![Goa May Face The Same Fate As Kerala - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/20/goa.jpg.webp?itok=6zvf6i1-)
పణజీ: వీలైనంత త్వరగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే గోవాలో కూడా కేరళ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరిస్తున్నారు. గోవా కూడా పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు చేపడుతోందన్నారు. ‘పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకు గోవా మినహాయింపు కాదు. కచ్చితంగా కేరళ తరహా ముప్పు గోవాకు కూడా వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ç గోవాలో రూ.35 వేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని కమిటీ వెల్లడించిందని గుర్తు చేశారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు చేకూరడంతో కొండలను తొలచివేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment