Updates..
👉 నిజాంపేటలో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడి చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే, పలు ఆస్తులను సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
👉ఇక, అంతకుముందు గడువు పూర్తైనా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్వారీలను అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
👉తెలంగాణలో మరోసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
👉కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్‌చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment