
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీపై పఠాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవానం మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని మహిపాల్‌రెడ్డి అన్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు.
చదవండి: ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి