CM Ramesh: గనులపై కన్ను... పోటీకి దన్ను | Sakshi
Sakshi News home page

గనులపై కన్ను... పోటీకి దన్ను

Published Sat, May 4 2024 9:41 AM

CM Ramesh Focus on Illegal mining

అక్రమ మైనింగ్‌పై సీఎం రమేష్‌ కన్ను 

మైనింగ్‌ డాన్‌ శ్రీనుతో సత్సంబంధాలు 

బీ–ఫారం ఇచ్చే సమయంలో ఇద్దరూ చెట్టాపట్టాల్‌ 

కొండలను, రంగురాళ్లను దోచుకునే పక్కా ప్లాన్‌ 

భారీ బెల్లం మార్కెట్‌తోపాటు మైనింగ్‌కు కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే సీఎం రమేష్‌ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న కొండలను పిండి చేసి అక్రమార్జనకు తెరలేపేందుకే ఇంతదూరం వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా అనకాపల్లి చుట్టుపక్కలున్న మైన్లతోపాటు నర్సీపట్నంలో ఉన్న రంగురాళ్లను దోచేందుకే చంద్రబాబు డైరెక్షన్‌లో అడుగుపెట్టారనే చర్చ నడుస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా బరిలో నిలిచేందుకు బీ–ఫారం తీసుకునే సమయంలో పక్కనే మైనింగ్‌ డాన్‌ ఉండటం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది.  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు చెబితేనే వచ్చాను.. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉంటానని ప్రకటించుకున్న సీఎం రమేష్‌ మాటల్లో మర్మం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలోని కొండలను నుగ్గు చేసి భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టిన వెంగమాంబ శ్రీనుతో కలిసి బీ–ఫారం తీసుకున్న ఫొటోలు చక్కర్లు కొట్టడంతో నాన్‌ లోకల్‌ నేత పక్కా స్కెచ్‌ తేటతెల్లమవుతోంది. వెంగమాంబ పేరుతో మైనింగ్‌ అధికారులను వెర్రిమాలోకాలను చేసి అక్రమ మైనింగ్‌తో దర్జాగా కోట్లాది రూపాయల మేర దండుకున్న చరిత్ర శ్రీనివాస్‌ చౌదరికి ఉంది. 

ఖజానాకు రావాల్సిన రాయల్టీ వగైరాలను ఎగ్గొటి సొంత జేబులు నింపుకున్న సదరు ఉల్లంఘనుడి సహాయ సహకారాలతో ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాకుండా తనకు తానుగా ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా చెప్పుకుంటూ ఇటు అల్లూరి నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న వనరులను దోచేందుకే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉంటానంటూ చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అనకాపల్లి జిల్లాలోని గనులను దోచుకునేందుకే ఈ ఘనుడు వచ్చాడని అర్థమవుతోంది. 

ఇదీ వెంగమాంబ బాగోతం...! 
వాస్తవానికి అనకాపల్లి ఎంపీ బరిలో సీఎం రమేష్‌ ఉండాలని నిర్ణయించుకున్న సమయంలోనే మైన్స్‌పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పారీ్టకి దగ్గరగా ఉండి... 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వెంగమాంబ క్వారీ సంస్థ అధినేత శ్రీనివాస్‌ చౌదరి బీజేపీకి దగ్గరగా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్‌ కూడా శ్రీనివాస్‌ చౌదరికి దగ్గరయ్యారు. ఎంతగా దగ్గరయ్యారంటే.... బీ–ఫారం తీసుకునే సమయంలోనే అక్రమ మైనింగ్‌ వీరుడితో చెట్టాపట్టాలేసుకునేంతగా.. అక్రమ మైనింగ్‌ డాన్‌గా వీవీఆర్‌ స్టోన్‌క్రషర్స్‌ అధినేత శ్రీనివాస్‌ చౌదరికి పెట్టింది పేరు. అక్రమ మైనింగ్‌ అధికారులతో కుమ్మక్కై కోట్లాది విలువ చేసే వనరులను దోచుకున్న వెంగమాంబ శ్రీనివాస్‌ చౌదరి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చాడు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యరి్థగా వచ్చిన సీఎం రమే‹Ùకు అత్యంత ఆప్తుడిగా ఎన్నికల ప్రచారాల్లో శ్రీనివాస్‌ చౌదరి ప్రచారం చేస్తున్నాడు.

 సీఎం రమేష్‌ ఎంపీ అయితే జిల్లాలో ఎక్కడా కొండలు లేకుండా అనకొండ శ్రీనివాస్‌ చౌదరి దోచుకుంటారనే అనుమానాలున్నాయి. అయితే కడప నుంచి వచ్చిన సీఎం రమేష్‌ లాంటి వారిని ఓడగొడితేనే ఇలాంటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని స్ధానిక ప్రజలు భావిస్తున్నారు. అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నెం.193, 303లో వీవీఆర్‌ స్టోన్‌ క్రషర్స్‌ ఖనిజ సంపదను అక్రమంగా దోచేసి మైనింగ్‌ చేయడంతో మైన్స్‌ శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గత ఏడాది జూలై 8న  క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేసి శ్రీనివాస్‌ చౌదరికి దాదాపు రూ.33 కోట్ల జరిమానా విధించారు. అయినా లెక్కచేయకుండా మైనింగ్‌ డాన్‌ శ్రీనివాస్‌ చౌదరి స్ధానిక మైనింగ్‌ అధికారులతో చేతులు కలిపి యథేచ్ఛగా మైనింగ్‌ కొనసాగిస్తున్నారు. 

వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతుందని స్థానికులు చేసిన ఫిర్యాదులను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమంటే లెక్కలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాకు సంబంధించి నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, శ్రీనివాస్‌ చౌదరి ఆగడాలకు తొత్తులుగా పనిచేస్తున్నారని అప్పట్లో ముగ్గురు అధికారులను, విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీవీవీ సత్యనారాయణరెడ్డిని ఏలూరు బదిలీ చేశారు. వెంగమాంబ స్టోన్‌ క్రషర్స్‌లో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. 

ఏకంగా 5 లక్షల 68 వేల 923 క్యూబిక్‌ మీటర్ల ఖనిజం దోచుకున్నారని మైన్స్‌ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి అప్పట్లో నిర్ధారించారు. దీనికి రూ.32.36 కోట్ల మేర జరిమానా విధించారు. అయినప్పటికీ ఆగకుండా అక్రమ మైనింగ్‌ చేశారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి గ్రామీణ జిల్లాగా పచ్చని వ్యవసాయ గ్రామాలతో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉంది. ఇప్పటికే శ్రీనివాస్‌ చౌదరి లాంటి అక్రమ మైనింగ్‌ డాన్‌లు జిల్లాలో ఖనిజాన్ని దోచేస్తున్నారు. వీరికి తోడు సీఎం రమేష్‌ లాంటి వాళ్లు వస్తే జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి ఎదురుకావచ్చు.  

చంద్రబాబు డైరెక్షన్‌లోనే..
వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్‌లోనే బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆయన రాజ్యసభ అభ్యరి్థత్వంపై వేటు పడలేదు. దర్జాగా చివరి వరకూ ఆ పదవిని అనుభవించారు. తిరిగి రాజ్యసభకు వెళ్లాలని భావించినప్పటికీ ఆ అవకాశాన్ని బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తహతహలాడిన చంద్రబాబు... అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం తన వ్యక్తికే ఉండాలని భావించారు. మొదటగా ఈ సీటు నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా పావులు కూడా కదిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న భారీ గనులను దృష్టిలో ఉంచుకున్న బాబు... ఈ సీటు నుంచి నాగబాబు బరిలో ఉండటాన్ని ఇష్టపడలేదు. దీని ఫలితంగానే ఈ సీటును బీజేపీ గట్టిగా కోరడం... పవన్‌ ఈ సీటును వదులుకోవడం జరిగిపోయాయి. ఫలితంగా సీఎం రమేష్‌ తెరమీదకు వచ్చారు. ఈ వ్యవహారమమంతా బాబు డైరెక్షన్‌లోనే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

 

Advertisement
Advertisement