నేడు కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ! | Patancheru Brs Mla Ready To Join Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి పటాన్‌చెరు ఎమ్మెల్యే.. సాయంత్రం చేరే ఛాన్స్‌

Published Mon, Jul 15 2024 1:18 PM | Last Updated on Mon, Jul 15 2024 1:31 PM

Patancheru Brs Mla Ready To Join Congress

సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి  జిల్లాలో  బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగలనుంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు  రంగం సిద్దమైంది. 

సోమవారం(జులై 15)  సాయంత్రం  సీఎం  రేవంత్  సమక్షంలో మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలు కాట శ్రీనివాస్‌గౌడ్‌,నీలం మధును  కాంగ్రెస్  అదిష్టానం బుజ్జగిస్తోంది. 

మహిపాల్‌రెడ్డి వెంట సంగారెడ్డి  జిల్లా  జెడ్పీ  వైస్ చైర్మన్ ప్రభాకర్ , అమీన్‌పూర్‌ మున్సిపల్ చైర్మన్‌ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్‌ చైర్మన్‌, ఎంపీపీ తదితరులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement