Red clay
-
ఎర్రమట్టి దిబ్బల దోపిడీ.. కూటమి పాలన ఇదంటూ అమర్నాథ్ ఫైర్
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని ‘పచ్చ’ మాఫియా దోచేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే బఫర్ జోన్లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న విధ్వంసం వద్ద సెల్ఫీ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ క్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల వద్ద పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం స్థానిక నాయకుల మద్దతుతో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఏలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెబుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే… pic.twitter.com/27R1dNyr7e— Gudivada Amarnath (@gudivadaamar) July 17, 2024 ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దిబ్బలపై పచ్చ మీడియా ఎన్నో అసత్య ప్రచారాలు చేసింది. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా అక్కడేదో ఘోరం జరిగిపోతోందంటూ నానా యాగీ చేసి నిజాలను ‘ఎర్రమట్టి’లో కప్పెట్టేశారు. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఇంకేముంది.. నిబంధనల్ని గాలికొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. ఏమో సార్.. మాకు కనబడదు.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి తీరు. -
మట్టి మంత్రం
బ్యూటిప్స్ మొటిమలతో బాధపడే వారు మెత్తని ఎర్ర మట్టిలో కాస్త పెరుగు కానీ తేనె కానీ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో మర్దన చేసుకుంటూ కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి సత్వర ఉపశమనం పొందుతారు. చుండ్రు సమస్య ఉన్న వారు వారానికోసారి ఎర్రమట్టి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెత్తని ఎర్రమట్టిలో కాస్త బాదం నూనె లేదా నిమ్మ రసం కలపాలి. అందులో ఒక గుడ్డు తెల్లసొన వేస్తే జుట్టు నిగారిస్తుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. -
దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !
ఎర్రమట్టిని కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రభుత్వ,అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే గ్రావెల్ తరలింపు సర్కారీ ఖజానాకు రూ.కోట్లలో గండి కొండలు, చారిత్రక ప్రదేశాలు, గుట్టలు, అసైన్డ్భూములు, చెరువులు, అటవీభూములు ఖాళీగా కనిపిస్తే చాలు. రాత్రికి రాత్రే భారీ యంత్రాల సాయంతో తవ్వి జేబులు నింపుకోవటం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో కొనసాగుతున్న అక్రమ దందా ఇది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో అత్యంత విలువైన ఎర్రమట్టి నిల్వలు ఉన్నాయి. వంకాయలపాడు, బోయపాలెం, మైదవోలు, సంగం గోపాలపురం, చెంఘీజ్ ఖాన్పేట, యడ్లపాడు, పుట్టకోట ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి (రెడ్‌గ్రావెల్)పై అధికారపార్టీకి చెందిన కొంతమంది కన్ను పడింది. రాజధాని శంకుస్థాపనతో భూములకు రేట్లు పెరగటంతో రెడ్‌గ్రావెల్ కు డిమాండ్ ఏర్పడింది. రియల్ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణానికి, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎర్రమట్టి రవాణా చేస్తుంటారు. ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 300 వరకు ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాఫీయాను తలపిస్తున్న వ్యవహారం ... గతం నుంచి ఈ మట్టిని తవ్వటానికి అనుమతి పొందిన వ్యక్తులు మైనింగ్ అధికారులు సూచించన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. కేటాయించిన ప్రాంతంలో నిబంధనల మేరకు 18 అడుగుల లోతు వరకే తవ్వకాలు నిర్వహించాలి. ప్రాంత సరిహద్దుల్లో సుమారు మూడు అడుగుల భూమిని వదిలివేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అనుమతి పొందిన ప్రాంతంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఎకరాల మేర మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. మట్టిని తవ్విన ప్రాంతం అటవీభూమి, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశమా, ప్రభుత్వ భూమి అన్న నిబంధనలతో వీరికి పనిలేదు. యడ్లపాడు ప్రాంతంలో ఉన్న 17 వందల ఎకరాల ప్రభుత్వ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, టెక్స్టైల్ పార్కుకు కేటాయించిన 130 ఎకరాల భూముల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి... ఎర్రమట్టి అక్రమ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభు త్వానికి వాణిజ్యపన్నుల ద్వారా, మైనింగ్ సెస్సుల ద్వారా రావాల్సిన ఆదాయం అవినీతి అధికారులు, అధికారి పార్టీ నేతల చేతుల్లోకి చేరుతుంది. ఒక్కొక్క యూనిట్‌కు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.100 లు చెల్లించాలి. రెండు నెలల కాలంలో ఈ ప్రాంతం నుంచి 6 లక్షల యూనిట్ల తరలించారు. ఒక్కో యూనిట్ రెడ్ గ్రావెల్ ధర రూ. 2 వేలు ఉంది. మొత్తం 6 లక్షల యూనిట్లకు 12 కోట్ల రూపాయలను అక్రమ తవ్వకం దారులు తమ జేబుల్లో వేసుకున్నారు. దీంతో పాటు వాణిజ్యపన్నుల శాఖకు కూడా భారీ స్థాయిలో ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. మేడమ్ కల్పించుకోవడంతో... అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టేలోగా అక్రమార్కులకు వత్తాసుగా, ఇక్కడవ పవర్ పాయింట్‌గా వ్యవహరిస్తున్న ‘మేడమ్’ కల్పించుకోవడంతో వెనక్కు తిరిగి వెళుతున్నారు. గతంలో జిల్లా అటవీశాఖ అధికారి రెండు పొక్లయినర్లను సీజ్ చేసి అక్కడ ముగ్గురు బీటు అధికారులను కాపలా ఉంచారు. ఇది జరిగిన రెండో రోజు రాత్రి ఒంటిగంట సమయంలో 10 మంది యువకులు బీట్ అధికారులను బెదిరించి ఒక పొక్లయినర్‌ను తీసుకువెళ్లారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. -
రెడ్ అలెర్ట్
ఎర్రమట్టి దిబ్బలపై ఎనలేని నిర్లక్ష్యం బోర్డు లేదు.. గార్డూ లేడు.. ఎక్కడ చెత్త అక్కడే అసాంఘిక కార్యకలాపాలు దుస్థితిలో చరిత్రాత్మక ప్రాంతం విశాఖపట్నం: సాగరతీరంలో గుట్టల కొద్దీ కుంకుమ రాశులు పోసినట్టు కనిపిస్తాయి. మధ్యమధ్య లో పచ్చదనంతో మేళవిస్తాయి. దేశవిదేశాల్లోని పర్యాటకు ల మదిని దోచుకున్నా యి. సుమారు పన్నెండు వేల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. విశాఖ కీర్తిని, ప్ర తిష్టను ప్రపంచవ్యాపితంగా ఇనుమడింప చేసేందుకు తోడ్పడ్డాయి. గత ఏడాది జియో హెరిటే జ్ స్థలంగానూ గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కనీసం ఇవే ఎర్రమట్టి దిబ్బలు అని తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేసే వాడే లేడు. అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే వాడే లేడు. వాటిని సంరక్షించే నాథుడూ లేడు. విశాఖ పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు, అధికారులు ఈ ఎర్రమట్టి దిబ్బలను పేరు గొప్ప ఊరు దిబ్బ అనే స్థితికి తీసుకొస్తున్నారు. విశాఖలోని ఎర్రమట్టిదిబ్బలు లాంటివి ఆగ్నేయాసిలో తమిళనాడు, శ్రీలంకల్లో మాత్రమే ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి గొప్పగా ఎర్రమట్టి దిబ్బలను ప్రముఖంగా చూపిస్తుంటారు. సాగరతీరంలో ఉన్న వీటిని ఏటా వేలాది మంది ప ర్యాటకులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడక్కడ పరిస్థితి వేరుగా ఉంది. సంబంధింత అధికారులు ఎర్రమట్టి దిబ్బలను గాలికొదిలేశారు. శుభ్రతను పట్టించుకోవడం మానేశారు. హుద్‌హుద్ తుపాన్‌కు విరిగిపడ్డ చెట్ల కొమ్మలను, ఇతర వ్యర్థాలను చాన్నాళ్లు అలాగే వదిలేశారు. పగలు, సాయంత్రం తేడా లేకుండా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులకు రక్షణకు పోలీసులు కూడా ఉండరు. అరకొరగా వస్తున్న పర్యాటకులు, సందర్శకులు దిబ్బలపైకి ఎక్కి, దిగడంతో సహజత్వాన్నీ, ఆకృతినీ కోల్పోతున్నాయి. ైగె డ్లను ఏర్పాటు చేయలేదు. ఎర్రమట్టిదిబ్బలు ఇవే అని తెలిపే ఒక్క బోర్డు కూడా లేదు. స్వచ్ఛందంగా బోర్డు ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకొచ్చినా అధికారులు అనుమతించడంలేదు. రానున్న 15-20 ఏళ్లలో ఎర్రమట్టిదిబ్బల ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కవచంలో ఉంచాలి ఎంతో విలువైన వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టిదిబ్బలను కాపాడుకోవాలి. దిబ్బల సహజత్వాన్ని దెబ్బతీయకుండా తగు చర్యలు తీసుకోవాలి. పిక్నిక్లు, సినిమా షూటింగ్‌లను నిలువరించాలి. జియాలజిస్టులు దీనిని పర్యాటక ప్రాంతంగా చూడొద్దంటున్నారు. పర్యాటకుల్లో అవగాహన వచ్చేదాకా దిబ్బల చుట్టూ ఫెన్సింగ్ వేయిం చాలి. మట్టితో కట్టడాలు ని ర్మించాలి. సత్వరమే ఎర్రమట్టిదిబ్బలపై సర్వే పూర్తి చేయా లి. అక్కడ బోర్డు ఏర్పాటుతో పాటు వీటి విశిష్టతను తెలిపే సమాచారం ఉంచాలి. -సోహన్ హటంగడి, పర్యావరణవేత్త. ఎందుకిలా? ఎర్రమట్టిదిబ్బలు ఎవరి అజమాయిషీలోనూ లేవు. జీవీఎంసీ, వుడా, ఆర్కియాలజీ, ఏపీటీడీసీ ఇలా ఎవరూ వీటి బాధ్యతను తీసుకోవడం లేదు. అప్పుడెప్పుడో ఏపీటీడీసీ ముందుకొచ్చినా విమర్శల నేపథ్యంలో అడుగు ముందుకు పడలేదు. గతంలో జీఎస్ఐ డెరైక్టర్ జనరల్ వీటిని సంరక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. అయినా అతీగతీలేదు. దీంతో వీటి సంరక్షణను గాలికొదిలేశారు.