నేడే ట్రంప్‌ ప్రమాణ స్వీకారం | Donald Trump inauguration | Sakshi
Sakshi News home page

నేడే ట్రంప్‌ ప్రమాణ స్వీకారం

Published Fri, Jan 20 2017 2:31 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నేడే ట్రంప్‌ ప్రమాణ స్వీకారం - Sakshi

నేడే ట్రంప్‌ ప్రమాణ స్వీకారం

వాషింగ్టన్ : అమెరికా 45వ అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ లోని లింకన్  స్మారకంలో జరగనున్న ఈ వేడుకలకోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలతోపాటు దాదాపు 9 లక్షల మంది ప్రజలు కూడా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. సంగీత కళాకారుల ప్రదర్శనతోపాటు పాఠశాల విద్యార్థుల పరేడ్, బాలీవుడ్‌ తారల నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయిట.

50 మందికి పైగా చట్టసభ సభ్యులు, పలువురు అమెరికా కళాకారులు, సంగీత విద్వాంసులు ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకావటం లేదని స్పష్టం చేశారు. సెంట్రల్‌ వాషింగ్టన్ కు 8 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పలు సంఘాలు ట్రంప్‌ బాధ్యతలు తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి తీసుకున్నాయి. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ట్రంప్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement