
చెప్పింది చేయడం... చేసేదే చెప్పడం ఆయన నైజం
విద్య, వైద్యం విషయంలో బ్రహా్మండమైన మార్పు
కమిట్ అయిన ప్రతీదీ కంప్లీట్ చేశారు
బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆయనదే...
కరోనా సంక్షోభంలో ఆపద్బాంధవుడయ్యారు
హామీలు మేనిఫెస్టోలో పెడితే చాలదు,
అమలు చేయడం ముఖ్యం
సాక్షి ఇంటర్వ్యూలో సినీనటుడు సుమన్ విశ్లేషణ
‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచి్చన తరువాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూశా. చాలా కాలంగా రాజకీయాలను గమనిస్తున్నాను. ఇప్పటివరకూ ఏనాడూ చూడని అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగింది. చెప్పింది చేయడం... చేసేదే చెప్పడం ఆయన అభిమతం. మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఖురాన్‌లా, బైబిల్‌లా భావించి తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయనే.’ అని ప్రముఖ సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది
నేను పుట్టి పెరిగింది చెన్నైలో. మా అమ్మా నాన్నలది కర్ణాటకలోని మంగళూరు. చెన్నైలో అన్నాదురై కాలం నుంచీ ఎంజీఆర్, కామరాజ్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి కాంగ్రెస్... ఆ తర్వాత ప్రభుత్వాల వరకూ గమనిస్తున్నాను. పూర్వాశ్రమంలో మాది కాంగ్రెస్ పారీ్టకి చెందిన కుటుంబం. దివంగత ప్రధాని ఇందిరాగాం«ధీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చేసిన జనార్దన్ పూజారి మాకు దూరపు బంధువు. నా పూర్తి పేరు సుమన్ పూజారి(అయితే స్కూల్ రికార్డ్స్‌లో సుమన్ తల్వార్ అని ఉంటుంది) పూజారి అంటే గుడి పూజారి కాదు. ఆయుర్వేద వైద్యం చేసే బిల్లవ కమ్యూనిటీ అది.
జగన్‌ని బీసీలు ఎన్నటికీ మరచిపోరు
నేను కూడా బిసీ కమ్యూనిటీకి చెందిన వాడ్ని కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేత జగనే. అది నేను చెప్పడం కాదు స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఆయన బీసీలకు 48 సీట్ల వరకూ ఇచ్చారు. అలాగే 11 ఎంపీ టికెట్లు ఇచ్చారు. గతంలో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఇచ్చారు. బీసీలు ఎవ్వరూ జగన్‌ను మర్చిపోయే అవకాశం లేదు. అంత ప్రాధాన్యత మరెవ్వరూ ఇప్పటిదాకా బీసీలకు ఇవ్వలేదనేది వాస్తవం.
ఏపీలో విద్య, వైద్యం అద్భుతం
డబ్బున్నవారు.. ఆ స్థాయిలో ఉన్నవారు ఎలాగైనా బతికేస్తారు. కానీ పేదల బతుకులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. వాళ్లకు సరైన తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. ఎదగడానికి చదువు లేదు. సరైన వైద్యం అందడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ జగన్ అద్భుతమైన పరిష్కారాలు చూపించారు. పేదల విద్య, వైద్యం విషయంలో ఆయన చేసిన సంస్కరణలు ప్రశంసనీయం. నేను చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లకు స్వయంగా వెళ్లి చూశా.
ఒకప్పుడు స్కూలా శ్మశానమా అన్నట్టు ఉండేది. ఇప్పుడు నీట్‌గా క్లాస్‌రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేదల పిల్లలు స్వచ్ఛమైన ఇంగ్లి‹Ùలో గుడ్‌మారి్నంగ్, థాంక్యూ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా అనిపిస్తోంది. వైద్యం విషయంలోనూ చాలా మంచి మార్పు కనబడుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్స్ వంటివి పేదలకు బాగా ఉపయోగపడేవే. పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. రేపటి వైద్యుల కోసం దాదాపుగా జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తోందంటే గొప్ప విషయమనే చెప్పాలి.
కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారు
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే ఊహించని ఉత్పాతంలా వచి్చపడిన కరోనాని ఆయన అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగారు. ఆ సమయంలో నేను ప్రత్యక్షంగా గమనించాను. అత్యధిక వైద్య పరీక్షలు చేయడం... ప్రభుత్వం తరపున ప్రజలకు అందించిన మెడికల్ సరీ్వసెస్, జనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
వృద్ధుల విషయంలో ఆయన తీరే వేరు
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటిదాకా వృద్ధుల గురించి ఏ సీఎం కూడా ఇంతగా ఆలోచించలేదు. నెలకోసారి ఇచ్చే పింఛన్ల కోసం వృద్ధులు చాలా కష్టపడేవారు. ఎండల్లో, వర్షాల్లో... గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అలాంటి వారు ప్రస్తుతం ఇంటి దగ్గరే కూర్చుని దర్జాగా పింఛన్ తీసుకునేలా చేసింది తొలుత జగనే. ఇప్పటిదాకా దేశంలో ఎవరూ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎవరు అమలు చేసినా అది కచి్చతంగా కాపీ కొట్టినట్టే.
చెప్పిందే చేశారు చేసిందే చెబుతున్నారు
నిరుపేదల కోసం జగన్ సీఎం అయ్యాక చాలా వరకూ మంచి పనులు చేశారు. తాను పదవిలోకి రాక ముందు ఏదైతే చెప్పారో అందుకు తగ్గట్టు కమిట్ అయిన ప్రతీదీ చేశారు. ఇప్పుడు తాను చేసిందే చెపుతున్నారు. నిజం చెప్పాలంటే కొందరైతే ఆయన చెప్పిందానికన్నా ఎక్కువే చేశారంటున్నారు కూడా.
అభివృద్ధి అంటే ఒక వ్యక్తికో, ఒక కులానికో కాదు
ఇప్పుడు చాలా మంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఒక వ్యక్తికా... ఒక కులానిదా... లేక రాష్ట్ర అభివృద్ధా... అనేది ప్రజలు ఆలోచించాలి. అంతకు ముందు పాలించిన వారు ఏ మేరకు అభివృద్ధి చేశారు. ఇంకా ఏం చేయలేదు... అన్నది విశ్లేíÙంచుకోవాలి. ఎంత గొప్ప పాలన అయినా చిన్న చిన్న లోపాలు తప్పవు. అన్నీ అద్భుతాలే చేయాలంటే అసాధ్యం. ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా గ్యాప్ రాకుంటే ఇంకా గొప్పగా అభివృద్ధి జరిగి ఉండేదని నా అభిప్రాయం.
మేనిఫెస్టో... బాగుంటే చాలదు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ మేనిఫెస్టో కన్నా హామీలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెప్పారు. అయితే అందులోని హామీలు ఏ మేరకు అమలవుతాయి? ఎంత వరకూ అమలు కావు? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రస్తుత పాలనను కూడా ఒక్కసారి పోల్చుకోవాలి. –సత్యార్ధ్
Comments
Please login to add a commentAdd a comment