తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 288కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మంది ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజాగా వయనాడ్ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3డీ రూపంలో చూపించింది. హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ శాటిలైట్ ఈ చిత్రాలను క్యాచ్ చేసింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86వేల చ.మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో గుర్తించింది. ఇరువంజిపుళ నదిలో దాదాపు 8కి.మీ మేర ఈ శిథిలాలు కొట్టుపోతున్నట్లు చూపుతోంది. సముద్రమట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment