ఆ భయంతోనే ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారు
ఈ చట్టం భూ పరిపాలనలో గొప్ప సంస్కరణ
ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తుంది
భూకుంభకోణాలు, కబ్జాలు, అక్రమాలకు చెక్ పెడుతుంది
అందుకే ఇది చంద్రబాబుకు నచ్చడంలేదు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన మనుషులు ఇన్నాళ్లూ సాగించిన భూ కుంభకోణాలు, కబ్జాలు బయటపడతాయని, ఆ భయంతోనే ఆయన, ఎల్లో మీడియా ఈ చట్టంపై దష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జల శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధ్యేయమని పునరుద్ఘాటించారు.
అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు తెలిపారు. భూ పరిపాలనలో గొప్ప సంస్కరణగా నిలిచే, విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ చట్టంపై పచ్చ మీడియా సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు భద్రంగా కడితే దొంగలకు భయమేననని, భూ కుంభకోణాలకు, కబ్జాలకు మారుపేరైన చంద్రబాబుకు ఈ చట్టం నచ్చదని ఎద్దేవా చేశారు.
కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అన్నారు. సీఎం జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగే కానీ, గ్రాబింగ్ కాదని చెప్పారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సమగ్ర భూ సర్వే జరిగిందని, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయి, ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చని తెలిపారు.
ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారని, ఆ తర్వాతే విధి విధానాలు ఖరారవుతాయని, చట్టం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వా«దినేత భూములు మింగేస్తాకరని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భూ సంస్కరణలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులను జీర్ణించుకోలేకే చంద్రబాబు వీటికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రజలకు మేలు చేసేదిలా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదని చెప్పారు.
ప్రధాని కూడా భూ కబ్జాలు చేస్తారని బాబు ఉద్దేశమా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చట్టమని, దానినే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమైతే నరేంద్ర మోదీ కూడా దేశంలో భూములు కబ్జా చేస్తున్నట్లు ఆయన ఉద్దేశమా అని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబును కచ్చితంగా శిక్షించాల్సిందేనని, బీజేపీ నేతలు ఆయనకు మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలని అన్నారు.
వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరమని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టేనని తేల్చిచెప్పారు. ఈ చట్టంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీఐడీ విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తోంది కచ్చితంగా విష ప్రచారమేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు.
భూముల పత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులని నిలదీశారు. సీఎం జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని, బాబుకు నచ్చకపోతే ఇబ్బందేమీ లేదని చెప్పారు.
భూకబ్జాలు చేసింది బాబు, టీడీపీనే
రాష్ట్రంలో భూ కబ్జాలు చేసింది చంద్రబాబు, టీడీపీనే అని సజ్జల చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెబ్‌ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అమరావతి ప్రాంతంలో (సీఆర్‌డీఏలో) చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు దోచేశారని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు చేసిన భూకుంభకోణంపై విచారణ కూడా జరుగుతోందన్నారు. డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో భూములు లాక్కున్నారని తెలిపారు.
2014–19 మధ్యనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు. సాదా బైనామా పేరుతో పేపర్లు సృష్టించి భూములు కాజేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులున్నాయని తెలిపారు.
విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కట్టుకోవడానికి భూమిని లీజుకు తీసుకున్న రామోజీరావు.. ఆ భూమిలో రహదారి కోసం 600 గజాల భూమిని ఇచ్చి, దాని పరిహారాన్ని భూ యజమానికి ఇవ్వకుండా మింగేశారని చెప్పారు. ఇలాంటి కబ్జాకోరు రామోజీరావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ఫ్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment