సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.
కాగా, పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి హస్తం గూటిలో చేరబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది కాంగ్రెస్‌లో చేరారు. మహిపాల్ చేరికతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.
ఇదిలా ఉండగా.. ఈరోజు మధ్యాహ్నమే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి ఫొటోలను ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే సంకేతాలిచ్చాడు. మరోవైపు.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో బీఆర్‌ఎస్ కేడార్ టెన్షన్ పడుతున్నారు.
ఇక, పార్టీలో విలీనం అయ్యే వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చారు. గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేసింది. దీంతో, వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక రూరల్ నుంచి కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడుతున్న సమాచారం. మరో రెండు రోజుల్లో మరో నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాజీనామా చేస్తేనే బీజేపీలో చేరాలంటున్న కాషాయ పార్టీ నేతలు. దీంతో, మిగిలిన నేతలు హస్తంవైపు అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment