kabza
-
వక్ఫ్ భూమిలో అక్రమంగా వరి నాట్లు
పెనమలూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను రాత్రికి రాత్రే ఆక్రమించుకోవడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిపోయారు. వరినాట్లు వేసి మరీ కబ్జా చేయడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప పరిధి లోని ఆర్ఎస్ నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమి ఆక్రమణకు గురవుతోందని బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించి.. వక్ఫ్ భూముల లీజ్ కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు శుక్రవారం సాయంత్రం చీకటి పడుతుండగా చకచకా వరి నాట్లు వేశారు. సమాచారం తెలుసుకున్న వక్ఫ్ అధికారులు భూమి వద్దకు వెళ్లి చూసి.. తహసీల్దార్‌కు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళ ఏమీ చేయలేమని, ఏం చేయాలో శనివారం ఆలోచిద్దామని వారు చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నాట్లు వేసిన వారిపై కేసులు పెట్టాలని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని మైనార్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ బాషా డిమాండ్ చేశారు. -
‘కొణతాల’ వారి కబ్జా కథ..
సాక్షి, అనకాపల్లి: దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల బరితెగింపునకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఎంతో ఉన్నతాశయంతో ఆరేడు దశాబ్దాల క్రితం దేవదాయ శాఖకు రాసిచ్చిన భూములపై కూటమి గద్దలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చీరాగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడీ కబ్జా బాగోతాన్ని నడిపిస్తోంది అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబీకులు. ఈ భూదాహం కథాకమామిషు ఏమిటంటే..అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబరు 66లో 29.71 ఎకరాల భూమి (పూల్‌బాగ్ భూములు)ని చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. తన తదనంతరం దేవదాయ శాఖకు భూమిని అప్పగించాలని.. అప్పటివరకు ట్రస్టీలుగా తన పెద్ద అల్లుడు రాజూభీర్ ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావులను నియమించారు. ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవదాయ శాఖాధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవదాయ శాఖకే అనుకూలంగా కోర్టు తీర్పువచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవదాయ శాఖాధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు.దేవస్థానం బోర్డులు పీకేసి..నిజానికి.. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటినుంచో కన్నేశారు. అందులో భాగంగా.. కోర్టు ఇంటెరిం ఆర్డర్ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్ 27నే పీకేశారు. వాటి స్థానంలో ఆ భూములు తమవేనని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ కొణతాల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు వెలిశాయి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పటి దేవదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన ఆరుగురిపై సీఐ దాడి మోహన్ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం ఏఈవో రాంబాబు, దేవదాయ ఏఈ కె.సూర్యనారాయణమూర్తి, సిబ్బంది, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ కోర్టుకుఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే.. ఆ భూమిలో కొణతాల రామకృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుంచి రూ.10వేల చొప్పున కౌలు వసూలుచేస్తున్నారు. అంతేకాక.. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హఠాత్తుగా శనివారం మరోసారి దేవదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు. నాయుడుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవదాయశాఖ భూములను కాపాడతాంగతంలో కోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇస్తే.. దేవస్థానం బోర్డులు పీకేసీ బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటుచేశారు. అప్పుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై కేసులు నమోదుచేశారు. మళ్లీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాం. దేవదాయశాఖ భూములను కాపాడడమే మా లక్ష్యం. – రాంబాబు, కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ, అనకాపల్లి -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన మనుషులు ఇన్నాళ్లూ సాగించిన భూ కుంభకోణాలు, కబ్జాలు బయటపడతాయని, ఆ భయంతోనే ఆయన, ఎల్లో మీడియా ఈ చట్టంపై దష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జల శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధ్యేయమని పునరుద్ఘాటించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు తెలిపారు. భూ పరిపాలనలో గొప్ప సంస్కరణగా నిలిచే, విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ చట్టంపై పచ్చ మీడియా సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు భద్రంగా కడితే దొంగలకు భయమేననని, భూ కుంభకోణాలకు, కబ్జాలకు మారుపేరైన చంద్రబాబుకు ఈ చట్టం నచ్చదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అన్నారు. సీఎం జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగే కానీ, గ్రాబింగ్ కాదని చెప్పారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సమగ్ర భూ సర్వే జరిగిందని, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయి, ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చని తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారని, ఆ తర్వాతే విధి విధానాలు ఖరారవుతాయని, చట్టం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వా«దినేత భూములు మింగేస్తాకరని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భూ సంస్కరణలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులను జీర్ణించుకోలేకే చంద్రబాబు వీటికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రజలకు మేలు చేసేదిలా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదని చెప్పారు.ప్రధాని కూడా భూ కబ్జాలు చేస్తారని బాబు ఉద్దేశమా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చట్టమని, దానినే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమైతే నరేంద్ర మోదీ కూడా దేశంలో భూములు కబ్జా చేస్తున్నట్లు ఆయన ఉద్దేశమా అని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబును కచ్చితంగా శిక్షించాల్సిందేనని, బీజేపీ నేతలు ఆయనకు మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలని అన్నారు. వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరమని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టేనని తేల్చిచెప్పారు. ఈ చట్టంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీఐడీ విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తోంది కచ్చితంగా విష ప్రచారమేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. భూముల పత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులని నిలదీశారు. సీఎం జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని, బాబుకు నచ్చకపోతే ఇబ్బందేమీ లేదని చెప్పారు.భూకబ్జాలు చేసింది బాబు, టీడీపీనేరాష్ట్రంలో భూ కబ్జాలు చేసింది చంద్రబాబు, టీడీపీనే అని సజ్జల చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెబ్‌ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అమరావతి ప్రాంతంలో (సీఆర్డీఏలో) చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు దోచేశారని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు చేసిన భూకుంభకోణంపై విచారణ కూడా జరుగుతోందన్నారు. డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో భూములు లాక్కున్నారని తెలిపారు. 2014–19 మధ్యనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు. సాదా బైనామా పేరుతో పేపర్లు సృష్టించి భూములు కాజేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కట్టుకోవడానికి భూమిని లీజుకు తీసుకున్న రామోజీరావు.. ఆ భూమిలో రహదారి కోసం 600 గజాల భూమిని ఇచ్చి, దాని పరిహారాన్ని భూ యజమానికి ఇవ్వకుండా మింగేశారని చెప్పారు. ఇలాంటి కబ్జాకోరు రామోజీరావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ఫ్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
కబ్జాల కందికుంట
కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్ అలియాస్ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్ చేయించుకోండని ఖాజామోద్దీన్ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్ మనవడు అమీర్‌ఖాన్ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
పోలిపల్లిలో కబ్జా గళం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్‌కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు. బినామీ బాగోతం ఇలా... విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు. చుట్టూ తిరిగి పులవర్తికే.. పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్‌పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది! మారణాయుధాలతో దాడులు.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆక్రమణదారుల కోసమేనా యువగళం టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు -
పల్లి.. పల్లి.. బెల్లంపల్లి...
‘‘చంద్రు ఇదివరకే అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్. ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కబ్జా’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ‘పల్లి.. పల్లి.. బెల్లంపల్లి..’ అంటూ సాగే మూడో పాటను కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ విడుదల చేశారు. ఉపేంద్ర, తాన్యా హోప్‌పై ఈ మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ పాడారు. దర్శక–నిర్మాత ఆర్. చంద్రు హోమ్ టౌన్ షిడ్ల గట్ట (కర్నాటక)లో జరిగిన ఈ పాట విడుదల వేడుకలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం. రెవన్న, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీయఫ్ స్ఫూర్తితోనే ఉపేంద్ర ‘కబ్జా’
నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. సుదీప్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహానంతరం నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు, నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమని చెప్పారు. కేజీఎఫ్ చిత్రం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ చిత్ర స్ఫూర్తితోనే కబ్జా చిత్ర కథను తయారు చేసినట్లు చెప్పారు. తను ఇంతకుముందు 11 చిత్రాలు రూపొందించానని ఇది తనకు 12వ చిత్రం అని చెప్పారు. నటుడు ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయన చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్ పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు చాలా నచ్చిందని.. చెన్నై అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత, అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన స్పూర్తిదాయకమన్నారు. లైట్‌మ్యాన్ నుంచి అందరికీ నమస్కారం పెట్టే సంస్కారం రజనీకాంత్దే అన్నారు. అలాంటి వారితో నటించడానికి ఎవరికైనా ఇష్టమేనని తెలిపారు. తానూ మళ్లీ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇప్పుడు భాష భేదం లేదని.. మంచి కథా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఈ కబ్జా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందని, ఇందులో నటించటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిపోతున్న భూ కబ్జాలు
-
వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా?
సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్):ఇటీవల భూముల విలువ పెరగడంతో డ్రైనేజీలను సైతం వదలడం లేదు. జనవరి 5, 2021న పట్టణంలోని ఎదులాబాద్ రోడ్డులో రూ.21లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసిన భూగర్భ డ్రైనేజీ స్థలామే కబ్జాకు గురైంది. మున్సిపల్ కమిషనర్ కార్యలయానికి నిత్యం వెళ్లే దారిలోని డ్రైనేజీ స్థలం కబ్జాకు గురికావడం, కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహరించడం, పక్షం రోజులుగా పనులు జరగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ స్థలంపై గేటు నిర్మించడంలో పాటు, సర్వేనంబర్ 481, 482లో చేసిన వెంచర్ రోడ్డును కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డు, డ్రైనేజీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉపేంద్ర కబ్జా
ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
అండర్‌వరల్డ్ కబ్జా
‘‘ఇప్పటివరకూ ఎన్నో గ్యాంగ్‌స్టర్ కథలు విన్నారు.. చూశారు. కానీ మా సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. అండర్ వరల్డ్‌లోనే కొత్త కోణాన్ని చూపించబోతున్నాం’’ అంటోంది ‘కబ్జా’ చిత్రబృందం. ఉపేంద్ర ముఖ్య పాత్రలో ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర డాన్‌గా కనిపించబోతున్నారు. 1970ల కాలంలో ఈ సినిమా కథ ఉంటుందట. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్న ఈ చిత్రం 7 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఉపేంద్ర హీరోగా ‘కబ్జ’ చిత్రం ప్రారంభం
-
ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం
‘‘ఏ’ చిత్రం నుంచి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా వరకూ తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చేస్తున్న ఈ ‘కబ్జా’లో 1940–80 మధ్య కాలంలో అండర్ వరల్ద్ ప్రపంచాన్ని చూపించనున్నాం’’ అన్నారు ఉపేంద్ర. ఆయన హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జా’. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్. చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేష్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్చాన్ చేశారు. బి. గోపాల్ తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఓం’తో ఓ ప్రయోగం చేశాం. ‘కబ్జా’ చిత్రం కూడా ఓ ప్రయోగమే. చంద్రుతో ‘బ్రహ్మ, ఐ లవ్ యూ’ సినిమాలు చేశాను. ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా సంతోషం. చంద్రుతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా చేశాను’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘‘సరికొత్త స్టయిల్లో ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు ఆర్. చంద్రు. ‘‘ఉపేంద్రగారితో సినిమా చేయాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. చంద్రు చెప్పిన కథ నచ్చింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అన్నారు రాజ్ ప్రభాకర్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత గోనుగుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కన్నడనూ కబ్జా చేస్తారా?
పదేళ్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేసి పడేశారు కాజల్ అగర్వాల్. హీరోయిన్గా పదేళ్లు పూర్తి చేసినా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు కాజల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు కాజల్. కానీ ఇంతవరకూ కన్నడ సినిమా చేయలేదు. ఉపేంద్ర చేయబోతున్న ‘కబ్జా’ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారట కాజల్. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కనున్న గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘కబ్జా’. ఇందులో ఉపేంద్ర సరసన హీరోయిన్గా కాజల్ కనిపిస్తారట. ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు నటించనున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. -
కృష్ణా నది కబ్జా కేసును నీరుగార్చేందుకు బాబు ప్రయత్నం
-
పచ్చనేతలు పోట్లూరు స్కూల్ ప్లేగ్రౌండ్ కబ్జా
-
కర్నూలు జిల్లాలో ఆలయ భూమి కబ్జా
-
కాలేజీ స్థలంపై కన్ను
కామారెడ్డి డిగ్రీ కళాశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడింది. కోట్ల విలువచేసే ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవడానికి పథకం పన్నారు. పాత పట్టాదారులను ముందుకు తెచ్చి.. తెరవెనక తతంగం నడిపిస్తున్నారు. అయితే వారి కుయుక్తులను కళాశాల పూర్వవిద్యార్థులు, విద్యార్థులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. అంగుళం భూమిని కూడా వదలబోమని, ఇందుకోసం ఎం తటి త్యాగాలకైనా సిద్ధమని పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను ఎలాగైనా కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు పావులు కదుపుతున్నాయి. పాత పట్టాదారులను తెరపైకి తెచ్చి వారితో కేసులు వేయించడం, వారిని ముందుకు పంపి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా భూ బకాసురులు రూ. 100 కోట్ల విలువైన 8.26 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కు6టలు పన్నుతున్నారు. వాటిని విద్యార్థిలోకం తిప్పికొడుతోంది. కాలేజీకి మొత్తం 268 ఎకరాల భూమి ఉండగా, అందులో వివిధ ప్రభుత్వ అవసరాలకు దాదాపు వంద ఎకరాలకుపైగా భూమిని కేటాయించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా గతేడాది 148 ఎకరాల భూమిని కాలేజీ ఎడ్యుకేషన్ కమిటీ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. అప్పుడు కోర్టు కేసు ఉండడంతో ఈ 8.26 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇదీ చరిత్ర.. 1964లో అప్పటి కలెక్టర్ బీఎన్.రామన్ ఆధ్వర్యంలో కామారెడ్డికి చెందిన ప్రముఖులంతా కలిసి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. 258 ఎకరాల భూమిని సేకరించి, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు ఉపయోపడేలా రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టి కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తర్వాతి కాలంలో కళాశాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండడంతో.. కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి లోకం అప్పట్లోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టింది. ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ వ్యవహారం కాల్పులదాకా వెళ్లింది. పోరాటాల ఫలితంగా 1987లో ప్రభుత్వం కాలేజీని స్వాధీనం చేసుకుంది. అయితే కాలేజీ సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కాలేజీ సొసైటీ పరమైంది. తిరిగి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కాలేజీ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగినప్పటికీ ఆస్తులు మాత్రం కాలేజీ సొసైటీ పేరిటనే ఉన్నాయి. కాలేజీకి సంబంధించిన 268 ఎకరాల్లో వంద ఎకరాలకు పైగా భూమి ఇతర సంస్థలు, ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. మిగతా భూమిని కాలేజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని విద్యార్థులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోయింది. జిల్లాల పునర్విభజన అనంతరం.. కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అటు విద్యార్థులు, ఇటు జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. జిల్లాల పునర్విభజనతో కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదివిన సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా వచ్చారు. ఆయన కళాశాల ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయిలో చర్చించారు. ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అడ్డంకులపై పలుమార్లు చర్చలు జరిపారు. గతేడాది 148 ఎకరాల భూమిని కాలేజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కోర్టు వివాదంలో ఉన్న 8.26 ఎకరాల భూముల విషయాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఈ భూమిపై కోర్టులోనే తేల్చుకోవాలనుకున్నారు. సెలవుల్లో కబ్జాకు యత్నం.. కోర్టు ఇటీవల భూమి కొలతలకు అనుమతి ఇవ్వడాన్ని సాకుగా చూపి పట్టాదారులు కబ్జాకు సిద్ధమయ్యారు. గత శనివారం(సెలవు రోజున) ఉదయమే జేసీబీ, ట్రాక్టర్లతో కాలేజీ గ్రౌండ్‌నంతా దున్నేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి, జేఏసీ, ప్రజాసంఘాల నేతలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పనులను నిలిపి వేయించారు. పోరుబాట.. కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం మంగళవారం అఖిలపక్షం సమావేశమైంది. జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్‌గౌడ్, టీఆర్ఎన్కు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భూమన్న, బహుజన ఐక్యవేదిక నాయకుడు క్యాతం సిద్ధరాములు తదితరలతో పాటు విద్యార్థి, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాలేజీ ఆస్తులను కాపాడుకోవడానికి పోరుబాట పట్టాలని నిర్ణయించారు. 20వ తేదీన కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. మైదానం రక్షణ కోసం ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 20 లక్షలు ఇస్తానని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రకటించారు. కాలేజీకి సంబందించిన ఆస్తులన్నీ ప్రజల ఆస్తులని, అంగుళం కూడా వదిలే ప్రసక్తి లేదని అందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎంతో మందికి బతుకు బాటలు వేసిన కాలేజీని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తెరవెనుక ఉన్నదెవరు? రూ. 100 కోట్ల విలువైన కాలేజీ భూమిని కబ్జా చేయడానికి జరుగుతున్న కుట్రల్లో బడాబాబులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎవరనేది బయటకు వెల్లడి కావడం లేదు. రకరకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తెరవెనుక తతంగం నడుపుతున్నది ఎవరనేది బహిర్గతం కావడం లేదు. కాగా అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాలేజీ ఆస్తులను కాపాడుకునేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. -
దర్జాగా కబ్జా..
ఖమ్మం: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాగర్ కాల్వలు వరంలా మారాయి. పంట పొలాలకు నీరందించే కాల్వలను కొల్లగొడుతూ.. పక్కనే తమ వెంచర్లలో యథేచ్ఛగా విలీనం చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. రైతులు మాత్రం తమ పంట భూములకు నీరందించే కాల్వలు బక్కచిక్కిపోవడం.. ఆక్రమణలకు గురికావడంతో ఆయకట్టుకు నీరందక అవస్థలు పడుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద మేజర్ కాల్వ నుంచి పెదతండా సాయిబాబా గుడి వరకు వచ్చే మూడో కాల్వ ప్రస్తుతం కనుమరుగైంది. సుమారు 20 అడుగుల వరకు ఉన్న మూడో కాల్వ పల్లెగూడెం నుంచి రెడ్డిపల్లి, తాళ్లేసేతండా, పెదతండా వరకు వందల ఎకరాలకు సాగునీరు అందించేది. రానురాను వ్యవసాయ భూములుగా వెంచర్లుగా మారుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు తాము కొనుగోలు చేసిన భూముల్లో కాల్వలను కూడా కలిపేసుకుంటున్నారు. ప్రస్తుతం మూడో కాల్వ అనేది నామరూపాలు లేకుండా పోయింది. దీని కింద కొద్దోగొప్పో భూమి ఉండి.. సాగు చేస్తున్న రైతుల భూములకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. రియల్టర్లు పెదతండా వద్ద తవుడు మిల్లు సమీపంలోని కాల్వలను తమ భూముల్లో కలుపుకుని వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం గమనార్హం. ఏదులాపురం చెరువు కాల్వ మాయం.. ఏదులాపురం నుంచి పెదతండా, గుర్రాలపాడు మొదటి భాగం భూముల వరకు వెళ్లే నీటి కాల్వ ఒకప్పుడు 20 అడుగులకుపైగా ఉండేది. ప్రస్తుతం 5 నుంచి 6 అడుగులకు చేరింది. దీనినిబట్టి కబ్జాదారులు ఎంతకు బరితెగించారో ఇట్టే అర్థమవుతోంది. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చిన కాల్వ రెండు వైపులా కలిపి 15 అడుగుల వరకు ఆక్రమణకు గురికావడం చూస్తే ఇక్కడే ఏడెనిమిది ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద ఓ రియల్టర్ ఏకంగా సాగర్ కాల్వ మధ్యలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. దర్జాగా పిల్లర్లు వేసి కొంత మేర గోడలు కూడా నిర్మించాడు. అప్పట్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా నడీ కాల్వపై ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై రైతులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తర్జన భర్జనల నడుమ తొలగించారు. అలాగే వరంగల్ క్రాస్‌రోడ్ నుంచి పెదతండా వరకు, పక్కనే ఎఫ్‌సీఐ గోడౌన్ల ఎదురుగా, ఆటోనగర్ ప్రాంతంలో కూడా కాల్వ ఆక్రమణకు గురైంది. 50 ఎకరాలు ఆక్రమణ దశాబ్ద కాలంగా ఆక్రమణదారులు పంట కాల్వలను ఆక్రమించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై రైతులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆక్రమణల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 20 అడుగుల కాల్వ ఉండేది.. పల్లెగూడెం నుంచి పెదతండా సాయిబాబా ఆలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర గతంలో 20 అడుగుల వెడల్పుతో పంట కాల్వ ఉండేది. అందులో వచ్చే నీటితో రెండు పంటలు పుష్కలంగా పండేవి. ప్రస్తుతం పంట భూములు ప్లాట్లుగా మారడంతో అసలు కాల్వే లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి భూములకు నీరందడం లేదు. – బాణోత్ తారాచంద్, పెదతండా సాగునీటికి ఇబ్బందులు.. గతంలో ఏదులాపురం చెరువు నుంచి వచ్చే పంట కాల్వ 20 అడుగుల వరకు ఉండేది. ఇప్పుడది అయిదారు అడుగులకు మించిలేదు. కాల్వ వెడల్పు ఉన్నప్పుడు పంటలకు నీరు సమృద్ధిగా చేరేవి. పంటలకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఉండేది. కాల్వ వెడల్పు తగ్గడంతో నీళ్లు రావడం తగ్గింది. ఆయకట్టు కొన్నేళ్లుగా ఎండిపోతోంది. – బాణోత్ సేవాలాల్, రైతు, పెదతండా ఆక్రమిస్తే సహించేది లేదు.. ఎక్కడైనా పంట కాల్వలు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వరంగల్ క్రాస్‌రోడ్ ప్రాంతంలో సాగర్ పంట కాల్వపై రియల్టర్ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాం. పంట కాల్వలు ఆక్రమిస్తే తమకు వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. – బి.నర్సింహారావు, తహసీల్దార్ -
రేపల్లెలో ’భూ’పాలుడు
-
కోండ కబ్జా
-
ముషిక్ చెరువుపై కబ్జాదార్ల కన్ను
-
దేవుడి భూమిపై బడా నేత కన్ను!
సాక్షి, హైదరాబాద్: అది దేవాదాయశాఖ పరిధిలో ఉన్న మఠం.. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో ఉన్న ఈ మఠానికి అనుబంధంగా దేవాలయం, దాదాపు ఎకరం ఖాళీ స్థలం ఉంది. అందులో పేదలు, ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడా స్థలంపై ఓ బడా నేత కన్ను పడింది. అందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చేసి.. అటు వారి ఓట్లను రాబట్టుకోవడం, ఇటు సొంత వ్యవహారాలకు వాడుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దేవాలయాల భూములను ఏ ఇతర అవసరాలకు కూడా కేటాయించకూడదన్న నిబంధన ఉండటంతో... అసలు అది దేవాలయ భూమి కాదని ఆ శాఖ అధికారులే తేల్చేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ‘తేల్చేందుకు’ రంగం సిద్ధం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో ఉన్న మఠం పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. గతంలో దాతలు ఆ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చారు. అందులో మూడున్నర వేల గజాల స్థలం ఖాళీగా ఉండేది. అందులో కొందరు పేదలు, స్థానిక నేతల సహకారంతో కొంతమంది ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఓ బడా నేత తన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఆ స్థలాన్ని బస్తీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లను నిర్మించి, పెద్ద సంఖ్యలో కుటుంబాలను అందులో చేర్చాలని చూస్తున్నారు. దీంతోపాటు కొంతమందికి పట్టాలిప్పించి ఇళ్లు నిర్మించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఈ స్థలానికి సమీపంలో మరో దేవాలయానికి చెందిన వెయ్యి గజాల భూమి కూడా ఉంది. దానిని కూడా ఇదే తరహాలో మార్చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం కూడా దేవాలయ భూమిగా ఉంది. దాంతో ఆ భూమి తమది కాదంటూ దేవాదాయశాఖ పేర్కొనేలా ఓ ఉన్నతాధికారితో ‘ఒప్పందం’చేసుకున్నట్టు సమాచారం. ఆ అధికారి ఆ స్థలం దేవాలయభూమి కాదని ‘తేల్చేందుకు’ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుండటంతో.. అది దేవాలయ భూమి కాదని రికార్డుల్లో నమోదయ్యేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
రూ.15 కోట్లు...కృష్ణార్పణం
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజల సొమ్మే కాదు ప్రజలు ఏమైపోయినా సరే పాలకులకు లెక్కేలేకుండా పోతోంది. పాతికవేల మందిని ఇబ్బందుల పాలుజేసి ‘తమ్ముడుంగారి’ బాగు కోసం పురపాలికలు మోకరిల్లుతుండడంతో పట్టణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణ తుని నడిబొడ్డున బాతులు కోనేరును బినామీ పేర్లతో ఆక్రమించేసిన వైనమే. 15 వార్డుల్లో నివసించే పాతికవేల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆక్రమణలు చేస్తున్నా అడ్డుకోవల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 53 సెంట్లు జిరాయితీ స్థలాన్ని కొనుగోలుచేసి కోట్ల రూపాయల విలువైన కోనేరు స్థలాన్ని కలిపేసుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటుకాక మునుపు తుని వీరవరం పంచాయతీగా ఉండేది. మురుగు ఈ బాతుల కోనేరులోకి వచ్చి ముంపు నుంచి రక్షించేది. కోనేరును చదును చేసి స్థలంగా మార్చేయడంతో పాతికవేల మంది నివసిస్తున్న 15 వార్డులు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆక్రమణకు గురైన ఈ కోనేరును తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఏదైనా తేడా వచ్చినా ‘అన్నయ్య’ (తుని నియోజక వర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధి) చూసుకుంటారని తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో పురపాలికలు కిమ్మనడం లేదు. ఆక్రమణదారులను వదిలేసిన మున్సిపాలిటీ ప్రత్యామ్నాయంగా రూ.38 లక్షల ప్రజధనాన్ని కుమ్మరించి కొత్తగా డ్రై¯ŒSను నిర్మించింది. గట్టిగా వర్షం పడితే చాలు లక్షలు పోసి నిర్మించిన ఈ డ్రై¯ŒS ఎందుకు పనికిరావడం లేదు. వచ్చిన వర్షం నీటిని అదుపు చేయలేకపోవడంతో వరద కష్టాలు తప్పడం లేదు. ఆక్రమణ విలువ రూ.15 కోట్ల పైమాటే... ఆక్రమించుకున్న ఆ స్థలం మార్కెట్ విలువ రూ.15 కోట్ల పైమాటే. అన్ని కోట్లు విలువైన బాతుల కోనేరు కబ్జా చేసినా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. కోనేరుకు ముందు జీఎన్టీటీ రోడ్డును అనుకుని తాలూకా పోలీస్‌స్టేçÙన్, దానికి వెనుక పోలీస్ క్వార్టర్లున్నాయి. ఇవన్నీ పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసినవే. వీరవరం పంచాయతీగా ఉండగా సర్వే నంబరు 268/4లో 1.50 ఎకరాల రెవెన్యూ పోరంబోకు ఇది. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్డులోని సర్వే నంబరు 268/4లో సోమరాజు సినిమా థియేటర్ గోడ అనుకుని 22 సెంట్లు భూమిలో మురుగు కాలువ నిర్మించింది. కాలువ 15 వార్డుల మురుగుకు నీరు పారుదలకు ప్రధాన మార్గం. బినామీ పేర్లతో కొనుగోలు... బాతులు కోనేరు మనుగడలో ఉండగా ఆ స్థలంలో ఎవరూ లేరని స్థానికులు ఎవరినడిగినా ఇట్టే చెబుతారు. తునికి చెందిన ఒక వ్యక్తి సర్వే నంబరు 268/4 లో 1.25 సెంట్లు భూమి కొన్నట్టు డాక్యుమెంట్లు అధికారులకు అందజేశాడు.1995లో రెవెన్యూ సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్థారించారు. దీనిపై 2003లో జేసీ కోర్టును పిటీషనర్ ఆశ్రయించగా, జేసీ ఆదేశాల మేరకు మున్సిపల్ కాలువకు 22 సెంట్లు భూమి విడిచిపెట్టేశారు. జేసీ కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తన పేరుతో 53 సెంట్లు 2005లో పట్టా ఇచ్చారు. వెబ్ ల్యాండ్‌లో మాత్రం ఆ భూమి రెవెన్యూ పోరంబోకుగానే ఉంది. అయినా సరే తన అధికార దర్పాన్ని చూపించి కబ్జాకు పాల్పడ్డాడు. కొనుగోలు ఇంత ... ఆక్రమణ అంత... అధికారికంగా కొనుగోలు చేసింది 53 సెంట్లే. కానీ ఆ భూమికి ఆనుకుని మురుగు డ్రై¯ŒSకు చెందిన 22 సెంట్లు, పోలీస్ క్వార్టర్స్ సమీపాన 10 సెంట్లనూ తన ఖాతాలో వేసేసుకున్నాడు.ఈ మొత్తం భూమి 1500 గజాలు పైబడి ఉంది. అక్కడ గజం రూ.లక్ష పలుకుతుంది.అంటే అక్షరాలా రూ.15 కోట్లు విలువైన స్థలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని బినామీ పేర్లతో తమ్ముడు చేతుల్లోకి పోయింది. మున్సిపల్ కాలువ ఆనుకుని ఉన్న థియేటర్‌ను కూడా తమ్ముడు బినామీలే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ స్థలం, కబ్జా చేసిన స్థలాన్ని చదును చేసేసి కంచె ఏర్పాటు చేశారు. ప్లాట్లుగా అమ్మకానికి పెట్టినా భూమి రికార్డు విషయం తెలుసుకున్న వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలువ మూసి వేసినా పురపాలకులు మాత్రం తమ్ముడు అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు. -
దేవుడికే ద్రోహం!
విశాఖపట్నం: అది నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం.. ఆ గ్రామ పరిధిలో సముద్రతీరానికి ఆనుకుని సర్వేనెం 288/1లో 19 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి చెరువు సరోజనమ్మ పేరుతో నమోదై ఉంది. సుమారు 80 ఏళ్ల క్రితమే ఆ భూమిని సరోజనమ్మ గ్రామంలోని రామాలయానికి దానంగా ఇచ్చేశారు. అçప్పటి నుంచి దాన్ని గ్రామస్తులే సాగు చేస్తూ వచ్చిన ఆదాయంతో ప్రతి ఏటా శ్రీరామనవమి, నూకతాత, నూకాలమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సాగు లీజును గ్రామపెద్దలే నిర్ణయించేవారు. 1960 నుంచి 1990 వరకు జంపన లక్షణరాజు, లక్ష్మీపతిరాజులు ఆ భూములను లీజుకు తీసుకుని ఆదాయాన్ని గ్రామస్తులకు చెల్లించేవారు. 1990లో గ్రామానికి చెందిన పూజారి పిక్కి అప్పన్నను ఆలయ ధర్మకర్తగా నియమించారు. అప్పటి నంచి ఆయన ద్వారా లీజు వసూలు చేస్తూ పండగలు నిర్వహించేవారు. కాగా 2000 నుంచి 2015 వరకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పిక్కి రాంబాబు, దైలపల్లి ముత్యాలు, పిక్కి కాశీరావు తదితరులు ఈ భూములను సాగుచేసి ఏడాదికి రూ.1.40 లక్షలు గ్రామస్తులకు ఇచ్చేవారు. 2015–16 సంవత్సరానికి గాను గ్రామానికి చెందిన పూడి అప్పాయ్యమ్మకు లీజుకు ఇచ్చారు. ఇలా 1960 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా నిర్విరామంగా గ్రామస్తులే సాగుచేసుకుంటూ వచ్చారు. రికార్డుల్లో సరోజనమ్మ పేరున ఉన్న ఈ భూములకు సంబంధించిన వారుసులెవరూ ఇన్నేళ్లుగా గ్రామానికి రాలేదు. అటువంటి వారెవరూ లేరని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. పాసు పుస్తకాలున్నా సరే.. వాస్తవానికి 30 ఏళ్ల క్రితమే అధికారులు ఆ భూములను దేవుడి మాన్యంగా చూపిస్తూ రాముల వారి తరఫున పాసుపుస్తకాలు (తోక పుస్తకాలు) జారీ చేశారు. ఇక 1990లో గ్రామపెద్దలు నియమించిన ధర్మకర్త పిక్కి అప్పన్న రాముల వారి పేరిట ప్రభుత్వానికి భూమి పన్ను కూడా చెల్లించారు. ఈ ఆధారాలన్నీ గ్రామస్తుల వద్ద ఉన్నాయి. భూములు లీజుకు తీసుకున్న వారి వద్ద ఆ లీజు ఒప్పంద పత్రాలు కూడా కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలున్నా సరే.. అధికారం తలకెక్కిన సదరు పచ్చనేతకు అవేవీ కనపించడం లేదు. ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. తను చెప్పినట్లు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే రికార్డులు కూడా మార్చేయాలని ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఆ భూములను కట్టబెట్టి పరిహారంలో సగం సగం కొట్టేయాలన్నదే సదరు నేత వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయితీ భూములకు పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలైంది. చాలామందికి ఎకరాకు రూ.18 లక్షల చొప్పున చెల్లించారు. టీడీపీ నేత ఒత్తిడి మేరకు రాములోరి భూములకు కూడా పరిహారం చెల్లించేందుకు అధికారులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అడకత్తెరలో అధికారులు వారసుడని చెప్పుకుంటున్న వ్యక్తిగానీ, అతని కుటుంబ సభ్యులుగానీ ఈ భూములను సాగు చేస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాసు పుస్తకాలు కోసం అతను చేసిన దరఖాస్తును తొలుత తిరస్కరించారు. అయితే టీడీపీ నేత ఆదేశాలతో రికార్డులు మార్చే పనిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారులు ఓ సాకు చూపిస్తున్నారు. భూములు ఎవరివైనా.. సాగులోగానీ, అనుభవంలోగానీ ఉన్న వారి పేర్లు అడంగల్(సాగుబడిలెక్క)లో నమోదు చేయాలి. అయితే 80 ఏళ్లుగా రామాలయ భూములను గ్రామస్తులే సాగుచేస్తున్నా వారిపేర్లు ఎక్కడా అనుభవదార్లుగా నమోదు కాలేదు. ఇప్పుడు ఇదే సాకుతో ఆ భూమి గ్రామస్తులకు చెందదని అధికారులు తేల్చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవుడిమాన్యంగా రామాలయం పేరిట ఉన్న భూములను తిరిగి చెరువు సరోజనమ్మ పేరిట మార్చినట్టు సమాచారం. సరోజనమ్మ పేరిట మార్చడం ద్వారా వారసుడంటూ తెరిపైకి వచ్చిన వ్యక్తికి కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, పరిహారం కోసం దేవుడి భూములను కొట్టేసే కుట్రను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భూముల ఫలసాయంతో ఎన్నాళ్ల నుంచో ఏటేటా రాములోరి, అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములు పోతే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఎలా మారిపోతాయ్ రాములోరి భూములను పదిహేనేళ్లుగా సాగుచేస్తూ శిస్తు గ్రామాభివద్ధికి చెల్లిస్తున్నాము. పరిహారం కోసం ఈ భూములను కాజేయాలని కొంతమంది కుట్ర పన్నారు. ఎనభై ఏళ్లుగా ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి.. ఇప్పటికిప్పుడు రికార్డులు ఎలా మారిపోతాయి. – పిక్కి రాంబాబు, మాజీ సర్పంచ్ అధికారులు న్యాయంగా ఆలోచించాలి ఇరవై ఏళ్లపాటు ఈ భూములను సాగుచేసి శిస్తు దేవుడి పండగల కోసం చెల్లించాను. మా తాతల కాలం నుంచి ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది వచ్చి అవి తమవేనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అధికారులు న్యాయం చేయాలి. పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి దేవుడికి అన్యాయం చేయొద్దని మనవి. – దైలపల్లి ముత్యాలు, లీజుదారుడు అర్ధంతరంగా వారసుడొచ్చాడు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములు సేకరిస్తూ భారీగా పరిహారం చెల్లిస్తుండటంతో పచ్చనేత కన్ను ఈ రామాలయం భూములపై పడింది. ఎలాగైనా ఆ పరిహారం కొట్టేయాలని ప్లాన్ వేశారు. అంతే.. అర్ధంతరంగా సరోజనమ్మ వారసుడంటూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చారు. ఆ భూమిపై సర్వ హక్కులు అతనివేనని, భూములను ఎవరికి దానం చేయలేదని భూసేకరణలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం సుమారు నాలుగు రూ.కోట్లు అతనికే దక్కాలంటూ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. -
దేవుడి ఆలయాన్ని కూడా వదలరా..!
-
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న వరహాలగడ్డను ఆక్రమించుకున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయడు, టీడీపీ నాయకుడు అయిన బొంగు జోగినాయుడుతోపాటు మర్రాపు నారాయణస్వామిలను అరెస్ట్ చేసినట్టు మంగళవారం సాయంత్రం ఎస్ఐ బి.అశోక్‌కుమార్ తెలిపారు. వరహాలగడ్డ ఆక్రమణలను 'సాక్షి' దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అధికారులు స్పందించినట్టే స్పందించి చర్యల విషయంలో వెనక్కి తగ్గడంతో... కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కబ్జాకోరల్లో విజయవాడ కాలేజి