రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు: నాగం | However the state is not involved in the practice: sources | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు: నాగం

Published Sun, Mar 23 2014 3:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు: నాగం - Sakshi

రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు: నాగం

తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రమేయం ఏమీ లేదని, అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర పున ర్నిర్మాణంలో ఆయన పాత్ర ఏముంటుందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, ఆస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాల కసరత్తు వేగంగా సాగుతోందని, వీటిని ఆపేశక్తి కేసీఆర్‌కు లేదన్నారు.


ఉద్యోగుల ఆప్షన్‌లు... తదితరాల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణం కాకుండా తన పార్టీ పునర్నిర్మాణంలో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. గంగలో మునిగితే కాకి హంసకాదన్న కేసీఆర్.. తాను పార్టీలో చేర్చుకుంటున్న తెలంగాణ ద్రోహులు  ఏవిధంగా పునీతులయ్యారని భావించి పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement