దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ ! | Lateritized kollagodutunna Irregulars | Sakshi
Sakshi News home page

దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !

Published Fri, Nov 6 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !

దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !

ఎర్రమట్టిని కొల్లగొడుతున్న అక్రమార్కులు
ప్రభుత్వ,అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు
అధికార పార్టీ నేతల     కనుసన్నల్లోనే గ్రావెల్ తరలింపు
సర్కారీ ఖజానాకు     రూ.కోట్లలో గండి

 
కొండలు, చారిత్రక ప్రదేశాలు, గుట్టలు, అసైన్డ్‌భూములు, చెరువులు, అటవీభూములు ఖాళీగా కనిపిస్తే చాలు. రాత్రికి రాత్రే భారీ యంత్రాల సాయంతో తవ్వి జేబులు నింపుకోవటం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో కొనసాగుతున్న అక్రమ దందా ఇది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.
 
చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో అత్యంత విలువైన ఎర్రమట్టి నిల్వలు ఉన్నాయి. వంకాయలపాడు, బోయపాలెం, మైదవోలు, సంగం గోపాలపురం, చెంఘీజ్ ఖాన్‌పేట, యడ్లపాడు, పుట్టకోట ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి (రెడ్‌గ్రావెల్)పై అధికారపార్టీకి చెందిన కొంతమంది కన్ను పడింది. రాజధాని శంకుస్థాపనతో  భూములకు రేట్లు పెరగటంతో రెడ్‌గ్రావెల్ కు  డిమాండ్ ఏర్పడింది.  రియల్‌ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణానికి,  నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎర్రమట్టి రవాణా చేస్తుంటారు. ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 300 వరకు ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.    
 
మాఫీయాను తలపిస్తున్న వ్యవహారం ...
 గతం నుంచి ఈ మట్టిని తవ్వటానికి అనుమతి పొందిన వ్యక్తులు మైనింగ్ అధికారులు సూచించన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. కేటాయించిన ప్రాంతంలో నిబంధనల మేరకు 18 అడుగుల లోతు వరకే తవ్వకాలు నిర్వహించాలి.  ప్రాంత సరిహద్దుల్లో సుమారు మూడు అడుగుల భూమిని వదిలివేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అనుమతి పొందిన ప్రాంతంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఎకరాల మేర మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. మట్టిని తవ్విన ప్రాంతం అటవీభూమి, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశమా, ప్రభుత్వ భూమి అన్న నిబంధనలతో వీరికి పనిలేదు.  యడ్లపాడు ప్రాంతంలో ఉన్న 17 వందల ఎకరాల ప్రభుత్వ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, టెక్స్‌టైల్ పార్కుకు కేటాయించిన 130 ఎకరాల భూముల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.
 
ప్రభుత్వ ఖజానాకు భారీ గండి...  

 ఎర్రమట్టి అక్రమ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభు త్వానికి వాణిజ్యపన్నుల ద్వారా, మైనింగ్ సెస్సుల ద్వారా రావాల్సిన ఆదాయం అవినీతి అధికారులు, అధికారి పార్టీ నేతల చేతుల్లోకి చేరుతుంది. ఒక్కొక్క యూనిట్‌కు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.100 లు చెల్లించాలి.  రెండు నెలల కాలంలో ఈ ప్రాంతం నుంచి 6 లక్షల యూనిట్ల తరలించారు. ఒక్కో యూనిట్  రెడ్ గ్రావెల్ ధర రూ. 2 వేలు ఉంది. మొత్తం 6 లక్షల యూనిట్లకు 12 కోట్ల రూపాయలను అక్రమ తవ్వకం దారులు తమ జేబుల్లో వేసుకున్నారు. దీంతో పాటు వాణిజ్యపన్నుల శాఖకు కూడా భారీ స్థాయిలో ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

మేడమ్ కల్పించుకోవడంతో...
అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టేలోగా అక్రమార్కులకు  వత్తాసుగా, ఇక్కడవ పవర్  పాయింట్‌గా వ్యవహరిస్తున్న ‘మేడమ్’ కల్పించుకోవడంతో వెనక్కు తిరిగి వెళుతున్నారు.  గతంలో జిల్లా అటవీశాఖ అధికారి రెండు పొక్లయినర్లను సీజ్ చేసి అక్కడ ముగ్గురు బీటు అధికారులను కాపలా ఉంచారు. ఇది జరిగిన రెండో రోజు రాత్రి ఒంటిగంట సమయంలో 10 మంది యువకులు బీట్ అధికారులను బెదిరించి ఒక పొక్లయినర్‌ను తీసుకువెళ్లారు. అయినా అధికారులు పట్టించుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement