ప్రజల మనిషి జగన్‌ | Actor Bhanuchander Exclusive Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ప్రజల మనిషి జగన్‌

Published Mon, Apr 29 2024 3:27 AM | Last Updated on Mon, Apr 29 2024 3:27 AM

Actor Bhanuchander Exclusive Interview With Sakshi

పాలనపట్ల విజన్‌ ఉన్న నాయకుడు  

ఆయన దృష్టి అంతా రాష్ట్ర భవిష్యత్‌ పైనే... 

ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్నదే ఆయన తపన 

కొన్ని తరాలపాటు ఆయన పేరు నిలిచిపోవాలన్నదే ఆకాంక్ష 

సాక్షితో ప్రసిద్ధ సినీ నటుడు భానుచందర్‌ ఇంటర్వ్యూ 

‘రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. నిరంతరం ప్రజల మనిషిగా నిలిచిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష. గత ఎన్నికల సమయంలోనే ఆయనలో ఉన్న గొప్ప ప్రజాసేవకుడిని గుర్తించాను. ఆయన తన ఆకాంక్షలు అంచనాలకు మించి జగన్‌ పనిచేస్తున్నారు’ అని ప్రముఖ చలన చిత్ర నటుడు భానుచందర్‌ అన్నారు. జగన్‌ పాలనా దక్షతపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

నిస్సందేహంగా జగన్‌ ఒక బ్రిలియంట్‌ గై. ఆయన ఏది చేసినా ప్రజల గురించి చేస్తున్నారు. ఆయనో అసలు సిసలు యువ నేత. ఆయనది నవ యువ భావజాలం. ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతీ నిమిషం ఆలోచన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎలాగైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో... అలాగే జగన్‌ బాబు కూడా అదే ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మేలు కోరి చేసే ఆయన ఆలోచనలు, ప్రణాళికలు... అన్నీ సాకారం కావాలని నేను కోరుకుంటున్నాను.  

వైఎస్సార్‌లాగా కాదు... అంతకు మించి 
ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కారు. బతికినంత కాలం మనం నలుగురికి ఏం మంచి చేశామనేదే ముఖ్యం. కొన్ని తరాల పాటు మన పేరు ప్రజలకు గుర్తుండిపోవాలి. దివంగత వైఎస్సార్‌ విషయంలో అదే జరిగింది కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక్క పథకం వల్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా బతికున్నారు. అలాగే జగన్‌బాబు కూడా అంతకు మించి అనేక  మంచి పనుల ద్వారా ప్రజలకు గుర్తుండిపోవాలి అని ఆశపడుతున్నారు. నిజంగా యుక్త వయసులోనే ఇలాంటి ఆలోచనా ధోరణి రావడం చాలా గొప్ప విషయం. అది సాధించే శక్తి కూడా ఆయనకు ఉంది. –సాక్షి, అమరావతి 

మంచికే మద్దతు పలకాలి 
మోదీ నుంచి జగన్‌ బాబు దాకా ప్రజలకు మంచి చేసే వారికి మద్దతివ్వాలి అనేది నా మనస్తత్వం. విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మన దేశంలో గాం«దీజీ మీద కూడా విమర్శలు చేస్తారు. ఎవరి విమర్శల వెనక ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అయితే అవన్నీ పక్కనబెట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? మన వల్ల ప్రజలకు కలుగుతున్న లాభమేమిటి? అనేది జగన్‌ బాబుకు ముఖ్యం. తను నమ్ముకున్న అదే పంథాలో ఆయన వెళుతున్నారు.

కచ్చితంగా ఆయనకు అంతా శుభమే జరగాలి. జరుగుతుంది కూడా. నేను గత ఎన్నికల ముందు కూడా జగన్‌ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన గొప్ప పాలన అందిస్తారని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా జగన్‌ను నేను కలవలేదు. అయితే అది ముఖ్యం కాదు. ఆయన ప్రజలకు మంచి చేయడం నాకు ముఖ్యం. అలాంటి ముఖ్యమంత్రికి నాలా ప్రజల మంచి కోరుకునే ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలి. 

ఇస్తారనే నేను నమ్ముతున్నాను. తమకెవరు మంచి చేశారనేది ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తమ గురించి నిరంతరం ఆలోచించే మంచి చేసిన వారినే జనం గెలిపిస్తారు. జనం గురించి ఎప్పుడూ ఆలోచించే నాయకుడు జగన్‌. నా ఉద్దేశం ప్రకారం మళ్లీ జగన్‌ గెలవడం... ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement