రావెల కిశోర్‌బాబు, ప్రతిపాటి పుల్లారావు
సాక్షి, గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినా తన నియోజకవర్గంలో భూ అక్రమాలు ఆగడం లేదని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వాపోయారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు.
తన నియోజకవర్గంలో భూ అక్రమాలు జరగడం వల్ల తన పాత్ర ఉందని చాలా మంది అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్బుద్ధి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కాగా, మంత్రికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం ఏపీలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment