పవర్‌ కమిషన్‌ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి | Ex Minister Jagadish Reddy Comments On Justice L Narasimha Reddy Commission | Sakshi
Sakshi News home page

పవర్‌ కమిషన్‌ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి

Published Sun, Jun 16 2024 12:57 PM | Last Updated on Sun, Jun 16 2024 1:30 PM

Ex Minister Jagadish Reddy Comments On Justice L Narasimha Reddy Commission

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.

‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్‌ కమిషన్‌ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘కేసిఆర్‌కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement