తే గానీ స్పందించడంలేదని, కొన్ని సందర్భాల్లో తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి మమ అనిపిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించి అటవీ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఎవరినీ ఉపేక్షించడంలేదు. లేమూరులో కూడా ఫిర్యాదు అందగా తవ్వకాలను నిలిపివేయించాం. పరిశీలించిన తర్వాత అనుమతిస్తాం. - సుశీల, తహసీల్దార్, కందుకూరు -
365లో 420 పనులు
సాక్షి, హన్మకొండ : భారీ వాహనాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత నాణ్యత ప్రమాణాల ప్రకారం జాతీయ రహదారి పనులు చేపట్టాలి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా మీదుగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి పేరు చెబుతూ గ్రామీణ రోడ్ల స్థాయిలో పనులు చేపడుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సన్నకంకర, గ్రానైట్ శాండ్ (జీఎస్బీ, గ్రాన్యుల్ సబ్ బేస్) మిశ్రమంతో ప్రాథమిక స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉండగా... చవగ్గా లభిస్తుందనే ఉద్దేశంతో ఎర్రమట్టితోనే రోడ్డు నిర్మాణం చేపడతున్నారు. సమీపంలో ఉన్న గుట్టల నుంచి అక్రమంగా ఎర్రమట్టి తవ్వి రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి దాదాపు కోటిన్నర రూపాయలు వెచ్చిస్తున్నా... పట్టపగలే నాసిరకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా... అధికార యంత్రాంగం కళ్లుమూసుకుని చోద్యం చూస్తోంది. మొదటిదశలో 80 కి.మీలు ప్రస్తుతం వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్తోంది. కొత్తగా మరో జాతీయ రహదారిని జిల్లా మీదుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి మన జిల్లాలో భూపాలపల్లి మండలంలో ప్రవేశించి మరిపెడ మండలంలో ముగుస్తుంది. జిల్లాలో 220 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణాన్ని భూపాలపల్లి-పరకాల-ఆత్మకూరు, ములుగు మండలం మల్లంపల్లి-మరిపెడ, మరిపెడ- నల్గొండ జిల్లా నకిరేకల్ మధ్య మొత్తం మూడు పనులుగా విభజించారు. మొదటిదశలో మల్లంపల్లి-మరిపెడ మధ్య ఉన్న 80 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను రూ. 127 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయూనికీ గండి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నల్లబెల్లి మండలం కన్నారావుపేట, గుండ్లపహాడ్ గ్రామాల సమీపంలోని రాజన్నగుట్టల నుంచి అనుమతులు పొందకుండా ఎర్రమట్టిని తవ్వుతున్నారు. ఇక్కడ మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కానీ... సర్కారు రికార్డుల్లో ఉన్న గుట్టల్లో మైనింగ్ చేపడుతూ ప్రొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో యథేచ్ఛగా ఎర్ర మన్ను తరలించుకుపోతున్నారు. నెలరోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిగా సాగుతున్న మైనింగ్ కారణంగా గుట్ట హరించుకుపోతోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సినఆదాయానికి గండి పడుతోంది. -
హాట్ టాపిక్..! నీ పెత్తనమేంటి?
కడప రాజ్యసభ సభ్యుడిపై జిల్లా ముఖ్యనేత సోదరుడు ఫైర్ ఇసుక, మైనింగ్ వాటాల నుంచి కోరిన రాయలసీమ ఇంచార్జి నయాపైసా ఇచ్చేది లేదని ముఖ్యనేత సోదరుడు స్పష్టీకరణ ముఖ్యనేతపై కన్నెర్ర చేసిన అధికార పార్టీ అధిష్టానం! కర్నూలు : అధికార పార్టీ జిల్లా ముఖ్యనేత పరిధి కేవలం నియోజకవర్గానికే పరిమితం కానుందా? అంతకు మించి పనులు చేసేందుకు అటు పార్టీ అధిష్టానం, ఇటు అధికార యంత్రాంగం సిద్ధంగా లేదా? ఇందుకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అయితే, ఇందుకు కారణం ఏమిటనే విషయం ఆరా తీస్తే.. పార్టీ రాయలసీమ ఇంచార్జితో ముఖ్యనేత సోదరుడు పెట్టుకున్న వైరమే కారణమని తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న వివిధ అక్రమ వ్యాపారాల్లో ‘పార్టీ ఫండ్’ పేరిట వాటా ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడిని సదరు ఇంచార్జి కోరినట్టు సమాచారం. అయితే, జిల్లాలో నీ పెత్తనమేమిటని.. నయాపైసా ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని ఈ వర్గాలు వివరించాయి. ఈ గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారి.. ముఖ్యనేత అధికార పరిధికే ఎసరు తెచ్చిందనే ప్రచారం సాగుతోంది. నీకు రూ. 100... నాకు రూ. 150 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు.. జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. అసైన్డు భూములు, దేవాదాయ భూములతో పాటు వక్ఫ్ భూములనూ వదల్లేదు. ప్రధానంగా డోన్, బేతంచర్ల నియోజకవర్గాల్లోనైతే.. ఎక్కడ చూసినా భూములను జేసీబీలతో భారీగా తవ్విపెట్టారు. ఈ అక్రమ మైనింగ్ మొ త్తం ఆయా నియోజకవర్గాల పరిధిలోని తెలుగు తమ్ముళ్లు చూసుకుంటుండగా.. పర్యవేక్షణ మా్ర తం ముఖ్యనేత సోదరుడిదే. ఈ విధంగా అక్రమ మైనింగ్ చేసుకుంటున్న ప్రతీ సంస్థ ఈ సోదరుడికి టన్ను ఇనుప ఖనిజానికి రూ. 250 ముట్టచెప్పాల్సిందే. అయితే, రాయలసీమ ప్రాంతం ‘మొత్తం వ్యవహారాలను’ పర్యవేక్షించేందుకు పార్టీ కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడిని నియమించిందన్న ప్రచారం ఉంది. ఈ నేత కన్ను కాస్తా జిల్లా అక్రమ మైనింగ్‌పై పడింది. ఇందుకు అనుగుణంగా టన్నుకు వసూ లు చేస్తున్న రూ. 250లో ‘పార్టీ ఫండ్’గా రూ. 150 ఇవ్వాలని జిల్లా ముఖ్యనేత సోదరుడిని సదరు నేత కోరినట్టు సమాచారం. అంతేకాకుండా ఇసుక మాఫియాలోనూ వాటా కోరారనే ప్రచారం ఉంది. అయితే, దీనిని జిల్లా ముఖ్యనేత సోదరుడు ఏమాత్రమూ లెక్కపెట్టలేద ని తెలుస్తోంది. దీంతో లాభం లేదనుకున్న సదరు ఇంచార్జి నేరుగా ముఖ్యనేత సోదరుడితోనే భేటీ అయ్యారని సమాచారం. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జిల్లాలో నీ పెత్తనమేమిటని? నయాపైసా కూడా ఇచ్చేది లేదని ఇంచార్జికి ముఖ్యనేత సోదరుడు తేల్చిచెప్పినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. తీవ్రస్థాయిలో వాగ్వా దం జరిగిందనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోని వ్యతిరేక వర్గం కూడా సదరు ఇంచార్జితో చేతులు కలిపినట్టు సమాచారం. వాళ్ల సంగతి చూడాల్సిందే..: మొత్తంగా ముఖ్యనేత పట్టును జిల్లాలో సడలించేందుకు ఆయన వ్యతిరేకులందరూ ఏకమయ్యారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. పార్టీ అధిష్టానం కూడా ముఖ్యనేతతో పాటు ఆయన సోదరుల వ్యవహారాలపై కన్నెర్ర చేసినట్టు సమాచారం. దీనితో పాటు అక్రమ ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ముఖ్యనేత సోదరుల ప్రమేయానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని, ఉద్యోగుల బదిలీల్లోనూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారంటూ.. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నుంచి అందిన నివేదికల నేపథ్యంలో కట్టడి చేసేం దుకే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కేవలం నియోజకవర్గానికే పెద్దన్నను పరిమితం చేసేలా యాక్షన్ ప్లాన్‌ను అధిష్టానమే దగ్గరుండి నడిపించాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే అధికారులెవ్వరూ ముఖ్యనేత సోదరుడు చెప్పిన పనులు చేయకూడదని పార్టీ అధిష్టానమే ఆదేశించిందని సమాచారం. తాజాగా సీఐల పోస్టింగుల్లోనూ సదరు ముఖ్యనేత మాట చెల్లలేదనే ఫ్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. మొత్తం మీద అధికార పార్టీలో ఇద్దరి నేతల మధ్య చెలరేగిన గొడవ కాస్తా జిల్లాలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.