మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ముంబై: మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యాక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ ఎస్ షా ఆయనే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మంత్రులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న శంకర్ నారాయణన్ను మిజోరాంకు బదిలీ చేయడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.