gudem Mahipal Reddy
-
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు
-
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్
సాక్షి, పటాన్చెరు: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.తాజాగా బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పటాన్చెరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు. కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నాను. గత పది ఏళ్లు నాకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. గూడెం మహిపాల్ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
నేడు కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దమైంది. సోమవారం(జులై 15) సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్‌గౌడ్,నీలం మధును కాంగ్రెస్ అదిష్టానం బుజ్జగిస్తోంది. మహిపాల్‌రెడ్డి వెంట సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ , అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్, ఎంపీపీ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్కు మరో షాక్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.కాగా, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి హస్తం గూటిలో చేరబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది కాంగ్రెస్‌లో చేరారు. మహిపాల్ చేరికతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు మధ్యాహ్నమే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి ఫొటోలను ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే సంకేతాలిచ్చాడు. మరోవైపు.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో బీఆర్ఎస్ కేడార్ టెన్షన్ పడుతున్నారు. ఇక, పార్టీలో విలీనం అయ్యే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చారు. గ్రేటర్లో బీఆర్ఎస్ను ఖాళీ చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేసింది. దీంతో, వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక రూరల్ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడుతున్న సమాచారం. మరో రెండు రోజుల్లో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాజీనామా చేస్తేనే బీజేపీలో చేరాలంటున్న కాషాయ పార్టీ నేతలు. దీంతో, మిగిలిన నేతలు హస్తంవైపు అడుగులు వేస్తున్నారు. -
పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం
-
ED Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
Updates..👉 నిజాంపేటలో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడి చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే, పలు ఆస్తులను సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.👉ఇక, అంతకుముందు గడువు పూర్తైనా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్వారీలను అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.👉తెలంగాణలో మరోసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది. 👉కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మధుసూదన్ అరెస్ట్‌తో రంగంలోకి హరీష్.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయి. పూర్తి పర్మిషన్తో క్వారీలు నడిపిస్తున్నాము. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నాము. మా తమ్ముడిని అక్రమంగా అరెస్ట్ చేశారు’ అని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది?. నోటీసులు ఇవ్వరు.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి. పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. pic.twitter.com/xm5037wIyS — Telugu Scribe (@TeluguScribe) March 15, 2024 Video Credit: TeluguScibe మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు. వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వంద రోజులు పూర్తి అయ్యాయి.. హామీల అమలు పూర్తి కాలేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చివరకు ధర్మమే గెలుస్తుంది. కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము. మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలవండి. ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్.. కారణం ఇదే..
సాక్షి, పటాన్చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మధుసూదన్ అరెస్ట్‌తో పటాన్చెరు పోలీసు స్టేషన్ వద్దకి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు. -
పటాన్చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మూడు పార్టీల్లోనూ వర్గపోరు! మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం. రాజకీయానికి అంశాలు : పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ : కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్) బిజెపి: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి. -
‘తారకాసుర’సిరీస్ విజయం సాధించాలి: ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే... ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న "తారకాసుర -2" చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!! "తారకాసుర సిరీస్"తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ "శ్రీజ మూవీస్" బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. "తారకాసుర-2" చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
వెంటాడుతున్న కేసులు: కోర్టుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వరుస కట్టారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (ములుగు)పై జారీ చేసిన నాన్ బెయిల్ వారెంట్‌ను కోర్టు ఉప సంహరించుకోగా.. అయితే రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వేర్వేరు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి) కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు విచారణ కోసం వచ్చారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇంకొక కేసులో సమన్లు జారీ చేసిన కూడా గైర్హాజరవడంతో నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై అతడిని కోర్టు పిలిచింది. అయితే ఎస్హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా అతడు వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. -
హింసిస్తున్న ఎంఈఓ
పటాన్చెరు: మండల విద్యాధికారి తమను అనవసరంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం ఆరోపించింది. ఆదివారం వారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి తమ బాధలను ఆయనతో ఏకరువు పెట్టారు. తమను బూతులు తిడుతున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. మరో రకంగా చెప్పాలంటే తమను హింసిస్తున్నాడని, ఆ ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొన్ని పాఠశాలల మహిళా కరస్పాండెంట్లను వ్యక్తిగతంగా రావాలంటూ వేధిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఇలాంటి విద్యాధికారిని చూడలేదన్నారు. ఇటీవల ఓ కరస్పాండెంట్‌ను సమావేశం పేరుతో పిలిచి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేకు వివరించారు. ఆ సంఘటనతో ఆ కరస్పాండెంట్ కన్నీటి పర్యంతమయ్యారని వారు చెప్పారు. చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. పటాన్చెరు ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. వీరిలో సంఘం ప్రతినిధులు టి.ప్రమోద్, రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రావణ దహనానికి పోటాపోటీ ఏర్పాట్లు
పటాన్చెరు: పటాన్చెరు పారిశ్రామికవాడలో దసరా ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు నిర్వాహకులు వెనుకాడటంలేదు. ప్రతి ఏటా రావణ దహనానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. నేతలు పోటీ పడి మరీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పటాన్చెరు పట్టణంలో రెండు దశాబ్దాలుగా మైత్రి గ్రౌండ్స్‌లో రావణ దహన కార ్యక్రమం కొనసాగుతుంది. పట్టణంలో జరిగే దసరా ఉత్సవాల్లో రాజకీయాలకు తావివ్వకుండా పుర ప్రముఖులంతా ఐక్యంగా పండగ ఏర్పాట్లు చేస్తారు. అధికారంలో ఉన్న వారు తమ వంతు సహకారంగా ఏర్పాట్ల నిర్వహణకు ముందుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పండుగ రోజున అన్ని పార్టీల వారు వారి అభిమానులు కలిసి పండుగ నిర్వహిస్తారు. పట్టణంలోని పౌరులంతా మైత్రి గ్రౌండ్స్‌కు చేరుకుని రావణ దహన కార్యక్రమాన్ని వీక్షిస్తారు. అంతకు ముందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఇతర పెద్దలందతా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ ఈ సంస్కృతి చాలా కాలంగా సాగుతోంది. మండలం పరిధిలో ఇదే తీరులో అమీన్పూర్, పాశమైలారంలలో కూడా గత మూడు ఏళ్లుగా సాగుతుంది. పాశమైలారంలో ఈ సారి రూ.అయిదు లక్షలు వెచ్చించి సర్పంచ్ సుధాకర్‌గౌడ్ రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలో రావణ విగ్రహం ఏర్పాటు చేసే కళాకారులే ఇక్కడ ఆ రూపాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన నిపుణలు బాణా సంచాను తెచ్చి విగ్రహాన్ని దహనం చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ.2.50 లక్షలు వెచ్చిస్తున్నారు. లక్ష తీసుకుంటాం: నందీశ్వర్, విగ్రహ రూపకర్త రావణ దహన కార్యక్రమానికి ప్రతి దసరాకు తాము సంగారెడ్డిలో రావణ విగ్రహాన్ని రూపుదిద్దుతాము. ఖైరతాబాద్ నివాసులం. మా వర్కర్లు 15 మంది ఈ విగ్రహాల నిర్మాణానికి 15 రోజుల పాటు పని చేస్తారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని కొంపల్లి, పటాన్‌చెరులోని పాశమైలారంలలో రావణ దహనం కోసం విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేస్తున్నాం. సాధారణంగా చాలా మంది తడికలు వాడుతారు. మేం దాంతో పాటు విగ్రహానికి మంచి రంగు వచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో దాన్ని తీర్చిదిద్దుతున్నాము. అలాగే క్షణాల్లో విగ్రహం దహన మయ్యేలా తయారు చేయడం మా ప్రత్యేకత. -
ఎవరి లెక్క వారిదే
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక సంగ్రామం ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి ‘కాసింత’ సమయం మిగిలి ఉంది. ‘ఐదేళ్ల పదవి’ కాంక్షతో మండుటెండలను లెక్కజేయకుండా ఎడాపెడా తిరిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, పోలింగ్ ముగిసిన వెంటనే యథాలాపంగా తమ ఏసీ గృహాలకు చేరి సేదతీరుతున్నారు. కానీ, గదులు ఎంత చల్లగా ఉన్నా, వారికి చెమటలు పడుతూనే ఉన్నాయి. కంటినిండా నిద్ర కూడా పట్టడం లేదు. గొంతులో ముద్ద దిగడం లేదు. ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారోనని అభ్యర్థులందరూ లోలోపల మదన పడుతున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నెల 16న వెల్లడి కానున్న ఫలితాల్లో తమ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు మాత్రం మేమే గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే గణాంకాలు తెప్పించుకున్న అభ్యర్థులు మండలాలు, గ్రామాల వారీగా తమకు వచ్చే ఓట్లను విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిపై స్పందించాలని ‘సాక్షి’ ఆయా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్న అభ్యర్థులను పలకరించింది. ఈ ఎన్నికల తర్వాత తమ భవితవ్యంపై అభ్యర్థులు ఏమనుకుంటున్నారు...విజయావకాశాలపై వారెలా స్పందించారు. 25 వేల మెజార్టీతో గెలుస్తా చింత ప్రభాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లు నిండు మనస్సుతో ఆశీర్వదించి ఓటేసినందువల్ల దాదాపు 25 వేల ఓట్ల మోజార్టీతో కచ్చితంగా విజయం సాధిస్తా. సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలతో పాటు సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి మండలాల ఓటర్లు టీఆర్ఎస్ పార్టీనే ఆశీర్వదించి ఓట్లు వేశారు. అందువల్ల నాకే మోజార్టీ వస్తుందని భావిస్తున్నా. నా కష్టాన్ని, అభివృద్ధిని ప్రజలు గుర్తించారు కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పడిన కష్టాన్ని ఇక్కడి ప్రజలు గుర్తించారు. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించి ఓటు వేశారు. నాకు 85 వేలకు పైగా ఓట్లు రానున్నాయి. 15 వేల నుంచి 20 వేల మెజారిటీతో మళ్లీ గెలవబోతున్నాను. విజయం నాదే టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పోలింగ్ రోజే మా విజయం ఖాయమైంది. భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. మెజార్టీ ఎంత అని తెలుసుకోడానికే ఎదురుచూస్తున్నాను. ప్రజలు టీడీపీని తిరస్కరించడంతో ఆ పార్టీ కేడర్ మా విజయానికి సహకరించింది. వెయిట్ అండ్ సీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఫలితం కోసం ఈ నెల 16 వరకు వేచి చూడండి. గెలిచేదెవరో, ఓడేదెవరో మీకే తెలుస్తుంది. ప్రజాతీర్పును శిరసా వహిస్తా. ఎలాంటి ఫలితానైన్నా స్వీకరిస్తా. ఫలితాలపై ఎలాంటి టెన్షన్ లేదు. మేము అనుకుంటున్నది చెప్పాక ఫలితాలు మరోలా వస్తే ప్రజల ముందు అపహస్యం పాలవుతాం. అందుకే కొన్ని రోజులు వేచి చూద్దాం. ఊహించని మెజార్టీ ఖాయం: టీఆర్ఎస్ అభ్యర్థి పి.బాబూమోహన్ ఈ సారి నా గెలుపు ఖాయం. నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో ఓటర్లు నన్ను ఆదరించారు. పోలింగ్ సరళిని చూస్తే అదే రోజు నా విజయం ఖాయమైందని అర్థం చేసుకున్నా. ఎవరూ ఊహించని మెజారిటీతో గెలుస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటాననే నన్ను ఆదరించారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా, ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేశారు. పోలింగ్ సరళి సంతృప్తిని కలిగించింది. మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మూలంగానే తెలంగాణ వచ్చిందని ప్రజలు గట్టిగా నమ్మి ఓట్లు వేశారు. తెలంగాణ తెచ్చామని ప్రజలు నమ్మారు కె.మాణిక్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేశారు. సుమారు 10 వేలకు పైగా మెజార్టీతో నా గెలుపు ఖాయం. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మడం లేదు. పోలింగ్ రోజు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా కనిపించింది. తప్పకుండా గెలిచి తీరుతా. నా సేవలే నన్ను గెలిపిస్తాయి కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి గత 15 ఏళ్ళుగా నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విజయానికి సహకరించింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం కూడా కలిసి వచ్చింది. అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చారు. నా గెలుపు ఖాయం. గెలుపుఖాయం.. మెజార్టీ చెప్పలేను టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నాకే మెజారిటీ రానుంది. మెదక్ పార్లమెంటు నుంచి కేసీఆర్ పోటీ చేయడం, తెలంగాణ వాదం బలంగా ఉండడం, అన్ని వర్గాల అభ్యున్నతికి అనువుగా మా మేనిఫెస్టో ఉండడం నాకు కలిసి వచ్చింది. గతంలో నేను రెండుసార్లు ఓడిపోవడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉంది. ఈ సారి గెలుపు ఖాయం..కానీ మెజార్టీ ఎంతో ఇప్పుడే చెప్పలేను. 5 వేలకు పైగా మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డిపై ఐదువేల నుంచి పది వేల ఓట్లతో మెజార్టీతో విజయం సాధిస్తా. గ్రామాల వారీగా పోలింగ్ వివరాలను తెలుసుకున్నా. విజయంపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. 15 వేల మేజార్టీతో గెలుస్తా టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గ్రామాలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలంతా నమ్మారు. అందుకే టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. వారిపై వ్యతిరేకతే నా విజయానికి దారి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో పాటు నరేంద్రమోడి ప్రభంజనం పనిచేస్తే నేను గెలుస్తా. సమీప ప్రత్యర్థిపై కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది. నియోజకవర్గంలో బీజేపీకి ఆపూర్వ ఆదరణ లభించింది. దుబ్బాకను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో మా పార్టీ పటిష్టంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదే అన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ మాట తప్పడం కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో స్థానికత అంశం తెరపైకి వచ్చింది. సిద్దిపేట పెత్తనాన్ని గజ్వేల్ ప్రజలు కోరుకోవడంలేదు. అందువల్ల నాకు విజయాకాశాలున్నాయి. ప్రజలు అక్కున చేర్చుకున్నారు టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి 2009 ఎన్నికల్లో ఓడిపోయినా నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకున్నాను. అందువల్ల ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. టీఆర్ఎస్ నాపై ఎన్నో రకాల కుట్రలు చేసింది. అయినా ప్రజలు నాకే మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పునాదులు ఉండటం నాకున్న బలం. 2009 ఫలితం పునరావృతం కాంగ్రెస్ అభ్యర్థి పి.కిష్టారెడ్డి ఖేడ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరించారు. నాకు అఖండ విజయం ఖాయం. 2009 ఎన్నికల్లో వచ్చిన 27 వేల మెజార్టీనే మళ్లీ పునరావృతం కాబోతోంది. గత ఐదేళ్ళుగా చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపించబోతున్నాయి. గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు చేశాను. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేశాను. వైఎస్సార్ అభిమానులంతా ఆశీర్వదించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా నాకే ఓటు వేశారు. యువత, మహిళలు, దళితులు, గిరిజనులు ఇలా అందరూ నాకే మద్దతు తెలిపారు. తప్పకుండా నేనే గెలిచి తీరుతానని నమ్ముతున్నా. నాకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. 10 వేల మెజార్టీ తథ్యం టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం సాధించినందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. గిరిజనులు, యువత, మహిళలు, మైనారిటీలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. తక్కువలో తక్కువగా వేసుకున్నా కనీసం 10 వేల మెజారిటీతో నా గెలుపు ఖాయంగా ఉంది. భారీ మెజార్టీపై సంపూర్ణ విశ్వాసం టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్‌రావు గత ఉప ఎన్నికలతో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో నా మెజార్టీ కూడా పెరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. సిద్దిపేటలో నా విజయం నామినేషన్ వేసిన రోజే ఖాయమైంది. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నా. నియోజకవర్గ ప్రజలు మరోసారి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని గట్టిగా నమ్ముతున్నా. విజయానికి దగ్గరగా... కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందని ఓటర్లు నమ్మారు. గత ఉప ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా నాకు ఓట్లు తెచ్చిపెట్టింది. దీంతో విజయానికి దగ్గరగా ఉన్నా. సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. తెలంగాణవాదమే నా బలం టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నియోజకవర్గ ప్రజలు విశ్వసించారు. తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీకీ ప్రజలు కృతజ్ఞతపూర్వకంగా ఓటు వేశారు. 15వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. నా గెలుపుకోసం సీమాంధ్రవారు కూడా పనిచేశారు. వారందరికీ కృతజ్ఞతలు. అన్ని వర్గాల ఓటు నాకే కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. టీడీపీ, టీఆర్ఎస్లకు కొన్ని గ్రామాల్లోనే ఆధికత్య ఉంది. అమీన్పూర్లో టీడీపీ బలంగా ఉన్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ కొన్ని గ్రామాల్లో బలంగా ఉంది. కొన్ని గ్రామాల్లో బలహీనంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అన్ని గ్రామాల్లో ఓట్లు భారీ పడ్డాయనుకుంటున్న. 10వేలకు పైగా ఓట్ల మెజార్టీ వస్తుందని భావిస్తున్నా. క్లీన్ ఇమేజే గెలిపిస్తోంది టీడీపీ అభ్యర్థి సపాన్‌దేవ్ సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా, పటాన్చెరు కార్పొరేటర్‌గా నాకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా ప్రజలు నాకు మద్దతుగా నిలిచారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. అందువల్లే తెలంగాణ వారే కాకుండా తెలంగాణేతరులు కూడా టీడీపీకే ఓటు వేశారు. పార్టీ కార్యకర్తలతో పాటు బీజేపీ నేతలు నా గెలుపునకు బాగా సహకరించారు. నా విజయం ఖాయం.