ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పూర్తయినందున ఆయన పాలనా వైఫల్యాలపై ...
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పూర్తయినందున ఆయన పాలనా వైఫల్యాలపై ఏపీ కాంగ్రెస్ కమిటీ సోమవారం ప్రత్యేక నివేదికను విడుదల చేయనుంది. గుంటూరు-విజయవాడ మధ్యలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన స్థలంలోనే సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నివేదికను విడుదల చేయనున్నారు. ఈ 6 నెలల్లో తానిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేకపోవడమే కాకుండా ప్రజలను మభ్యపెడుతున్న తీరును ఈ నివేదిక ద్వారా ప్రజలకు వివరించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.