మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం | Medak MP kotta prabhakar reddy Sworn in lok sabha | Sakshi
Sakshi News home page

మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం

Published Tue, Nov 25 2014 11:34 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Medak MP  kotta prabhakar reddy Sworn in lok sabha

న్యూఢిల్లీ : మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. లోక్ సభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.  

మరోవైపు నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం నల్లధనంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు మాత్రం తమ పట్టు వీడలేదు. టీఎంసీ, జేడీయూ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవటంతో గందరగోళం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement