
ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్
రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై ...
విశాఖ : రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో విజయ్‌కు పెద్ద మొత్తంలో షేర్లున్నాయని, దాన్ని అడ్డుకోవాలంటూ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయ్.. తనకు మైనింగ్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయనడం సత్యదూరమన్నారు. అబ్బాయి రెడ్డి, శ్రీనులతో తనను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు.