teleangana
-
నేడు కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దమైంది. సోమవారం(జులై 15) సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్‌గౌడ్,నీలం మధును కాంగ్రెస్ అదిష్టానం బుజ్జగిస్తోంది. మహిపాల్‌రెడ్డి వెంట సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ , అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్, ఎంపీపీ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్‌కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు
-
తారామతి బారాదరిలో కన్నుల పండుగగా నాట్యతోరణం!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కూచిపూడి.. మరోవైపు భరతనాట్యం.. ఇవే కాదు, ఇంకా కథక్, మోహినియట్టం, ఒడిస్సిలతో పాటు తెలంగాణలోని పురాతన నృత్యశైలి అయిన పేరిణి నృత్యం.. ఇవన్నీ ఒక్కచోటే కొలువుదీరాయి. నగరంలోని ప్రముఖ కళావేదిక అయిన తారామతి బారాదరిలో గల కేలిక ఇండోర్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం అమృత కల్చరల్ ట్రస్టు వారి మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన నాట్యతోరణం-2023 కళాప్రియుల మది దోచుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆన్లైన్ సందేశం పంపారు. “అమృత కల్చరల్ ట్రస్టుకు ఆల్ ది బెస్ట్. నా పని నిరంతరం మారుతుంటుంది. అందువల్ల నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేటి సాంస్కృతిక ఉత్సవాన్ని నేను వ్యక్తిగతంగా వచ్చి ఆస్వాదించలేకపోతున్నాను. స్వీయ వ్యక్తీకరణ ఉత్తమ రూపాలలో నృత్యం ఒకటి. భారతీయ శాస్త్రీయ నృత్యాలు మన దేశ గొప్ప సాంస్కృతిక, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. నేటి కాలంలో వీటికి మన ప్రోత్సాహం అవసరం. కళాకారులకు తోడ్పాటునందించి, ప్రామాణిక నృత్య పాఠశాలల నుంచి విస్తృతమైన శాస్త్రీయ నృత్య రూపాలను తెలంగాణకు తీసుకువచ్చిన అమృత కల్చరల్ ట్రస్టును అభినందిస్తున్నాను” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఈరోజు అవార్డులు గెలుచుకున్నవారితో పాటు నృత్యాలు ప్రదర్శించిన కళాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలుపుతూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను చూసిన అత్యుత్తమ జుగల్బందీలలో ఇది ఒకటి. ఇంతకుముందు కూడా అమృత కల్చరల్ ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొని మన సామాజిక నిర్మాణంలో సంప్రదాయాలను పరిరక్షించడానికి వారు చూపుతున్న అంకితభావానికి మంత్రముగ్ధుడినయ్యాను. ఈ వారసత్వాన్ని మిగతా తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని చెప్పారు. నిర్వహణ కమిటీ చీఫ్ రాజేష్ పగడాల మాట్లాడుతూ, “అమృత కల్చరల్ ట్రస్ట్ అనేది లాభాపేక్షలేని సంస్థ, ఇది కళలను పెంపొందించడం, ప్రోత్సహించడంలో ముందుంటుంది. తనను, చుట్టుపక్కల ప్రజలను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సాధించడానికి, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, పురాణాల మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక నృత్య కళాకారుడికి జీవితకాల అంకితభావం అవసరమన్నది మా బలమైన నమ్మకం. నృత్యాన్ని వృత్తిగా ఎంచుకునే ప్రతిభావంతులైన కళాకారులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తాం” అన్నారు. యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్సన్ భార్గవి పగడాల మాట్లాడుతూ, “పాత, కనుమరుగవుతున్న శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను బలోపేతం చేయడం.. సాంకేతికత, సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అవగాహనను ప్రోత్సహించడం మా లక్ష్యం. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభావంతులను ప్రేరేపిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల శాస్త్రీయ నృత్యరీతులను ఒకే వేదికపైకి తీసుకువస్తాము. మా ప్రేక్షకులు, అభిరుచి గల ఔత్సాహికులు ముందుకు రావడానికి, భారతీయ శాస్త్రీయ నృత్యకళలకు దోహదం చేయడానికి చేస్తున్న మా ఈ ప్రయత్నాలు.. కళాకారుల అవగాహనను పెంచుతాయని మేము విశ్వసిస్తున్నాము” అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు... ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బడుగుల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ నృత్య విభాగాధిపతి డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య విభాగాధిపతి కళారత్న డాక్టర్ వనజ ఉదయ్, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి కుమార్తె, అభినయవాణి నృత్యనికేతన్ వ్యవస్థాపకురాలు చావలి బాలా త్రిపురసుందరి, ప్రముఖ నాట్యగురువు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని లాస్యకల్ప ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డి.ఎస్.వి. శాస్త్రి. (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
విజన్ ఉన్న నాయకుడు.. అధ్యక్ష పదవి చేపట్టాలి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో కూరుకుపోయిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూలుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘కరోనాతో నేడు దేశమంతా అతలాకుతలమై తల్లడిల్లుతోంది. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తూ.. లక్షలాది మరణాలకు కారణమైంది. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ‘‘దేశానికి ముప్పు దాపురించి ఉంది.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రాహుల్ గాంధీ విజన్‌ను, ఆయన మాటలను ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి’’అని భట్టి చెప్పారు. అదే విధంగా... ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుందని భట్టి అన్నారు. దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు, విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని, ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించాలని కోరుతూ సీఎల్పీ పక్షాన లేఖ రాస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, కరోనా బాధితులకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందని చెప్పారు. అదే విధంగా ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాలు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించందని అన్నారు. లక్షల మంది చనిపోవడానికి కారణమయ్యారు.. ‘‘కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ఎన్నో రకాల వ్యవస్థలను దేశ ప్రజల కోసం నిర్మాణం చేశాయి. ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయి. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసింది. నేడు.. దేశం మీద ఏ మాత్రం అవగాహలేని పాలకులు, కేవలం ప్రచార్భాటం, మాటలతో బతికే ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను కూలుస్తున్నారు. దేశ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకువచ్చారు’’ అని ప్రధాని మోదీని భట్టి విమర్శించారు. అదే విధంగా.. ప్రజారోగ్యాన్ని పక్కకు పెట్టి.. కరోనాతో కొన్ని లక్షలమంది చనిపోవడానికి మోదీ కారణమయ్యారని అన్నారు. కరోనా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. లాక్డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం దేశ భవిష్యత్తే అంధకారంగా మారుతోందన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ బాధ్యతలు మళ్లీ స్వీకరించాలని భట్టి కోరారు. రాజీవ్ గాంధీ హయాంలో దేశాన్ని ప్రపంచంలో మూడో శక్తిగా తీర్చిదిద్దారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించారు. అమెరికా, రష్టాలతో సమానంగా దేశాన్ని నడిపించారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా దేశంలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకువచ్చాం. ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయిమెంట్, ఆహార భద్రత వంటివి తెచ్చామని చెప్పారు. చదవండి: Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?! -
పాలన లో కొత్త పంథా
సలహాల కోసం మేధావులు, నిపుణులతో కమిటీ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్రంతో సమానంగా జీతాలు 24 జిల్లాల ఏర్పాటు, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. సంస్కరణలతో సరికొత్త పాలన అందిస్తామన్నారు. అన్ని వర్గాలకూ పలు హామీలనిస్తూ శుక్రవారం ఆయన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కొత్త పంథాను అనుసరిస్తామని ఈ సందర్భంగా గులాబీ దళపతి ప్రకటించారు. సామాజిక మార్పు కోసం నిజాయితీగా పనిచేసిన మేధావులు, సామాజిక ఉద్యమకారులతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రజా కమిటీలను ఏర్పాటు చేసి సమర్థ పాలన కోసం సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వానికి సలహాలివ్వడానికి, సంప్రదింపుల కోసం పత్రికా సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలతో కూడిన రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కో జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్‌ను అభివృద్ధి చేస్తామని, నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు.. నీటిపారుదల రంగం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు చెరువుల పునరుద్ధరణ, నదీ జలాలతో అనుసంధానం పోలవరం డిజైన్ మార్పు, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తికి చర్యలు విద్యుత్‌రంగం కొత్తగా పది థర్మల్ ప్లాంట్ల నిర్మాణం కొత్త ప్రాజెక్టుల ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధికి అవకాశం యవసాయరంగం రైతులందరికీ లక్షలోపు రుణాలు మాఫీ 8 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ మూడేళ్లలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి విద్యారంగం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక పాలిటెక్నిక్ కాలేజీ వైద్య, ఆరోగ్య రంగం 24 జిల్లా కేంద్రాల్లో 24 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నలుగురు డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల ఆసుపత్రి, నియోజకవర్గంలో వంద పడకల ఏరియా ఆసుపత్రి మరింత పటిష్టంగా 108, 104 పథకాల అమలు ప్రజా సంక్షేమం వృద్ధులు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు రూ. 1500 పింఛను వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు అమరుల కుటుంబాల సంక్షేమం అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రూ. 10 లక్షల సహాయం, గృహ వసతి అంతర్జాతీయస్థాయిలో అమరుల స్మృతి చిహ్నం నిర్మాణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల సంక్షేమం వచ్చే ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లతో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాల భూ పంపిణీ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్, గ్రామ పంచాయతీలుగా తండాలు, గూడెంలు చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌కు కృషి రూ. 25 వేల కోట్లతో బీసీల సమగ్రాభివృద్ధి హైదరాబాద్‌లో కల్లు డిపోలపై నిషేధం ఎత్తివేత మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, రెండో అధికార భాషగా ఉర్దూ చట్ట సభల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు, మహిళా బ్యాంకుల ఏర్పాటు, ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, పెన్షన్లు ఆంధ్రా ఉద్యోగుల బదలాయింపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇళ్లు, అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు తక్షణం హైకోర్టు ఏర్పాటుకు చర్యలు రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధి పారిశ్రామికాభివృద్ధి పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా వరంగల్‌కు గుర్తింపు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జిల్లా కేంద్రాలకు రింగు రోడ్లు హైదరాబాద్-జిల్లా కేంద్రాల మధ్య నాలుగు లైన్ల రోడ్డు -
రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు: నాగం
తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమేయం ఏమీ లేదని, అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర పున ర్నిర్మాణంలో ఆయన పాత్ర ఏముంటుందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, ఆస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాల కసరత్తు వేగంగా సాగుతోందని, వీటిని ఆపేశక్తి కేసీఆర్‌కు లేదన్నారు. ఉద్యోగుల ఆప్షన్లు... తదితరాల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణం కాకుండా తన పార్టీ పునర్నిర్మాణంలో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. గంగలో మునిగితే కాకి హంసకాదన్న కేసీఆర్.. తాను పార్టీలో చేర్చుకుంటున్న తెలంగాణ ద్రోహులు ఏవిధంగా పునీతులయ్యారని భావించి పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు -
సాఫీగా సాగితే నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు!
బిల్లుకు రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గెజిట్ కీలకం ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నుంచే రెండు రాష్ట్రాలు మనుగడలోకి నేడో, రేపో రాజ్యసభలో బిల్లు ఆమోదిస్తే నెలాఖరులోగా గెజిట్ ప్రకటన లేదంటే.. ఎన్నికలు పూర్తయ్యాక రెండు రాష్ట్రాలు ఏర్పడేలా నిర్ణయం సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014’ను లోక్‌సభ ఆమోదించటంతో.. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాంకేతికంగా ఎప్పటి నుంచి వేరుపడతాయన్న అంశంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ యథాతథంగా ఆమోదిస్తే.. ఈ నెలాఖరులోగానే రెండు రాష్ట్రాలు వేరుపడే అవకాశాలున్నాయి. అయితే రాజ్యసభ ఆమోదం, దానిపై రాష్ట్రపతి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగానే రాష్ట్రాలు ఏ రోజు నుంచి వేరుపడతాయన్నది తేలనుంది. త్వరలో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడనున్న పరిస్థితుల్లో.. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయా? లేక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడి.. తర్వాత వేరువేరుగా రెండు శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయా? అనే కోణాల్లో చర్చ సాగుతోంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత విభజన బిల్లు కేంద్ర హోంశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి దానిని ఆమోదించాక.. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ముందుగానే జారీ అయినప్పటికీ.. అందులో పేర్కొన్న రోజు (అపాయింటెండ్ డే) నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు బుధ లేక గురువారాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ ఎలాంటి సవరణలు చేయకుండా బిల్లును యథాతథంగా ఆమోదించిన పక్షంలో ఈ నెలాఖరులోగానే అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయటానికి అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభలో బిల్లులోని ఏవైనా అంశాలపై సవరణ ప్రతిపాదించి ఆమోదించిన పక్షంలో.. దాన్ని మళ్లీ లోక్‌సభ ముందు ఆమోదానికి పెట్టాల్సి ఉంటుంది. గతంలో మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లుపై 2000 జూలై 31న లోక్‌సభ ఆమోదించగా.. అదే ఏడాది ఆగస్టు 9న రాజ్యసభలో దానికి కొన్ని సవరణలు చేసి ఆమోదించారు. రాజ్యసభలో కొత్తగా ఆమోదించిన సవరణలకు లోక్‌సభ ఆమోదం కూడా అవసరమైంది. దాంతో మరుసటి రోజు అంటే 2000 ఆగస్టు 10న మళ్లీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కొత్త సవరణలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఎలాంటి సవరణలకు ఆమోదం తెలిపే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. గెజిట్‌లోని తేదీయే కీలకం ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు 21వ తేదీతో ముగుస్తుండగా.. ఈలోగా జరగాల్సినవి అన్నీ సాఫీ గా జరిగితే సమావేశాలు ముగియగానే విభజన బిల్లును హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. ఆ లెక్కన ఈ నెల 22 లేదా 24న రాష్ట్రపతి భవన్‌కు ఫైలు చేరుకోవచ్చని అధికారవర్గాలు చెప్తున్నాయి. కీలకమైన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ సాధారణ ఎన్నికలకు ఈ నెలాఖరు రోజున లేదా మార్చి 3న షెడ్యూలు వెలువడుతుందని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్లో ఏ తేదీని ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అంతా సాఫీగా సాగితే ఈ నెల 28 లోగా రాష్ట్రపతి రెండు రాష్ట్రాల ఏర్పాటు చట్టాన్ని ఆమోదించటంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో 28వ తేదీ తోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని ఆ వర్గాలు అంచనావేస్తున్నాయి. లేదంటే ప్రస్తుత శాసనసభ కాలపరిమితి జూన్ 2తో ముగుస్తుండగా.. జూన్ 1 నుంచి.. అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వా లు వేరువేరు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే విధంగా గెజిట్ జారీ కావొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.