face to problems
-
గోవాకూ కేరళ గతే!
పణజీ: వీలైనంత త్వరగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే గోవాలో కూడా కేరళ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరిస్తున్నారు. గోవా కూడా పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు చేపడుతోందన్నారు. ‘పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకు గోవా మినహాయింపు కాదు. కచ్చితంగా కేరళ తరహా ముప్పు గోవాకు కూడా వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ç గోవాలో రూ.35 వేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని కమిటీ వెల్లడించిందని గుర్తు చేశారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు చేకూరడంతో కొండలను తొలచివేస్తున్నారని పేర్కొన్నారు. -
కిటికీ ఎక్కి.. ఫెన్సింగ్ దూకి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ సీఎం, దివంగత కరుణానిధి అంతిమయాత్రలో అగ్రనేతలు నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సైతం కరుణ అంత్యక్రియల సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొలుత కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు రాజాజీ హాల్ వద్దకు రాహుల్ చేరుకున్న సమయంలో అక్కడ వీఐపీల మార్గం కిక్కిరిసి ఉంది. దీంతో ముందుకు వెళ్లేదారిలేక రాహుల్ అక్కడే ఆగిపోయారు. ఇంతలో కొందరు సెక్యూరిటీ గార్డులు రాహుల్‌కు కుర్చీ ఏర్పాటుచేసి దారి క్లియర్ చేసేందుకు వెళ్లారు. ఇలా వెళ్లినవారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాహుల్ అక్కడే తచ్చాడారు. ఇలా దాదాపు 30 నిమిషాలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్ ఒక్కరే ఉన్నారని కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది. కర్రల కింద నుంచి దూరి.. కరుణ అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్‌కు చేరుకోవడానికీ రాహుల్ చాలా అవస్థలు పడ్డారు. అశేషజనవాహని మధ్య టీఎన్‌సీసీ చీఫ్ తిరునావుక్కరసర్, మాజీ ఎంపీ విశ్వనాథన్ తదితరులు రాహుల్ చుట్టూ వలయంగా ఏర్పడి ఆయన్ను అంత్యక్రియల వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయినా జనం తాకిడితో రాహుల్ ఇబ్బంది పడ్డారు. కరుణ అంత్యక్రియలు ముగిశాక అక్కడ్నుంచి తిరిగివెళ్లడం రాహుల్‌కు మరో సవాలుగా మారింది. సమీపంలోని అన్నా స్మారక మందిరం పక్కనే ఉన్న పెయింట్ డబ్బాలపైకి ఎక్కి కిటీకి ఊచలు పట్టుకుని అవతలకు దూకారు. అక్కడ చిందరవందరగా ఉన్న పాత తుక్కు సామానుపైనే నడుచుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం అడ్డుగా కట్టిన కర్రల కింద నుంచి దూరి సమీపంలోని కారు వద్దకు చేరుకుని బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. కాగా, రాహుల్ భద్రత విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం విజయన్, కేరళ గవర్నర్ తదితరులు జనసందోహంలో చిక్కుకుపోయారు. చివరికి భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. -
తప్పులు... తిప్పలు
- గందరగోళంగా మారిన పంట నష్ట పరిహారం పంపిణీ - ఒకే రైతు ఖాతాలోనే ఇద్దరు, ముగ్గురి రైతుల పరిహారం జమ - రూ. 30 వేలు దాటిన ఖాతాలను బ్లాక్ చేసిన అధికారులు నంబులపూలకుంట: పంట నష్టపోయిన రైతులకు విడుదలైన పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. జాబితాను తయారు చేసే సమయంలో అధికారులు చేసిన పొరపాట్లు రైతులకు గ్రహపాటుగా మారాయి. గ్రామసభలో చదివి వినిపించిన జాబితాలో పేరున్నా పరిహారం ఇచ్చే సరికి రైతులకు అందాల్సిన పరిహారం మరొక రైతు జాబితాలో జమ కావడంతో ఇబ్బందులొస్తున్నాయి. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు మండలంలో సుమారు 300 మంది రైతులకు జమకావాల్సిన పరిహారం మొత్తం మరొకరి రైతు ఖాతాలో జమకావడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 8,840 మంది రైతుల ఖాతాలకు గాను రూ,12.16కోట్లు మంజూరైంది. వీరిలో 2,300 మంది రైతులకు బ్యాంకు ఖాతాలు సక్రమంగా నమోదు చేయకపోవడంతో జాబితాలో పేరున్నప్పటికీ పరిహారం రాని రైతులు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరి పరిహారాన్ని మరో రైతుకు జమ చేసిన వైనం మండలంలో పి.కొత్తపల్లి, వంకమద్ది, మర్రికొమ్మదిన్నె రెవెన్యూ గ్రామాలల్లో ఒకరికి అందాల్సిన పరిహారం మరొకరి ఖాతాల్లో జమ అయింది. అయితే ఆ డబ్బులను కూడా సదరు రైతులు వాడుకోవడంతో ఇప్పుడు సమస్య వచ్చిపడింది. చాలా మంది రైతుల ఖాతాల నమోదులో తప్పులు జరిగినాయనే విషయాన్ని తెలుసుకొన్న వ్యవసాయాధికారులు బ్యాంకుకు వెళ్లి ఇన్పుట్ సబ్సిడీ రూ.30,000లు దాటిన రైతుల ఖాతాలను హోల్డ్‌లో ఉంచాలంటూ కోరారు. వారు ఆదేశించే సమయానికి సుమారు 100 మంది రైతులకు పైగా తమ ఖాతాలల్లో జమ అయిన మెత్తాన్ని అవసరాల కోసం విత్‌డ్రా చేసేశారు. నా పరిహారం వేరొకరికి అందింది - బయ్యారెడ్డి, రైతు, పి.కొత్తపల్లి నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చాను. అయితే అధికారులు మాత్రం మరొకరి స్టేట్ బ్యాంకు ఖాతా నెంబర్ నమోదు చేయడంతో నాకు రావాల్సిన పరిహారం ఆ రైతుకు జమ అయింది. ఆ రైతు పరిహారాన్ని కూడా విత్ డ్రా చేశాడు. డ్రా చేసుకొన్న రైతు పేరు కూడా తెలుసు. అధికారులను అడిగితే రైతు నుంచి రికవరీ చేసి ఇస్తాం అంటున్నారు. ఇది ఎప్పటికి జరుగుతుందో..? తప్పులను సరిచేస్తాం - రామ్ సురేష్‌బాబు, వ్యవసాయాధికారి మిస్ మ్యాచింగ్ జాబితాతో పాటు రైతుల ఖాతాల మార్పు అయిన జాబాతాలను తయారు చేశాం. మరో రెండు రోజుల్లో అప్రూవల్ చేసి జేడీకి పంపడం జరుగుతుంది. హోల్డ్‌లో పెట్టిన రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వ సొమ్మును తొలగించి ఎవరికైతే చేరాలో వారి ఖాతాలల్లో జమచేస్తాం. ఇప్పటికే విత్ డ్రా చేసిన రైతుల నుంచి వారికి వచ్చిన పరిహారం పోను మిగిలిన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసి రికవరీ చేస్తాం.