
చండీగఢ్: హర్యానా డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్‌ను పోలీసులు గంటల్లోనే పట్టుక్నునారు. నూహ్‌లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
నూహ్‍లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మధ్యాహ్నం తన టీమ్‌తో వెళ్లారు తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. అక్కడ మైనింగ్ చేస్తున్న డంపింగ్ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం డీఎస్పీ ఆపుతున్నా లెక్కచేయకుండా వాహనాన్ని ఆయనపై నుంచే పోనిచ్చాడు. అనంతరం సురేంద్రసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలై ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ట్రక్కును ఆపే సమయంలో డీఎస్పీతో పాటు గన్‌మెన్, డ్రైవర్ ఉన్నారు. కానీ వారు ప్రాణభయంతో ట్రక్కు దగ్గరకురాగానే పక్కకు దూకారు. డీఎస్పీ మాత్రం అలాగే ఉండిపోవడం వల్ల ట్రక్కు ఆయనపై నుంచి వెళ్లి చనిపోయాడు. ఈ ట్రక్కును డ్రైవ్ చేసింది నిందితుడు ఇక్కారే అని పోలీసులు తెలిపారు.
చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్
Comments
Please login to add a commentAdd a comment