ఫైల్ ఫోటో
సాక్షి, పటాన్‌చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మధుసూదన్ అరెస్ట్‌తో పటాన్‌చెరు పోలీసు స్టేషన్ వద్దకి భారీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment