
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్‌విల్లా భూ వివాదమే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు.
చదవండి: టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..?
ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment