
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఖాళీగా ఉన్న స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ఫరీదుద్దీన్ గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఫరీదుద్దీన్ చేత ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఫరీదుద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో తానూ భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) పదవికి రాజీనామా చేయగా ఆ టికెట్‌ను టీఆర్‌ఎస్ ఫరీదుద్దీన్‌కు కేటాయించింది. విపక్షాల నుంచి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.