వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా? | Hyderabad: Drainage Land Kabza By Realtors Ghatkesar | Sakshi
Sakshi News home page

వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా?

Published Fri, Mar 11 2022 9:41 PM | Last Updated on Fri, Mar 11 2022 9:52 PM

Hyderabad: Drainage Land Kabza By Realtors Ghatkesar - Sakshi

సాక్షి,ఘట్‌కేసర్‌(హైదరాబాద్‌):ఇటీవల భూముల విలువ పెరగడంతో డ్రైనేజీలను సైతం వదలడం లేదు. జనవరి 5, 2021న పట్టణంలోని ఎదులాబాద్‌ రోడ్డులో రూ.21లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసిన భూగర్భ డ్రైనేజీ స్థలామే కబ్జాకు గురైంది. మున్సిపల్‌ కమిషనర్‌ కార్యలయానికి నిత్యం వెళ్లే దారిలోని డ్రైనేజీ స్థలం కబ్జాకు గురికావడం, కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహరించడం, పక్షం రోజులుగా పనులు జరగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ స్థలంపై గేటు నిర్మించడంలో పాటు, సర్వేనంబర్‌ 481, 482లో చేసిన వెంచర్‌ రోడ్డును కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డు, డ్రైనేజీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement