అవన్నీ అపోహలే | Nalsar Professor M Sunilkumar Exclusive Interview with sakshi | Sakshi
Sakshi News home page

అవన్నీ అపోహలే

Published Sun, May 5 2024 5:48 AM | Last Updated on Sun, May 5 2024 5:48 AM

Nalsar Professor M Sunilkumar Exclusive Interview with sakshi

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో భూములకు మరింత రక్షణ

ఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది 

అన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులే 

ఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుంది 

హక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావు 

అందుకే ఈ చట్టం అవసరమవుతోంది

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో భూచట్టాల నిపుణుడు, నల్సార్‌ ప్రొఫెసర్‌ ఎం. సునీల్‌కుమార్‌

మేకల కళ్యాణ్‌ చక్రవర్తి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులకు ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం–2023 ద్వారా మరింత రక్షణ లభిస్తుందని భూ చట్టాల నిపుణులు, నల్సార్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌ కుమార్‌(భూమి సునీల్‌) స్పష్టం చేశారు. ఈ చట్టంపై ఉన్న అపోహలు, అనుమానాలు సత్యదూరమైనవన్నారు. ఈ చట్టం వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని భూములకు గ్యారంటీ లభిస్తుందన్నారు. ఈ గ్యారంటీకి ప్రభుత్వం సరి్టఫికెట్‌ ఇస్తుందని తెలిపారు.

ఈ చట్టం భూముల రక్షణ కోసమే కానీ భక్షణ కోసం కాదని తేలి్చచెప్పారు. రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి హక్కుల గ్యారంటీ పత్రం వస్తే ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భూములు కొంటారన్నారు. దీంతో పెట్టుబడులు పెరుగుతాయని, నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదని, ఆ కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందన్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందన్నారు. నలభై ఏళ్లుగా ఎలాంటి చట్టం రావాలని ఆశించామో, భూహక్కులకు ఎలాంటి భద్రత కలగాలని అనుకున్నామో అలాంటి చట్టం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టమని తెలిపారు. ఇలాంటి చట్టంపై అపోహలను సృష్టించడం, వాటిని సమరి్థస్తూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

ఎవరూ చేయలేకపోయిన ఈ చట్టం కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం కారణంగానే అమల్లోకి వస్తోందన్నారు. ఇలాంటి చట్టాన్ని తేవాలని 1908లో రిజి్రస్టేషన్ల చట్టం, 1971లో రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) చట్టం రూపొందిస్తున్నప్పుడే అనుకున్నారన్నారు. ఈ మేరకు సునీల్‌ కుమార్‌ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి సంబంధించి అనేక అనుమానాలను నివృత్తి చేశారు.  

ప్రశ్న: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తెచ్చిందా? 
సునీల్‌:  ఈ చట్టం లక్ష్యమే ఆస్తులు లేదా భూములకు రక్షణ కల్పించడం, ప్రభుత్వం తరఫున గ్యారంటీ సరి్టఫికెట్‌ ఇవ్వడం. ఏదైనా తేడా వస్తే సదరు ఆస్తి లేదా భూమికి పరిహారం చెల్లించడం. లాక్కోవడం, లాక్కోవాలనుకోవడం ఈ చట్టం ద్వారానే కష్టమవుతుంది. అలాంటి వాళ్ల ఆటలు ఈ చట్టంతో సాగవు.  

ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూముల యాజమాన్య పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయా? 
సునీల్‌: ఇప్పటివరకు రైతుల చేతుల్లో భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకం మాత్రమే ఉంది. ప్రభుత్వం చేతిలో ఆ భూమి రికార్డులు, సాగు వివరాలతో కూడిన అడంగల్‌ ఉన్నాయి. ప్రస్తుతం భూములకు సంబంధించి మొత్తం 40 రకాల రిజిస్టర్లు ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇన్ని రిజిస్టర్లు ఉండవు.. ఒక్కటే రిజిస్టర్‌ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ రికార్డులుండే రిజిస్టర్‌కు అదనంగా ప్రభుత్వం యజమానులకు గ్యారంటీ సరి్టఫికెట్, యాజమాన్య పత్రం
అందజేస్తుంది. భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలను యజమానులకే ఇస్తుంది.  

ప్రశ్న: ఇప్పటికే పాస్‌ çపుస్తకాలు, రిజిస్టర్డ్‌ దస్తావేజులు ఉన్నవారు కూడా ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలా? 
సునీల్‌: ఇది కూడా వాస్తవం కాదు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 1బీ రికార్డు ఉంది. భూముల సర్వే ద్వారా కొత్త రికార్డు తయారవుతుంది. ఈ రికార్డుల ఆధారంగా టైటిల్‌ రిజి్రస్టేషన్‌ అధికారి (టీఆర్‌వో) రిజిస్టర్‌ తయారు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే రెండేళ్ల పాటు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యాకే శాశ్వత రిజిస్టర్‌ రూపొందిస్తారు. రైతులు లేదా యజమానులు వెళ్లి వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.   

ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూతగాదాల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదా?  
సునీల్‌: ఇప్పుడున్న విధానం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను రెవెన్యూ అధికారులే సరిదిద్దుతారు. యాజమాన్య వివాదాల కోసం మాత్రమే సివిల్‌ కోర్టులకు వెళుతున్నారు. కొత్త చట్టం వచ్చాక కూడా రెవెన్యూ రికార్డుల్లో మార్పుల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫోరంకు వెళ్లొచ్చు. యాజమాన్య వివాదాలుంటే హైకోర్టుకెళ్లొచ్చు.   

ప్రశ్న: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌వోకు సమాచారమివ్వాలా?  
సునీల్‌: ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదు. అసలు కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తోంది. ఒకవేళ కోర్టులకు వెళ్లినా ఏళ్లతరబడి జాప్యం జరగదు. రికార్డులన్నీ పకడ్బందీగా ఉంటాయి. యాజమాన్య హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి కేసులు కూడా త్వరగా పరిష్కారమవుతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచి్చన గ్యారంటీ తప్పయితే సదరు రైతుకు పరిహారం లభిస్తుంది.  
 
ప్రశ్న: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు? 
సునీల్‌: ఈ చట్టం ద్వారా ప్రతి గ్రామానికి టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. ఈ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏవైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ గ్యారంటీకి అనుగుణంగా రిజిస్టర్‌లో మార్పులు చేసే అధికారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు మాత్రమే ఉంటుంది. వారి అధికారాల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్‌ చేయొచ్చు.  

ప్రశ్న: కొత్త చట్టం ద్వారా వారసత్వ హక్కుల వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? 
సునీల్‌: వారసత్వ హక్కుల్లో ఎలాంటి వివాదాలూ లేకపోతే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో) చేస్తారు. వివాదం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. సివిల్‌ కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును టీఆర్‌వో రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  

ప్రశ్న: వందేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న భూముల సర్వే ప్రాధాన్యత ఏంటి? 
సునీల్‌: వాస్తవానికి భూముల సర్వేలు ప్రతి 30 ఏళ్లకోసారి జరగాలి. ఏపీలో 1910 తర్వాత సర్వే రికార్డులు రూపొందాయి. ఇప్పుడు 110 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేందుకు భూముల సర్వేలే పునాది. ఇప్పుడు ఏపీలోని నాలుగువేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. సమస్యలు పరిష్కారమయ్యాకే సర్వే రికార్డులు రూపొందిస్తారు.  

ప్రశ్న: ఇలాంటి చట్టం ఎక్కడైనా అమల్లో ఉందా?  
సునీల్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆ్రస్టేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. భూముల హక్కులకు గ్యారంటీ ఉంటే జీడీపీ పెరుగుతుందనే శాస్త్రీయ లెక్కలున్నాయి.   

ప్రశ్న: ఇది కేంద్ర చట్టమా? రాష్ట్ర ప్రభుత్వ చట్టమా? 
సునీల్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కోసం 1987లో ప్రొఫెసర్‌ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను ప్రణాళికా సంఘం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచి్చంది. ఆ తర్వాత 2008లో కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్‌ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. ఈ చట్టాన్నయినా లేదంటే మహారాష్ట్రలో అమల్లో ఉన్న చట్టాన్నయినా, లేదంటే ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు చేసుకుని కొత్త చట్టం చేసుకోవాలని సూచించింది.  

ప్రశ్న: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచి్చందా? 
సునీల్‌: ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. ఆ తర్వాతే చట్టం అమల్లోకి వస్తుంది.  

ప్రశ్న: కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి? 
సునీల్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా భూముల హక్కులపై స్పష్టత, భద్రత, భరోసా వస్తాయి. సమస్యల పరిష్కారం, లావాదేవీల బదలాయింపు సులభమవుతుంది. ఇప్పుడు ఉన్న రికార్డులు, చట్టాలు హక్కుల నిరూపణలకు అంతిమ సాక్ష్యాలు కావు. ఇవన్నీ తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొత్త చట్టం వచి్చంది. ఇది తప్పకుండా రైతులకు మేలు చేసే చట్టమే. ఈ చట్టం అమలులో ఇబ్బందులను అధిగమించగలిగితే ఏపీలోని ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ప్రతి భూమికి, ఆస్తికి రక్షణ లభిస్తుంది.  

ప్రశ్న: ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న పాస్‌ పుస్తకాలు, రిజిస్టర్డ్‌ దస్తావేజులు చెల్లకుండా పోతాయా? 
సునీల్‌: చెల్లకుండా పోవడానికి ఇవేమీ రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు కాదు. జాతీయ స్థాయిలో చర్చించి ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్‌ లాంటివి సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన చట్టం. ఒకేరోజు చెల్లకుండా పోవు. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. 

భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్‌ రూపొందించిన ప్రదేశాల్లో కాలాను క్రమంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్‌ పుస్తకాలు, రిజిస్టర్డ్‌ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్‌ ద్వారా ప్రభుత్వం టైటిల్‌ గ్యారంటీ ఇచ్చాక మాత్రమే పాత రికార్డులు చెల్లవు.  

ప్రశ్న: భూహక్కులకు సంబంధించి వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు? 
సునీల్‌: భూరికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 124 చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్‌వోఆర్‌ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.  

ప్రశ్న: ఈ చట్టం వ్యవసాయ భూములకేనా? వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తిస్తుందా? 
సునీల్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అన్ని రకాల భూములు, ఆస్తులకు వర్తిస్తుంది. గతంలో వ్యవసాయ భూముల రికార్డులు రెవెన్యూ శాఖ దగ్గర ఉంటే.. ఆస్తుల వివరాలు స్థానిక సంస్థల వద్ద ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని భూములు, ఆస్తులకు ఒకటే రిజిస్టర్‌.. ఒకటే మ్యుటేషన్‌.  

ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వచ్చాక రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? 
సునీల్‌: భూ రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఈ చట్టం ద్వారా ప్రధాన మార్పులు వస్తాయి. ఇప్పటివరకు స్టాంపు కాగితాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అత్యంత భద్రతతో ప్రభుత్వ గ్యారంటీతో కూడిన డాక్యుమెంట్లు వస్తాయి. హక్కులను కూడా టీఆర్‌వోనే బదలాయిస్తాడు కాబట్టి మ్యుటేషన్‌ అవసరముండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు డీడ్స్‌ రిజి్రస్టేషన్‌ జరగ్గా ఇక నుంచి టైటిల్‌ రిజి్రస్టేషన్‌ జరుగుతుంది.  

ప్రశ్న: ఈ చట్టం అమలు పట్ల న్యాయవాదులకున్న అభ్యంతరాలేంటి? 
సునీల్‌: ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల లిటిగేషన్లు తగ్గిపోతాయి. కోర్టుల్లో
ఉన్న కేసుల్లో 66 శాతం భూ వివాదాల కేసులే. చట్టం అమల్లోకి వస్తే అది 10 శాతానికి తగ్గిపోతుంది. భూవివాదాల పరిష్కారం వల్ల నేరాలు కూడా తగ్గిపోతాయి. దీంతో సివిల్‌ కేసుల కోసం ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన
అవసరం ఉండదేమో.  

ప్రశ్న: ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న పాస్‌ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకూడదా?  
సునీల్‌: కొత్త పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం గ్యారంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు.. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు,
కొనుగోళ్లకు ఇదే పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వ్యాక్సినేషన్‌ సరి్టఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు.  

ఈనాడు కథనం కల్పితం
 ఉమ్మడి కర్నూలు జిల్లాకుచెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్‌కే రాలేదు 
కర్నూలు జిల్లా రిజి్రస్టార్‌ సీహెచ్‌ నాగలింగశ్వేర రావు వెల్లడి 
కర్నూలు(సెంట్రల్‌): ‘‘ఈనాడులో మీ భూమి మీదికాదు శీర్షికన ప్రచురితమైన కథనం పూర్తిగా ఊహాజనితం. కలి్పతం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్‌ కోసం వెళ్తే టైటిల్‌ రిజి్రస్టార్‌ ఆఫీసర్‌(టీఆర్‌ఓ) అనుమతి తీసుకొని వస్తేనే రిజి్రస్టేషన్‌ చేస్తామని చెప్పినట్లు ఆ కథనంలో ఉన్న విషయం అవాస్తవం’’అని  కర్నూలు జిల్లా రిజి్రస్టార్‌ సీహెచ్‌ నాగలింగశ్వేర రావు స్పష్టం చేశారు. 

తన పరిధిలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విచారణ చేయించామన్నారు. గోవిందరెడ్డి పేరుతో ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజి్రస్టేషన్‌ జరగలేదన్నారు. కనీసం సదరు వ్యక్తి సందేహా నివృత్తి కోసం కూడా రాలేదన్నారు. ఇంతవరకు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. పూర్వం నుంచి అమల్లో ఉన్న రిజి్రస్టేషన్‌ చట్టం ప్రకారం ఆన్‌లైన్‌ 1బీ, అడంగల్‌ చూసి మాత్రమే వ్యవసాయ భూములు రిజి్రస్టేషన్‌లు చేస్తున్నామన్నారు.

అపోహలు వద్దు 
‘ఈ భూమి మీది కాదు’రాతలు కలి్పతం మాత్రమే 
శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్‌ స్పష్టీకరణ 
శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): శ్రీకాకుళం జిల్లాలోని 13 సబ్‌–రిజి్రస్టార్‌ కార్యాలయాలకు సాంబశివుడు అనే పేరుతో ఏ వ్యక్తీ రిజి్రస్టేషన్‌ కోసం గానీ, తన భూమి రిజి్రస్టేషన్‌ విషయమై సందేహ నివృత్తి కోసం గానీ రాలేదని జిల్లా రిజి్రస్టార్‌ తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఈనాడు దిన పత్రికలో ‘ఈ భూమి మీది కాదు’ శీర్షికతో వచ్చిన కథనం కేవలం ఊహాజనితం, కల్పితం మాత్రమేనని ఖండించారు.

భూ యాజమాన్య హక్కు చట్టం అనేది రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదిత, సంప్రదింపుల దశలోనే ఉందన్నారు. ఈ చట్టం ప్రతిపాదిత వివరాల్లో రిజి్రస్టేషన్‌ కార్యాలయాల పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. రిజి్రస్టేషన్‌ కార్యాలయాల్లో ఇంతకు ముందు ఏ పద్ధతిలో రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.  

ఎవరా సుబ్బారావు? 
ఈనాడులో తప్పుడు కథనం 
అటువంటిదేమీ లేదన్న అమలాçపురం జిల్లా రిజిస్ట్రార్‌ 
సాక్షి, అమలాపురం: జగన్‌ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకు వస్తోందని, దీని వల్ల అమలాపురానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని ఊరూ పేరూ లేని మరో వ్యక్తి పేరిట రాసేశారని ఈనాడు ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జిల్లా రిజి్రస్టేషన్, స్టాంపుల శాఖ రిజి్రస్టార్‌ బి.శ్రీనివాస్‌ రాత పూర్వకంగా ఖండించారు. 

సుబ్బారావు అనే పేరుతో ఏ వ్యక్తీ జిల్లాలోని 15 సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్‌ కోసం రాలేదని, కనీసం సందేహ నివృత్తికి కూడా సుబ్బారావు తమ కార్యాలయాలను సంప్రదించలేదని నిర్ధారించారు. అసలు భూ యాజమాన్య హక్కు రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి నిబంధనలు ఇంకా రూపొందించకపోతే కొత్త రిజిస్ట్రేషన్‌ ఎక్కడుందని ప్రశి్నంచారు. ఈనాడులో వచి్చన కథనంపై శాఖాపరమైన చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా, ఎవరా సుబ్బారావు అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement