Mining case
-
CM Ramesh: గనులపై కన్ను... పోటీకి దన్ను
భారీ బెల్లం మార్కెట్‌తోపాటు మైనింగ్‌కు కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే సీఎం రమేష్ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న కొండలను పిండి చేసి అక్రమార్జనకు తెరలేపేందుకే ఇంతదూరం వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా అనకాపల్లి చుట్టుపక్కలున్న మైన్లతోపాటు నర్సీపట్నంలో ఉన్న రంగురాళ్లను దోచేందుకే చంద్రబాబు డైరెక్షన్లో అడుగుపెట్టారనే చర్చ నడుస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా బరిలో నిలిచేందుకు బీ–ఫారం తీసుకునే సమయంలో పక్కనే మైనింగ్ డాన్ ఉండటం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు చెబితేనే వచ్చాను.. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉంటానని ప్రకటించుకున్న సీఎం రమేష్ మాటల్లో మర్మం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలోని కొండలను నుగ్గు చేసి భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టిన వెంగమాంబ శ్రీనుతో కలిసి బీ–ఫారం తీసుకున్న ఫొటోలు చక్కర్లు కొట్టడంతో నాన్ లోకల్ నేత పక్కా స్కెచ్ తేటతెల్లమవుతోంది. వెంగమాంబ పేరుతో మైనింగ్ అధికారులను వెర్రిమాలోకాలను చేసి అక్రమ మైనింగ్‌తో దర్జాగా కోట్లాది రూపాయల మేర దండుకున్న చరిత్ర శ్రీనివాస్ చౌదరికి ఉంది. ఖజానాకు రావాల్సిన రాయల్టీ వగైరాలను ఎగ్గొటి సొంత జేబులు నింపుకున్న సదరు ఉల్లంఘనుడి సహాయ సహకారాలతో ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాకుండా తనకు తానుగా ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా చెప్పుకుంటూ ఇటు అల్లూరి నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న వనరులను దోచేందుకే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉంటానంటూ చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అనకాపల్లి జిల్లాలోని గనులను దోచుకునేందుకే ఈ ఘనుడు వచ్చాడని అర్థమవుతోంది. ఇదీ వెంగమాంబ బాగోతం...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ బరిలో సీఎం రమేష్ ఉండాలని నిర్ణయించుకున్న సమయంలోనే మైన్స్పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పారీ్టకి దగ్గరగా ఉండి... 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వెంగమాంబ క్వారీ సంస్థ అధినేత శ్రీనివాస్ చౌదరి బీజేపీకి దగ్గరగా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్ కూడా శ్రీనివాస్ చౌదరికి దగ్గరయ్యారు. ఎంతగా దగ్గరయ్యారంటే.... బీ–ఫారం తీసుకునే సమయంలోనే అక్రమ మైనింగ్ వీరుడితో చెట్టాపట్టాలేసుకునేంతగా.. అక్రమ మైనింగ్ డాన్‌గా వీవీఆర్ స్టోన్‌క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరికి పెట్టింది పేరు. అక్రమ మైనింగ్ అధికారులతో కుమ్మక్కై కోట్లాది విలువ చేసే వనరులను దోచుకున్న వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చాడు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యరి్థగా వచ్చిన సీఎం రమే‹Ùకు అత్యంత ఆప్తుడిగా ఎన్నికల ప్రచారాల్లో శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేస్తున్నాడు. సీఎం రమేష్ ఎంపీ అయితే జిల్లాలో ఎక్కడా కొండలు లేకుండా అనకొండ శ్రీనివాస్ చౌదరి దోచుకుంటారనే అనుమానాలున్నాయి. అయితే కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ లాంటి వారిని ఓడగొడితేనే ఇలాంటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని స్ధానిక ప్రజలు భావిస్తున్నారు. అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నెం.193, 303లో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ ఖనిజ సంపదను అక్రమంగా దోచేసి మైనింగ్ చేయడంతో మైన్స్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత ఏడాది జూలై 8న క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేసి శ్రీనివాస్ చౌదరికి దాదాపు రూ.33 కోట్ల జరిమానా విధించారు. అయినా లెక్కచేయకుండా మైనింగ్ డాన్ శ్రీనివాస్ చౌదరి స్ధానిక మైనింగ్ అధికారులతో చేతులు కలిపి యథేచ్ఛగా మైనింగ్ కొనసాగిస్తున్నారు. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతుందని స్థానికులు చేసిన ఫిర్యాదులను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమంటే లెక్కలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాకు సంబంధించి నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, శ్రీనివాస్ చౌదరి ఆగడాలకు తొత్తులుగా పనిచేస్తున్నారని అప్పట్లో ముగ్గురు అధికారులను, విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీవీవీ సత్యనారాయణరెడ్డిని ఏలూరు బదిలీ చేశారు. వెంగమాంబ స్టోన్ క్రషర్స్‌లో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఏకంగా 5 లక్షల 68 వేల 923 క్యూబిక్ మీటర్ల ఖనిజం దోచుకున్నారని మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీ ప్రతాప్‌రెడ్డి అప్పట్లో నిర్ధారించారు. దీనికి రూ.32.36 కోట్ల మేర జరిమానా విధించారు. అయినప్పటికీ ఆగకుండా అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి గ్రామీణ జిల్లాగా పచ్చని వ్యవసాయ గ్రామాలతో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ చౌదరి లాంటి అక్రమ మైనింగ్ డాన్లు జిల్లాలో ఖనిజాన్ని దోచేస్తున్నారు. వీరికి తోడు సీఎం రమేష్ లాంటి వాళ్లు వస్తే జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు డైరెక్షన్లోనే..వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆయన రాజ్యసభ అభ్యరి్థత్వంపై వేటు పడలేదు. దర్జాగా చివరి వరకూ ఆ పదవిని అనుభవించారు. తిరిగి రాజ్యసభకు వెళ్లాలని భావించినప్పటికీ ఆ అవకాశాన్ని బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తహతహలాడిన చంద్రబాబు... అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం తన వ్యక్తికే ఉండాలని భావించారు. మొదటగా ఈ సీటు నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా పావులు కూడా కదిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న భారీ గనులను దృష్టిలో ఉంచుకున్న బాబు... ఈ సీటు నుంచి నాగబాబు బరిలో ఉండటాన్ని ఇష్టపడలేదు. దీని ఫలితంగానే ఈ సీటును బీజేపీ గట్టిగా కోరడం... పవన్ ఈ సీటును వదులుకోవడం జరిగిపోయాయి. ఫలితంగా సీఎం రమేష్ తెరమీదకు వచ్చారు. ఈ వ్యవహారమమంతా బాబు డైరెక్షన్లోనే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మధుసూదన్ అరెస్ట్‌తో రంగంలోకి హరీష్.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయి. పూర్తి పర్మిషన్తో క్వారీలు నడిపిస్తున్నాము. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నాము. మా తమ్ముడిని అక్రమంగా అరెస్ట్ చేశారు’ అని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది?. నోటీసులు ఇవ్వరు.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి. పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. pic.twitter.com/xm5037wIyS — Telugu Scribe (@TeluguScribe) March 15, 2024 Video Credit: TeluguScibe మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు. వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వంద రోజులు పూర్తి అయ్యాయి.. హామీల అమలు పూర్తి కాలేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చివరకు ధర్మమే గెలుస్తుంది. కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము. మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలవండి. ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్.. కారణం ఇదే..
సాక్షి, పటాన్చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మధుసూదన్ అరెస్ట్‌తో పటాన్చెరు పోలీసు స్టేషన్ వద్దకి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు. -
ఈడీ ఎఫెక్ట్.. జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం!
ఢిల్లీ: జార్ఖండ్, రాజస్థాన్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు మరోసారి రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 చోట్ల తనిఖీలు చేస్తోంది. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మీడియా అడ్వజర్ అభిషేక్ ప్రసాద్‌కు సంబంధించిన నివాసం, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే, హజారీబాగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక, రామ్ నివాస్‌కు రాజస్థాన్‌లో కూడా ఇళ్లు ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం కూడా నోటీసులు అందించింది. వాటిని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మరోసారి సోరెన్‌కు అవకాశమిచ్చింది. #WATCH | Ranchi: ED raids are underway at Jharkhand CM Hemant Soren's press advisor's residence Abhishek Prasad alias Pintu in connection with an illegal mining case. Searches are being carried out at 12 locations including Abhishek Prasad's residence and the residence of… pic.twitter.com/fRuJWQkxw8 — ANI (@ANI) January 3, 2024 మరోవైపు.. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి బుధవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. Ranchi- BJP leader Nishikant Dubey claimed that Jharkhand CM Hemat Soren's wife Kalpana Soren will take over as the Chief Minister of the state. Dubey's statement came after a Jharkhand Mukti Morcha (JMM) MLA resigned from the Assembly, citing personal reasons. pic.twitter.com/iZLPTf3MRZ — 🚩वसुधैव कुटुंबकम् 🚩 (@vasudhaiva1978) January 1, 2024 ఈడీ నోటీసుల నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాలకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈడీ కేసు వెంటాడుతున్న నేపథ్యంలో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారని, ఆ బాధ్యతలను సతీమణి కల్పనకు అప్పగిస్తారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గండేయ్ స్థానం నుంచి ఆమెకు అవకాశం కల్పించేలా.. అహ్మద్‌తో రాజీనామా చేయించారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేత, ఎంపీ నిషికాంత్ దూబే ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం సొరేన్ స్పందించారు. దీన్ని ఖండించిన సోరెన్.. తన సతీమణి పోటీ చేసే అవకాశం పూర్తిగా అబద్దమేనని కొట్టిపారేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వస్తున్న వార్తలను నిజం కాదన్నారు. -
ఓఎంసీ కేసు నుంచి తప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసు నుంచి తన పేరును తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మంత్రి అభ్యర్థనను గత అక్టోబర్‌లో తోసిపుచ్చింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కేసుతో తనకు సంబంధం లేనందున పేరు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ జరగనుంది -
దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థలకు నోటీసులు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ కేసు నమోదైంది. జేసీ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన మైనింగ్ అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆయన పేర్కొన్నారు. చదవండి: మా వాళ్లు రాక్షసులు.. మీ రక్తం తాగుతారు: జేసీ మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదని, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందని, ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు స్పష్టం చేశారు. -
నన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన లైమ్‌స్టోన్(సున్నం రాయి) అక్రమ తవ్వకాల వ్యవహారంలో పోలీసులు తనను నిందితుడిగా చేర్చి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా యరపతినేని తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇందులో పిటిషనర్ యరపతినేని నిందితుడు కాదని తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు జారీ చేసి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసులను నిరోధించాలని చూస్తున్నారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. భారీ మొత్తంలో లైమ్‌స్టోన్‌ను కొల్లగొట్టారన్న ఆరోపణలు యరపతినేనిపై ఉన్నాయని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు చేస్తున్న పనిని చేయకుండా వారిని నిరోధించాలని యరపతినేని కోర్టును కోరుతున్నారని వివరించారు. ఇలాంటి పిటిషన్లను న్యాయస్థానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ను ఉల్లంఘిస్తూ ఏవైనా చర్యలు తీసుకుంటే అప్పుడు పిటిషనర్ కోర్టుకు రావొచ్చని, కేవలం భయాందోళన ఆధారంగా కోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ
-
సీబీఐ విచారణ చేయాల్సిందే: అంబటి
గుంటూరు: గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..అక్రమ మైనింగ్‌లో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ల హస్తం ఉందని ఆరోపించారు. అధికారులు అక్రమార్కులకు సహకరిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐడీ విచారణతో నిజాలు బయటికి రావు..సీబీఐ విచారణ చేయాల్సిందేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడికుడి, కొనంకి, కేసానుపల్లి గ్రామాల్లో ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి యరపతినేని టన్నుల కొద్దీ ముడి ఖనిజాన్ని తవ్వి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టులో పిల్ వేసిన గురువాచారిని అక్రమ కేసులో ఇరికించి టీడీపీలో చేర్చుకోవాలని చూశారని అన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో ఎమ్మెల్యే యరపతినేనికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్‌పై కోర్టు మెట్లెక్కిన వారిపై యరపతినేని అక్రమ కేసులతో వేధిస్తున్నారని, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణా రెడ్డిపై 6 అక్రమ కేసులు బనాయించారని వెల్లడించారు. కోడెల కుటుంబానికి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతోన్న సత్తెనపల్లి రెవెన్యూ అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చెప్పారు. -
బుల్లెట్ రాణి గురించి ఎస్పీ ఆరా
విజయనగరం టౌన్: గరివిడి మండలంలోని శేరీపేటలో బుల్లెట్ ఓర్ మైనింగ్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన బెంగళూరు కంపెనీ నిర్వహకురాలు, కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ జి.పాలరాజు దృష్టి సారించారు. బుల్లెట్ఓర్ తవ్వకాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఎస్పీ స్పందించారు. బుల్లెట్‌రాణి ఎవరు? ఆమె కార్యకలాపాలు ఏమిటి? ఆమె వెనుక ఎవరున్నారు అనే కోణంలో పరిశోధనలు జరిపి నివేదిక ఇవ్వాలని స్పెషల్‌బ్రాంచ్ పోలీస్ అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ పాలరాజు సాక్షికి వెల్లడించారు. -
బెయిల్ స్కాం కేసులో అదనపు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో బెయిల్ పొందేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ముడుపులిచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు కోర్టులో ఇటీవల ఓ అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. జనార్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయించే క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి సోమశేఖర్‌రెడ్డి, రౌడీషీటర్ యాదగిరి, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ తదితరులు.. తమ సన్నిహితులు, తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, బంధువుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని, వాటి ద్వారా సంభాషణలు జరిపేవారని ఏసీబీ చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఎవరెవరి పేర్లతో సిమ్ కార్డులు పొందారో వారి వాంగ్మూలాలను నమోదు చేసి ఆ వివరాలను చార్జిషీట్లో పొందుపరిచారు. రౌడీషీటర్ యాదగిరి వద్ద పనిచేసే కారు డ్రైవర్ రాము, సోమశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి, జి.రాజశేఖర్, నాగరాజు తదితరుల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. వీరిలో కొందరు తమ గుర్తింపు కార్డులతోపాటు దరఖాస్తులపై సంతకాలు తీసుకున్నారని చెప్పగా, మరికొందరు తమకు అసలు ఫోన్లే లేవని చెప్పారు. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారుల వాంగ్మూలాలను కూడా ఏసీబీ నమోదు చేసింది. -
‘గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతులు చెప్పండి’
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి షరతులు విధించాలో చెప్పండంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మూడు నెలల అనంతరం జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. తొలుత గాలి జనార్దన్‌రెడ్డి తరపు న్యాయవాదులు దుష్యంత్ దవే, దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా పిటిషనర్ 39 నెలల 23 రోజులుగా అండర్ ట్రయల్‌గా జైల్లో మగ్గుతున్నాడని తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో మూడో చార్జిషీట్ కూడా ఫైల్ చేశారని, దర్యాప్తు ఎప్పుడో పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు జోక్యం చేసుకుంటూ ‘ఎలాంటి షరతులు పెట్టాలో సీబీఐని చెప్పనివ్వండి.. డిసెంబర్ 15లోపు సీబీఐ స్పష్టమైన వైఖరితో రావాలి’ అంటూ సీబీఐ తరపు న్యాయవాది మన్విందర్ సింగ్‌ను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేశారు.