Land Titling Act
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో ఏం సాధిస్తారు ?
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..
-
భూ తగాదాలకు ఫుల్ స్టాప్..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
-
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
లాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్లపై ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొన్ననే విశాఖలోని రుషికొండలో భూములు కొన్నాడు. దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్లిద్దరినీ అడుగుతున్నా. భూములు కొన్నప్పుడు మీకు ఒరిజనల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా? లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా? రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న 9 లక్షల మందికి మనం ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే.. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని, వాళ్ల భూములను జగన్ కొట్టేస్తున్నాడంటూ దారుణంగా దుష్ప్రచారాలు చేస్తున్న వీళ్లంతా అసలు మనుషులేనా?– చిలకలూరిపేట, పిఠాపురం సభల్లో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వివిధ పథకాలతో నేరుగా లబ్ధి చేకూరుస్తూ మీ బిడ్డ బటన్లు నొక్కిన డబ్బులు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు అందకుండా చంద్రబాబు కూటమి ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి దుర్మార్గంగా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజల గొంతు నొక్కేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ప్రజలకు మంచి చేసేందుకు మీ బిడ్డ బటన్లు నొక్కుతూనే ఉన్నాడని, ఇప్పటికి 130 సార్లు బటన్లు నొక్కాడని గుర్తు చేశారు. అలాంటి రొటీన్‌గా జరుగుతున్న కార్యక్రమాన్ని 57 నెలలకే అడ్డుకుని గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ‘రెండు నెలల క్రితం వరకు నేరుగా ఇంటివద్దకే వచ్చి అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేవారు. ఆ పెన్షన్ వల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వలంటీర్లను అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా అడ్డుకుని వారి ఉసురు పోసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాన్నైనా 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటిది మన ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతు పట్టుకుని పిసికే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్ము అందకుండా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట! పోలింగ్ ముగిసిన మర్నాడు 14వ తారీఖున ఇస్తారట! ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం. వారి పిల్లల చదువులకు మంచి జరగడం నాకు కావాలి. నాకు కావాల్సింది రైతన్నల మొహాల్లో సంతోషం. నాకు కావాల్సింది ఇదే! వాళ్లు నొక్కుతున్నది మీ బిడ్డ గొంతు కాదు.. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లల గొంతులనే. జగన్ ఎలాంటివాడో నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ఐదేళ్లుగా ఏటా చూస్తూనే ఉన్నారు. మీ బిడ్డ తప్పు చేయలేదు. మీ జగన్ మీ కోసం బటన్లు నొక్కాడు. ఇవి ఎన్నికల కోసం నొక్కిన బటన్లు కావు’ అని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని స్పష్టం చేశారు. పెత్తందార్లతో జరుగుతున్న ఈ యుద్ధంలో మీ జగన్ పేదల పక్షాల పోరాడుతున్నాడని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైందని, మీ బిడ్డ ప్రభుత్వం మళ్లీ రాగానే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ 59 నెలలుగా అందిన పథకాలు, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పైశాచిక ఆనందం..ఈ మధ్య అత్యంత హేయంగా జరుగుతున్న కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వాళ్లకున్న రికమండేషన్లు, అధికారంతో మొన్నటి వరకూ అవ్వాతాతలకు ఇంటికొచ్చి ఇచ్చిన పెన్షన్లను దారుణంగా ఆపించారు. ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అగచాట్లు పడుతుంటే చంద్రబాబుకు, ఆయన కూటమికి ఎంత శాడిస్టిక్ ప్లెజర్ (పైశాచిక ఆనందం)? ఈ కుట్రలు ఇంకా కొనసాగిస్తూ మీ బిడ్డ 60 నెలల పాలన పూర్తి కాక ముందే 57 నెలలకే గొంతు నొక్కుతున్నారు.గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా..నాకు అక్క లాంటి వంగా గీతమ్మను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తానని మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం పంపిస్తా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. కూటమి ప్రలోభాలకు మోసపోవద్దని మీ అందరినీ సవినయంగా కోరుతున్నా. జరుగుతున్న మంచి కొనసాగేలా మీ బిడ్డ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి.దత్తపుత్రుడికి ఎందుకు ఓటేయకూడదంటే..పిఠాపురంలో పోటీ చేస్తున్న ఈ దత్తపుత్రుడికి ఎందుకు ఓటు వేయకూడదో కూడా చెబుతా. 2014లో ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ కలసి ఉన్నప్పుడు.. గద్దెనెక్కాక బాబు హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఆయనకు ఆ కత్తి అందించిన వీళ్లకు భాగస్వామ్యం లేదా? ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి మేనిఫెస్టో ఇచ్చాడు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పారదర్శకంగా పథకాలను అందిస్తుంటే ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతోంది. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఏకంగా రూ.1.05 లక్షల కోట్లు ఏటా ఇస్తానని నమ్మబలుకుతున్నాడు. అది సాధ్యం కాదని ఆ కూటమికీ తెలుసు. తెలిసి తెలిసీ అదే చంద్రబాబుకు మళ్లీ కత్తి అందించి రైతన్నలను పొడవండి.. పిల్లలను పొడవండి.. అక్కచెల్లెమ్మలను పొడవండి.. అవ్వాతాతలను పొడవండంటున్నాడంటే ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి.కార్లు మార్చినట్టుగా..ఐదేళ్లకొకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ పెద్దమనిషిని అక్కచెల్లెమ్మలు ఎవరైనా నమ్ముతారా? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారీ, నాలుగోసారీ అంటే అది అలవాటు కాదా? ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మయినా కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తమకు సాయం చేయమని అడగగలరా? అసలు ఈ పెద్ద మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటాడా? ఆ మధ్య జలుబు చేస్తే అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయాయి. ఇప్పుడు పిఠాపురం వంతు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. -
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
మీ భూమి మీదే..
బాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు.. » మీ ఆస్తులకు జిరాక్సు కాపీలు ఇస్తారు. ఒరిజినల్ పత్రాలు ఇవ్వరు.. – ఇది పచ్చి అబద్ధం» మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు. మీ భూములు లాక్కుంటారు.. – ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది..» మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు. మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి.. – స్థలాలను ఎత్తుకెళ్తారనేది అపోహే» కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.. – నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చు.» మీ వారసులకు భూములు దక్కవు.. – మీ వారసులకే భూములు దక్కుతాయి» ఇది కేంద్ర చట్టం కాదు. రాష్ట్రమే తెచ్చింది.. – కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం గురించి సిఫారసు చేసింది» మీ పాసు పుస్తకాలు మీ దగ్గర ఉండవు.. – మీ పాస్ పుస్తకాలు మీ దగ్గరే ఉంటాయి ప్రజలారా చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు» భూముల్ని మింగిన చంద్రబాబు మీ భూముల్ని కాపాడతాడా?» అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచేసిన వాడు భూముల రక్షకుడా?» విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డుల్ని మాయంచేసిన మాయావి మీ భూములకు భద్రత కల్పిస్తాడా?» వైఎస్ జగన్ హయాంలో ఒక్క భూకుంభకోణం జరగలేదు» చంద్రబాబు హయాంలో అమరావతి భూముల కుంభకోణం, విశాఖ లక్ష ఎకరాల కుంభకోణం, సదావర్తి భూముల కుంభకోణం వంటివి ఎన్నో జరిగాయి.» జగన్ హయాంలోనే భూములకు రక్షణ.» చుక్కల భూములకూ విముక్తి కల్పించింది జగ¯ó...» షరతుల గల పట్టా భూములకూ విముక్తి కల్పించింది జగన్» అసైన్డ్ భూములకూ హక్కులు ఇచ్చినవాడు జగన్» చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్ భూములు ఇచ్చాడు.ఇక దుర్మార్గాలేంటి?ళీ మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు. » చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. » అలాగే, పవన్‌కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్స్ తీసుకున్నాడు. కానీ, ప్రజలను మాత్రం జిరాక్సు కాపీలని భయపెడుతున్నాడు.» అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్నిఎవరూ కొట్టేయలేరు. అది అసాధ్యం» మీ వారసుల్ని నిర్ణయించేది మీరే. అందులోఅధికారుల ప్రమేయం ఉండనే ఉండదు» జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం» ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ చట్టమేలేదు. అలాంటప్పుడు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ని ఎలా నియమిస్తారు?» ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగాకోర్టుకు వెళ్లొచ్చు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం వాస్తవాలు..» ప్రజల ఆస్తులను కాపాడ్డానికే ‘ల్యాండ్ టైట్లింగ్’ » దీన్ని ఇంకా అమలు చేయడంలేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చింది. అమలుకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు» నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ చట్టం అమలుచేయలేరు» రాష్ట్రమంతటా ఈ చట్టం ఒకేసారి అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలన్నీ పరిష్కరమయ్యాక,గ్రామాల వారీగా భూముల తుది రిజిస్టర్ రూపొందించిన చోట్ల కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది.» నోటిఫికేషన్ ఇవ్వాలంటే రీసర్వే పూర్తవ్వాలి. ఆరు వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో పూర్తవ్వాలి. అప్పుడే చట్టం అమలుచేసే అవకాశం ఉంటుంది. » ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధంలేదు. భూపత్రాలు యాజమానుల వద్దే ఉంటాయి. జిరాక్సు కాపీలు ఇస్తారనేది దుర్మార్గపు ప్రచారం» ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలైనా కోర్టుకు నిస్సంకోచంగా వెళ్లవచ్చు. » వారసత్వ ఆస్తులను మ్యుటేషన్ తరహాలోనే చేసుకోవచ్చు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దాన్ని నిర్ణయించలేడు. » ఈ చట్టం 90 దేశాల్లో అమల్లో ఉంది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది.» 2019లో నీతి అయోగ్ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని చెప్పింది» ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది. -
‘ల్యాండ్ టైట్లింగ్’పై దుర్మార్గ రాజకీయం
సాక్షి, అమరావతి: కూటమి కట్టినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చంద్రబాబు చెప్పించగలరా అని నిలదీశారు. కుట్రపూరితంగా చట్టంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. నీతిఆయోగ్ ప్రతిపాదనతో కేంద్రం తెచ్చిన ఈ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజల భూములను ఎవరైనా దోచేశారా అని ప్రశ్నించారు. పత్రికల్లో అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రమాదకరమైతే టీడీపీ శాసనసభల్లో ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు చీడపురుగు..ఉగ్రవాది కంటే ఘోరంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు విష ప్రచారానికి ఒడిగట్టారు. ఎన్నికలకు ముందే ఆయన ఎత్తిపోయారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు. 2019 జూలైలో శాసనసభలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపింది. ఆ రోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ‘ల్యాండ్ టైట్లింగ్ బిల్లు’ అమల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కూలంకషంగా వివరించారు (ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఆ రోజు మద్దతు తెలిపిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. రద్దు చేస్తానంటే కూటమి ఆమోదం ఉండాలి కదా? అది కూడా మోదీ, అమిత్‌షాతో చెప్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ పోలింగ్‌కు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం సీఐడీని కేసు నమోదు చేయమని చెప్పాక కూడా ఇలాంటి ప్రకటనలను ఈసీ ఎలా అనుమతించింది? ఎన్నికల్లో ఎప్పుడూ సక్రమ మార్గంలో గెలవని చంద్రబాబు లాంటి చీడ పురుగుకు సమాజంలో ఉండే అర్హత లేదు. ప్రజలు తనను నమ్మట్లేదని, సూపర్ సిక్స్ పని చేయట్లేదని ఆయన గ్రహించాడు. దీంతో ఓటమి భయంతో, దింపుడు కళ్లం ఆశతో దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు పింఛన్ అందకుండా అవ్వాతాతలను రోడ్లపైకి తీసుకొచ్చి బలితీసుకున్నాడు. మహిళలకు అందాల్సిన పథకాల నగదును జమ కాకుండా అడ్డుకున్నాడు. నేడు భూములు లాగేసుకుంటారంటూ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నాడు. రైతుల భూమికి ప్రభుత్వం గ్యారంటీ..భూ దోపిడీకి కేరాఫ్ చంద్రబాబు. వెబ్‌ల్యాండ్ పేరుతో ఆయన చేసిన భూదోపిడీ, తీసుకొచ్చిన భూ తగాదాలు అన్నీఇన్నీకావు. చుక్కల భూముల పేరుతో ఎందరో భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 22ఏలో పెట్టి.. డబ్బులు ఇస్తేవాటిని విడిపించే సంస్కృతిని తీసుకొచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాల చుక్కలు, ఈనాం భూములకు విముక్తి కల్పించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 120 ఏళ్ల కింద బ్రిటీష్ వాళ్లు సర్వే చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టారు. యజమానుల ఆధ్వర్యంలో భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. వాటిని ఆన్లైన్లో జియో ట్యాగ్ చేస్తారు. తద్వారా తగాదాలు వచ్చే పరిస్థితి ఉండదు. డివిజన్, సబ్ డివిజన్లు కూడా సమగ్రంగా జరుగుతాయి. ఇవన్నీ పూర్తి చేశాక యజమానికి ప్రభుత్వం పూచీకత్తుతో, ఇన్సూరెన్స్ చేసి భూమికి భద్రత కల్పిస్తూ టైట్లింగ్ ఇస్తుంది. ఆ తర్వాత వేరొకరు ఆ భూమి తనదంటూ వచ్చినా టైట్లింగ్‌దారుడికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరైనా ఆస్తిని కొని నిశ్చింతగా ఉండొచ్చు. సిగ్గు లేకుండా రాజకీయానికి వాడుకుంటున్నాడు..దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ–స్టాంపు విధానాన్ని కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఈ–స్టాంపులను ట్యాంపర్ చేయడానికి ఉండదు. దీన్ని చంద్రబాబు హయాంలోనే 2016–17లో తీసుకొచ్చారు. అప్పట్లో తెల్గీ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 8న నందమూరి బాలకృష్ణ విశాఖలో భూములు కొని 12న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 8న ఈ–స్టాంపుతో పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో భూమిని కొనుగోలు చేసి అదే నెల 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఆ రిజిస్ట్రేషన్లకు విలువ లేకపోతే.. వారికిచ్చిన పత్రాలను చించేసి చంద్రబాబు తుడుచుకోవచ్చు కదా. మీ బావమరిది బాలకృష్ణ, దత్తపుత్రుడు పవన్ ఆస్తికి ఇప్పుడేమైనా అయ్యిందా? వాళ్ల స్థలాల్లో ఎవరైనా వెళ్లి జెండా పాతి నాది అంటే వదిలేస్తారా? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017–18లో ఈ–స్టాంప్ ద్వారా 77 వేలకు పైగా ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేస్తే అది 2023–24కు వచ్చేసరికి ఏకంగా 62.93 లక్షలకు పెరిగింది (2016–17లో ప్రారంభమై నాటి నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాల వరకు వీడియోలో చూపిస్తూ).ఈ విధానంలో లోపాలు లేకపోవడంతోనే చాలా మంది ఈ–స్టాంప్‌ల ద్వారా క్రయవిక్రయాలు చేశారు. వాళ్లందరి భూములు సక్రమంగా ఉన్నాయి కదా! ఎలాగైనా అధికారంలోకి వచ్చేసి రామోజీరావు ప్రజల సొమ్ముతో తన అక్రమ వ్యాపారాలు చేసుకోవాలని, బాబు అమరావతిలో రూ.వేల కోట్లు దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారు. -
మీ దస్తావేజులు మీకే ఇస్తారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే.. పచ్చి అబద్ధం.. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్ కాపీలు కాదు. మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్ ఆఫీసర్ చెప్పలేరు.. రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయి. ఈ రిజిస్టర్‌లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్‌క్లూజివ్ టైటిల్ నిర్ధారణ అవుతుంది. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ (టీఆర్ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్‌పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కి (ఎల్‌టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడిపోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో భయానక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది. చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమంది. నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. నిజానికి.. ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్ , ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్ చేస్తున్న గందరగోళమే ఇదంతా? -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్‌ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్‌ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్‌లో లేక రెవెన్యూ కోర్ట్‌లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్‌కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్‌లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్‌కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. -
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
-
KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
-
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నారని చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. సర్వే చేసి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించటమే ఈ యాక్ట్ ఉద్దేశమని స్పష్టం చేశారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. సంబంధిత భూమిపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ సంస్కరణ తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన అని వెల్లడించారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ యాక్ట్ చాలా గొప్పదని స్వయంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పాడని, బిల్లుకు టీడీపీ సైతం సభలో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో చంద్రబాబు నాలుక మడతేసి మంచి సంస్కరణను ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సజావుగా ఇంటికొచ్చే ఫించన్లను సైతం చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్ల ఫించనర్లు నానా అగచాట్లు పడుతున్నారన్నారు. సీఎం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఏమన్నారంటే..లాక్కున్నారని ఒక్కరైనా చెప్పారా?భూమికి సంబంధించిన మ్యాప్‌తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా రైతన్నలకు పదిలంగా అందించే కార్యక్రమం చేస్తున్నాడు మీ జగన్. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే సమర్థించాల్సింది పోయి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరుతున్నా. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నారని చెప్పారా? అని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5ను అడుగుతున్నా. ఒక మంచి సంస్కరణను ఆపడానికి వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. నాడు టీడీపీ, ఈటీవీ ప్రశంసలు..నిజంగా వీళ్ల మాటల్లో ఎంత డొల్లతనం ఉందంటే.. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతో మంచిదంటూ శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్ ఎంత పొగిడాడో అసెంబ్లీ రికార్డులు చూసుకోండి. చివరకు దుష్ప్రచారం చేస్తున్న ఇదే ఈటీవీలో నాలుగు నెలల క్రితం ఇది మంచి యాక్ట్, రైతన్నలకు మంచి జరుగుతుందని ప్రచారం చేశారు. ఇవాళ ఎన్నికలు రాగానే యూట్యూబ్ నుంచి వాళ్లు ప్రసారం చేసిన ఆ కథనాన్ని తొలగించి అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో మీరే చూడండి.వివాదాలు లేకుండా సంపూర్ణ హక్కులే లక్ష్యం..ఈమధ్య కాలంలో బాబు బృందం ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. ప్రతి ఒక్కరికీ ఫోన్లు చేసి అబద్ధాలు చెబుతున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఏమిటో మీలో ఎవడికైనా తెలుసా? అని ఈ దుష్ప్రచారం చేసేవాళ్లను అడుగుతున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే.. వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేలా చట్టం చేయడమని ఈ మూర్ఖులకు తెలియజేస్తున్నా.ఈ రోజుల్లో ఎక్కడ భూమి కొనాలన్నా కూడా ఏదో ఒక వివాదాలు కనిపిస్తుంటాయి. భూములు అమ్మాలనుకునేవారికి, కొనాలనుకునేవారికి తెలియని భయం ఉంటుంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ, తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరక్కపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యుటేషన్ జరగకపోవడం.. ఇలాంటి వాటి కారణంగా భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతున్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల ఇటువంటి వివాదాలకు తావు వుండదు.ప్రతి ఒక్కరికీ వాళ్ల భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి, ఆ హక్కులకు గ్యారెంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్లకు తోడుగా ఉండేలా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు అర్థం. రైతులు, భూ యజమానులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆ భూముల మీద యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, ఎలాంటి వివాదం లేదని గ్యారెంటీ ఇచ్చే ఒక సంస్కరణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదొక్కటే కాదు.. రేపు వివాదం తలెత్తితే టైటిల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ భూ యజమానులకు కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తున్నాం. ఇది కూడా చట్టంలో చేర్చాం.రైతులపై పైసా భారం పడకుండా..ఇలా ఒక సంస్కరణ తెచ్చి భూ యజమానులు, రైతులకు రక్షణ కల్పించే కార్యక్రమం జరగాలంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 వేల రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూయజమానికి సంబంధించిన రికార్డులు అప్డేట్ కావాలి. మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈ పని చేస్తున్నాడు. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ చొప్పున 15,000 మంది సర్వేయర్లను నియమించాం. రోవర్లను కొనుగోలు చేశాం. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. జీపీఎస్‌తో సరిహద్దు రాళ్లు సైతం పాతిస్తున్నాం. ఇందుకోసం రూ. 2వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. మీ బిడ్డ ఈ ఖర్చును చిరునవ్వుతో భరాయిస్తున్నాడు.కేవలం నా రైతన్నలకు మేలు జరగాలి.. భూ యజమానులకు మంచి జరగాలి.. వారి చేతుల్లో ఉన్న టైటిల్స్ ఎవరికైనా స్వేచ్ఛగా అమ్ముకునేందుకు సర్వహక్కులూ ఉండాలి.. ఎలాంటి వివాదాలు రాకూడదు.. ఏ కోర్టు చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదని మీ బిడ్డ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. 17 వేల రెవెన్యూ గ్రామాలకుగానూ 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వేలు పూర్తి అయ్యాయి. ఇంకా ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల్లో మిగతా గ్రామాల్లో కూడా సర్వేలన్నీ పూర్తిచేసి రికార్డులన్నీ అప్డేట్ చేస్తాం. అవసరమైన చోట సబ్ డివిజన్, మ్యుటేషన్ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు, రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మొత్తం మీ బిడ్డే చేయిస్తున్నాడు. -
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు వదిలిన బుల్ బుల్ పిట్ట బోల్తా కొట్టింది. టీడీపీ గూటి చిలుక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌తో సోషల్ మీడియాలో చంద్రబాబు సాగించిన దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే పచ్చ ముఠా సభ్యుడైన ఆయన చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి అడ్డంగా దొరికిపోయారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూములకు మ్యుటేషన్ చేయడంలేదని, అందుకు ల్యాండ్ టైట్లింగ్ చట్టమే కారణమనే భావన కలిగిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు ఇంకా అమలులోకి రాని చట్టం దుర్వినియోగం కావడం ఏమిటంటూ మండిపడ్డారు. మరోవైపు తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెబుతున్న 11.04 ఎకరాల భూమిని పీవీ రమేశ్ కుటుంబం కబ్జా చేసిందన్న విషయం ఆధారాలతో సహా బయటç³డింది. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూమలు కబ్జా చేసేసి, న్యాయస్థానం తీర్పును కూడా ధిక్కరిస్తున్న పీవీ రమేశ్ బరితెగింపు బట్టబయలైంది.పీవీ రమేశ్ కుటుంబమే భూ దొంగపీవీ రమేశ్ చేసిన దుష్ప్రచారం ఆయన కుటుంబం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చింది. ఏ భూమి గురించి అయితే పీవీ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారో.. ఆ భూమి ఆయన కుటుంబం కబ్జా చేసిందన్న విషయం కూడా బయటపడిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 25ఏళ్ల క్రితం పలువురు రైతులు తమ భూములను కలిపి దాదాపు 100 ఎకరాల్లో చెరువు తవ్వి సహకార వ్యవసాయం తరహాలో చేపల సాగు చేపట్టారు. ఈ భూముల్లో పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావుకు చెందినవి 11.04 ఎకరాలు ఉన్నాయి. కానీ వాటిలో 3.29 ఎకరాల అసైన్డ్ భూమి, 0.29 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు తన భూమి కూడా ఉందని గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పెనుమాక సుబ్బారావు ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేయాలని 2022లోనే తీర్పునిచ్చింది. పీవీ రమేశ్ పరపతికి భయపడి ఆ తీర్పును అధికారులు అమలు చేయలేకపోయారు. దాంతో బాధితుడు నాగేంద్ర కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అంటే పీవీ రమేశ్ ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిగా చెబుతున్న 11.04 ఎకరాలు ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమి అన్న విషయం బయటపడింది.కబ్జా భూమికి మ్యుటేషన్ సాధ్యం కాదన్న అధికారులుఅయినా సరే తమ కుటుంబం కబ్జా చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని పీవీ రమేశ్ యత్నించడం గమనార్హం. ఆ మేరకు ఆయన 2023 డిసెంబర్ 16న రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. తన తండ్రి పెనుమాక సుబ్బారావు మరణించినందున ఆయన పేరిట ఉన్న భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని కోరారు. అప్పటికే ఆ భూములపై న్యాయ వివాదం ఉందన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కబ్జా భూములను ఖాళీ చేయాల్సింది పోయి, మ్యుటేషన్ చేయాలని కోరడంతో పీవీ రమేశ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు 2023 డిసెంబర్ 30న అధికారులు ఆయనకు లిఖితపూర్వకంగా తెలిపారు.తొందరపడి అబద్ధం కూసి.. ఆపై మరోపోస్టు పెట్టివైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే చంద్రబాబు కుట్రలో పాత్రధారి అయిన పీవీ రమేశ్ సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. ‘తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటేషన్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’ అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు కుట్రను పక్కాగా అమలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న దుర్బుద్ధితో పీవీ రమేశ్.. అసలు ఆ చట్టం రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదన్న అసలు విషయాన్ని విస్మరించారు. వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే ఎలా దుర్వినియోగం అవుతోందని అంటారు అంటూ నిలదీశారు. దాంతో బండారం బయటపడుతుందన్న ఆందోళనతో పీవీ రమేశ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తన పోస్టును ఎడిట్ చేశారు. ‘చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులేకుండా చేస్తున్నారు’ అంటూ పోస్టులో మార్పు చేశారు.ఆయన తండ్రిపై వరకట్న వేధింపుల కేసు కూడాపీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు భూముల కబ్జాకు పాల్పడటమే కాదు.. ఆయనపై క్రిమినల్ కేసులు కూడా గతంలో నమోదు కావడం గమనార్హం. కట్నం కోసం కోడల్ని మానసికంగా, శారీరకంగా హింసించారన్న కారణంతో ఆయనపై విజయవాడ పోలీసులు 2018లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీవీ రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి భార్య పెనుమాక సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 1999లో తన పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల తల్లినైన తనను వేధిస్తున్నారంటూ భర్త పెనుమాక రాజశేఖర్ జోషి, మామగారు పెనుమాక సుబ్బారావు, అత్తగారు పెనుమాక మణిలపై ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. భూముల రీ సర్వేకు పీవీ రమేశ్ కుటుంబం హాజరు కాలేదని, కబ్జా చేసిన భూమిని పీవీ రమేశ్ పేరిట మ్యుటేషన్ చేయటం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు రీసర్వేకు ముఖం చాటేసిన పీవీ రమేశ్అంతేకాదు.. తమ భూకబ్జా బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతోనే పీవీ రమేశ్ రెవెన్యూ అధికారుల రీ సర్వేకు ముఖం చాటేశారు. పీవీ రమేశ్ చెబుతున్న చెరువు భూముల్లో కూడా రీసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఆ రైతుల భూములకు హద్దులను నిర్ణయించి వారి పేరిట పత్రాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 26న కృష్ణా జిల్లా కలెక్టర్ జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించారు. దాంతో గుడివాడ ఆర్డీవో ఆ చెరువు భూముల్లో 2024 మార్చి 5న నిర్వహించనున్న ఉమ్మడి సర్వేకు హాజరుకావాలని, ఇందుకు భూముల ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలని భూ యజమానులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేశారు. పీవీ రమేశ్ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజున రైతులందరూ వచ్చారు. వారి భూముల పత్రాలను చూపించి రీ సర్వేకు సహకరించారు. కానీ పీవీ రమేశ్ గానీ ఆయన కుటుంబ సభ్యులుగానీ ఆ రీ సర్వేకు హాజరు కాలేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినా వారు హాజరుకాలేదు. దాంతో అందరు రైతులు వచ్చి పత్రాలు చూపించే వరకు రీసర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అదీ పీవీ రమేశ్ కుటుంబ భూకబ్జా బాగోతం. -
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
-
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు.చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు.. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు...ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి, విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు.👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది.:::: సిమ్మాదిరప్పన్న -
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు... ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు...👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది ..:::సిమ్మాదిరప్పన్న -
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
సాక్షి, అమరావతి: ప్రతి విషయంలోనూ రెండు నాలుకల ధోరణిని పాటించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపైనా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బురద చల్లుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్బిల్లును ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూలై 29న దీనిపై సభలో జరిగిన చర్చలో టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపి పలు సూచనలు కూడా చేశారు. నాడు పయ్యావుల ఏమన్నారంటే..బిల్లు అవసరాన్ని కేంద్రం కూడా గుర్తించిందిఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు. బిల్లుని మేం ఆమోదిస్తున్నాం. మంత్రిగారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూములు కొనాలంటే భయపడే పరిస్థితులున్నాయి. అది నిజమైన టైటిలా? డిస్ప్యూటెడ్ (వివాదాస్పద) టైటిలా? అనేది తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్‌గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది. కర్నాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది.ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు కానీ 1858లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైట్లింగ్ అనే విధానం.. అంటే టైటిల్‌కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేశాయి. రాజస్థాన్–2016లోనే దాదాపు ఇలాంటి చట్టాన్నే పాస్ చేసింది. కానీ ప్రాక్టికల్‌గా అమల్లోకి వెళ్లినట్లు కనపడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి. ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు.. ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకున్నది ఇది. చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైమ్ పడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది రెండేళ్లలో అవుతుందా? నాలుగేళ్లు పడుతుందా? ఐదేళ్లు పడుతుందా? అనేది పక్కన పెడితే తప్పకుండా ఇదొక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు అవుతుంది.రీ సర్వే సాహసోపేతం ల్యాండ్ టైట్లింగ్కంటే ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్దఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్టుమెంట్ ఏర్పడితే 1970కి గానీ మనకి అప్డేటెడ్ రికార్డులు రాలేదు. మనం రెండేళ్లలో చేస్తామంటున్నాం. టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య. సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి రూ.1500 కోట్లు అవసరమయ్యే ప్రాజెక్టు ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీ సర్వే 40 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలి. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే చర్య. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులోని ఐటీసీ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందేళ్ల కిందట బ్రిటీష్‌కాలంలో భూముల సర్వే చేశారని, అనంతరం మళ్లీ సమగ్రమైన సర్వే జరగలేదని చెప్పారు.భూ యాజమాన్య హక్కులు, హద్దులపై రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భూ వివాదాలతో ప్రజలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో సమగ్ర భూసర్వే ద్వారా భూములకు యజమానులను గుర్తించి, సంబంధిత భూములపై వారికే శాశ్వతరీతిలో హక్కులను కల్పించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ అనే మహత్తరమైన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు.భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించి, యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడంతోపాటు డిజిటల్ రికార్డుల రూపంలో వాటిని భద్రపర్చడం ఎంతో గొప్ప కార్యక్రమమని చెప్పారు. గత ప్రభుత్వాలే కాకుండా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని వివరించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రాజకీయ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం, సీఎం జగన్‌పై బురదచల్లడం తగదన్నారు. అడ్డగోలుగా ఫిలిం సిటీ కట్టిన రామోజీ రైతుల భూములు ఆక్రమించి అడ్డగోలుగా ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు తన ఈనాడు పత్రిక ద్వారా నిత్యం తప్పుడు వార్తలు రాస్తూ సీఎం వైఎస్ జగన్‌పై అభాండాలు వేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భూములు లాగేసుకుంటారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్న రామోజీరావు... గతంలో రామోజీ ఫిలింసిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు జడ్జిగా తాను స్టే ఇచ్చిన విషయం మరిచారా.. అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ, జనసేనలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.బీసీ విద్యార్థులకు న్యాయంచేసిన సీఎం జగన్వైద్య విద్య సీట్ల కేటాయింపులో సీఎం జగన్ బీసీ విద్యార్థులకు న్యాయంచేశారని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. బీసీ కోటాలో సీటు పొంది, ఓపెన్ మెరిట్‌లోకి వెళ్లిన విద్యార్థుల సీట్లను తిరిగి బీసీ కోటాలోనే భర్తీచేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత ప్రభుత్వంలో చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఫలితంగా బీసీ కోటాలో ఏటా దాదాపు 500 ఎంబీబీఎస్ సీట్లను బీసీ విద్యార్థులు కోల్పోతున్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా... బీసీ కోటా సీట్లు బీసీ విద్యార్థులతోనే భర్తీ చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వడంతోపాటు సక్రమంగా అమలు చేయిస్తున్నారని వివరించారు.బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్‌కు బీసీలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవేనని, అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎంగా ఉండాలని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్, ప్రభుత్వ మాజీ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు, బీసీ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
-
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
-
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ? అంటూ ప్రశ్నించారు.‘‘సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు? బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?. నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. నాలుగేళ్లలో మోదీ ఏం చేశాడు? మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి?’’ అని రామకృష్ణ నిలదీశారు.‘‘కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’’ అంటూ రామకృష్ణ మండిపడ్డారు. -
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..