మీ దస్తావేజులు మీకే ఇస్తారు | Chandrababu Naidu false propaganda on Land Titling Act | Sakshi
Sakshi News home page

మీ దస్తావేజులు మీకే ఇస్తారు

Published Sat, May 11 2024 5:25 AM | Last Updated on Sat, May 11 2024 5:25 AM

Chandrababu Naidu false propaganda on Land Titling Act

ఏవీ జిరాక్సులు కాదు.. అన్నీ నిఖార్సైన ఒరిజినల్సే

ఏడాదిగా 9.58 లక్షల రిజిస్ట్రేషన్లు చేసి ఒరిజినల్స్‌ ఇచ్చారు 

ఈ–స్టాంపింగ్‌ 2016లోనే మొదలైంది 

ఐదేళ్లలో 60 లక్షలకు పైగా డాక్యుమెంట్లు ఈ–స్టాంపింగ్‌ ద్వారా జారీ 

మీ ఆస్తి మీది కాదని టైటిల్‌ రిజిస్టర్‌ ఆఫీసర్‌ అనే అవకాశమేలేదు 

మీ వారసులను మీరే నిర్ణయిస్తారు  

సరైన కాగితాల్లేవని యజమానుల్ని జైల్లోపెట్టే పరిస్థితి ఉండనే ఉండదు 

ఇవన్నీ చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలే  

వీటిపై ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేయించింది 

ఎన్నికల్లో చెప్పుకునే అంశాలు లేక భూములపై దారుణ ప్రచారం 

భూములకు భద్రత పెరుగుతుందే తప్ప ఎలాంటి ముప్పు ఉండదు 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. 

వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్‌ పేజీ యాడ్స్‌ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రి­కల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే..  

పచ్చి అబద్ధం.. 
స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్‌ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్‌ చేసి ఒరిజినల్‌ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 

1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్‌ చేసి ఒరిజినల్‌ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్‌ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్‌ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్‌ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్‌ కాపీలు కాదు. 

మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. 
మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం సెక్షన్‌ 25 (3) ప్రకారమైనా.. టైటిల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్‌ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్‌ కోర్టుకు రిఫర్‌ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది.   

మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్‌ ఆఫీసర్‌ చెప్పలేరు.. 
రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్‌ రిజిస్టర్లో నమోదవుతాయి. 

ఈ రిజిస్టర్‌లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్‌క్లూజివ్‌ టైటిల్‌ నిర్ధారణ అవుతుంది. టైటిల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్‌పై అభ్యంతరం ఉంటే ల్యాండ్‌ టైట్లింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌కి (ఎల్‌టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.  

భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? 
సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్‌ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడి­పోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో  భయా­నక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. 

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, వాయిస్‌ రికార్డింగ్స్‌ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్‌ కమిషన్‌ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్‌ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది.  

చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. 
ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్‌ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్ర­జ­ల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక  మా­ర్పులు, చేర్పులకు   ప్రభుత్వం సిద్ధమంది.  నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్‌ అథారిటీ అను­మతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.  

ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. 
నిజానికి.. ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్‌ అడ్వైజర్‌గా నల్సార్‌ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్‌ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. 

దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్, లా డిపార్ట్‌మెంట్‌ , ఐటీ, హోమ్, సోషల్‌ వెల్ఫేర్‌ వంటి డిపార్ట్‌మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.  
 
బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. 
వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. 

కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. 

ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్‌ చేస్తున్న గందరగోళమే ఇదంతా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement