Realtors
-
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
బిల్డర్లకు రేటింగ్! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు. చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ఓకే
న్యూఢిల్లీ: రుస్తోంజీ బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కీస్టోన్ రియల్టర్స్ పబ్లిక్ ఇష్యూకి ఓమాదిరి స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా 2 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 86,47,858 షేర్లను ఆఫర్ చేయగా.. 1,73,72,367 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) నుంచి 3.84 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 3.03 రెట్లు అధిక బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో మాత్రం 53 శాతమే సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 514–541 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 635 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 190 కోట్లు అందుకున్న విషయం విదితమే. దాదా పు రూ. 342 కోట్ల రుణ చెల్లింపులు, భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనుంది. 1995లో ఏర్పాటైన కంపెనీ 32 ప్రాజెక్టులను పూర్తి చేయగా.. ప్రస్తుతం 12 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మరో 19 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. -
రియల్టర్ల పాదయాత్రకు ప్రజల నుంచి నిరసన
-
అసైన్డ్‌పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అసైన్డ్‌దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. పెద్దఅంబర్‌పేట్‌లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్‌గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్‌గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా?
సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్):ఇటీవల భూముల విలువ పెరగడంతో డ్రైనేజీలను సైతం వదలడం లేదు. జనవరి 5, 2021న పట్టణంలోని ఎదులాబాద్ రోడ్డులో రూ.21లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసిన భూగర్భ డ్రైనేజీ స్థలామే కబ్జాకు గురైంది. మున్సిపల్ కమిషనర్ కార్యలయానికి నిత్యం వెళ్లే దారిలోని డ్రైనేజీ స్థలం కబ్జాకు గురికావడం, కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహరించడం, పక్షం రోజులుగా పనులు జరగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ స్థలంపై గేటు నిర్మించడంలో పాటు, సర్వేనంబర్ 481, 482లో చేసిన వెంచర్ రోడ్డును కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డు, డ్రైనేజీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!
ఇబ్రహీంపట్నం రూరల్: సంచలనం రేపిన రియల్టర్ల జంట హత్యల కేసులో కొంతమంది పోలీసులపై వేటు తప్పదని తెలుస్తోంది. రెండు నెలలుగా లేక్‌విల్లాలోని భూ తగాదాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ తగాదాల్లో అనేకమార్లు మాట్లాడినప్పటికీ సయోధ్య కుదరలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఇద్దరూ మట్టారెడ్డిని బెదిరించినట్లు సమాచారం. అదేరోజు తనకు ప్రాణహాని ఉందని వారిద్దరిపై మట్టారెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని తెలిసింది. ఉన్నత స్థాయి అధికారి నోటీసుకు ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదని.. దీంతో భయాందోళనకు గురైన మట్టారెడ్డి.. ఎలాగైనా వారిద్దరి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఇలా హత్యకు కుట్ర చేసినట్లు సమాచారం. భారీగా ముడుపులు..! పోలీసులకు శ్రీనివాస్‌రెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఓ పెద్ద స్థాయి పోలీసు అధికారి లేక్‌విల్లాను పరిశీలించి వెళ్లారని సమాచారం. కేసును కనీసం పట్టించుకోలేదని మట్టారెడ్డి ఆరోపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసు కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఫిర్యాదు చేసినా స్పందన లేకే.. రెండు నెలలుగా కర్ణంగూడలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేక్‌విల్లా ఆర్చిడ్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కౌన్సిలర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. మట్టారెడ్డి కేసుపై ఎటూ తేల్చలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి హత్య చేసినట్లు మట్టారెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. మట్టారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే హత్యల దాకా వచ్చేది కాదని చర్చించుకుంటున్నారు. ఐదుగురు నిందితులకు రిమాండ్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మేరెడ్డి మట్టారెడ్డి, ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీం, సమీర్ అలీని సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. (చదవండి: కటకటాల్లో గజదొంగ నాయక్) -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్‌విల్లా భూ వివాదమే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. చదవండి: టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..? ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు. -
ముందు ఆర్భాటం.. ఆ తర్వాత సెటిల్మెంట్లు..
‘ఇస్నాపూర్‌లో 40 అంతస్తుల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ఓ నిర్మాణ సంస్థ ప్రచారం చేస్తోంది. ఏ కంపెనీ, ప్రమోటర్లు ఎవరు, గత ప్రాజెక్ట్‌లు ఏంటని శోధిస్తే.. రాత్రికి రాత్రే బోర్డ్ ఏర్పాటు చేసిన కంపెనీ అది. పోనీ ప్రమోటర్లకు ప్రాజెక్ట్‌లు నిర్మించిన అనుభవం ఉందా అంటే ప్చ్.. అదీ లేదు! హైరైజ్ అపార్ట్మెంట్ అని భూ యజమానికి ఆశ చూపించి ఒప్పందం చేసుకున్నాడు. తక్కువ ధర అని ప్రచారం చేస్తుండటంతో కొనుగోలుదారులూ తొందరపడుతున్నారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ఆర్థిక దమ్ము ఉందా లేదా ఆరా తీశాక ముందు పడితేనే కస్టమర్లకు గృహమస్తు. లేకపోతే శోకమస్తే!’ సాక్షి, హైదరాబాద్: చిన్నాచితకా కంపెనీలు, అనుభవం లేని వాళ్లు రియల్టీ రంగంలోకి వచ్చేసి స్థల యజమానితో అగ్రిమెంట్ చేసుకోవటం, హైరైజ్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని గొప్పలు చెప్పడం ఎక్కువైపోయింది. అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్), ప్రీలాంచ్లో విక్రయాలు చేస్తూ.. పారదర్శకంగా ప్రాజెక్ట్‌లు చేపట్టే నిర్మాణ సంస్థలకు, సంఘటిత పరిశ్రమకు విఘాతం కలిగిస్తున్నారు. కొనుగోలుదారులు, భూ యజమానులు, స్టేక్ హోల్డర్లు, డెవలపర్ల సంఘాలతో సహా ప్రభుత్వం మేల్కొనకపోతే.. వచ్చే ఏడాది కాలంలో నగర రియల్టీ కుప్పకూలిపోయే ప్రమాదముందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గొప్పలకు పోవద్దు స్వలాభం కోసం 30–40 ఫ్లోర్లలో అపార్ట్మెంట్లు కడతామని గొప్పలకు పోవద్దు. భూ యజమానులను ఆశ పెట్టొదు. ఆ ప్రాంతంలో అంత ఎత్తులో నిర్మాణాలు సాధ్యమయ్యే పనేనా? కొనుగోలుదారుల భవిష్యత్తు తరాల మనుగడ ఎలా ఉంటుంది? వంటి సుదీర్ఘ ఆలోచన చేయాలి. అంతే తప్ప అమ్మేశాం.. డబ్బు చేసుకున్నాం.. చేతులు దులుపుకున్నాం అనే రీతిలో ఉండకూడదు. శంకర్పల్లి, ఇస్నాపూర్‌లో 30–40 ఫోర్లు కడుతున్నామని కొందరు డెవలపర్లు ఆర్భాటాలు చేస్తున్నారు. అడ్వాన్స్‌లు తీసుకొని.. ప్రాజెక్ట్‌ను నిర్మించలేక ఆఖరికి సెటిల్మెంట్ చేసుకునే స్థాయికి దిగజారిపోయారని ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ఓసీ వచ్చాక ఫర్ సేల్ ఉందా? సొంతిల్లు అనేది మధ్యతరగతికి జీవితాశయం. అలాంటి వారికి ఆశ పెట్టి అందిన కాడికి దోచుకోవటం అన్యాయం. నిర్మాణ అనుమతులు రాకముందే ప్రీలాంచ్, యూడీఎస్లో విక్రయాలు చేయడం ఆపైన లీగల్ సమస్యలు తలెత్తి, అనుమతులు రాక చేతులెత్తేస్తే మధ్య తరగతి కొనుగోలుదారుల పరిస్థితేంటని ఒక్కసారి పునరాలోచించుకోవాలి. కొనుగోలు చేసే ముందు కస్టమర్లు కూడా ప్రాజెక్ట్ పూర్వాపరాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డర్ చరిత్ర, ఆర్థిక స్థోమత, ప్రమోటర్లు ఎవరనేది తెలుసుకోవాలి. పాత ప్రాజెక్ట్స్‌లో అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయాయా? లేక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చాక కూడా ఫర్ సేల్ బోర్డ్ ఉందా గమనించాలి. సొంత డబ్బుతో ప్రాజెక్ట్‌ను ఎవరూ పూర్తి చేయలేరు. ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లకే బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేస్తాయి. డెవలపర్ల సంఘాలు మేల్కోవాలి.. పరిశ్రమ వృద్ధిలో డెవలపర్ల సంఘాలది కీలక పాత్ర. కానీ, ఫీజు తీసుకొని సభ్యత్వ నమోదు వరకే పరిమితం అవుతున్నాయే తప్ప పరిశ్రమ వృద్ధికి ఆలోచన చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా మేల్కొని భజన కార్యక్రమాలు ఆపి, నిర్మాణ రంగంలోని ప్రతికూల నిర్ణయాలపై ఒక్కతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలి. నిర్భయంగా, స్పష్టంగా ప్రతికూల ప్రభావమేంటో వివరించాలి. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, అనుభవజ్ఞులను కలుపుకొని పోవాలి. దిగువ స్థాయి ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద రంగం నిర్మాణ రంగమే. అలాంటి రంగం ఉనికికే ప్రమాదం ఏర్పడితే విక్రయాలకే కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. చదవండి:నిర్మాణంలోని అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటున్నారా..! అయితే ఈ విషయాల పట్ల జాగ్రత్త..! -
దేవుడు ముసుగులో దోచేస్తున్నారు
పేరు దేవుడిది.. దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు. అక్కడ రేకుల షెడ్లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు. స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం... కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు... వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు. స్వాగతద్వారం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు... కలెక్టర్ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు. దర్జాగా నిర్మాణ పనులు... ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు. నీరుగారిన క్రిమినల్ కేసు... ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత తహసీల్దార్ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్ గ్రాబింగ్) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాలకు ఎసరు... కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వర్టును ధ్వంసం చేయించాం.... ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస -
70 లక్షల చోరీ: 7 ఆటోలు మారినా దొరికారు
బనశంకరి: స్నేహితుని సోదరి ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పులకేశినగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. లక్కసంద్ర నివాసి నజీం షరీఫ్, గుర్రప్పనపాళ్య మహమ్మద్ షఫీవుల్లా రియల్ ఎస్టేట్, గ్రానైట్ వ్యాపారాలు చేసి నష్టపోయారు. దీంతో ఎలాగైనా భారీగా డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ స్నేహితుని సోదరి అయిన జ్యోతిజ్వాల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సేఫ్ లాకర్లో ఉన్న రూ.70 లక్షల విలువైన నగలు, నగదును బ్యాగులో వేసుకుని స్కూటీతో సహా పరారయ్యారు. జాడ దొరకరాదని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి 7 ఆటోలు మారి 18 కిలోమీటర్లు చుట్టి వెళ్లారు. ఫిర్యాదు మేరకు తూర్పు విభాగపు డీసీపీ శరణప్ప, సీఐ ప్రదీప్‌ఎడ్విన్ దర్యాప్తు చేపట్టారు. 15–20 రోజుల పాటు చుట్టుపక్కల 270 కు పైగా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా షరీఫ్, షఫీవుల్లాలే చోరీ చేసినట్లు గుర్తించి శనివారం అరెస్టు చేసి సొత్తు సీజ్‌చేశారు. చదవండి: రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు -
ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలి
సాక్షి, మేడ్చల్ : నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. అనంతరం ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. (వీఆర్వో వ్యవస్థ రద్దు) ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని నిరసనలు చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచడం అంటే సామాన్యప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి విఙ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. (రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు ) -
పోరులో రియల్టర్ల జోరు
అది ఆదిబట్ల మున్సిపాలిటీ. టీసీఎస్, కలెక్టరేట్, ఏరోస్పేస్ జోన్ రావడంతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. పురపాలికగా మారిన అనంతరం తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో మూడో వంతు అభ్యర్థులు రియల్టర్లే బరిలో నిలిచారు. 15 వార్డులకుగాను 49 మంది బరిలో ఉండగా.. ఇందులో 40 మంది స్థిరాస్తి వ్యాపారులే కావడం గమనార్హం. చైర్మన్ పదవి ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డు నుంచి పోటీ పడుతుండటంతో ఇక్కడ ఓటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఇద్దరు కూడా రియల్టీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన వారే కావడంతో మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు కుమ్మరిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ : పుర‘పోరు’కు ‘స్థిరాస్తి’ రంగం పెట్టుబడిగా మారింది. అసాధారణంగా పెరిగిన భూముల ధరలు.. కలిసొచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నడిచొచ్చిన నడమంత్రపు సిరి మున్సి‘పోల్స్’ను రసవత్తరంగా మార్చేశాయి. నగర/పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రియల్టర్లే ఎక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజధాని శివారు జిల్లాల్లోని సుమారు 40 పట్టణ సంస్థల్లో ఈ అభ్యర్థుల హవానే కనిపిస్తోంది. సాఫీగా సాగుతున్న వ్యాపారానికి కౌన్సిలర్/కార్పొరేటర్ పదవి కవచంలా ఉంటుందని భావిస్తున్న రియల్టర్లు.. పట్టణ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా అవతరించడం ద్వారా పనులను చక్కబెట్టుకోవచ్చని ఆశిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా మొదట్నుంచీ కన్నేసిన వార్డుకు ఎసరొచ్చినా.. వేరే సీటు నుంచి పోటీ చేసేందుకు వెనుకాడకపోవడానికి డబ్బే కారణంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తే.. తమ కుటుంబ సభ్యులను బరిలో దించింది కూడా రియల్టర్లే కావడం గమనార్హం. ఎంతకైనా రెడీ! రాజకీయ పార్టీలు కూడా రియల్ ఎస్టేట్ లో బాగా రాణించిన వారిని గుర్తించి బీ–ఫారాలు పంపిణీ చేశాయి. దీంతో హైదరాబాద్ శివార్లలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, తుక్కుగూడ, తుర్కయంజాల్, ఆదిబట్ల, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్పేట్, నిజాంపేట్, అమీన్పూర్, దుండిగల్, శంషాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీలే కాకుండా గ్రేటర్‌కు దూరంగా ఉన్న చౌటుప్పల్, షాద్‌నగర్, శంకర్పల్లి, వికారాబాద్, చండూరు, చిట్యాల, భువనగిరి తదితర పురపాలిక సంఘాల్లో పోటీపడుతున్న అభ్యర్థు ల్లోనూ సింహభాగం రియల్టర్లే ఉన్నారు. బహుళజాతి సంస్థల తాకిడి, ఐటీ కంపెనీల రాకతో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరకు రియల్టీ రంగం కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమవగా 2016లో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టడం.. కొత్త జిల్లా కేంద్రాలు రావడంతో ఆ ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గద్వాల, వనపర్తి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ తదితర పట్టణాల్లోనూ భూముల విలువలు పెరిగాయి. దీంతో స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇలా సంపాదించిన సొమ్మును రాజకీయాల్లోకి మళ్లించేందుకు పురపోరు వేదికగా మారింది. సోమవారంతో ప్రచారపర్వానికి తెరపడగా.. ఇప్పటికే రెండు, మూడు దశల్లో పంపకాల ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు.. తుది విడత పంపిణీకి ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
కశ్మీర్ భూములపై ఎవరికి హక్కు?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఈ రోజు నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అధికారికంగా ఆవిర్భవించిన విషయం తెల్సిందే. ఇంతవరకు కశ్మీర్‌కు మాత్రమే వర్తిస్తున్న ప్రత్యేక భూమి హక్కుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలపై కేంద్రానికే ఎక్కువ హక్కులు ఉంటాయి. అందులో భాగంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాల భూములకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ఈ రోజు వరకు ఎదురు చూసిన వారు నిరాశకు గురవుతున్నారు. రెండుగా విడిపోయిన కశ్మీర్ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించే సుందర వనాలవడం, అక్కడ భూములు చాలా చౌక అవడంతో దేశంలోని చిన్న రియల్టర్ నుంచి పెద్ద రియల్టర్ వరకు ఆ ప్రాంతాలపై కన్నేశారు. రద్దు చేసిన రాజ్యాంగంలోని 35ఏ అధికరణం కింద కశ్మీర్లో శాశ్వత నివాసితులే స్థిరాస్తులను కొనుగోలు చేయాలి. ఇతర రాష్ట్రాల వారు కొనుగోలు చేయడానికి వీల్లేదు. కశ్మీర్ ఆడ పిల్లల పేరిట భూమి, ఇల్లు లాంటి స్థిరాస్థులుంటే వారు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుంటే వాటిపై హక్కులను కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నిబంధనలన్నీ రద్దయ్యాయి కనుక, అందమైన కశ్మీర్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని, వీలైతే వారి స్థిరాస్తులను అనుభవించవచ్చని ఎంతో మంది యువకులు సోషల్ మీడియా సాక్షిగా ఉవ్విళ్లూరారు. భూమి హక్కులు కశ్మీరీలకే దక్కేలా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరళిలో ప్రత్యేక చట్టాలు తీసుకు రావాలని స్థానిక బీజేపీ నాయకులతో సహా పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: కశ్మీర్‌కు ‘రోడ్‌మ్యాప్’ లేదు!) -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్‌లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
అక్రమ బ్లో అవుట్లు!
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. రియల్ రంగం జోరు మీద ఉండటంతో కొందరు రియల్టర్లు, బ్రోకర్లు తక్కువ ధరకు ప్లాట్ల పేరిట ప్రజలను మోసగిస్తున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే హైదరాబాద్ శివార్లతోపాటు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి అమ్మేస్తున్నారు. చిన్నపాటి లొసుగులను సాకుగా చూపుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిజి్రస్టేషన్ అవుతున్న ప్లాట్లలో దాదాపు 85 శాతం అక్రమ లేఅవుట్లే కావడం గమనార్హం. నిబంధనలివి... - సాధారణంగా లేఅవుట్ ఏర్పాటుకు డీటీసీపీ, హెచ్ఎండీఏ తదితర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. పంచాయతీలకు లేఅవుట్ జారీ అధికారం లేదు. - పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ప్లేగ్రౌండ్స్ తదితర వాటికి పక్కాగా స్థలాలను కేటాయించాలి. - తారు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు సౌకర్యాన్ని ప్రతి ప్లాటుకు కల్పించాలి. - ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూరా 10 కి.మీ మేర నిర్మాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. - ఈ జలాశయాల పరిరక్షణకు 111 జీఓను తెచ్చి కాలుష్య పరిశ్రమలను నిషేధించింది. - గృహ, ఇతర అవసరాలకు మాత్రం భూ విస్తీర్ణంలో 10 శాతం మాత్రమే వినియోగించుకునేలా షరతు విధించింది. అనుసంధానానికి అడ్డు... కొత్తగా ఏర్పాటు చేసే లే–అవుట్ల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. అనుమతి పొందిన లేఅవుట్లలోని స్థలాలనే రిజిస్ట్రేషన్ చేసేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ సబ్ రిజి్రస్టార్లకు లేఖ రాసినా రిజిస్ట్రేషన్లశాఖ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. అలాగే 111 జీవో క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిన పంచాయతీరాజ్, హెచ్ఎండీఏ విభాగాలు చోద్యం చూస్తుండగా, వాటర్‌బోర్డు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో రోడ్డు, ఓ భవన నిర్మాణం ఉన్న ప్రాంతం ఓ కుంట అంటే నమ్ముతారా! కానీ ఇది నిజం.. శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన వెంచర్ ఇది. ఇక్కడ జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం ఎలాంటి లే–అవుట్లు, నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రియల్టర్లు ఏకంగా కుంటలోనే ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. కుంట సమీపంలో ఉన్న చారిత్రక ఫిరంగి కాలువ కూడా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కి కనుమరుగైంది. ఈ జీఓ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమాలే కనిపిస్తాయి. -
బరితెగించిన రియల్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. నాలుగు నెలల వ్యవధిలో 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్ధలాలను పప్పుబెల్లాల్లా అమ్మేశారు. ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ సిబ్బంది తలమునకలై ఉండటాన్ని గమనించి తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు తెరతీశారు. ఈ అక్రమ లే అవుట్లతో ఒకవైపు కొనుగోలుదారులను మోసగించడంతోపాటు మరోవైపు భారీగా ప్రభుత్వాదాయానికి గండికొట్టారు. రియల్టర్లకు జైలుశిక్ష... అనధికార లే అవుట్లలోని నివేశన స్ధలాలను విక్రయించిన రియల్టర్లు, ఏజెంట్లకు మూడు సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. అయినా అధికార పార్టీ నేతల అండదండలతో రియల్టర్లు ఒక ఎకరానికి లే అవుట్ తీసుకుని ఐదారు ఎకరాల్లోని నాన్ లే అవుట్లలోని స్ధలాలను అమ్మేశారు. మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కొరత, గ్రామపంచాయతీ సిబ్బంది అవినీతి కారణంగా ఈ దందా ఇంకా కొనసాగుతోంది. బిపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) తరహాలోనే అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందనే ఉద్దేశంతో అనేకమంది కొనుగోలుదారులు ఈ నివేశన స్ధలాలను కొన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం,తిరుపతి, విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో అనధికార లేఅవుట్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. విశాఖ, గుంటూరు, నెల్లూరు వంటి కార్పొరేషన్లలో సమీప గ్రామాలు కూడా విలీనం అవుతుండటంతో అక్కడి స్ధలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ విలీన గ్రామాల్లోని స్ధలాలకు సమీప కాలంలో మంచి డిమాండ్ రానుందని ఏజెంట్లు ప్రచారం చేసుకుని అమ్మకాలు చేశారు. రంగురంగుల బ్రోచర్లలో లే అవుట్ల అనుమతులకు సంబంధించిన సీఆర్డిఏ నెంబర్లు ఉదహరించి మరీ అమ్మకాలు సాగించారు. అయితే కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న లే అవుట్ల విస్తీర్ణానికి మించిన స్ధలాలను అమ్మి కొనుగోలుదారులను నిలువునా ముంచేశారు. ఎన్నికల సందడిలో.. ఆన్లైన్ విధానంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించింది. గతంలో పంచాయతీ పరిధిలో లే అవుట్ల అనుమతికి అక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతి తప్పనిసరి. వారు సిఫారసు చేసిన తరువాత కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖలో ఆ లే అవుట్లకు అనుమతి మంజూరు చేసేది. ఈ విధానంలో గ్రామ పంచాయతీల సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తమ పరిధిలో అనధికార లే అవుట్లు ఉంటే వాటి వివరాలను కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖకు పంచాయతీ సిబ్బంది సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత డిసెంబరు వరకు రాష్ట్రంలో అనధికార లే అవుట్ల సంఖ్య 2 వేలకు మించిలేదు. అయితే జనవరి నుంచి సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అన్ని శాఖల సిబ్బంది నిమగ్నం కావడంతో రియల్టర్ల అక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు. తెలుగుదేశం నేతల అండ కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రియల్టర్ల వెంచర్లకు అక్కడి కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే అనుమతుల కంటే ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అనుమతి తప్పనిసరి. వారి నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లిన తరువాతనే కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖ ఆ వెంచర్లకు అనుమతి ఇచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రియల్టర్ల నుంచి భారీ మొత్తాల్లో మామూళ్లు తీసుకుని లే అవుట్ల అనుమతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. దీనికితోడు వారే అనధికార లే అవుట్లలోని స్ధలాల అమ్మకాలను ప్రోత్సహించారు. దీంతో రియల్టర్లు ఎకరం పొలంలో లే అవుట్లకు అనుమతి తీసుకుని నాలుగైదు ఎకరాల్లోని అనధికార లే అవుట్ల స్ధలాలను విక్రయించారు. ఇలా దాదాపు 18 వేల లే అవుట్లలోని స్థలాలను విక్రయించేశారు. కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ చేసిన సర్వేలో 16 వేలకుపైగా అనధికార లే అవుట్లు ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ విభాగం డైరెక్టర్ రాముడు ధ్రువీకరించారు. దాదాపు అన్ని పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోందని చెప్పారు. దాదాపు 1100 మంది సిబ్బంది కొరత తమ శాఖలో ఉందని, దీని కారణంగా అక్రమాలను నిలువరించలేని పరిస్ధితి ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి రియల్టర్ల దందా కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దాదాపు 18 వేల అనధికార లే అవుట్లలోని స్ధలాలన్నింటినీ క్రమబద్దీకరిస్తే కోట్లలోనే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపనున్నారు. వీటి క్రమబద్దీకరణతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రియల్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయం ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నామని ప్లానింగ్ డైరెక్టర్ రాముడు తెలిపారు. -
బయటపడుతున్న రాకేష్‌రెడ్డి అక్రమాలు
-
రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో ప్రధాన సూత్రధారి రాకేష్‌రెడ్డి అక్రమాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కస్టడీలో భాగంగా రాకేష్ రెడ్డిని విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్చర్యపోయే రీతిలో అతడి అక్రమ లీలలు తెలుస్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు, హత్యలతో గత ఏడాదిన్నర కాలంగా అటు పోలీసులతోను, ఇటు అధికారులతోను సంబంధాలు పెట్టుకొని రాకేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. జయరాంను హత్య చేసిన తర్వాత రాకేష్‌రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబు, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఘటనలో ఆ ముగ్గురినీ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నట్లు కాల్‌డేటాలో తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు చింతల్, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్, రాజేశ్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గురువారం విచారించారు. రాకేష్‌రెడ్డితో వారికి ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి పరిచయం అన్నదానిపై ఆరా తీశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అక్రమాలు, కబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటిపై కూడా ఆరా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణకు సంతోష్‌రావు కూడా.. అనంతరం శిఖా చౌదరి సన్నిహితుడు సంతోష్‌రావు అలియాస్ శ్రీకాంత్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. జయరాం గత నెల 31న హత్యకు గురికాగా అదేరోజు రాత్రి శిఖా చౌదరి తన స్నేహితుడు సంతోష్‌రావుతో అనంతగిరి ప్రాంతానికి నైట్‌రైడింగ్‌కు వెళ్ళినట్లు చెప్పడంతో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సంతోష్‌రావును పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆమెతో ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి? జయరాం హత్య జరిగిన విషయం ఎప్పుడు తెలిసింది? హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరిని కలిశారా అన్న కోణంలో విచారణ జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉండేవన్న దానిపై కూడా ఆరా తీశారు. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఇటు సంతోష్‌రావును వేర్వేరుగా నాలుగు గంటల పాటు విచారించారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇంకో 30 మంది వరకు విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ పోలీసులు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న పలువురు రాజకీయ నాయకులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్ రియల్టర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్‌ఏఆర్) ఇం డియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన డెవలపర్ సుమంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కాల పరిమితి 2019–2020. నిర్మాణ రంగ సమ స్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విప్లవాత్మక నిర్ణయా లతో రియల్టీ రంగా నికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఏఆర్‌లో 13 లక్షల మంది, మన దేశంలో 20 రాష్ట్రాల్లో 30వేల మంది సభ్యులుగా ఉన్నారు. 1908లో చికాగో ప్రధాన కేంద్రంగా ఎన్‌ఏఆర్ ప్రారంభమైంది. -
రియల్ మోసం
కామారెడ్డి క్రైం: నిబంధనలను తుంగలో తొక్కి దందా చేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే స్థలాన్ని వేరువేరు వ్యక్తులకు అమ్ముతున్నారు. అధికారులు వారితో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుండడంతో సామాన్యులు నష్టపోతున్నారు. వెంకటస్వామి అనే వ్యక్తి గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో పొట్టచేతబట్టుకుని 15 ఏళ్ల క్రితం కామారెడ్డికి వలస వచ్చాడు. రాత్రనక, పగలనక కష్టపడి కొన్ని డబ్బులు పోగు చేశాడు. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం దేవునిపల్లి శివారులో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. భూమి పూజ చేయగానే ఓ వ్యక్తి ‘‘ఇది నా స్థలం’’ అంటూ అడ్డుకున్నాడు. దీంతో వెంకటస్వామి ఈ విషయమై స్థలాన్ని అమ్మిన వ్యక్తిని నిలదీశాడు. సదరు రియల్టర్ స్పందించకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అతడిని కాపాడారు. ఈ సంఘటన ఇటీవల కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఇలా ఎంతో మంది అమాయక ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి నిలువునా దోపిడీకి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో తరచూ రియల్ ఎసేŠట్ట్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు ప్లాట్లు కొనుగోలు చేసేవారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో రూ. లక్షల్లో నష్టపోతున్నారు. దీంతో కొత్త వ్యక్తి దగ్గర స్థలం కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. అక్రమార్కులతో సంబంధిత అధికారులూ కుమ్మక్కవ డం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బై నంబర్లతో డబుల్ రిజిస్ట్రేషన్లు అక్రమార్కులు ఒక స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లకు బై నంబర్లు వేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఒక స్థలాన్ని మొదట ఒక వ్యక్తికి అమ్మిన తర్వాత తిరిగి అదే స్థలాన్ని ఈ పద్ధతిలో సృష్టించిన డాక్యుమెంట్లతో మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక స్థలాన్ని ముగ్గురు నలుగురికి విక్రయించిన ఉదంతాలూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు డాక్యమెంట్ల విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనిని మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ప్లాట్లుగానీ, ఇతర స్థలాలు గానీ కొనుగోలు చేయాలనే విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అధికారుల అండతోనే! ఒకేస్థలాన్ని చూపించి ఇద్దరు ముగ్గురికి అంటగడుతున్న మోసగాళ్లకు అధికారుల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖల అధికారులు నకిలీ డాక్యుమెంట్ల సృష్టి, ఆన్లైన్ వ్యవహారాల్లో అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించిన రికార్డులు ముందుగానే ఆన్లైన్లో వచ్చేలా ఎంట్రీ చేస్తూ రిజిస్ట్రేషన్లు పూర్తికాగానే ఆన్‌లైన్‌లోనుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లోౖ నెతే సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనే బై నంబర్లు సృష్టిస్తూ అక్రమ రిజి స్ట్రేషన్లకు పాల్పడుతున్నారని సమాచారం. సెటిల్మెంట్ల పేరుతో గుంజుడు.. డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలతో స్థలాలు కొని మోసపోయిన వారు ఇదేమిటని ప్రశ్నిస్తే.. తప్పించుకోవాలని చూస్తున్నారు. పదేపదే అడిగితే సెటిల్మెంట్ల పేరుతో మరింత గుంజుతున్నారు. చేసేదిలేక, ఎదిరించలేక బాధితులు ఎంతోకొంతో ముట్టజెబుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతోనైనా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందా అన్నది తేలాల్సి ఉంది. సర్వేనంబర్ల విషయంలో బైనంబర్లను తొలగించడం, ఒకే నంబరు విధానాన్ని తీసుకువస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. తప్పుగా ఉంటే తిరస్కరిస్తున్నాం వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు వస్తే వాటిని తిరస్కరిస్తున్నాం. ఎలాంటి లొసుగులు ఉన్నా తిరస్కరించి కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నాం. కోర్టు ద్వారా ఏదైనా అడిగితే సమాచారాన్ని కోర్టుకే నేరుగా ఇస్తాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మల్లికార్జున్, సబ్‌రిజిష్ట్రార్, కామారెడ్డి -
శ్మశానాలూ హాంఫట్
జిల్లాలో 150 ఎకరాలకు పైగా కబ్జా తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి శివారుల్లో ఎక్కువ అనువైన చోట్ల రెచ్చిపోతున్న రియల్టర్లు భూముల ధరలు పెరగడమే కారణం మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల్లో ఉదాసీనత జిల్లాలో శ్మశానాలు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. వాగులు, వంకలు, చెట్లు, గట్లను అనువుగా చేసుకుని ఆయా గ్రామాల్లో శవ దహనాలతో కూడిన అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. వానొచ్చినా, వరదొచ్చినా శవ దహనాలు కష్టమైనా భరిస్తున్నారు. మరో కోణంలో చూస్తే....చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలను బడా బాబులు, రియల్టర్లు ఆక్రమిస్తున్నారు. రాత్రికి రాత్రే హద్దులు తొలిగించి సొంత భూముల్లో కలిపేసుకుంటున్నారు. అధికార, రాజకీయ బలాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పూనుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 ఎకరాల మేర శ్మశాన భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు శివారుల్లోనే ఈ ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 1,360 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 50 శాతం గ్రామాల్లోనే అధికారికంగా నిర్దేశించిన శ్మశానాలున్నాయి. మిగతా చోట్ల లేవు. కాలువ గట్లు, వాగుల అంచులు, పొలిమేర కాలిబాటల్లోనూ, రహదారుల పక్కన శవ దహనాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా శ్మశాన భూములున్న ప్రాంతాల్లోనూ ఇటీవల ఆక్రమణలు పెరుగుతున్నాయి. జిల్లాలోని 100 కి పైగా గ్రామాల్లోనూ, ప్రధాన మున్సిపల్ శివారుల్లోనూ శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. విద్య, వైద్యం, పారిశ్రామికంగా పలు పట్టణాలను అభివృద్ధి పర్చనున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. దీంతో పట్టణాలకు శివారున రియల్ వ్యాపారులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. వీటికి పక్కనే ఉన్న పంట భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి విక్రయించే క్రమంలో శ్మశానాలనూ ఆక్రమిస్తున్నారు. తిరుపతి పట్టణంలో మొత్తం 8 చోట్ల శ్మశాన భూములున్నాయి. ఇక్కడ అంకణం ధర వేలల్లో ఉండటంతో రియల్ వ్యాపారులు, రాజకీయ నేతల కన్ను వీటిపై పడింది. నగరానికి మధ్యలో ఉండే ఎస్టీవీ నగర్ శ్మశాన వాటిక పక్కనున్న సుమారు 10 సెంట్లకు పైగా ఆక్రమణలకు గురవుతోంది. పక్కనే ఉన్న మఠం భూముల పేరు చెబుతున్న కొంతమంది బడాబాబులు శ్మశానానికి కేటాయించిన జాగాను కూడా కబ్జా చేస్తున్నారని సమాచారం. తిరుపతి రూరల్ మండలంలోని చెర్లోపల్లి, సీ మల్లవరం, వేమూరు గ్రామాల్లో శ్మశాన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీ.మల్లవరం శ్మశాన భూములను ఆక్రమించి రోడ్లు నిర్మించిన వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకున్నారు. చిత్తూరులో కైలాసపురం వద ఉన్న శ్మశాన వాటకిలో 80 సెంట్లు ఇప్పటికే ఆక్రమణలో ఉంది. జానకారపల్లె వద్ద సగానికి పైగా ఆక్రమించుకున్నారు. ఇరువారం, కొంగారెడ్డిపల్లె వద్ద నున్న శ్మశాన వాటికలు సైతం ఆక్రమణలో ఉన్నాయి. గుడిపాల మండలం నంగమంగళం, మరకాలకుప్పం, 197రామాపురం గ్రామాల్లోని శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయని మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు. ఈ శ్మశాన భూముల్లో కొందరు గానుగ మిషన్లు పెట్టారు. మరికొందరు సారా తయారీ చేసి విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి వాసులు స్వర్ణవుుఖినదినే శ్మశానవాటికగా వినియోగిస్తారు. టీడీపీ నేతలు ఇసుకను తరలించే నేపథ్యంలో శ్మశానాలు తవ్వేస్తున్నారు. దీంతో వుృతదేహాలు బయటపడుతున్నాయి. అదేవిధం బీవీపురం, వుుచ్చివోలు, అక్కుర్తి, చుక్కలనిడిగల్లు గ్రావూల్లో శ్మశానాలు అక్రమించారు. తొట్టంబేడు వుండలంలోని కొనతనేరి,కొన్నలి,కనపర్తి,చిట్టత్తూరు,బోనుపల్లి గ్రావూల్లోనూ శ్మశానాలను కొందరు ఆక్రమించారు. ఏర్పేడు వుండలం గుల్లకండ్రిగ, కందాడు, నచ్చనేరి, నాగంపల్లి గ్రావూల్లో టీడీపీ నేతలు శ్మశాలను అక్రమించారని ఆరోపణలున్నాయి. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 15 ఎకరాల వరకు శ్మశాన స్థలాలు ఆక్రమణకు గురై ఉన్నాయి. సత్యవేడు మండల పరిధిలో చెన్నేరి, చిన్న ఈటిపాకం, మోటుపాళెం గ్రామాల పరి«ధిలో 2 ఎకరాల శ్మశాన భూములు ఆక్రమణల పాలయ్యాయి. వరదయ్యపాళెం మండలంలోని బత్తలావల్లం, కడూరు, ఆంబూరు, కళత్తూరు, కరింజలం గ్రామాల పరిధిలో సుమారు 10 ఎకరాలు స్థలం ఆక్రమణకు గురైంది. నాగలాపురం మండలంలో వెళ్లూరు దళితవాడ శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురై ఉంది. శవాలు తీసుకు వెళ్లేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. పిచ్చాటూరు, శేషంపేట, కారూరు, అడవి కొడింబేడు, బంగాళా గ్రామాల పరిధిలో సుమారు మూడు ఎకరాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో హిందూ శ్మశానవాటిక దురాక్రమణకు గురైంది. దీనిపై ప్రజలు పలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీని కారణంగా అంత్యక్రియలు నిర్వహించే ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
పడిలేచిన రియల్ భూం
పుంజుకుంటున్న వ్యాపారం కలెక్టరేట్ పైనే రియల్టర్ల నజర్ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు సాక్షి, సిరిసిల్ల : కొత్తజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. రెండు నెలలుగా నెలకొన్న సందిగ్ధంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆటుపోట్లకు గురైంది. ఆద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిలేచింది. సిరిసిల్లను జిల్లా చేయనున్నారనే ప్రభుత్వ ప్రకటనతో రెండు నెలలక్రితం ఒక్కసారిగా ఈ వ్యాపారం జోరందుకుంది. చాలా మంది రియల్టర్లు వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. మరికొందరు కొత్తగా రియల్టర్‌గా అవతారమెత్తారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భూ యజమానులు భారీగా ధరలు పెంచారు. అయినా వ్యాపారులు భూములు విపరీతంగా కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగింది. ఇదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మలివిడత నోటిఫికేషన్లో సిరిసిల్ల జిల్లా ప్రస్తావన లేకపోవడం, మంత్రి కేటీఆర్ కూడా అదే అంశాన్ని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రియల్ భూమ్ కుప్పకూలింది. అప్పటివరకు రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు.. రియల్ వ్యాపారంలో తమకు నష్టం తప్పదని నీరసించారు. అడ్వాన్స్ ఇవ్వడంతో మిగతా సొమ్ము చెల్లించి తమ భూములు కొనుగోలు చేయాల్సిందేనని భూయజమానులు పట్టుబట్టారు. తాము వాటిని కొనలేమని, ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని రియల్టర్లు ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. దీనిపై కొందరు పోలీసుస్టేçÙన్ల తలుపు తట్టారు. ఆ పంచాయితీలు ఇప్పటికీ ఎటూ తేలడంలేదు. ఇదిలా ఉండగానే, ప్రభుత్వం జారీ చేసిన చివరి నోటిఫికేషన్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయడం, మంత్రి కేటీఆర్ నూతన జిల్లాను ప్రారంభించడంతో రియల్ భూమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అప్పటిదాకా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్లీ కదలికొచ్చింది. ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, సమీప ప్రాంతాల్లో రియల్టర్లు పాగా వేస్తున్నారు. కలెక్టరేట్ ‘చుట్టూ’ రియల్ నజర్ ప్రస్తుతానికి రియల్ఎస్టేట్ రంగం స్థిరంగా ఉంది. నూతనంగా చేపట్టబోయే కలెక్టరేట్ భవన నిర్మాణం చుట్టూ రియల్ భూమ్ ఆధారపడి ఉంది. సిరిసిల్ల, వేములవాడ నడుమ, సిద్దిపేట రహదారి వైపు తంగళ్లపల్లి సమీపంలో కలెక్టరేట్ భవనం నిర్మిస్తారనే ప్రచారం ఉంది. ఇందుకోసం అనువైన స్థలం ఎంపిక పూర్తి కాగానే, ఆ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం రెట్టింతయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. జంటనగరాల తరహాలో.. హైదరాబాద్, సికిందరాబాద్ తరహాలో సిరిసిల్ల, వేములవాడ భవిష్యత్‌లో జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు పట్టణాల నడుమ రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా పుంజుకుంటోంది. సిరిసిల్ల పట్టణం, శివారు, వేములవాడ పట్టణం, శివారు ప్రాంతాలపై రియల్ వ్యాపారులు దృష్టి సారించారు. జిల్లా ఏర్పాటుతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.50లక్షల– రూ.60 లక్షలు ఉండగా, ఇప్పుడు ఎకరాకు రూ.కోటికి పైమాటే అంటున్నారు రియల్టర్లు. సిరిసిల్ల జిల్లా తెరపైకి రానపుడు, జగిత్యాల జిల్లా అవుతుండడంతో, వేములవాడ, జగిత్యాల నడుమ కొండగట్టు ప్రాంతంలో రియల్ వ్యాపారం కొనసాగింది. సిరిసిల్లను జిల్లా చేయడంతో ఆ వ్యాపారమంతా ఇటువైపు మళ్లింది. దీంతోపాటు సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, 17 పోలీస్ బెటాలియన్ తదితర ప్రభుత్వ విభాగాలు ఏర్పాటయ్యే ప్రాంతాలపై రియల్టర్లు కన్నేసి ఉంచారు. ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే.. కొత్త జిల్లా.. సరికొత్త వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొనుగోలుదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా లేఅవుట్ లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు కొనుగోలు చేయకపోవడమే మంచిదంటున్నారు. -
వట్టిపల్లిలో రియల్టర్ల భూ దందా
కుంట కబ్జాకు యత్నం.. అడ్డుకున్న గ్రామస్తులు జగదేవ్‌పూర్: కొందరు రియల్టర్లు భూ దందాకు తెరలేపారు. కుంటను కబ్జా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని వట్టిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న 20 ఎకరాల భూమిని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అయితే గ్రామస్తులు తన భూమి పక్కనే కామునికుంట ఉంది. కొన్నేళ్లుగా గ్రామస్తులు కుంటలోనే బతుకమ్మలను వేస్తున్నామని అయితే కుంటను విడిచి మిగతా భూమిని అమ్ముకోవాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే కొన్నవారు కుంట లేదు శికం లేదు అంతా తమదేనని ఇరవై రోజుల నుంచి చదును చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం కొంత మంది గ్రామస్తులు కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ గ్రామంలో కామునికుంటను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించారు. కుంట సర్వే నంబర్ 276, 278 లో ఉందని డీప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలు తెలిపారు. దీంతో మంగళవారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కామునికుంట దగ్గరకు వెళ్లి భూమిని పరిశీలించారు. ముందే తెలుసుకున్న రియల్టర్లు పనులను ఆపేశారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ కుంటను కబ్జాను చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కుంట శికం ఐదెకరాల వరకు ఉంటుందని తెలిపారు. బతుకమ్మలను వేసేటోళ్లం.. ఎన్నో ఏళ్ల నుంచి కామునికుంటలో బతుకమ్మలు వేసుకుంటూ వస్తున్నాం. కుంట ఇన్నాళ్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిలోనే ఉందని అనుకున్నాం. అయన కూడా ఎప్పుడు బతుకమ్మలను అడ్డుకోలేదు. తాను అమ్ముకున్న తర్వాత కొన్నవారు భూమితో పాటు కుంటను కూడా తవ్వేస్తున్నారు. కుంటను తవ్వొద్దని చెప్పినా వినలేదు. అధికారులను కలిసితే అసలు విషయం తెలిసింది. కామునికుంట ప్రభుత్వ భూమిలో ఉందని, రికార్డులో కూడా చుశాం. - గ్రామస్తుడు, నర్సయ్య అధికారులు హద్దులు పాతాలి గ్రామంలో కామునికుంట కబ్జాకు గురైంది. మిషన్‌కాకతీయ నిధులు వచ్చినా పనులు జరగనివ్వలేదు. కామునికుంట గ్రామానికే చెందాలి. లేకుంటే గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేస్తాం. కొన్నవారిని అడిగితే ఏమి చేసుకుంటరో చేసుకోండని అంటున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు పాతాలి. - గ్రామస్తుడు, సత్యనారాయణ -
'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్తో రైతులకు కాదు, రియల్టర్లకు మాత్రమే లాభం చేకూరుతుందని సామాజికవేత్త మేథా పాట్కర్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మేథా మాట్లాడారు. అమరావతి ప్రస్తుత నిర్మాణంతో అన్ని వృత్తులవారి జీవన పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమతున్నాయని ఆమె అన్నారు. వరదలు వస్తే సగం నగరం తుడిచి పెట్టుకుపోతుందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అమరావతి నిర్మించాలని మేథా పాట్కర్ డిమాండ్ చేశారు.